యురేనియం తెలిసిన వాస్తవాలు – పొంచి ఉన్న ప్రమాదాలు -అనువాదం: ఎస్‌.జయ

 

ప్రపంచ యురేసియం విచారణ (వరల్డ్‌ యురేనియం హియరింగ్స్‌)లో డాక్టర్‌ గోర్డాన్‌ ఎడ్వర్ట్‌ చేసి ఆహ్వాన ప్రసంగ పాఠం సార్బబర్గ్‌, ఆస్ట్రియా : సెప్టెంబర్‌14, 1994

యురేనియం

మనకు యురేనియం గురించి అసలేం తెలుసు? ఇది భూమ్మీద సహజ సిద్ధంగా పుష్కలంగా లభించే ఒక మూలకం. అలాగే ఇతర లోహాల మాదిరిగా ఇది కూడా ఒక లోహం. కాకపోతే, 20వ శతాబ్ది మధ్యభాగం వరకు కూడా దీనికి వాణిజ్య విలువ ఏమీలేదు. యాభై ఏళ్ళ క్రితం వరకు కూడా ఒక ఉపోత్పత్తి – (ఒకదాన్ని ఉత్పత్తి చేస్తుంటే అదనంగా ఇది దొరికేది – (by product) గా లభించేది.

కెనడాలో మొట్టమొదట శుద్ధి చేయబడిన యురేనియం 1945లో హిరోషిమా, నాగసాకిలో వేసిన అణుబాంబుల కోరకు, పరమాణు పేలుడు పదార్ధం తయారీకి ఉపయోగించబడింది. నిజమే, అణ్వాయుధాల ఉత్పత్తిలో యురేనియంకు గుర్తింపు వచ్చింది. 1956 నాటికి, కెనడా ఎగుమతి చేసే అతి ముఖ్యమైన నాలుగు వస్తువులలో యురేనియం కూడా ఒకటి అయింది. అవి కలప గుజ్జు, కలప, గోధుమ, యురేనియం. ఎగుమతి అయ్యే ప్రతి ఔన్సు కూడా అమెరికా అణుబాంబులు, హైడ్రోజన్‌ బాంబులు ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడింది. దీనికన్నా కొంచెం తక్కువగా బ్రిటన్‌ అణ్వస్త్రాల పథకానికి కూడా ఉపయోగపడింది. అప్పుడు యురేనియం కేవలం అణుబాంబుల తయారీకి ఉపయోగపడింది.

ఇప్పుడు యురేనియంను ఉత్పత్తి చేసి, ఎగుమతి చేయడంలో కెనడా అగ్రస్థానంలో ఉంది. ఆశ్చర్యకరంగా, శాంతియుత ప్రయోజనాల కొరకు పౌర అణు రియాక్టర్ల కోసం ఇంధనంగా ఉపయోగపడుతోంది. ప్రపంచంలో యురేనియం తవ్వకాలను పెద్ద ఎత్తున చేపట్టిన కొన్ని దేశాలలో కెనడా కూడా ఒకటి. నేడు యురేనియం ధర గతంలో కన్నా చాలా తక్కువగా ఉంది. గత 15 ఏళ్ళుగా ధర అంతకంతకూ తగ్గుతూ వచ్చి ఇప్పుడు ఇంకా తక్కువగా ఉంది. కాగా సస్క్చేవన్‌ (Saskatchewan) ప్రాంతంలో, కొత్తగా ఐదు యురేనియం గనులను ప్రారంభించడానికి పథకం చేపట్టడానికిి పబ్లిక్‌ హియరింగ్‌ జరగబోతున్నది.

ఈ సదస్సుకు వచ్చిన మీరందరూ ఈ పరిశ్రమను విస్తరింపచేయకూడదని కెనడా ప్రధానమంత్రికి, సస్క్చేవన్‌ ప్రీమియర్‌కు విజ్ఞప్తులు చేయండి. ఎందుకంటే, భూమ్మీద ఉండే లోహాల్లోకెల్లా యురేనియం అత్యంత ప్రాణహాని కలిగించే మూలకం. సైన్స్‌ సాక్ష్యాధారాలతోనే మనం ఈ నిర్ణయానికి రాగలం. ఈ విషయాన్ని ఇంకొంచెం వివరంగా చర్చించుకుందాం.

రెండు విభిన్న ప్రత్యేక లక్షణాల కారణంగా యురేనియం వాణిజ్య విలువను, అదే సమయంలో ప్రమాదకర లక్షణాలను కలిగి

ఉంది. మొట్టమొదటిది యురేనియం అణుధార్మిక శక్తి కలిగి ఉండటం. రెండోది, యురేనియం పరమాణు విచ్ఛేదకశక్తి (fissionable) కలిగి ఉండటం. ఇలా రెండు రకాల పూర్తి భిన్నమైన లక్షణాలు కలిగి ఉన్న ఈ ఖనిజాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవలి.

