సంపన్న దేశాలకు శ్రామిక దేహాల కాంక్ష
ఖరీదైన ఖండాలకు కారుచౌకగా కాయాల వలస
కుటుంబపు ఆకలి కడుపున భాద్యతగా మోసే తల్లి
కన్నీళ్ళ సంద్రాలదాటి వంటరి ఒంటెలా ఇసుకనేల చేరింది
భాషరాని దేశాన బానిసై బ్రతుకుతూ కూడా జీవితం కరిగింది
తన బిడ్డలకు భవిషత్తు దార్లు వేయాలని నిలిచింది
ఆంక్షల ముళ్ళ వలయములో ఆకాంక్షల పంటకోసం తపించింది
దినాలెన్నో దీనంగా గడిపి దీనారాల దిండు కట్టింది
వెళ్ళాలిక … గూటికి చేరాలిక కాని దారులన్ని మూసుకొని