స్త్రీలపై హింసలన్నీ ఘోరమైన నేరాలే

కె.సత్యవతి

ఇటీవల ఏదో మీటింగులో కలిసిన ఒక పోలీస్‌ అధికారి ఓ వ్యాఖ్య చేసాడు. ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్‌ ఆర్డర్‌ మెరుగైంది. ఘోర నేరాల సంఖ్య చాలా తగ్గిపోయింది అన్నాడు. ఘోర నేరాలంటే ఏమిటి అని అడిగినపుడు కత్తులతో కుత్తుకలు కోయడం, తుపాకులతో కాల్చేయడం, కిడ్నాప్‌ చేసి చంపేయడం, దొంగతనాలకొచ్చి చంపడం లాంటివి అన్నాడు. ఇవన్నీ తగ్గాయి. మా పని ఇపుడు విఐపి బందోబస్తు, ట్రాఫిక్‌ని కంట్రోల్‌ చెయ్యడానికి పరిమితమైంది అన్నాడాయన. స్త్రీల మీద జరుగుతున్న నేరాల సంగతేటండి. దీని గురించి ఏమంటారు అంటే అవెప్పుడూ ఉండేవే కదా! ఈ వరకట్న హత్యలు, అత్యాచారాలు. ఇవన్నీ మాములే కదా! అంటే – మన రాష్ట్రం దేశంలోనే స్త్రీల మీద జరుగుతున్న హింసల విషయమై ప్రధమ స్థానంలో వుంది కదా! అలాగే మన విజయవాడ నగరం అన్ని రకాల హింసల్లోను అగ్రభాగాన వుంది కదా! మీకు తెలియంది ఏముంది. ఇవన్నీ ఘోరమైన నేరాలు కావా? స్త్రీల పట్ల జరుగుతున్న సవాలక్ష నేరాల పట్ల మీరెందుకింత సాఫ్ట్‌గా ఆలోచిస్తున్నారు అంటే – ఆయనకి కోపమొచ్చింది. చాలాకోపంగా మీ ఆడవాళ్ళు చిన్న చిన్న విషయాలకి కూడ పోలీస్‌ స్టేషన్‌కి వస్తున్నారు. మొగుడు కొట్టాడని, అత్త కొట్టిందని, ఇలాంటివే సిల్లీ కారణాలతో కాపురాలు కూలదోసుకుంటున్నారు అంటూ మొదలుపెట్టాడు. పైగా 498ఏ ఒకటి మీకు బాగా దొరికింది. మొగుళ్ళని రాచి రంపాన పెట్టడానికి అంటూ ఇంకా ఏమేమో మాట్లాడుతుంటే మాకు చాలా కోపమొచ్చి, నోరు నొప్పి పుట్టేదాకా ఆయనతో వాదించి, విభేదించి చేసేదేంలేక అక్కడి నుంచి లేచెళ్ళిపోయాం.
ఈ సంభాషణ , వాదోపవాదాలు నాలో ఎన్నో ప్రశ్నల్ని రేపాయి. స్త్రీలకు అండగా ఎన్ని చట్టాలొచ్చినా, ఇలాంటి అధికారుల బండతనంవల్ల అవి ఎలా కొరగాకుండా పోతాయో, పోలీసులకి, న్యాయాధికారులకి, పరిపాలనా వ్యవస్థకి జండర్‌ సెన్సటైజేషన్‌ లేకపోవడం స్త్రీలకి ఎలా శాపంగా పరిణమించిందో అర్ధమౌతుంది. ఇద్దరు పురుషులు కొట్టుకుంటే నేరమౌతుంది. ఇద్దరు స్త్రీలు కొట్టుకుంటే కూడా ఐ.పి.ఎస్‌ ప్రకారం నేరమౌతుంది. భార్యను భర్త కొట్టి హింసిస్తే దాన్ని శిక్షార్హమైన నేరంగా పోలీసులు అంగీకరించక పోవడం వెనుక వున్న పితృస్వామ్య భావజాలం నన్ను భయకంపితని చేసింది. అది మాములేగా అన్న ఆ అధికారి దృష్టిలో మహిళల మానవ హక్కులకు అర్ధం లేదు. విలువ లేదు. స్త్రీల మీద ఇంట్లోను, ఇంటి బయట అమలవుతున్న హింసలన్నీ షరా మామూలు విషయాలే. అవేమీ అంత ఘోరమైన నేరాలు కాదు పోలీసుల దృష్టిలో.
ఈ దృష్టివల్లనే ప్రతిరోజు వరకట్న మరణాలు, వరకట్న నేరాలు జరుగుతున్నా, అరెస్టులుంటాయేమోగాని శిక్షలుండవు. భార్యను చంపేసి, ఆ రక్తమంటిన చేతుల మరకలు ఆరకుండానే మలి పెళ్ళికి సిద్ధమౌతున్న ఎందరినో మనం చూస్తున్నాం. మామూలు హత్యానేరాల దర్యాప్తులు, కోర్టుల్లో వాదనలు, శిక్షలు గట్టిగానే వుంటాయి. భర్త చంపేసిన భార్య హత్య కేసులు మాత్రం ఉట్టుట్టిగానే తేలిపోతాయ్‌. చాలా స్వల్పమైన కేసుల్లోనే శిక్షలు పడతాయి.
గృహహింస నుండి రక్షణ చట్టం వచ్చి మూడేళ్ళయిపోయింది. ఇటీవల గృహహింస విపరీతంగా పెరిగిపోయింది. రక్షణాధికార్ల వ్యవస్థ అప్పుడే బండబారిపోయింది. ఒక యాంత్రికతలోకి జారిపోయింది. న్యాయమూర్తులకు ఈ చట్టం పట్ల అవగాహన లేదు. హింసలో మగ్గుతున్న స్త్రీల జీవితాలకు వెలుగివ్వాలనే కనీస మానవీయకోణం కరువైపోయింది. ఈ హింసను ఘోర నేరంగా గుర్తించ నిరాకరించే పోలీసు, న్యాయవ్యవస్థలను ఎలా సంస్కరించాలి? గర్భంతో వున్నపుడు భర్త పెట్టే హింసలు భరించలేక రక్షణాధికారిని ఆశ్రయిస్తే, ప్రసవమై బిడ్డకి పదినెలలొచ్చినా న్యాయం చెప్పని న్యాయమూర్తిని ఏమని పిలవాలి?
ఘోరనేరాలు తగ్గాయని సంబరపడిపోతున్న పోలీస్‌ వ్యవస్థ, మహిళలపై పెచ్చరిల్లుతున్న నేరాలు పది రెట్లు హీనమైనవని అర్ధంచేసుకోవాలి. జనాభాలో సగభాగమున్న స్త్రీలు కూడా పౌరులేనని, వారికి మానవ హక్కులున్నాయని, వారిపై అమలయ్యే అన్ని హింసలూ నేరాలేనని మన పోలీసులు ఎప్పుడు అర్ధం చేసుకుంటారో!!! గుడ్డిలో మెల్లలా మనకి హోమ్‌ మినిష్టర్‌గా ఒక మహిళ నియమితులయ్యారు. దేశంలోనే మొట్ట మొదటి హోమ్‌ మినిష్టర్‌గా సబితా ఇంద్రారెడ్డి రికార్డు సృష్టించారు. ఆమె సారధ్యంలో పోలీసులు ఎలా పనిచేస్తారో చూడాలనే ఆసక్తి ఉన్నా మహిళా శిశు సంక్షేమశాఖకి ఒక మహిళ సారధ్యం వహిస్తున్నా గానీ మహిళలకు అదనంగా ఏమీ జరగడం లేదనేది మనందరి అనుభవం. వారి ఆధీనంలోని రక్షణాధికారుల వ్యవస్థ ఎలా పని చేస్తోందో చూస్తున్నాం కదా!
అయినప్పటికీ, హోమ్‌ మినిస్టర్‌గా సబితా ఇంద్రారెడ్డి నియమాకాన్ని ఆహ్వానిస్తూనే స్త్రీలపై పెరిగిపోతున్న నేరాల అదుపునకు ఆవిడేం చేస్తారో వేచి చూద్దాం. పైన పేర్కొన్నలాంటి పోలీసులని జండర్‌ సెన్సటైజ్‌ చేస్తారో లేక మరింత బండబారుస్తారో లెటజ్‌ వెయిట్‌ అండ్‌ సీ.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

3 Responses to స్త్రీలపై హింసలన్నీ ఘోరమైన నేరాలే

  1. పోలీస అధికార్లలో కూడా తమ భార్యలని కొట్టేవాళ్ళు ఉన్నారు. సాధారణ పౌరులు కూడా భార్యలని కొట్టడం ఆ అధికారులకి తప్పుగా అనిపించకపోవచ్చు.

  2. అది ఒక్క ఆ పోలీసు అధికారి అభిప్రాయం మాత్రమే కాదు. ఈనాటి సగటు భారతీయ పురుషులందరి ఆలోచనాధోరణికి ప్రతిబింబం.
    ఆడది అణిగి మణిగి వుండాలి, కొట్టినా తిట్టినా క్కిక్కురుమనకుండా పడివుండాలన్నపురుషాహంకార ధోరణి అది.
    స్త్రీలు సమాన హక్కులు, సమానత్వం కోరుతుండడం వల్లనె ఈ సమస్యలన్ని ఏర్పడుతున్నయన్నది ఈ పురుషాధిక్య సమాజపు ఆరోపణ.
    వ్యవస్థ మారకుండా ఈ భావజాలం పోదు. వ్యవస్థను వీళ్ళు అంత సులువుగా మారనివ్వరు.
    ఇదొక దీర్ఘకాలిక పొరాటం.
    వ్యాసం చాలా అలొచనలను రెకెత్తించింది.అ

  3. MLFR says:

    ఈ లింకు వీక్షించండి: http://telugu.stalin-mao.net/2009/07/11/499

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.