అణుధార్మికశక్తి (రేడియో ఆక్టివిటీ)

అసాధారణమైన అణుధార్మిక శక్తిని 1896లో యాదృచ్ఛికంగా కనుగొన్నారు. హెన్రీ బెక్వెల్‌ (Henri Becqueral) అనే శాస్త్రవేత్త ఒక రాయిని టేబుల్‌ సొరుగులో పెట్టాడు. ఆ సొరుగులో వెలుతురు సోకని విధంగా ఫోటోగ్రాఫిక్‌ ప్లేట్‌ పెట్టబడి ఉంది. కొన్ని వారాల తర్వాత ఆ శాస్త్రవేత్త సొరుగులోంచి ప్లేట్‌ బయటికి తీసి బాగుచేశాడు. ఆ రాయి పెట్టినంతమేరకు, ఫోటోగ్రాఫిక్‌ మీద కాంతికిరణాలు ప్రసరించి ఉండడం గమనించి ఒక శాస్త్రవేత్తగా ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. బయట నుంచి ఎటువంటి ప్రేరణ లేకుండా, రసాయనిక క్రియ జరగకుండా, సూర్యకాంతి కూడా ప్రసరించని, పూర్తిగా చీకటి ప్రాంతంలో దాన్ని ఉంచినా ఆ రాయి నుంచే శక్తి విడుదల అయినట్లుగా తెలుసుకున్నాడు. అదే అణుధార్మిక శక్తి (రేడియో ఆక్టివిటీ)గా గుర్తించగలిగాడు.

దీనిలోని రహస్యాలను మరిన్ని తెలుసుకోవాలనుకున్న మేరీ క్యూరీ, ఎర్జ్‌ (Erz) పర్వతాల నుంచి యురేనియం ముడి ఖనిజాన్ని సంపాదించింది. యురేనియంను బయటికి తీయడానికి ఆమె రాయిని పొడిచేసి, ఆమ్లంలో కరిగించి యురేనియంను తీసింది. ఇదే విధానం ఇప్పటికీ అనుసరిస్తున్నారు. యురేనియంను వేరేచేేసిన తరువాత కూడా, ఆ రాయి పొడిలో అణుధార్మిక శక్తి ఇంకా మిగిలే ఉన్నట్టు, అంతేకాకుండా అది యురేనియంలో ఉండేదానికన్నా ఎక్కువని కూడా మేడమ్‌ క్యూరీ కనుగొంది.

1906 కల్లా, అణుధార్మిక శక్తికి సంబంధించిన అన్ని విషయాలు తెలిసినప్పటికీ, అటువంటి మూలకాలు ప్రకృతిలో అసలెందుకు ఏర్పడుతున్నాయో మనకు ఇప్పటికీ అంతుపట్టని విషయం. నిజంగా, సైన్సుకు కూడా దీని ఆంతర్యం తెలియదు. వస్తువులు ఎట్లా ప్రవర్తిస్తాయో సైన్స్‌ వివరిస్తుంది. సైన్స్‌ చెప్పేదేమంటే, చిన్న చిన్న అణువుల కలయికతో అన్ని పదార్ధాలు తయారవుతాయని, దాదాపు అన్ని పదార్థాలలో పరమాణువులు స్థిరసంఖ్యలోనే ఉంటాయి. కానీ అణుధార్మిక శక్తి కలిగిన పదార్థాలలో, పరమాణువులు స్థిరంగా ఉండవు.

అణుధార్మిక శక్తి ధాతువులలో పరమాణువులు అస్థిరంగా ఉంటూ సూక్ష్మరీతిలో విస్ఫోటనం చెందుతూ శక్తిని విడుదల చేస్తూ ఉంటాయి. ఈ క్రమాన్ని ”అణుధార్మిక శక్తి విభజన (రేడియో యాక్టివిటీ డిసింటిగ్రిటి)” లేక ”అణుధార్మిక శక్తి శిథిలం (రేడియో యాక్టివిటీ డికే)” అని అంటారు. అణుధార్మిక శక్తికి పరమాణువులు విస్ఫోటనం చెందినప్పుడు, శక్తివంతమైన ఆల్ఫా, బీటా అనే రెండు రకాల కిరణాలు విడుదలవుతాయి. అవి పేలుడువల్ల సంభవించే పదునైన తూటాల్లాగా ఉంటాయి. అతి సూక్ష్మమైన ఈ చిన్న తూటాల్లోంచి చాలా శక్తి విడుదల అయి విపరీతమైన హాని చేస్తుంది.

శిథిల ఉత్పత్తులు (Decay Products)

అణుధార్మిక శక్తి పరమాణువు విస్ఫోటనం చెందినప్పుడు, ఆ పరమాణువు మారుతూ కొత్త పదార్థంగా తయారవుతుంది. యురేనియం పరమాణువుల విస్ఫోటనం ఫలితంగా రేడియం వస్తుంది. ఎప్పుడైనా సరే, మీకు యురేనియం కనిపించిందంటే దానితోపాటు మీరు రేడియంను కూడా చూస్తున్నట్టే. ఎందుకంటే యురేనియం శిధిల (డికే ప్రొడక్ట్‌) ఉత్పత్తులు డజనుకు పైగానే ఉన్నాయి. అందులో రేడియం ఒకటి.

మరింత వివరంగా చెప్పుకోవాలంటే యురేనియం ముక్కలుగా విడిపోయినప్పుడు ఏర్పడే పదార్థం ప్రొటాక్టినిమ్‌. దీనిక్కూడా అణుధార్మికశక్తి ఉంటుంది. ప్రొటాక్టినిమ్‌ ముక్కలుగా విడిపోయినప్పుడు థోరియం అనే పదార్థంగా మారుతుంది. దీనికి కూడా అణుధార్మిక శక్తి పోతే ఇక మిగిలిందంతా పూర్తిగా క్షేమకరమైందేనని అనుకుంటున్నారు. కానీ కాదు, అణుధార్మిక శక్తి ధాతువులతో పోల్చినపుడు మిగిలిపోయిన లెడ్‌ తక్కువ ప్రమాదకారి మాత్రమే.

యురేనియంను వేరుచేయగా మిగిలిన రాతిపొడిలో అణుధార్మిక శక్తి కలిగిన మూలకాలు మిగిలే ఉంటాయి. మేరీక్యూరీ ఈ విధంగానే రాయి అవశేషంలోని అణుధార్మిక శక్తిని రేడియం, పొలోనియంలుగా కనుగొన్నది.

