ఒక్క బిడ్డ చాలా?? -పి. ప్రశాంతి

 

కార్తీక మాసపు ఆహ్లాదకర వాతా వరణం. ఒక పక్కనుంచి చల్లగాలి మెల్లగా వీస్తోంది. మరో పక్కనుంచి నులివెచ్చని ఎండ… తమాషా అయిన అనుభవం. బీనా, ఆషా, హరిత, మధు, విజ్జి, సుజి, వినయ… ఒక్కరొక్కరుగా వేపచెట్టు కిందకి చేరుకున్నారు. ఒకరిద్దరికి ముఖపరిచయం ఉన్నా దాదాపు అందరూ మొదటిసారి ఒక దగ్గర కలుసు కుంటున్నారు. ఒకరినొకరు బిడియంగా, ఒకింత బెరుగ్గా పలకరించుకున్నారు. అంతలోనే శాంతి అక్కడికి చేరుకుంది. అందరి ముఖాల్లో ఒక రిలీఫ్‌… అందరికీ శాంతి బాగా పరిచయం కాబట్టి తను రాగానే అందర్లో సంతోషం.

ఈ రోజు వీళ్ళందరూ ఇక్కడ చేరడానికి సూత్రధారి శాంతినే. హుషారుగా అందర్నీ ఒకరికొకర్ని పరిచయం చేసింది. పరిచయం చేసేటప్పుడు ఒక్కొక్కరిలోని ఒక బలమైన సుగుణాన్ని, ఒక నైపుణ్యాన్ని హైలైట్‌ చేస్తూ పరిచయం చేసింది. అంతవరకూ అక్కడ అలుముకుని ఉన్న బెరుకు, బిడియం పారిపోయి స్నేహం, మెచ్చుకోలు వచ్చి చేరాయి. ఈ కొత్త స్నేహం సెలబ్రేట్‌ చేసుకుంటూ అందరూ తమ అరిచేతుల్ని దగ్గర చేర్చి, చేతులు కలిపి గుండ్రంగా నించున్నారు. ‘కూర్చొని మాట్లాడుకుందాం’ అన్న శాంతి మాటల్తో అందరూ అలాగే కూర్చుండిపోయారు.

‘మీకు అత్యంత సంతోషాన్నిచ్చిన సందర్భమేది’ అడిగింది శాంతి. ‘మా బాబు పుట్టడం’, ‘అప్పుడే పుట్టిన నా పాప ముఖం చూడడం’, ‘మా అమ్మాయి నన్ను మొదటిసారి అమ్మా అని పిలవడం’… ప్రతి ఒక్కరూ ఇంచుమించుగా ‘మాతృత్వం’ కేంద్రంగానే తమ అత్యంత సంతోషకర సందర్భం చెప్పారు. తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ అమ్మాయినో, అబ్బాయినో ఎంత బాగా చదివిస్తున్నారో, ఎంత గొప్ప స్కూల్లో చేర్పించారో, వారు ఆటల్లో ఎంత రాణిస్తున్నారో, వారికి ఏ కష్టం రాకుండా తాము ఎంత అపురూపంగా చూసుకుంటు న్నారో ఒకరితో ఒకరు పోటీపడుతూ విరామం ఇవ్వకుండా చెప్పుకుపోతున్నారు. అందర్నీ నవ్వుతూ ప్రేమగా, అభిమానంగా చూస్తోంది శాంతి.

‘ఇంత కేరింగ్‌గా ఉంటున్నా మా అమ్మాయి మాతో ముభావంగా ఉంటోంది. ఫ్రెండ్స్‌తో ఫోన్‌లో అయినా సరే చాలా చలాకీగా మాట్లాడుతుంది’ విజ్జి కంప్లెయింట్‌.

‘మా అబ్బాయి ఫ్రెండ్స్‌ గురించి అడిగితే చాలు ఇరిటేట్‌ అయిపోతున్నాడు’ హరిత అంది.

‘మొన్న మా అమ్మాయి స్నాక్‌ స్కూల్‌ క్యాంటీన్‌లో ఫ్రెండ్స్‌తో కలసి తింటానంటే వారి ఖర్చులతో కలిపి రెండొందలిస్తే తిరిగి ఇంటికొచ్చేటప్పుడు ఆటోకి పైసల్లేక కిలోమీటరు పైబడి దూరం నడిచొచ్చింది’ గొంతు జీరబోయి కళ్ళలో తడితో ఆషా.

‘మా అబ్బాయైతే, నేను మార్కెట్‌కెళ్ళి కూరగాయలు తెచ్చేలోపు స్కూల్‌ నించి ఇంటికొచ్చేసి ఆకలేస్తోందని పాలు వేడిచేసి తాగుదామనుకున్నాడట. పొయ్యిమీద పెట్టి, ముఖం కడుక్కొచ్చేలోపు పొంగిపోయాయని నేనొచ్చేసరికి స్టౌ శుభ్రం చేస్తున్నాడు. చిన్న వయసు. పైగా టెన్త్‌ సిలబస్‌ ఎంతుంటుందో మీకూ తెల్సుగా… నేను వాడికి సాయం చేయలేకపోతున్నా’ అంటూ బాధపడింది బీనా.

‘మా అబ్బాయి బర్త్‌డేకి ఐ ఫోన్‌ కొనిపెట్టలేదని రెండు రోజులు నాతో మాట్లాడలేదు. శామ్‌సంగ్‌ కొత్త ఫోన్‌ కొని రెండ్నెల్లన్నా కాలేదు కదరా అంటే వినలా. చివరికి నిన్న ఐ ఫోన్‌ కొనిచ్చాక కానీ నాతో సంతోషంగా మాట్లాడలా. వాడి శామ్‌సంగ్‌ ఫోన్‌ని ఇప్పుడు వాళ్ళ నాన్న వాడుతున్నారు. ఒక్కగానొక్కడు వాడ్ని బాధపెట్టలేం కదా…’ సుజి వాపోయింది.

