నమస్తే!
నాకు అబ్బూరి ఛాయాదేవి గారి కథలన్నా, ఆమె వ్యక్తిత్వం అన్నా… చాలా అభిమానం, గౌరవం. ఇష్టమైన రచయిత్రుల లిస్టులో ముందు ఉండేవారు. పరిచయం లేదు కానీ ఆమె కథల వలన బాగా దగ్గరైన భావన మనసులో ఎప్పుడూ ఉండేది. ఆమె గురించిన సాహిత్య వ్యాసాలలోను, సాహితీకారుల చర్చలలోనూ, సమీక్షలోను తెలుసుకున్నదే ఎక్కువ. అలా నేను ఆమె అభిమానినయ్యాను. ఆమెకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చిన విషయం, బోన్సాయ్ కథ గురించి ఒకసారి విశాఖపట్నం ఎఫ్.ఎమ్.వాళ్ళు మీ ఇష్టమైన రచయిత్రి గురించి చెప్పమన్నప్పుడు చెప్పాను. ఒకసారి అనుకోకుండా ఆమెను చూసే అవకాశం కలిగింది. హైదరాబాద్ తెలుగు యూనివర్విటీలో కార్యక్రమం చూడడానికి వెళ్ళినప్పుడు బయట కనిపించారు. గుర్తుపట్టి ఎగిరి గంతేసినంత ఆనందంగా వెళ్ళి పలకరించాను. ఇంతలో ప్రముఖ హాస్య రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి గారు వచ్చారు. అదే ఆమెను మొదటిసారి చూడడం. పలకరింతలు, నవ్వులు అయ్యాక… ఇలా ఈ ఫోటో తీయించుకున్నాను. ఇంతలో ప్రముఖ హాస్యమధురానుభూతిని మిగిల్చిన ఈ చిత్రాన్ని ఇలా ఆమె లేనప్పుడు జ్ఞాపకంగా పంచుకోవడానికి పంపాల్సి రావడం అత్యంత బాధాకరంగా ఉంది. అబ్బూరి ఛాయాదేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలనీ ప్రార్ధిస్తున్నాను.
– అమరజ్యోతి