రేడియం

యురేనియంలో అణుధార్మిక శక్తి దాని డికే ప్రొడక్టులకన్నా తక్కువగా ఉంటుంది. అది వాణిజ్యపరంగా విలువైంది కూడా కాదు. కానీ రేడియం చాలా విలువైందిగా గుర్తించబడింది. రేడియంను ప్రధానంగా రెండు ఉద్దేశాల కోసం ఉపయోగిస్తూ వచ్చారు. ఒకటి క్యాన్సర్‌ పెరుగుదలను నియంత్రించడానికి. హెన్రీ బేక్విల్‌, మేరీ క్యూరీ ఇద్దరూ కూడా కాలిన గాయాలతో తీవ్రంగా బాధపడ్డారు. ఆ గాయాలను నయం చేయడం సాధ్యం కాలేదు. రేడియంను చేత్తో పట్టుకోవడం వల్ల వారికి వాతలు పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన శాస్త్రవేత్తలకు ఒక ఆలోచన తట్టింది. క్యాన్సర్‌ ట్యూమర్లు ఉన్న వారికి, రేడియం ఉన్న సూది పెడితే, అది క్యాన్సర్‌ను కాల్చివేస్తుందని. వారు అనుకున్నట్లే జరిగింది. అలా దుష్ప్రభావాలను క్యాన్సర్‌ కణాలవైపు మళ్ళించడం ద్వారా ఉపయోగించుకోవడం జరిగింది. అయితే, అటామిక్‌ రేడియేషన్‌ను ఆరోగ్యకరమైన కణాలవైపు మళ్ళిస్తే హాని జరుగుతుంది.

రేడియంను లూమినస్‌ (మెరిసే) పెయింట్‌గా కూడా ప్రధానంగా నేడు ఉపయోగిస్తున్నారు. ఇది చీకట్లో ప్రకాశించే వస్తువు. నమ్మండి, నమ్మకపోండి. ఒక గ్రాము యురేనియం ధర 1920లో 1,00,000 డాలర్లు ఉండేది. అప్పటి డాలర్లలో ఇది చాలా ఖరీదైన వస్తువు. కానీ ఏ పనికైనా దీని అవసరం చాలా తక్కువ. ఆ రకంగా ఈ పదార్థం చాలా తక్కువ పరిమాణంలోనైనా సరే ఎంత హాని చేయగలదో తెలియజెప్పిన మొదటి అనుభవం. రేడియం పెయింట్‌ వేసే యువతులకు రోగాలు సోకడం మొదలైంది. బ్లూమ్‌ అనే అమెరికన్‌ దంత వైద్యుడు మొదటిసారిగా ఈ విషయాలను రిపోర్ట్‌ చేశాడు. ఆయన వద్దకు 18, 19, 20 ఏళ్ళ వయసు గల యువతులు వెళ్ళేవారు. వారి దంతాలు రాలిపోయి, చిగుళ్ళు ఇన్ఫెక్షన్‌కు గురయి రక్తం కారేవి. వారు రక్తహీనతతో బాధపడేవారు. వారి ఎముకలు పెళుసుబారి, కొందరికి దవడ ఎముకలు ఉన్నట్టుండి విరిగిపోయేవి. కొందరు తీవ్రమైన రక్తహీనతతో మరణించేవారు.

వీరందరూ కూడా న్యూజెర్సీలోని రేడియం డయల్‌ పెయింటింగ్‌ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. బ్లూమ్‌ ఈ జబ్బులకు ”రేడియం జా’ (radium jaw) అని పేరు పెట్టాడు. ఈ జబ్బుల్నుంచి కోలుకున్న యువతులకు కొన్ని సంవత్సరాల తరువాత వారి శరీరంలో ఎముకలు ఉన్నట్టుండి విరగడం, ట్యూమర్లు పెరగడం జరిగేవి. ఇందులో కొన్ని క్యాన్సర్లు ఎముకలలో కూడా ఏర్పడేవి. అయితే ఎముకల్లో క్యాన్సర్‌ రావడం చాలా అరుదైన విషయం. రేడియం ప్రభావం వల్ల ఇలాంటి క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.

గడియారం డయల్‌ మీద అందమైన నాజూకు అక్షరాలు రాయడానికి బ్రష్‌ని ముంచి తీసే సమయంలో చాలా తక్కువ పరిమాణంలో రేడియం ఈ యువతుల కడుపులోకి చేరుతున్నది. ఇదే ఈ జబ్బులన్నింటికీ కారణమైంది. ఆ తరువాత ఈ యువతుల శవాలపై శవపరీక్షలు నిర్వహించినప్పుడు వీరి అస్థిపంజరాల్లో కొన్ని మైక్రోగ్రాముల రేడియంను డాక్టర్లు కనుగొన్నారు. దీని పరిమాణం చాలా కొంచెం. సంప్రదాయక రసాయనిక విశ్లేషణ ద్వారానైతే దీన్ని గుర్తించడం కూడా కష్టమే. అంతేకాదు ఆ కొంచెం రేడియం కూడా వారి అస్థిపంజరమంతా వ్యాపించి ఉంది. వీరి అస్తిపంజరం చిత్రం తీసుకోవాలనుకుంటే వారిని చీకటి గదిలో ఫోటోగ్రాఫిక్‌ ప్లేట్‌ మీద పడుకోబెడితే చాలు దానికదే ఎక్స్‌రే చిత్రం వచ్చేది. అంటే ఆటో రేడియోగ్రాఫ్‌ అన్నమాట. ఎక్స్‌రే మెషిన్‌ లేకుండా ఎక్సరే పిక్చర్‌ తీయడం.

