భూమిక ఎడిటర్ గారికి,
ఒక పోలీస్ స్టేషన్‌కి సహాయం కోసం వచ్చిన నిండుగర్భిణి అని కూడా పోలీస్‌లు పట్టించుకోక పోయిన పోలీస్ స్టేషన్‌కి వేరే పనిమీద వెళ్లిన ఒక స్టూడెంటు పోలీస్ స్టేషన్ ముందు నిండు గర్భిణిని చూసి భూమిక హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేయడం నచ్చింది. పోలీస్ స్టేషన్‌లు జెండర్ స్పృహతో ఎలా ఉండొచ్చు, ఉండాలి, పోలీసులు వాడే భాష చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాలని అర్థం చేయించడానికి అన్ని స్థాయిల సిబ్బందికి జెండర్ ట్రైనింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉంది.
– మంజుల, హైదరాబాద్
……. ఙ …….
ఎడిటర్ గారికి,
గత సంచికలోని అల్లం రాజయ్య గారు రాసిన మనిషిలోపల విధ్వంసం కథ బాగుంది. అలాగే ఆలువాల శ్రీలత గారు రాసిన మానవి సమీక్ష చదివాక ఆ పుస్తకం చదవాలని ఉంది తప్పక చదివి ఆ స్పందనను కూడా తెలియచేస్తాను. కొండవీటి సత్యవతిగారు రాసిన సంపాదకీయం చదివిన తర్వాత ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న బీభత్స జీవితం ఎంత దుర్భంగా ఉందో అర్థమయింది.
– శ్వేత, హైదరాబాద్.
……. ఙ …….
డియర్ ఎడిటర్ గారికి,
ఏప్రిల్ సంచికలో వచ్చిన రొంపిచర్ల భార్గవి రాసిన మెనోపాజ్… ఇది ఒక జబ్బు కాదు అనే వ్యాసం చదివిన తరువాత ఉన్న అపోహలు తొలగిపోయాయి ఇందులో పొందుపరిచిన వివరణ చాలా ఉపయోగాత్మకంగా ఉంది. చాలా మంది ఇదోక వ్యాధి అనుకుంటారు. కాని ఇంత వివరంగా తెలియజేసిన భూమికకి ధన్యవాదాలు
– ప్రత్యూష, హైదరాబాద్