కరోనా టైమ్స్‌, కోవిడ్‌ డైరీ -ఉమా నూతక్కి

నాకు బాగా ఊహ తెలిసాక ఏ ఇద్దరు కలిసినా ఒకే విషయం గురించి మాట్లాడుకున్న సందర్భాలు రెండు. నాకు బాగా చిన్నప్పుడు స్కైలాబ్‌ ఉపగ్రహం కూలిపోతుందనీ, అందరూ ఇంక చచ్చిపోతారనీ అనుకునే వారట. అప్పటికి చిన్నదాన్ని కాబట్టి అవేం తెలీదు నాకు. ఈ మధ్య అందరినీ అతలాకుతలర చేసిన వాటిల్లో మొదటిది నవంబర్‌ 8, 2016న జరిగిన నోట్ల రద్దు… నవంబర్‌ 9న పొద్దున్న ఆఫీసుకి బయలుదేరి వెళ్తుంటే, రోడ్డు మీద ఏ ఇద్దరు నిలబడినా ఇదే చర్చ. నోట్ల రద్దుకి ముందూ తర్వాతగా మన సమాజాన్ని ఊహించుకున్నాం. సరే, ఆ తర్వాత ఏం ఒరిగింది అన్నది పక్కన పెడదాం.

నోట్ల రద్దు తర్వాత అంతగా కుదిపిన విషయం కరోనా. ఇందులో విస్తతంగా వెళ్ళకుండా నా అనుభవాల వరకూ దీన్ని పరిమితం చేయడానికి ప్రయత్నిస్తాను. వ్యక్తిగతంగా, వత్తిపరంగా నాకున్న సమయాభావాల వల్ల నేను టీవీ చూసేది చాలా తక్కువ. వార్తాపత్రికల్లో కూడా నాకు ఆసక్తి కలిగించే అంశాలు వేరు. సోషల్‌ మీడియాలో నేను ఏక్టివ్‌గా ఉన్నా, అందులో కూడా నా ఆసక్తులు పరిమితంగా ఉంటాయి కాబట్టి చైనా నుంచి వేరే దేశాలకి పాకుతున్నా, అడపాదడపా కొన్ని వీడియోలు కంటబడుతున్నా నా దష్టి అటు వెళ్ళలేదు. వీటన్నిటి వెనకా ఏదో ఒక కుట్ర సిద్ధాంతం ఉందనీ, ఇదంతా నోం చామ్‌స్కీ చెప్పినట్లు ‘వీaఅబటaష్‌బతీఱఅస్త్ర షశీఅరవఅ్‌’ అనీ బలంగా ఒక నమ్మకం.

మార్చ్‌ 13న మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలో భూమిక వలంటీర్స్‌ అంతా ఒక మీటింగ్‌ పెట్టు కున్నాం. ఆ రోజు ఒక చిన్న కుదుపు. మాల్స్‌ మూసేయడం, విమానాలు రద్దు చేయడం… అక్కడ ఉన్నప్పుడే విన్నా. ఆ తర్వాత జనతా కర్ఫ్యూ, హఠాత్తుగా లాక్‌డౌన్‌. కంటికి కనిపించని ఒక శత్రువు అందరి మీదా పెద్ద యుద్ధం ప్రకటించడం ఇప్పటికీ నాకు డైజెస్ట్‌ కాని విషయం.

మార్చ్‌ 23 నుంచి లాక్‌డౌన్‌ అన్నాక కూడా ఒక రోజు ఆఫీసుకి వెళ్ళా. ఎసెన్షియల్‌ సర్వీసెస్‌లో ఉన్నాం కాబట్టి. కానీ, ఆ తర్వాత ఏప్రిల్‌ 15 వరకూ మాకు కూడా వర్క్‌ ఫ్రం హోం ఇచ్చేసారు. మా కుండే వర్క్‌ స్ట్రెస్‌కి మార్చ్‌ రోజుల్లో సూర్యోదయాలూ సూర్యాస్తమయాలూ చూడం. అలాంటిది అనుకోకుండా ఇలాంటి అవకాశం పెద్ద రిలీఫ్‌గా అనిపించింది. చదవాల్సిన పుస్తకాలూ, చూడాల్సిన సినిమాలు, సంవత్సరానికి సరిపడా పెట్టుకోవాల్సిన పచ్చళ్ళూ, వడియాలూ… లైఫ్‌ చాలా ఎక్జయిటింగ్‌గా అనిపించింది.