ఆ పదార్థం సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటేనే అది కలిగించే హానికరమైన ప్రభావాలు ఏమిటో మొదటి పరిచయంలోనే మనం తెలుసుకున్నాం. అదేవిధంగా, ఈ దశ నుంచి బతికి బయటపడ్డ చాలామంది స్త్రీలు, ఆ తరువాత తలలో క్యాన్సర్‌, నోట్లో క్యాన్సర్‌ వంటి ఇతర రకాల క్యాన్సర్లకు లోనయ్యారు. వాటికి కారణమేమిటో మనకిప్పుడు తెలుసు. గుర్తుంచుకోండి, రేడియం మన శరీరంలోకి వెళ్ళినా, అణుధార్మికశక్తి కలిగి ఉంటుంది. ముందే నేను చెప్పినట్లు, రేేడియం ముక్కలుగా విడిపోయి రేడాన్‌ గ్యాస్‌గా మారుతుంది. అలా ఆ స్త్రీల శరీరాల్లో రేడాన్‌ గ్యాస్‌ ఉత్పత్తి అయింది. రేడియం కలుషితాన్ని గుర్తించడానికి ఒక పరీక్ష చేయొచ్చు. మనిషి వదిలే గాలిని పరీక్షించి రేడాన్‌ గ్యాస్‌ ఉందో లేదో తెలుసుకోవచ్చు. రేడాన్‌ గ్యాస్‌ ఉందంటే మనిషి శరీరంలో రేడియం ఉందని అర్థం. రేడియం డయల్‌ పెయింటర్స్‌ కేసులో వారి ఎముకల్లో రేడాన్‌ గ్యాస్‌ ఉత్పత్తి అయి, రక్తంలో కలిసింది. అది గుండె ద్వారా సరఫరా అయి తలకు చేరుకుంది. అక్కడ సున్నితమైన కణజాలాన్ని అది నాశనం చేయడం వల్ల తలలో క్యాన్సర్‌ వచ్చింది.

రేడాన్‌

కొన్ని వందల సంవత్సరాల క్రితం 15వ శతాబ్దంలో ఎర్జ్‌ పర్వతాల్లో పనిచేసిన గని కార్మికులు అంతు తెలియని ఊపిరితిత్తుల జబ్బులతో అత్యధిక సంఖ్యలో చనిపోయినట్లు నివేదికలున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని కేసుల్లో 75 శాతం మరణాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. 19వ శతాబ్ది చివరి వరకు ఆ జబ్బేమిటో అంతుపట్టలేదు. ఆ తరువాత పరీక్షల ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ అని తెలిసింది. అది ఊపిరితిత్తుల క్యాన్సర్‌ అని, ఆ పరిసరాల్లో నివసించే ప్రజలకు తెలియను కూడా తెలియదు.

1930 నాటికి, గనుల వాతావరణంలో కలిసిన అణుధార్మిక శక్తి గల ధాతువులను పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌, ఊపిరితిత్తుల్లో ఇతర జబ్బులు వచ్చాయని నిర్ధారణ అయింది. పశువుల్లో మరణాలకు ప్రధాన కారణం రేడాన్‌ గ్యాస్‌ అని కూడా గుర్తించారు.

యురేనియంతో అణుబాంబులు తయారు చేయవచ్చని కనుగొనడంతో 1942 నుండి దీనికి వాణిజ్య విలువ వచ్చింది. అప్పట్నుంచే, ఇతర ఉపోత్పత్తుల కోసం కాకుండా, కేవలం యురేనియం కోసమే గనుల తవ్వకం మొదలయింది. దీనికన్నా కొన్ని సంవత్సరాలకి ముందే, 1938లో యురేనియంలో అణుధార్మిక శక్తి మాత్రమే కాక పరమాణు విచ్ఛేదనంతో విపరీతమైన శక్తి విడుదల అవుతుందని కనుగొన్నారు. సహజంగా దొరికే అణుధార్మిక శక్తి మూలకాల కన్నా యురేనియం ప్రత్యేకమైనదని ఈ లక్షణాల వల్లే గుర్తించడం జరిగింది. యురేనియం పరమాణు విచ్చేదనానికి లోనయినప్పుడు విపరీతమైన శక్తి విడుదల అవుతుంది. అణుధార్మిక శక్తి సహజంగా క్షీణించే క్రమంలో, దాన్ని మార్చడం కానీ, ఆపడం కానీ చేయడం చాలా కష్టం. కానీ, మనిషి ప్రమేయంతో జరిగే పరమాణు విచ్ఛేదనాన్ని నియంత్రించవచ్చు. పరమాణు విచ్ఛేదనం కారణంగా వెలువడే శక్తి వేగాన్ని పెంచవచ్చు., తగ్గించవచ్చు, ప్రారంభించవచ్చు, ఆపివేయవచ్చు. అణ్వాయుధాల రూపంలో నగరాల్ని నాశనం చేయడానికి ఉపయోగించవచ్చు లేదా అణుశక్తి ఉత్పాదక కేంద్రం (న్యూక్లియర్‌ రియాక్టర్‌) లో నీళ్ళనూ మరిగించవచ్చు.

దీంతో, ఒక్కసారిగా యురేనియంకు డిమాండ్‌ పెరిగింది. కెనడాలోని గని కార్మికులను ఉత్తర అమెరికాలోని గనుల్లోకి పంపడం జరిగింది. అక్కడ రేడియేషన్‌ అనుమతించదగిన స్థాయిలో ఉంది. ఈ స్థాయిని మళ్లీ 19వ శతాబ్ది వెనక్కి వెళ్ళి ఎర్జ్‌ పర్వతాల్లోని గనుల స్థాయిని బట్టి నిర్ణయించడం జరిగింది. ఫలితాలు అనుకున్నవే. ముందుగానే ఊహించినట్లు ఊపిరితిత్తుల జబ్బులు, క్యాన్సర్లు సంభవించాయి. అందుకనే, ఎవరైనా ప్రశ్నించవలసిందేమిటంటే, ఈ నష్టాలు జరగబోతున్నాయని ముందుగానే ఎందుకు గుర్తించలేదు? ఎందుకని నివారించటం జరగలేదు?

రేడాన్‌ పిల్లలు

రేడాన్‌ పరమాణువులు విడిపోయి, అణుధార్మిక శక్తి మూల పదార్థాలు అనేకం ఏర్పడతాయి. ఇవి మొదట్లో లేవు. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు చూడడం లేదు. కనుక, గని కార్మికులు గనుల్లోకి వెళ్ళినపుడు అక్కడ వారు అనేక గంటలు ఉండాల్సి రావడంతో రేడాన్‌ వారి ఊపిరితిత్తుల్లోకి చేరుతోంది. ప్రయోగశాలల్లో ఉండే రేడాన్‌ కన్నా గనుల్లో ఉండే రేడాన్‌లోని అణుధార్మిక శక్తి ఐదు రెట్లు అధికంగా ఉంటుంది. అంతేకాకుండా, దాని ఇతర మూల పదార్థాలు, రేడాన్‌ పిల్లల్లో అత్యంత ప్రమాదకరమైన మూల పదార్థం పొలోనియం. ఈ పొలోనియంనే చాలా ఏళ్ళ క్రితం మేరీ క్యూరీ కనుగొన్నారు. చాలా సందర్భాలలో ఈ పొలోనియం కూడా ప్లూటోనియం అంత విషపూరితమైనది. కొన్నిసార్లు మరింత విషపూరితమైనదని శాస్త్రీయమైన సాక్ష్యాధారాలు రుజువు చేస్తున్నాయి.

అణువిచ్ఛేదనం (న్యూక్లియర్‌ ఫిజన్‌)

యురేనియం పరమాణువులు అణుధార్మికశక్తి కలవి. అలా అణుధార్మికశక్తిని ప్రసరిస్తూ అణువులు వాటికవే విడిపోతూ

ఉంటాయి. అయితే చిన్న కణాలైన న్యూట్రాన్స్‌తో యురేనియం పరమాణువులను తాడనకు గురిచేస్తే (పశీఎపaతీస) ఏం జరుగుతుంది? అవి మరింత ఎక్కువ శక్తివంతంగా విడిపోతాయి. దీన్నే పరమాణు విచ్చేదనం (న్యూక్లియర్‌ ఫిజన్‌) అంటారు. పరమాణు విచ్ఛేదనం జరిగినప్పుడు, యరేనియం పరమాణువు ఉత్తినే ముక్కలుగా విడిపోదు. అది రెండు మూడు పెద్ద్ద ముక్కలుగా విరిగిపోతుంది. ఈ క్రమంలో అదనంగా కొన్ని న్యూట్రాన్లను ఇస్తుంది. అంతేకాక సహజ రేడియో ధార్మికశక్తి కన్నా ఈ విధంగా ముక్కలుగా విడిపోయేటప్పుడు 400 రెట్లు అధికంగా శక్తిని కూడా ఇస్తుంది.

న్యూట్రాన్‌ ద్వారా పేల్చి అణువిచ్ఛేదనం చేసిన కారణంగా, ఇది సహజ అణుధార్మికత కన్నా పూర్తి భిన్నంగా ఉంటుంది. సహజ అణుధార్మిక శక్తి పేలుడుకు గురికాదు. అందుకే దీన్ని ఎలా నియంత్రించాలో సైన్సుకు తెలియదు. అణుధార్మిక శక్తిని వేగవంతం చేయడం, వేగం తగ్గించడం, కదిలించడం లేక నిలుపు చేయడం వంటి పద్ధతులు మనకు లేవు. అందుకే అణుధార్మిక శక్తి వ్యర్థాలు పెద్ద సమస్యగా ఉన్నాయి. అణువిచ్ఛేదనంలో ప్రతి స్థాయిలో ఉత్పత్తి అయ్యే అదనపు న్యూట్రాన్లను నియంత్రించడం ద్వారానే మనం అణుధార్మిక శక్తి విడుదలను మొదలు పెట్టవచ్చు, ఆపవచ్చు, నియంత్రించవచ్చు. ప్రారంభంలో ఒక న్యూట్రాన్‌లో యురేనియం పరమాణువును విడగొట్టడం ద్వారా ఒకటి రెండుగా, రెండు నాలుగుగా, నాలుగు ఎనిమిదిగా, ఎనిమిది పదహారుగా ఇలా పరమాణువులాగా విడిపోతూ ఉంటుంది. ఆ విధంగా నలభై క్వింటిలిన్‌ (ఒకటి పక్కన ముప్ఫై సున్నాలు ఉన్న సంఖ్య) యురేనియం పరమాణువులు కేవలం అరవై సార్లు విడిపోవడం ద్వారానే ఏర్పడతాయి. ఒకే ఒక్క న్యూట్రాన్‌ ద్వారానే ఇది సంభవించిందని మనం గుర్తుంచుకోవాలి. ఈ మొత్తం ‘చైన్‌ రియాక్షన్‌’కు ఒక సెకనులో వెయ్యో వంతు సమయం పడుతుంది. ఇదే అణుబాంబులో జరిగే చర్య.

