కవయిత్రులను కమలాదాస్‌ పూనుతోందా?-శ్రీనివాస్‌ సూఫీ

కమలాదాస్‌ కవిత్వానికి పరిచయం అవసరంలేని పేరు.. ఈమె రచనల ద్వారా సాహిత్య లోకంలో కలిగించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. కమలాదాస్‌ ఇప్పుడు మరోసారి పరోక్షంగా కవిత్వ కదలిక కలిగిస్తోంది. కవయిత్రులను పూని నిప్పురవ్వల కొలిమిలో సెగవాక్యాలనెగరేయిస్తోంది. తిరుగుబాటు కవిత్వానికి బాటలు వేసిన మహిళల్లో కమలాదాస్‌ ఒకరు. వాస్తవానికి కమలాదాస్‌ కన్నా ముందు, తరువాత అనేకమంది మహిళలు తమదైన శైలిలో తమ ఆవేశాన్ని, ఆగ్రహాన్ని కవిత్వంతో చాటారు. కానీ ఎందుకో కమలాదాస్‌ అంత ప్రభావం కనబరచలేదేమో అని నాకున్న అతికొద్ది సాహిత్య పరిజ్ఞానంలోని సందేహం. ఆంగ్ల సాహిత్యానికి పరిమితమైన కమలాదాస్‌ను సాధారణ పాఠకులకు చేరువ చేసిన సంకల్పం మాత్రం నిస్సందేహంగా కవిసంగమానికి దక్కుతుంది.

ప్రముఖ కవి, అనువాదకుడు సీవీ సురేష్‌ కారణంగా కమలాదాస్‌ను చదివే అవకాశం కవిసంగమం కవులకు దక్కింది. కవిత్వ నాణ్యత పెంచి మేలైన కవులను రూపొందించేందుకు కంకణం కట్టుకున్న కార్ఖానా కవిసంగమం. కవీంద్రుడు, మహాకవి రవీంద్రుడు ఆశించిన ఓపెన్‌ స్కూల్‌ విధానానికి కవిసంగమం అసలైన ఉదాహరణ. కవిత్వ క్రతువులో భాగంగా ఎందరో ప్రముఖ సాహితీవేత్తల పాఠాలతో రోజూ సాహిత్య కళాశాల నడుపుతోంది. కవులకు ఉత్తీర్ణతా పట్టాలను మాత్రం పాఠకులకే ఒదులుతోంది. కవయిత్రులు, కవుల ప్రతిభకు పాఠకులే పట్టం కడుతున్నారు. కమలాదాస్‌ పూనికకు గురైన కొందరు అభ్యుదయవాద, ఫెమినిస్ట్‌ కవులు ఆ ప్రభావంతో తమ భావ ప్రకటనకు స్వేచ్ఛ కల్పిస్తున్నారు. ఈ మధ్య కాలంలో స్త్రీ భావ స్వేచ్ఛ కోణంలో ధిక్కారం వినిపిస్తున్న వారిలో కమలాదాస్‌ ఆవహించినవాళ్ళే అధికం. కమలాదాస్‌ కవిత్వం ద్వారా మహిళా కవులను ఆయుధాలుగా మలచడంలో సీవీ సురేష్‌ కృషి అభినందనీయం. సాధారణంగా కింగ్‌ మేకర్‌ పేరు విని ఉంటాం. సీవీ సురేష్‌ మాత్రం క్వీన్‌లను రూపొందిస్తూ క్వీన్‌ మేకర్‌ అయ్యాడు. అనువాదకుడిగా అతనికి గల సామర్ధ్యం కవయిత్రులు రాటు తేలుతున్న విధంలో తెలుస్తోంది.

What poetry does … croses boundaries, gives us voice, may state facts, makes imaginative statements that we may value …

ఎస్‌. ఈ మధ్య వస్తోన్న కవిత్వం చదువుతుంటుంటే పై విషయాలు అక్షర సత్యమనిపిస్తోంది. ముఖ్యంగా మహిళా కవులు సంప్రదాయ గోడలను బద్దలు కొడుతూ ధిక్కార స్వరం వినిపిస్తుండడం ఇప్పడీ చర్చకు కారణం. వంటింటికి సంప్రదాయ కట్టుబాట్లు, ఆంక్షలు, నిషేధాలను పక్కకు తోసి ఇటీవలి కాలంలో ఎందరెందరో తమ భావ స్వాతంత్య్రం ప్రకటించారు. ఆ ఇద్దరికి నాలుగు గోడలకు మాత్రమే పరిమితమైన పడకగది రహస్యాలను కవిత్వం చేసి ఆశ్చర్యపరుస్తున్నారు. పెళ్ళి పేరుతో బానిసత్వాన్ని, తమ మనస్సుకు విలువివ్వని శరీర దోపిడీని పవిత్ర వ్యభిచారంగా ఎండగడుతున్నారు. పురుషుని సమక్షంలో, పరోక్షంలో స్త్రీ మనస్సులో కలిగే స్వేచ్ఛాయుత భావనలకు అక్షర రూపం కల్పిస్తుండడం స్వాగతనీయం.

స్త్రీ స్వాభావిక లక్షణంలో భాగంగా సాధారణ పరుష పదాలనే ఉపయోగించదు. తాను ఎంతటి ఆవేశానికి, ఆగ్రహానికి గురైన సందర్భంలోనైనా సరే పువ్వుల భాషనే ప్రయోగిస్తుంది. కానీ అంగాంగాలకై అర్రులు చాచే మగవాడు అంగాంగాలను పేర్కొంటూ బూతులు కూస్తుండడంపై మహిళా కవులు వారి భాషనే పలకడానికి వెనుకాడడంలేదు. బూతులు కూసేవాళ్ళకు తాళం వేసేందుకు తమకూ కొన్ని ప్రత్యేక పదాలు కావాలని కోరుతుండడం ఆశ్చర్యకరం. మగవాడినని విర్రవీగేటోడా.. నీ మగతనమెంతో నిర్ధారించేది మేమే అని సవాల్‌ చేస్తున్నారు. ఈ తిరుగుబాటు వాక్యాలను కార్పొరేట్‌ మహిళలో, మేధా సంపన్నులో, పాశ్చాత్య నాగరీకులో గుప్పిస్తున్నవి కావు… నగరాల నుంచి, సాధారణ పట్టణాల్లో నివసిస్తున్న అంతంత మాత్రపు విద్యార్హతగల మహిళలు కావటం గమనార్హం.

మహిళా కవులు తమను నిందిస్తూ రాసినా పురుష కవులు గొప్పగా స్వాగతిస్తున్నారు. ఎవరికి వారు ఈ కవితలో నేను లేననుకుంటూ ఉన్నవాళ్ళు తమను తాము చూసుకుంటున్నారు. అభియోగాలకు గురవుతున్నప్పటికీ అత్యధిక మగ కవులు అభినందనలే తెలుపుతున్నారు. కొందరు అర్ధవంతమైన చర్చలు లేవనెత్తుతున్నారు. కానీ ఎవరూ వ్యతిరేకించడంలేదు. కానీ కొందరు సంప్రదాయ మహిళా కవులు కళ్ళు మూసుకుంటుండడం, ఇంకా నోళ్ళు నొక్కుకుంటుండడం ఆశ్చర్యకరం. అధిక శాతం మహిళా కవులు, సాహిత్య అభిమానులు, రచయిత్రులు మాత్రం తాము చేయలేని సాహసాన్ని అభినందిస్తున్నారు, లైకులు, కామెంట్ల ద్వారా మద్దతు పలుకుతున్నారు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.