ప్రేమతో పరిమళాన్ని చిందించే
హృదయాన్ని సైతం వదలవు కదా
నీదైన కర్కశత్వంతో, కసిగా…
గాయాల పాలు చేస్తూనే ఉంటావు.
పరిస్థితులకు రాజీ పడుతూ…
గుండెను రాయిగా మార్చుకున్నా…
కానీ… గుండెను పిండి చేసేవరకూ…
రక్త కన్నీరు చిమ్మే వరకూ…
నీ రక్కస దాహం తీరదు.
గరళకంఠుడిలా గొంతులోనే దాచుకుని
గోల్డ్ ఫేషియల్ పూసుకుని
షోకేస్‌లో గాజు బొమ్మలా
నవ్వుల ప్లాస్టిక్ పరిమళాన్నై
ఇమేజ్‌ని ప్రపంచానికి పంచుతూ…
నవ్వు మాస్క్ వెనుక దిగులు మనస్సుతో
దుఃఖపు నదినై పారుతూనే ఉన్నాను.
తీరం దాటి సంద్రంలో కలిసినా,
నా దుఃఖపు అలలు ఆకాశాన్ని
తాకితే కానీ నీకూ, నీలాంటి
వారసత్వ సాడిజంతో… అల్లాడే
ఆధిపత్యం పైత్యంతో,
అసూయాద్వేషపు రెక్కలతో
నిత్యం వెంటాడి వేటాడే
డేగ కళ్ళకు తృప్తి ఉండదు.
అల్ప సంతోషిగా
ఆనందం అంబరమైనప్పుడు
ఆహ్లానంద నాట్యం చేసిన