ప్రఖ్యాత తెలుగు రచయిత్రి అబ్బూరి చాయాదేవి నేనూ ఉస్మానియా యూనివర్సిటీలో 1954 జర్నలిజం మొదటి బ్యాచ్‌లో సహాధ్యాయులం. ఇల్లిందల సరస్వతీ దేవి. లలితాసింగ్ ూడా మాతోనే చదివారు. అప్పుడు క్లాసులో ఆడవాళ్లు వేరుగా మగవాళ్ళు వేరుగా ూర్చునే వాళ్ళం. అటు వరుసలో మేము ఇటు వరుసలో వాళ్ళు. వరుసల మధ్య బెంచీల నడక దారి ఉండేది. ఈ సంవత్సరం మొత్తం మీద మాలో మేము ఒక్క మాట ూడా మాట్లాడుకోలేదు. ఛాయాదేవి క్లాసులో ప్రవేశించగానే ఒక వెలుగు వచ్చినట్లుందేది. తరువాత ఆమె ఒక గొప్ప రచయిత్రిగా వికసించారు.
ఆమె కాల్పనిక రచనలలో తనమార్గం ఎన్నతగిన కథా సంకలనం అని నా నమ్మకం. ఆ కథల్లో ఆమె ప్రాపంచిక ధృక్పథంతో పాటు పురుషాధిక్య ప్రపంచం పైన చేసే విమర్శలో కొంత హాస్యాన్ని జోడిస్తారు. ప్రయాణం కథలో జేవ్స్‌ు బాండ్ మాదిరి తండ్రి ఛాయాదేవి గారి తండ్రికి ఒక కల్పిత పాత్ర అనిపిస్తుంది. తన చుట్టూ ఉన్న మనుషులే తనకు ప్రేరణ అంటారు ఆవిడ. ఆయన క్రమశిక్షణకు ప్రాణమిచ్చే వ్యక్తి. తల్లి ఆర్థికంగా ఆయన మీద ఆధారపడ్డ గృహిణి. పైగా అంతులేని ఇంటిపని. ఆమె కథలు తీవ్రమైన నిష్టుర స్వరంలోనూ తీర్పులిచ్చేవి గానూ ఉండవు. ఏ వస్తువులోనైనా కొంత హాస్యం చొప్పించటం ఆమె ప్రత్యేకత. మా రెండు కుటుంబాలూ చాలా కాలం ఢిల్లీలో ఉన్నాం. కానీ ఎప్పుడూ కలుసుకోలేదు. ఒక రోజు ఆమెని సప్రూహౌజ్‌లో కలవడం తటస్థించింది. అప్పుడు తను జవహర్‌లాల్ యునివర్సిటీ లైబ్రరీలో పనిచేస్తున్నానని చెప్పారు. నేను ఢిóల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాను. తరువాత అమెరికా వచ్చాను. ఆమె బాగ్‌లింగంపల్లి నుంచి కొండాపూర్‌లోని ¬మ్‌కి మారారని తెలిసింది. ఆమె రచనలపైన, జీవన విధానంపైన జిడ్డుకృష్ణమూర్తి ప్రభావం ఉంది. తెలుగు సాహితీ ప్రపంచంలో వెలుగు నింపి ప్రశాంతంగా వెళ్ళిపోయారు ఛాయాదేవి.
– దాసు కృష్ణమూర్తి , న్యూజెర్సి