నేనెరిగిన ఛాయాదేవి గారు -వేములపల్లి సత్యవతి

నేనెరిగిన ఛాయాదేవి గారు ఒక విశిష్టమైన అద్భుత మహిళ. నిగర్వి, నిరాడంబర మహిళే కాక కలుపుగోలు మనిషి. వారిని నేను ‘మిసిమి’ పత్రిక వ్యవస్థాపకులు, సంపాదకులు ఆలపాటి రవీంద్రనాథ్‌ చౌదరిగారు చనిపోయినపుడు జరిగిన సంస్మరణ సభలో ఉపన్యాసం ఇచ్చే సమయంలో చూశాను. అంతకుముందు అప్పుడప్పుడు వారి రచనలు వారపత్రికలో చదువుతుండేదానిని. ఆనాటి

ఉపన్యాసంలో తన జీవిత సహచరుడు వరద రాజేశ్వరరావు గారు, ఆలపాటి వారు ఆప్తమిత్రులని చెప్పారు. ఆ ఇరువురు మిత్రులు కలుసుకున్నప్పుడు ఒకరు మందు తెస్తే, మరొకరు ప్రసాదం తెచ్చేవారని చెప్పారు. మందంటే విస్కీ, బ్రాందీ మొదలైనవి, ప్రసాదమంటే పకోడీలు, బూందీలాంటివనుకుంటా. నిండు సభలో చనిపోయిన వ్యక్తిని గురించి, భర్తను గురించి అలా చెబితే ఆమె ధైర్యానికి, నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు చకితురాలినయ్యాను. మనసులోనే ఆమెకు జేజేలు చెప్పుకున్నాను.

ఛాయాదేవి గారితో పరిచయం ఐద్వా నిర్వహించిన మహిళల మీటింగులలో జరిగింది. మూడు, నాలుగు పర్యాయాలు వారి ప్రక్కన కూర్చునే అవకాశం కలిగింది. మాటల సందర్భంలో తాను కమ్యూనిస్టును కానని, వారి మీటింగులకు తప్పక వస్తానని చెప్పారు. ఐద్వా వారు ఛాయాదేవి గారిని తప్పకుండా ఆహ్వానించేవారు. ఆ తర్వాత వారిని ఉమెన్స్‌ రిసెర్చ్‌ సెంటర్‌ వారు, మరో సంస్థ వారు కలిసి డా||అచ్చమాంబ గారి శతజయంతిని ఆంధ్ర దేశంలో ‘నభూతో న భవిష్యతే’ అన్న రీతిలో నిర్వహించారు. పన్నెండవ జయంతి సభ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఆ సభలో వారిని చూశాను. లోగడ ఐద్వా మీటింగులలో పరిచయమేర్పడినందున నమస్కరించి, పలుకరించాను. మరల ఎన్నడూ వారిని చూడలేదు. మెడలో రుద్రాక్ష మాల, చెవులకు దిద్దులు మాత్రమే ఉండేవి. ఇంక బంగారు ఆభరణాలేవీ ఉండేవి కాదు. బర్కత్‌పురాలోని ఆమె ఇంటిలో కలిసిన వారొకరు, ఛాయాదేవి గారిని, పిల్లలు లేనందుకు మీకు బాధగా లేదా అని ప్రశ్నించారు. ఏ మాత్రం లేదు, పిల్లలున్నవారు తల్లిదండ్రులను చూస్తున్నారా? చూస్తే వృద్ధాశ్రమాలెందుకు ఏర్పడేవని ఆమె జవాబిచ్చారు.