పరమాణు విచ్ఛేదన ఉత్పత్తులు

అణుబాంబు పేలిన తర్వాత వెలువడే అణుధార్మిక పదార్థాలు యురేనియం చిన్న పరమాణువులోంచి వచ్చినవేనన్న విషయం మనకు అర్థమవుతుంది. ఈ కొత్త పరమాణు విచ్ఛేదన పదార్థాలు వందల సంఖ్యలో పుట్టుకొస్తాయి. ఇవన్నీ రకరకాల పేర్లతో రకరకాల రసాయన, జీవసంబంధిత లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవన్నీ న్యూక్లియర్‌ టెక్నాలజీ రాక పూర్వం ప్రకృతిలో లేవు.

యురేనియం అనేక అదృశ్య రూపాలలో ప్రయాణిస్తుంది. ప్రతి యురేనియం ముడి ఖనిజం నమూనాలో, రేడియంని కనుగొంటాం. కానీ ఒక ప్రత్యేక స్థితిలో రేడియం కేవలం యురేనియం యొక్క రూపాంతరం మాత్రమే. మామూలుగా చెప్పుకోవాలంటే యురేనియం యొక్క అదృశ్యరూపమని అనుకోవచ్చు. శిథిలమైన గొలుసులో (Decay chain) ఉన్న చాలా మూలకాలలో ఇది ఒకటి మాత్రమే. అదేవిధంగా పొలోనియం, రేడాన్‌ గ్యాస్‌… ఇవన్నీ యురేనియం నుంచి పుట్టుకొచ్చినవే. అంటే అణుధార్మిక శక్తి కోల్పోతూ ఏర్పడుతున్న మూలకాలు (ఉదా: రేడియం ధాతువు శిథిలమవుతుంటే దాని నుంచి రేడాన్‌ అనే ధాతువు ఏర్పడుతుంది).

అదేవిధంగా అణుబాంబులు వేసినప్పుడు, యురేనియం అణువిస్ఫోటనం వల్ల విడుదలయ్యే అణుధార్మిక శక్తి పదార్థాల్లో ముఖ్యమైనవి ఐడిన్‌-131, స్టోనియం-90, సెసియం-137, క్రిప్టోన్‌-85 మొదలైనవి. ఇవి పరమాణు విచ్ఛేదనం ఫలితంగా ఏర్పడిన యురేనియం యొక్క అదనపు అదృశ్యరూపాలు.

చెర్నోబిల్‌ రియాక్టర్‌ నుంచి కూడా ఈ విధంగానే యురేనియం అణుధార్మిక శక్తి విషాలు వెలువడ్డాయి. పేలిన చెర్నోబిల్‌ దుర్ఘటన ద్వారా ఏర్పడిన రేడియేషన్‌లో 80 శాతం రేడియేషన్‌ కేవలం రెండు కిలోల రేడియో యాక్టివిటీ పదార్థం బయటికి రావడం ద్వారానే జరిగింది. ఈనాటికీ వేల్స్‌ (ఇంగ్లాండ్‌)లోని గొర్రె మాంసం మానవ వినియోగానికి ఉపయోగించడం లేదు. ఎందుకంటే చెర్నోబిల్‌ దుర్ఘటనతో వెలువడిన సెసియం-137 అనే ఒక ప్రత్యేక ఉపోత్పత్తి వల్ల గొర్రెలు చాలా కలుషితమయ్యాయి. పరమాణు విచ్ఛేదన

ఉత్పత్తులని పిలవడబడే ఈ రేడియో ధార్మిక శక్తి గల ముడిపదార్థాలు బాంబు పడినప్పుడు అణురియాక్టర్లలోనూ తయారయ్యేవి. మొదట చెప్పినవి యురేనియం యొక్క విచ్ఛేదన ఉత్పత్తులు కాగా, రెండవది రేడియో ధార్మికశక్తి కోల్పోవడం వల్ల ఏర్పడే ధాతువుల శిథిల

ఉత్పత్తులు. ఇవి సంఖ్యాపరంగా రెండు డజన్ల వరకు ఉంటాయి. పరమాణు విచ్ఛేదనం (ఫిజన్‌) ఉత్పత్తుల గురించి మాట్లాడుతున్నప్పడు, ఇవి అణు ఆయుధాల్లో, అణు రియాక్టర్లలో మాత్రమే సృష్టించబడతాయని అర్థం చేసుకోవాలి. ఇవి సుమారు 300 రకాలుంటాయి. ఇవి అణుధార్మిక శక్తి కలిగి ఉన్నందున ప్రతిదానికీ స్వతహాగా శిథిల ఉత్పత్తులు కూడా ఉంటాయి.

రేడియో థార్మిక శక్తి గల ముడిపదార్థాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు

ఈ యురేనియం పదార్థం ఒక్కటే, రేడియో ధార్మిక శక్తి గల అనేక ధాతువులుగా రూపాంతరం చెందుతూ విస్తృతమైన రీతిలో మానవ పరిసరాలలోకి ప్రవేశించడానికి కారణం. ఈ ధాతువులన్నీ కూడా జీవరాశులకు చాలా హానికరం. నీటి ద్వారా, ఆహారం ద్వారా, పీల్చొకొనే గాలి ద్వారా ఇవి మన శరీరాల్లోకి చేరతాయి. మామూలు ఇతర పదార్థాలలాగే ఉండే వీటికి రేడియో థార్మిక శక్తి ఉంటుంది.