కానీ, కొన్ని రోజులే… ఆ తర్వాత ఒక భయం. అది చావంటే వచ్చే భయం కాదు. ఏం జరుగుతుందో తెలియని ఒక అయోమయం లోంచి, చుట్టూ ఏదో కాన్స్పిరసీ జరుగుతోందన్న నమ్మకం లోంచీ వచ్చిన భయం. జయకాంతన్‌ ‘వేడుక’ అనే కథలో అంటాడు.. ”మనుష్యులకి వేడుక కానిది ఏమిటి??” అలా కరోనా సమయాల్లో వచ్చిన అవకాశాన్ని వేడుక చేసుకుంటున్న వ్యాపారులు… ఇంకో పక్క పొట్ట చేత బట్టుకుని నడిచిన మన తోటి వాళ్ళు… వీళ్ళని చూసి భయం.

మనసుని పరిస్థితులకి తగ్గట్లుగా ఎంత ట్యూన్‌ చేసుకున్నా ఉన్నట్టుండి… ఎప్పటిదాకా ఇలా ఉంటాం అన్నది అర్థం కానట్లు డిప్రెస్డ్‌గా అనిపిస్తోంది. బయటకి వెళ్ళిన ప్రతీసారీ, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు… ఎట్టి పరిస్థితుల్లోనూ వైరస్‌ని ఇంటికి తీసుకు రాకూడదన్న స్ట్రెస్‌ మైండ్‌ మీద బలంగా పడుతోంది. ఇదంతా ఒక ఊపిరాడనితనంలా అనిపిస్తుంది. మనకి కనిపించని నీడేదో వెనకే ఉండి మన జీవితాల్లోకి తొంగి చూస్తున్నట్లు అనిపిస్తోంది.

ఇవాళ్టి రోజున ఇంట్లో ఉండ గలగడం ప్రివిలేజ్‌. వరరవఅ్‌ఱaశ్రీ రవతీఙఱషవరలో ఉన్న మాకు తప్పనిసరి అయితే తప్ప శెలవు కుదరదు. పని చేసుకోకపోతే గడవని కోట్లమంది ఉన్నారు. వాళ్ళకీ బయటకి రాక తప్పదు. కానీ, తోచక బయటకి వచ్చే వాళ్ళని… మా ఆఫీసుకి ప్రీమియం కట్టడానికి ఇద్దరు ముగ్గురు కలిసి రావడం… బయట కూరగాయలు కొనడానికి కుటుంబం మొత్తం వెళ్ళడం. ఇలా చూసినప్పుడు మాత్రం చిరాగ్గా అనిపిస్తుంది.

దీని పర్యవసానం ఎలా ఉంటుందో తలచుకుంటే చాలా భయం వేస్తుంది. కేసెస్‌ పెరిగే కొద్దీ ఆ ఏరియా అంతా బ్లాక్‌ చేసేస్తారు. వారానికి పది రోజులకీ ఒక్క కేసు వచ్చినా ప్రతి ఏరియా పర్మినెంట్‌గా బ్లాక్‌ అయిపోతుంది. ఒక పక్క నిజంగా అవసరం అయినా లీవ్‌ పెట్టలేని టెక్నికల్‌ ఇష్యూస్‌, మరో పక్క వర్క్‌ స్ట్రెస్‌ (నిజానికి ఇప్పుడు వర్క్‌ స్ట్రెస్‌ కన్నా ఆఫీస్‌కి ఎలా వెళ్ళాలి అనే స్ట్రెస్సే ఎక్కువగా ఉంది). మరో పక్క ఈ టైంలో కూడా ఆఫీస్‌కి అవ సరమా అని సుతిమెత్తగా కోపగించే అయిన వాళ్ల మందలింపుల మధ్య ఏదోలా మానేజ్‌ చేస్తున్నాం అనుకుంటే, ఏ ఒక్క జాగ్రత్త తీసుకోకుండా… నిజంగా అవసరం లేని పనులు పెట్టుకుని వచ్చే జనాలని చూస్తుంటే మనసంతా చేదుగా అయిపోతుంది.

వాళ్ళది ఏమీ తెలియని అమాయకత్వమో… మాకేమీ కాదనుకునే అతి నమ్మకమో కానీ, వాళ్ళు సమాజానికి చేసే చెరుపు మాత్రం క్షమించలేనిది.

నిజం చెప్పాలంటే… ఆర్థిక సంస్థలో చేస్తున్నా కాబట్టి… కరోనా ఎకానమీ మీద చూపించిన ప్రభావం నేను అర్థం చేసుకోగలను. అయితే, కరోనా కన్నా ముందే మన ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉందనీ… కరోనా ఖాతాలోకి ఆ వైఫల్యాన్ని నెట్టి వేసే ప్రయత్నం జరిగిందనీ… ఈ రోజు మనం చెప్పినా సామాన్యులకి అర్థం కాదు. మనుష్యుల్లో ఉండే భయం, భవిష్యత్తు మీద అభద్రత… వీటి పునాదిగానే చాలా ఆర్థిక సంస్థలు వ్యాపారం చేస్తాయి. నేనూ అలాంటి సంస్థలోనే ఉన్నా కాబట్టి… పోయిన రెండు నెలలలో నా 25 సంవత్సరాల ఉద్యోగంలో ఎప్పుడూ చేయనంత ఎక్కువ కష్టపడ్డాను. ఒక పక్క జాగ్రత్తలు తీసుకుంటూ… వైరస్‌ని ఇంటి దాకా తీసుకురాకుండా ఉండడానికి అనేకానేక జాగ్రత్తలు తీసుకుంటూ… మానసికంగా శారీరకంగా ఎంతో అలసి పోయి… కంగుబాటుకి లోనవ్వకుండా పెద్ద యుద్ధమే చేసాను. ఇంకా చేస్తూనే ఉన్నాను.

వీట్టన్నిటిలోనూ సాహిత్యం నన్ను ఎంతో సేద తీర్చింది. చాలా పుస్తకాలు చదివాను. సినిమాలు చాలా చూసాను. కొన్ని కొరియన్‌ సినిమాలు, మళయాళం సినిమాలు. మార్క్వెజ్‌ పుస్తకాలు కొన్ని మళ్ళీ చదివాను. ఃూఅవ నబఅసతీవస ్‌వaతీర శీట రశీశ్రీఱ్‌బసవః, ఃకూశీఙవ ఱఅ ్‌ష్ట్రవ ్‌ఱఎవర శీట షష్ట్రశీశ్రీవతీaః. సిమోన్‌ డి బావా పుస్తకం ఒకటి చదివాను. ‘ుష్ట్రవ ఎవఎశీతీఱవర శీట ణబ్‌ఱటబశ్రీ ణaబస్త్రష్ట్ర్‌వతీ’ నెరుడా కవితల్లో మునిగి తేలాను. పాతాళ్‌ లోక్‌ వెబ్‌ సిరీస్‌ చూసాను. అన్‌ బిలీవబుల్‌ కూడా. మూడు కథలు రాసుకున్నా. ఇంకా అనువాదం చెయ్యడం కోసం ఒక వర్క్‌ మొదలు పెట్టాను.

కరోనా వైరస్‌ ఇచ్చిన షాక్‌ నుంచి వ్యక్తిగతంగా నేను చాలా నేర్చుకున్నా. ముందుగా అనవసర ఖర్చు తగ్గించు కోవడం… ఉన్న దాంట్లో సహాయం చేయడం, భౌతికంగా దూరంగా ఉండాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో మానసికంగా అందరికీ దగ్గరవడానికి చాలా ప్రయత్నం చేసాను.

నా విషయం పక్కన పెడితే, నిజానికి ఇప్పుడు ప్రపంచంలో కరోనా కంటే భయంకరమైనది ఏమిటంటే… అభూత కల్పనలు, ఊహాగానాలు నిండిన అవాస్తవ సమాచారం. ఇక్కడ ఇలా అక్కడ అలా అంటూ సోషల్‌ మీడియా అంతా అల్లుకు పోతున్న ప్రచారాలతో ప్రతి ఒక్కరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఒకసారి మనసులో వేళ్ళూనుకున్న భయం మనిషిని ఎంతగా కంగదీస్తుంది. ఇంతగా భయపడటానికి నిజంగా కరోనా సోకిన వారితో పరిచయం ఉన్నవాళ్ళు ఎంత మందనీ? భయం వ్యాపి స్తున్నంత విస్తతంగా ధైర్యం ఎందుకు వ్యాపించడం లేదు. కరోనా నుండి బయట పడిన వారి అనుభవాలు ఇస్తున్న ధైర్యాన్ని అందిపుచ్చుకోవాలి కదా? కానీ అలా లేదు. అంతా భయం భయం… కరోనా వస్తే ఇక అంతే అన్న భయం. ఈ భయాలన్నీ ఇప్పు డిప్పుడే ఎదిగే పసి మనస్సుల్లో జీవితం పట్ల ఎలాంటి దక్పథాన్ని కలగజేస్తుంది అన్న విషయం ఎంతమంది ఆలోచిస్తున్నారు.

ఒక్కసారి ఆలోచిద్దాం. మన ఆలోచనలని… జీవితాలని… కరోనాని దాటి సాగిద్దాం.

Share
This entry was posted in మంకెన పువ్వు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.