శిలాలోలిత
పచ్చని చెట్టు లాంటిదే
పసిడి జీవితం
పదిమందిని ఆదరిస్తే
పదికాలాలు నిలుస్తుంది పచ్చబొట్టులా -(పేజి.65)
ఆచార్య శరత్‌జ్యోత్స్నారాణి2006లో ప్రచురించిన ఃఅక్షరవసంతంః (మినీకవితలు) సంకలనంలోనిది పై ఖండిక
శరత్‌జ్యోత్న్సారాణి తెలుగు సాహిత్యంలో ఒక ప్రముఖమైన ప్రసిద్ధమైన పేరు. ఇదివరకే రెండు కవితా సంకలనాలు ఃపాగః (1996), కవనమందాకిని (2001), లతో పాటు రెండు కథానికా సంపుటులు ఃనీకు నాకూ నడుమ(2000), ఃవెండికిరీటం (2005) ప్రచురించారు. ఇవేకాక, పరిశోధనా గ్రంధాలు, సంకలన గ్రంధాలు ఉన్నాయి. ఇవన్నీ ఆమెలోని సాహిత్య జిజ్ఞాసకు, పరిశ్రమకు పరిచయాలు మాత్రమే.
ఆర్ధ్రమైన గుణంవల్ల, సమాజంలోని అనేక అంశాలపట్ల ఆమెకున్న సునిశిత అవగానవల్ల ఈ సంకలనంలోని మినీ కవితలు ఒకదానికి మించి ఒకటిగొప్పగా వున్నాయి. ముందు మాటల్లో అక్కినేని, ఉత్పల, అద్దేపల్లి, వాసాప్రభావతి, యం.కె.రాము, ఆచార్య ఆనందారామం, ఆచార్య గౌరీశంకర్ ఈ మినీ కవితల్లోని గొప్పతనాన్ని విశిష్టతను విశ్లేషించారు. ఉత్పలగారి మాటల్లో శరత్ జ్యోత్స్న గారు లోకశాస్త్రగవేక్షణంగల ప్రతిభావంతురాలైన కవయిత్రిఃఃగా సంభావించారు. సి.ఆనందా రామంకవితామృతపు జల్లులను కురి పించిన – కవయిత్రిగా శరత్‌జ్యోత్స్న గారిని మెచ్చుకున్నారు. కవిత్వాన్ని ప్రస్తావిస్తూ ఆచార్య జ్యోత్స్నా రాణి తన కవితలో సమకాలీన సమాజంలోని ఎన్నెన్నో సమస్యలను కవితాశిల్పాల ఇంద్రధనస్సు లలో మెరిపించింది. ఈ హరివిల్లులో ఎన్నెన్ని శిల్ప వర్షాలని? ఒకచోట వ్యంగ్యం! మరొకచోట హాస్యం! వేరొకచోట లాస్యం! ఇంకొక చోట విషాదం! అక్కడక్కడ చమత్కారాల చురకలు – ఈ మినీ కవిత ల్లోని అంతస్సారాన్ని పరిచయం చేశారు.
మినీ కవితలను ఆంధ్ర దేశంలో ఒక ఉద్యమంగా ప్రచారం చేసి, వెన్నుదన్నుగా నిలిచిన అద్దేపల్లి రామ్మోహనరావు గారి మాటలు ప్రస్తావించుకోవాలి. అద్దేపల్లి, శరత్‌జ్యోత్స్నాగారి మినీ కవితల్ని తన ముందు మాటలో మనసారా ఆహ్వానించారు. మినీ కవిత, హైకూ, నానీ మొదలగు లఘురూపాల కవిత్వాల్ని వివరిస్తూ ఈ కవయిత్రి మినీ కవితల విశిష్టతను అంచనా వేశారు. సామాజికత ప్రధానంగా మినీ కవితలో ఈమె అనుసరించడం గురించి అద్దేపల్లి కితాబునిచ్చారు. అన్యాయ సంఘటనలు, వ్యక్తిలో వున్న దుర్గుణాలు. ఈ రెండు లక్షణాలు ఈమె మినీ కవితల్లోని ప్రధానాంశాలు.
ప్రేమ
మనసుల్ని కలుపుతుంది
కులం
మందల్ని కలుపుతుంది-
ఆడది
ఆకాశంలో సగం
నేలమీద రెక్కలు తెగిన పక్షి –
మినీ కవితలకున్న లక్షణం ఒక గొప్పభావాన్ని కొద్ది పాటి అక్షరాలలో ఇమిడించి అనల్పార్ధాన్ని పాఠకుడిదాకా చేరవేస్తుంది. అందువల్లనే మినీ కవిత్వం సాహిత్య రంగంలో ఒక ఊపు ఊపింది. భారతీయ సాహిత్యంలో ప్రధానంగా, తెలుగులో మాత్రమే మినీ కవిత్వం ఒక ఉన్నత స్థానంలోకి ఎదిగి పాఠకుల్ని అలరించింది. ఉద్యమకాలం లోనూ మినీ కవిత్వం, ఆ కాలపు అవసరాల్ని అంది పుచ్చుకుంది. గోడలమీద నినాదాల స్థాయికి ఎదిగింది. తెలుగులో మినీ కవిత్వం ఒక ఉద్యమ స్థాయినందుకోవడానికి, దానిలోని వస్తురూపాల విభిన్నత కారణం.
శరత్‌జ్యోత్స్నగారి ఈ మినీ కవితల్లో నలుగురి నోళ్ళల్లో నానగలిగిన విశిష్టమైన కవితల్ని రాశారు.
గొంతు గొంతు కలిస్తే
నినాదం
చేతులు చేతులు కలిస్తే
చైతన్యం-
మనుషులంతా ఒక్కటే
మాటవరసకు
మన్ననలు మాత్రం
జాబితాల ప్రకారమే –
ఇటువంటి మినీ కవితల్లో జీవితాను భవం కలగలసిన విశ్లేషణ కనబడు తుంది. ఇంకా సంపుటిని తిరగవేస్తున్నపుడు సూటిగా కనిపించేవి మాత్రమే కాక, గుండెను తడిమే ఆర్ధ్రమైన మినీ కవితలు కనిపిస్తాయి. ఆ మినీ కవితల్లోని స్వారశ్యాన్ని అనుభవించే పని సంపుటిని చదువుకునే పాఠకులకే వదిలేస్తున్నాను. శరత్‌జ్యోత్స్నా రాణిగారిని ఆమె వెలువరించిన ఈ కవితా సంపుటి ద్వారా విశ్లేషించుకోవడం ఇప్పటి అవసరం. సూటిదనం, నిర్మొహమాటం, నిరాడంబరత, కలుపుగోలుతనం, కలగలసిన స్వభావం ఈ మినీ కవితల్లో కన్పిస్తుంది. ప్రస్తుతం శరత్‌జ్యోత్స్నగారు తెలుగు శాఖలో ప్రొపె ్డసర్‌గా సెంట్రల్ యూనివర్సిటీలో పని చేస్తున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి అవార్డును పొందారు. ఇంకా అనేక బాధ్యతాయుత పదవులను నిర్వహిస్తు న్నారు. ప్రతి ఏటా జ్యోత్స్న కళాపీఠ తరఫ ున విశిష్ట సాహిత్య వేత్తలకు పురస్కారాలు అందజేస్తూ ప్రోత్సహిస్తున్నారు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags