ఆకురాలు ఋతువు – చల్లపల్లి స్వరూపరాణ

 

అమ్మా!

ఒక్కరోజు కూడా

నీ మాట విననందుకు

నీ కొడుకు రోహిత్‌ని

క్షమించమ్మా!

నలుగురు నడిచే దారిలో

తలొంచుకు నడవనందుకు

కుడి చేతికి ఎడమ చేతికి

తేడా లేదన్నందుకు

నన్ను మన్నించమ్మా !

పరిధులలో ప్రమేయాలలో

ఒదగనందుకు

సున్నం కొట్టిన సమాధి లోకంలో

ఊపిరాడక ఉసురుసురన్నందుకు

నన్ను క్షమించవూ!

కంచెల్ని దాటి

నా కళ్ళు

నక్షత్రాలని చూసినందుకు

దగాకోరు రంగుల్ని చీల్చి

నలుపు రంగుని ముద్దాడినందుకు

అమ్మా!

నన్ను క్షమిస్తావు కదూ!

పొయ్యి మీదకీ పొయ్యి కిందకీ

జరగటానికి నీ ఒళ్ళు గుల్ల చేసుకోటం

కళ్ళతో చూసి కూడా

మంచి ఉద్యోగం తెచ్చుకుని

నీ కాళ్ళు కందకుండా

చూసుకోవాలని అనుకోని

ఈ ‘కటికోడిని’ తిట్టుకోవద్దమ్మా!

నీ మీద ప్రేమలేక కాదు

నా కళ్ళున్నాయి చూడు,

అవి ఇంటిని దాటి సమాజంలోకి

సమాజాన్ని దాటి

భూదిగంతాల వరకూ

నడిచి వెళ్ళాయి.

అమ్మా!

ఒక్క రోజన్నా

నీ మాట ఆలకించనందుకు

నన్ను క్షమించమ్మా!

మగతోడు లేక

లోకంలో ఎన్ని నిందలు మోశావు

ఎండకీ వానకీ తడిసినా

తిండికీ గుడ్డకీ నమిసినా

బతుకు ఎలమీద

తెగించి నుంచోడం

నువ్వే కదమ్మా నాకు నేర్పిందీ!

ఏడాదిలో ఓ రోజు

క్రిస్టమస్‌ పండక్కన్నా

ఇంటికొస్తానని

దారులంట పారజూసేదానివి

నేనేమో మనువుని

తగలబెట్టే పనిలో

పండగని పారబోసుకునేవాడిని

ఊర్లో అన్నాయోళ్ళు

రాత్రంతా చర్చి డెకరేషన్‌ చేస్తుంటే

కనీసం పండగ పూటకన్నా

నేను ఇల్లు చేరాలని

ఏసయ్యని ఎన్నిసార్లు

బతిమలాడావో నీకే తెలుసు

నా రాత్రులు

కాలేజీ గోడలపై పోస్టర్లు

అతికించడంలో

నా పగళ్ళు పుస్తకాల కుస్తీలో

కరిగిపోయినయ్యమ్మా!

ఏసయ్య ఏమియ్యకపోయినా

మన ఆడోళ్ళకి క్షమాగుణం

బాగా నేర్పాడు

నన్ను క్షమించు!

వయసు మళ్ళుతున్న నీకు

చేతి ఆసరా కాలేకపోయిన అశక్తుడిని!

చీకటిని చీకటని

వెలుతురుని వెలుతురని

చెప్పే పిడికెడు స్వేచ్ఛ కోసం

అర్రులు చాచినవాడిని!

మన్నించమ్మా!

నీ కొడుకు

దుఃఖితుడై వెళ్ళి

వెన్నెల నవ్వై తిరిగివస్తాడు చూడు!

ఆకురాలు కాలం సమీపించింది

ఇక నీ కడుపు పంట

రోహిత్‌ చిగురించి

విరగబూస్తాడు

నేను వెదజల్లుకుంటూ వెళ్ళిన

వేకువ చుక్కలు

చీకటి ఋతువులో

అక్కడక్కడా మినుకుమంటున్నాయి చూడు!

ఆ చుక్కల్లో నీ రోహిత్‌ కనబడతాడు

నువ్విక నాకోసం ఏడవొద్దు

నేను వెళ్తూ నిన్ను అనాధను చెయ్యలేదు

నా నెత్తుటిలో తడిసిన ఈ నేల

తిరిగి చిచ్చరపిడుగుల్లాంటి

నీ రోహిత్‌లను పండిస్తుంది

చూసి మురుసుకోమ్మా!

(ుశీ ్‌ష్ట్రవ వఙవతీ పశ్రీaఓవస ఎవఎశీతీవ శీట పవశ్రీశీఙవస =శీష్ట్రఱ్‌ష్ట్ర హవఎబశ్రీa)

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.