ఉదాహరణకు, రేడియో ధార్మికశక్తి గల అయోడిన్‌నే తీసుకోండి. ఇది రేడియో ధార్మిక శక్తి లేని అయోడిన్‌ లాగే పనిచేస్తుంది. మనం తినే ఉప్పుల్లో అయోడిన్‌ ఎందుకు ఉండాలి? మనకున్న కొన్ని రోగనివారణ మందుల్లో ఇది ఒకటి. మనం ఉప్పు తిన్నప్పుడు, అయోడిన్‌ థైరాయిడ్‌ గ్లాండ్‌కు చేరుతుంది. గాయిటర్‌ అని పిలిచే థైరాయిడ్‌ గ్లాండ్‌ జబ్బు నివారణకు ఇది సహాయపడుతుంది. రేడియో ధార్మిక శక్తి గల అయోడిన్‌ కూడా ఇలాగే పనిచేస్తుంది. ఆహారంలో రేడియో థార్మిక శక్తి గల అయోడిన్‌ను తీసుకుంటే, అది కూడా థైరాయిడ్‌కు చేరుతుంది. అది కూడా ‘గాయిటర్‌’ జబ్బును నివారిస్తుంది. అయితే, అది అక్కడ ఉన్నప్పుడు అణుధార్మికత (రేడియేషన్‌) వెలువడుతూ

ఉంటుంది. దీనివల్ల వేలసార్లు రసాయనిక బంధాలు లక్ష్యరహితంగా విచ్ఛిన్నమవుతాయి. ఇది ఒకరకంగా కంప్యూటర్‌లోకి గ్రెనేడ్‌ను విసరడం లాంటిది. గ్రెనేడ్‌ విసరడం వల్ల కంప్యూటర్‌ బాగుపడడానికి ఉండే అవకాశం అతి స్వల్పం. అలాంటిదే రేడియేషన్‌. మానవ కణాలు చనిపోతే నిజానికి సమస్య లేదు. ఎందుకంటే ఆ కొద్ది సమయంలో ఎన్నో చనిపోవు. వాటి స్థానంలో కొత్త కణాలు పుడతాయి. చనిపోకుండా బతికిపోయిన ఆ ప్రత్యేక కణమే నిజానికి ప్రమాదకరమైనది. నాశనమైన కణాలు క్యాన్సర్‌గా అభివృద్ది అవుతాయి. వీర్యకణాలకు, అండకణాలకు కూడా హానికలగడం వల్ల వంశపారంపర్యంగా పుట్టబోయే పిల్లలకు, మనుమలకు, మునిమనుమలకు కూడా ఈ ప్రమాదం ఉంటుంది.

అటామిక్‌ రేడియేషన్‌ చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ అది మనుషులకు సోకడం వల్ల ప్రధానంగా రెండు రకాల జబ్బులు వస్తాయని అందరూ అంగీకరిస్తున్నారు. అవి 1. అన్ని రకాల క్యాన్సర్లు. 2. వంశపారంపర్య మార్పులు. రేడియేషన్‌ మోతాదుతో హానికరమైన ప్రభావానికి సంబంధం ఉంటుందని చాలా మంది శాస్త్రవేత్తలు నమ్ముతారు. అంటే మోతాదు రెండు రెట్లు ఉంటే, క్యాన్సర్లు, వంశపారంపర్య లోపాలు రెండింతలు ఉంటాయని, మోతాదు సగానికి తగ్గుతాయని అంటారు. గమనించాల్సిన నిషయం ఏంటంటే, చాలా విస్తారంగా

ఉన్న జనాభా మధ్య, హానికరమైన మోతాదులో రేడియేషన్‌ వ్యాపిస్తే ఒక్కొక్క వ్యక్తి పొందే రేడియేషన్‌ మోతాదు చాలా తక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి క్యాన్సర్ల సంఖ్య, అంగ వైకల్యాలు చాలా తక్కువగా ఉంటాయని అనుకోవడం అశాస్త్రీయం. నిజానికి క్యాన్సర్ల సంఖ్యలో కానీ అంగ వైకల్యాల సంఖ్యలో కానీ ఏ మాత్రం మినహాయింపు ఉండదు. కాబట్టి మోతాదు తగ్గడం వల్ల జబ్బులు తగ్గుతాయనడం అసంబద్ధం. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. అదేమిటంటే చాలా తక్కువ స్థాయిలో రేడియేషన్‌ ఉన్నా నష్టం లేకపోలేదు. గర్భస్థ

శిశువుకు ఎంత తక్కువ మోతాదులో రేడియేషన్‌ సోకినా ఆ పిల్లలకు మానసిక వైకల్యం వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తల బృందం నిర్థారించింది. ఇక్కడ గమనించాల్సిన నిషయం రేడియేషన్‌ మోతాదు ఎంత తక్కువైనా పిండ దశలో మార్పులు రావడానికి పూర్తిగా అవకాశం ఉంది. కానీ ఇప్పుడు రేడియేషన్‌ వల్ల మానసిక వైకల్యంతో పుట్టే పిల్లల సంఖ్య పెరుగుతోంది.

