భూమిక ఎడిటర్ గారికి,
నమస్కారములు అబ్బూరి ఛాయ దేవిగారి పేరు వినడమేకాని కథలు అంత తెలియవు. అక్టోబర్ సంచిక మొత్తం చదివాను. అంత మంచి మనిషిని, గొప్ప రచయిత్రిని కోల్పోయినందుకు బాధగా ఉంది. ”బోన్సాయ్ బతుకు” పుస్తకం తప్పకుండా చదువుతాను.
– ఉషారాణి, విశాఖపట్నం
……. ఙ …….
భూమిక ఎడిటర్ గారికి,
ఆగస్టు సంచికలో ప్రచురించిన మేథాపాట్కర్‌తో మీరా ప్రయాణం వ్యాసం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇందులో నర్మదా లోయ అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు నిర్మించ తలపెట్టిన భారీ డ్యామ్‌ల నిర్మాణాలను అడ్డుకొని మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రల్లో ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే కోట్లాది మంది ప్రజలు, నిర్వాసితులు కాకుండా కాపాడడంలో వారికి పునరావాసం, జీవనోపాధి హక్కులు అందేలా చూడడంలో నర్మదా బచావో ఉద్యమం నిర్వహించిన కీలకమైన, అద్భుతమైన, అనన్య సామాన్యమైన పాత్ర, పోరాటాలను వ్యాసకర్త చాలా విపులంగా వివరించారు. ఈ ఉద్యమంలో అవిశ్రాంతంగా పోరాడి విజయం సాధించి 2019 సంవత్సరానికి గాను భాషా మెమోరియల్ అవార్డును అందుకున్న మీరా గారికి హృదయపూర్వక అభినందనలు.
– ఈ-మెయిల్
……. ఙ …….
డియర్ ఎడిటర్ గారికి,
ప్రపంచ లేఖా దినోత్సవ శుభాకాంక్షలతో…
గౌరవనీయులైన కె.సత్యవతి సంపాదకులు స్త్రీ వాద పత్రిక భూమికకు
హృదయపూర్వక వందనాలు. అబ్బూరి ఛాయాదేవి ప్రత్యేక సంచిక నేడే అందింది. చాలా విషయాలు అందించినందుకు మీకు ధన్యవాదాలు. భూమిక పత్రికను ఈ విధంగా తీర్చిదిద్దుతున్నందుకు మీకు వందనాలు. సిబ్బందికి, పాఠకులకు శుభాకాంక్షలు,
శుభాశీస్సులు. మీ సాహిత్యాభిమానులు కృతజ్ఞతలతో…
– వీరగోని సరస్వతి, పబ్లిక్ లైబ్రరీ, వేములవాడ