‘భూమిక’లో కొన్ని మాసాల క్రితం రెండు సంచికలలో వారి జీవిత విశేషాలు, ఛాయాదేవిగారు ఎదుర్కొన్న సమస్యలను మలుపు తిప్పుకున్న పద్ధతుల గురించి ప్రచురితమయ్యాయి. హైదరాబాద్‌లో కాపురం పెట్టిన తర్వాత వారి భర్త అర్థరాత్రి వరకు ఇంటికి వచ్చేవారు కాదు. రోజూ ఒంటరిగా రాత్రి రెండు గంటల వరకు ఎదురు చూడడం వారికి దుస్సాధ్యమయింది. భర్తతో కలిసి భోజనం చేయాలని, కలిసి సినిమాలకు వెళ్ళాలని ఛాయాదేవి గారికి ఉండేది. శ్రీశ్రీ, ఆరుద్ర, ఏచూరి సుబ్రమణ్యం మొదలగు కవులతో కలిసి తన భర్త ఇంటిలోనే తాగి, సాహిత్య చర్యలు, కవితాగోష్టులు జరుపుకునేలాగా ఆమె ఏర్పాటు చేసుకోగలిగారు. ‘అతి సర్వత్ర వర్జయేత్‌’ అన్నట్లు వారు పరిమితికి మించకుండా మందు పార్టీ చేసుకునేవారేమో! లేకపోతే కవితాగోష్టులని ఎలా నిర్వహించగలిగేవారు. వారికి మధ్యమధ్య ఛాయాదేవి గారు టీ చేసి, ఫలహారాలు చేసి పెట్టేవారట. అక్కడే కూర్చుని వారి చర్చలు వినేవారట. భర్త ఎంపిక చేసిన రంగుల చీరలే కట్టుకోవాలట. అదే తన చెల్లెలు తనకిష్టమయిన చీరలు కొనుక్కునేదని ఛాయాదేవిగారు తెలిపారు. అంతేకాక ఆమె పుట్టింటివారు పెట్టిన చీరలు పనిమనుషులు కట్టుకునేవిగా ఉన్నవనేవారట. ప్రఖ్యాత నవలా సామ్రాట్‌ మున్షీ ప్రేమ్‌చంద్‌ ఒక సందర్భంలో ‘ఔరత్‌ సబ్‌ కుచ్‌ సెహసక్తీ హై, లేకిన్‌ మైకేకీ నింద సహ్‌ నహీ సక్‌తే’ (స్త్రీ అన్నింటిని సహి స్తుంది కానీ పుట్టింటివారిని నిందిస్తే మాత్రం సహించదు) అన్నాడు. ఆ మాట ఇక్కడ ఛాయాదేవి గారికి వర్తించదే మోననిపి స్తుంది. వారిని నేను విమర్శిం చడానికి రాయడం లేదు. నాకంత అర్హత కూడా లేదు. ఎంతుకంటే పుట్టింటివారు పెట్టిన చీరలను పనిమనుషులు కట్టుకునేలా ఉన్నాయని రాశారే కానీ, దానికి వారి స్పందన తెలియపరచలేదు. ఒకసారి ఛాయాదేవిగారిని వారి భర్త నేను నీకు చవకగా దొరికానన్నారు. దానికి ఛాయాదేవిగారు, నిజమే మీరు నాకు చవకగానే దొరికారని జవాబిచ్చారు. కట్నం తీసుకోకుండా చేసుకున్నానన్న అర్థాన్ని ఛాయాదేవిగారు గ్రహించారు. అందుకే చవకగా దొరికారన్నారు. బజారులో స్టీలు గ్లాసొకటి, వెండి గ్లాసొకటి కొన్నప్పుడు స్టీలు గ్లాసు చవక వస్తువని తెలుసు కదా! విలువ తక్కువ ఉన్నందున చవకగా దొరికారన్న అర్థంలో జవాబిచ్చారేమోనన్న భావం కల్గుతున్నది.

28-06-2019న ఛాయాదేవిగారు చనిపోయిన రోజున కవి శిఖామణి గారు, వరద రాజేశ్వరరావు గారు చనిపోయినప్పుడు పలకరించడానికి తాను, సి.మృణాళిని వెళ్ళామని, ఆమె పంజరం నుంచి బయట పడిన పక్షిలాగా కనిపించారని రాశారు. ఆధిక్యతతో కాకుండా, ప్రేమామృతంతో కొత్త కోణంలో పెత్తనం చేసినట్లుగా కనిపించకుండా తనకనుకూలంగా నడిచేలా చేయగలిగారు. పురుషాధిక్యంలో ఇదో కొత్త కోణం ప్రవేశపెట్టారనిపించడంలేదూ!

పురుషాధిక్య స్వభావం గల కుటుంబం నుంచి వచ్చినవారనుకోవడానికి వీల్లేదు. ఛాయాదేవిగారి మామగారు అబ్బూరి రాజేశ్వరరావు గారు హేతువాది. ఆ విషయం నాకు వీరందరితో పరిచయం ఏర్పడక ముందునుంచే తెలుసు. ఆంధ్ర యూనివర్శిటీ లైబ్రేరియన్‌గా పనిచేసే సమయంలో ఛాయాదేవిగారి మామగారు పనిచేసేచోట చదువుకుంటా నంటే ఆమె భర్త తాను రెండు సంవత్సరాలపాటు తన తండ్రి దగ్గరికి పంపారు. ఒక పత్రికకు సంపాదకురాలిగా నియమించారు. ఆమె రచనలు తన కుటుంబంలోని వారిని గమనించి రాయడం మొదలుపెట్టారు. ఇంటి విషయాలు వీథికెక్కిస్తున్నావని గోలపెట్టారట. కొండాపూర్‌లోని సి.ఆర్‌.రావు గారి వృద్ధాశ్రమంలో చేరినప్పుడు కొండవీటి సత్యవతి గారికి ఒంటరి జీవితం నుండి, సమిష్టి కుటుంబంలో చేరానని రాశారు. భూమిక పత్రికతోను, సంపాదకురాలు కొండవీటి సత్యవతి గారితోను ఛాయాదేవిగారికి విడదీయరాని అవినాభావ సంబంధం ఉంది. ఎంతోమంది బంధువర్గముండగా, స్వంత చెల్లెలు తనతోపాటు ఆశ్రమంలో ఉండగా వీలునామా రాసి సత్యవతి గారికి పంపారు. ఆ కవరును ఛాయాదేవి గారు చనిపోయిన రోజున చించి బయటకు తీశారు. ఆశ్రమంలో చేరిన తర్వాత ‘భూమిక’కు 50 వేలు విరాళంగా ఇచ్చారు. 86 సంవత్సరాల వయసులో ఏ రోగాన పడకుండా సుఖ నిద్రలో ఈ లోకం నుంచి తిరిగిరాని లోకానికి వెళ్ళారు. ఒక విశిష్ట వ్యక్తిత్వం గల సహజ రచయిత్రిని కోల్పోవడం మహిళా లోకానికి తీరని లోటు. ఆమె నిష్క్రమణకు చింతిస్తూ, నివాళులు అర్పిస్తూ, మరోప్రక్క ఆ సహజ రచయిత్రికి జేజేలు పలుకుతూ ముగిస్తున్నా.

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.