యురేనియం వ్యర్థాలు (టెయిలింగ్స్‌)

రాళ్ళను తవ్వి, భూమిలోంచి యురేనియంను తీసినప్పుడు ముడిపదార్థాల్ని చూర్ణం చేసి, అందులోంచి యురేనియంను వేరు చేస్తారు. మిగిలిపోయేవి వ్యర్థాలు. వాటిని మలినాలు అంటారు. ఇది ఒకరకంగా పిండిలాగా ఉంటుంది. కెనడాలో 2000 లక్షల టన్నుల రేడియో ధార్మిక శక్తిగల వ్యర్థాలు ఉన్నాయి. వీటిని యురేనియం టెయిలింగ్స్‌ అంటారు. మేరీక్యూరీ కనిపెట్టినట్లు ముడి ఖనిజంలో 85 శాతం ఉన్న రేడియో ధార్మిక శక్తి పిండి చేయబడిన రాయిలో మిగిలే ఉంటుంది. అది మార్పులకు లోనవుతూ శిథిలమవుతున్నా కానీ దాని ”హాఫ్‌ లైఫ్‌” ఉంటుంది. దీనిలోని రేడియో ధార్మికశక్తి 80 వేల ఏళ్ళ వరకు ఉంటుంది.

ఇసుకలాగే ఉండే ఈ వ్యర్థాలు భూమి ఉపరితలం మీదనే వదిలేయడం వల్ల గాలి వల్ల ఇతర ప్రదేశాలకు కొట్టుకుపోతాయి. వర్షం వల్ల నీటిలో కలిసి ఇతర ప్రదేశాలకు చేరుకుంటాయి. అనివార్యంగా ఇలా ఇతర ప్రదేశాలకు ఈ వ్యర్థాలు వ్యాపిస్తాయి. ఒకసారి ఈ గనులకు సంబంధించిన కంపెనీలు మూసివేస్తే అప్పుడు ఈ వ్యర్థ పదార్థాల గురించి ఎవరు పట్టించుకుంటారు? వాస్తవానికి 2000 లక్షల టన్నుల రేడియో ధార్మిక శక్తి గల ఇసుకను ఎల్లకాలం ఎవరు కాపలా కాస్తారు? అది పర్యావరణంలో కలువకుండా ఎలాంటి చర్యలు చేపడతారు?

అంతేకాక భూమి ఉపరితలం మీద ఉంటే ఆ వ్యర్థాలు నిత్యం రేడాన్‌ గ్యాస్‌ను విడుదల చేస్తూ ఉంటాయి. రేడాన్‌ ధాతువు గాలి కన్నా 8 రెట్లు బరువైనది. కనుక ఇది ఎప్పుడూ భూమికి చాలా తక్కువ ఎత్తులోనే గాలిలో కలిసి ఉంటుంది. ఒక చిన్న చిరుగాలికి కూడా అది కొన్ని రోజుల్లోనే వేయి మైళ్ళు ప్రయాణించగలదు. రేడియో ధార్మిక శక్తి గల దీని ఉపోత్పత్తులను ‘రేడాన్‌ పిల్లలు’ పొలోనియంతో సహా చెట్టు చేమలు, జీవరాశులలోకి ప్రవేశిస్తాయి. వేలమైళ్ళ దూరంలో యురేనియం ప్రాజెక్టును నెలకొల్పినా జంతుజాలంలోకి, చెట్లు, చేపలు, పంటపొలాల్లోకి ‘రేడాన్‌ పిల్లలు’ చేరతాయి. స్వర్ణయుగాన్ని తీసుకురావడం కోసం పర్యావరణంలోకి రేడియో ధార్మిక శక్తిని పంపిస్తున్నారు. ఇదే పొంచి ఉన్న ప్రమాదాల్లో ఒకటి.

ముగింపు

చివరికి యురేనియం అంతా అణు ఆయుధాలుగానో లేక పెద్ద ఎత్తున రేడియో ధార్మిక వ్యర్థాలుగానో ఉండిపోతుంది. అన్ని యురేనియం గనుల గమ్యం ఇదే. యురేనియం కోసం గనులు తవ్వడం ద్వారా, రేడియో ధార్మిక ధాతువుల్ని భూమిలోంచి బయటకు తీయడమనేది చాలా హానికరమైనదని సైన్సుకు కూడా తెలుసు. మానవ సమస్యలకు అణు సాంకేతిక విజ్ఞానం (న్యూక్లియర్‌ టెక్నాలజీ) ఏనాడూ పరిష్కారం కాదనే విషయం మనం గుర్తుంచుకోవాలి. అణు ఆయుధాలు శాంతియుతమైన ప్రపంచాన్ని తీసుకురాలేవు. మన ఇంధన కొరతకు అణుశక్తి సరైన జవాబు కానేకాదు. విద్యుచ్ఛక్తి కోసం కూడా ఇది మనకు అవసరం లేదు. విద్యుచ్చక్తి పుట్టించే సంప్రదాయక పద్దతులు మనకు ఉన్నాయి. చక్రాలు తిప్పడం ద్వారా, జల విద్యుచ్చక్తి, గాలి విద్యుచ్చక్తి, థర్మల్‌ విద్యుచ్ఛక్తి వంటివి అనేకం ఉన్నాయి. అంతేకాక నేరుగా విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసే ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి.

ఉదాహరణకు సోలార్‌, ఇంధనం మొదలైనవి. అణుధార్మిక శక్తి విషయంలో మనం మొదట్నుంచి అనుకుంటున్న విషయం ఒకటే. దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకోవటం ఎలానో మనకు ఇప్పటికీ తెలియదు.

ఇప్పటికి జరిగింది చాలు. మానవజాతిగా మనం ఈ సమస్యను తీవ్రంగా పట్టించుకోవాలి. మన భూమిపై ఎల్లప్పుడూ అణుధార్మిక శక్తి స్థాయి పెరుగుతూ ఉండాలని మనం కోరుకోకూడదు. ఇప్పటికే మనకు చాలా సమస్యలున్నాయి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.