‘మా వాడికి హాలిడేస్‌. వాడ్ని ఎంగేజ్‌ చెయ్యడానికి నేను ఆఫీస్‌కి లీవ్‌ పెట్టాను. సడన్‌గా వాడి సెలవులు ఎక్స్‌టెండ్‌ చేసారు. నా లీవ్‌ ఎక్స్‌టెన్షన్‌కి పెడితే శాంక్షన్‌ చెయ్యలేదు. ఇంకా 13 ఏళ్ళన్నా నిండలా. ఒక్కడ్నే ఇంట్లో వదిలేసి కష్టం కదా. అపార్ట్‌మెంట్లో పిల్లల్తో సెల్లార్‌లో ఆడుకుంటా నంటాడు. అలా భయం కదా. చాలా స్ట్రెస్‌ ఫీల్‌ అయ్యా. చివరికి ఉద్యోగానికి రాజీనామా చేశా. ఇప్పుడు వాడేమో ఎంతసేపూ ఇంట్లోనే కూర్చోమంటావేంటి అని చిందులు తొక్కుతున్నాడు. ఎప్పుడెప్పుడు టెన్త్‌ అయి పోతుందా, ఎప్పుడు హాస్టల్లో చేర్చించెయ్యాలా అని ఎదురుచూస్తున్నా…’ వెళ్ళబోసుకుంది మధు.

‘స్విమ్మింగ్‌, టెన్నిస్‌ నేర్చుకోమంటే డాన్స్‌ నేర్చుకుంటానంటోంది మా అమ్మాయి. ఇన్నర్‌ ఎక్స్‌ప్రెషన్స్‌కి అది బాగా హెల్ప్‌ అవుతుందంటుందే కానీ ఒక్కగానొక్క ఆడపిల్ల. పెళ్ళి చేసి పంపాల్సిందేగా. ఎంతకాలం డాన్స్‌ చేస్తుంది. ఎంత చెప్పినా వినట్లా. మంకు పట్టు పట్టింది’ వినయ బాధపడింది.

అందర్నీ అన్నీ చెప్పనిచ్చింది శాంతి. విడివిడిగా వాళ్ళందరి నుంచి ఎప్పుడూ వింటూనే ఉంది. ఇప్పుడు అందరూ కలిసి చెప్తున్నారంతే. కొంతసేపటి తర్వాత ఉన్నట్లుండి ‘సఫొకేటింగ్‌గా లేదా’ అంది శాంతి. ‘మీరు చెప్పేవన్నీ వింటుంటే పిల్లల్ని ఎంత సఫొకేట్‌ చేస్తున్నామో అర్థం కావట్లేదా? మీ మీ కలలు, ఇష్టాలు మీ పిల్లల మీద రుద్ది, వాళ్ళు చెయ్యాలనుకున్నవి చెయ్యనివ్వకుండా వారి సర్కిల్‌ని దూరం చేయట్లేదా? లేదంటే నోటినుంచి మాట రాగానే, అడిగిందే తడవుగా అవసరమా లేదా అని, అవి వాడే వయసా కాదా అని చూడకుండా కొనివ్వడం మీ స్టేటస్‌కి వాళ్ళద్వారా వ్యక్తీకరించడం కాదా? బొమ్మల్తో, బట్టల్తో మొదలు పెట్టినవి ఇప్పుడు గాడ్జెట్స్‌కి వచ్చేసరికి కాదంటే పిల్లలు ఊరుకుంటారా? మనం ఆడుకోలేకపోయాం, మనం కొనుక్కోలేకపోయాం, మనం చదవలేకపోయాం… వాళ్ళకలా కాకూడదని మనక్కావల్సినవి వాళ్ళ ద్వారా తీర్చుకోవాలని చూస్తే వాళ్ళలా కాక ఇంకెలా ప్రవర్తిస్తారు? ఇద్దర్ని కంటే వారికన్నీ సమకూర్చలేమంటూ, ఒక్కర్నీ మీరు కమ్మేసి నేను చేస్తాగా, నేనున్నాగా, నేనిస్తాగా అంటూ వాళ్ళ చుట్టూ మీరే ఉంటే రేపు ఆ పిల్లలు వ్యక్తిత్వం, విలువలు, ఆదర్శాలతో కూడుకుని స్వతంత్రంగా నిలిచే అవకాశం లేకుండా చేస్తున్నారేమో ఆలోచించండి. ఈ సింగిల్‌ చైల్డ్‌ సిండ్రోమ్‌ నుంచి మీరు బయటపడకపోతే ఒక తరాన్ని మీరు చైల్డ్‌హుడ్‌లోనే ఉంచేసిన వారవ్వరా… వీటికి సమాధానాలు మీ బాల్యం నుంచి మీరే వెతకండి” అంటూ లేచింది శాంతి.

ఇలా సింగిల్‌ చైల్డ్‌ సిండ్రోమ్‌తో పిల్లల్ని బాల్యంలోనే ఉంచేస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా తాము మారకుండా… వారి పిల్లల్నీ మారనివ్వకుండా చేస్తున్న పేరెంట్స్‌ ఎంతమందున్నారో? వారికి కనువిప్పు ఎప్పుడు కలుగుతుందో??

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.