అబ్బూరి ఛాయాదేవి సంస్మృతిలో  -భండారు విజయ

 

సమాజంలో స్త్రీపురుషుల మధ్య వున్న అసమానతలను స్పష్టమైన ఒక అవగాహనతో అబ్బూరిఛాయాదేవి తమ రచనలు చేసారని చెప్పడానికీ ఎటువంటి సందేహం వుండదు. ఆమె ఎంత సౌకుమార్యంగా ఉంటారో, అంతే సున్నితంగా, సరళంగా ఆమె రచనలు మను కన్పిస్తాయి. ఆమె ముఖంలో చెరగని నువ్వు ఆమె ఆత్మ స్థైర్యానికి చిహ్నం. ఎప్పుడూ నవ్వుతూ తానొవ్వక, నొప్పించక మాట్లాడే ఆమె మాటలు ఎందరో రచయితలకు ఆదర్శనీయాలు. స్త్రీవాదం అంటే తెలియని రోజుల్లో ఆమె రచనలు స్త్రీల మనోగతాలను తెలియచేసి నాయని చెప్పడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదని భావిస్తాను సమాజంలో వున్న స్త్రీపురుషుల అసమానతల, వైరుద్యాల పట్నల స్త్రీలకు ఒక ఎరుకలేదా స్పృహ కలిగిన తర్వాత ఆ స్త్రీలు అనిగిమణిగి ఉండలేని స్థితికి జేరుకుంటారు. మానసిక సంఘర్షణకు గురి అవుతూనే పురుషులలో మార్పును తేవడానికి కృషి చేస్తూ తమ అస్థిత్వాలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారని వారి కథలు మనకు స్పష్టం చేస్తాయి.

అబ్బూరిఛాయాదేవి గారి కథలు ఏవి తీసుకున్నా నేలవిడిచి సాము చేయవు. అని పాత్రలూ వాస్తవికతను సంతరించుకుని చదివే పాటకులను ఆలోచింపజేస్తాయి. వారి లాగే వారి వాడే భాష కూడా చాలా సరళంగా, సున్నితంగా వుంటుంది. ప్రతిపాత్ర కూడా ఎవరినీ నొప్పించకుండా ఒక పాజిటీవ్‌ దృక్పథాన్ని అవర్చుకుని నడుస్తూ వుంటాయి. భావాలకు సరిపడ్డట్లుగా, భావనలకు అనుగుణంగా ప్రతిపాత్ర మాట్లాడుతూ వుంటుంది. కథ సాఫీగా, ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా నదిలో నీరులా ప్రశాంతంగా ఎటువంటి కల్పషం అంటకుండా సాగిపోతూ వుంటుంది.

ఏ సాహిత్యమైనా పాటకులకు ఒక ఆలోచనను వున్నప్పుడు ఆ సాహిత్య ప్రయోజనం నెరవేరుతుంది. అంతేకాదూ ఆ రచన ప్రేక్షకులకు ఒక సంస్కారాన్ని ఇవ్వగలగల్గినప్పుడు ఆచరన అసలైన ప్రయోజనం సాధించినట్లు అవుతుంది. సాహిత్యంఒక పాజినెస్‌ అప్రోచ్‌ను ఇవ్వ గల్గినప్పుడు ఆ సాహిత్య ప్రయోజనం నెరవేరినట్లే అవుతుంది. అబ్బూరి ఛాయాదేవి గారి రచనలు చదివితే మనకా సంస్కారాలను అందజేస్తాయని అనటానికి సందేహ పడాల్పిన అవసరం లేదు

ఆమె రచనల్లో మనకు ఎక్కడా పడికట్టు పదాలు కనబడవు. సిద్ధాంతాలు, వాటి తాలుకూ గజిబిజి వాతవరణం మనకు ఎక్కడా దొరకవు.. సరళమైన భాషలో వుండే పదాల లాలిత్యం మనల్ని ఆకట్టుకుంటుంది. ఎంత గంభీర వాతారణంలో అయినా వారి చతురోక్తులు, హాస్య గుళికల్లా నిశబద్ద తరంగాలను సైతం పీల్చి మనల్ని ఆనంద తీరాలవైపు నడిపించి తీరుతాయి. ఆమె సుతిమెత్తని హాస్యం ఎంత నవిస్తాయో అంతే ఆలోచింపజేస్తాయి. ఆమె ప్రత్యక్షంగా విసిరే చతురోక్తులు, హాస్య సంభాషణలు మనల్ని కట్టిపడేసి ఆనంద డోలలు ఊగిస్తాయి. అంతేకాదు మనల్ని సుదీర్ఘ ప్రయాణం చేయిస్తాయి.

ఆమె ప్రేమించని వారు లేనట్లే.. ఆమెను ప్రేమించని వారు కూడా ఎవ్వరూ వుండరు. ఆమెతో మాట్లాడటం గోదావరి అలలపై ప్రయాణం చేస్తున్నట్లుగా అనుభూతిని ఇస్తాయి. ఆమె తన భర్త అబ్బూరి వరద రాజేశ్వర రావు గారితో, అత్తగారితో, మరుదులు, ఆడపడుచులతో ఎంత సున్నితంగా ప్రేమను అల్లుకుని కుటుంబాన్ని తనవైపు తిప్పుకున్నారో అలాగే తన రచనలలోని పాత్రలు కూడా ఆప్యాయనుభూతులను మనకు పంచుతాయి. ఆమెతో మాట్లాడటం ఒక పూలతోటలో విహరించినంత హాయిగా వుంటుంది. చాలా మంది అభిమానులు ఆమెతో మాట్లాడం ఒక అదృష్టంగా భావిస్తారంటే ఆమె ఎంత ఆత్మీయంగా మెదులుతారో మనం అర్థం చేసుకోవచ్చు.

ఆమె జీవితం ఎందరికో ఆదర్శనీయం. ఆమె తన జీవితాన్ని తను నిర&ణయించుకున్న దిశలో నడుపుకోవడంలో ఆమె చూపిన తెగువ, ఆ తెగువ వెనుక వున్న నిర్ణయాత్మక శక్తి మనలో చాలామందిని ఆశ్చర్యానికి లోను చేసిన మాట వాస్తవం.. తన ఇల్లును అమ్మడంలో గానీ, వృద్దాశ్రమంలో చేరడం గానీ, తన జీవిత చివరి అంకాన్ని నిర్ణయించుకోవడంలోగానీ, ఆస్తిపాస్తుల నిర్ణయాధికారంలో గానీ ఆమె వ్యూహాత్మక శైలి అందరిని ఆశ్చర్యానికి లోనుచేసిందని చెప్పవచ్చు. ఆమె ఎంత ప్రేమను కురిపించగలదో అంతే మొండితనంతో తన నిర్ణయాలను అమలుచేసుకోగలదు. జీవితం పట్ల స్పష్టమైన ఒక అవగాహనతో పాటు జీవితానికి సరిపడా ప్రణాళికను వేసుకుని కాలానికి ఎదురీదకుండా.. కాలంతో నడిచి వెళ్ళిపోయిన అబ్బూరి ఛాయాదేవికి ఆత్మీయ అశృనివాళులు తప్పా మనం ఏమివ్వగలం? తరిగిపోని సాహిత్య ఘనని అభిమానులకు ఇచ్చి వెళ్ళిన వారికి సుమాంజలులు కాకా మరేం ఇవ్వగలం?

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.