లాక్‌డౌన్! ఈ మాటే అపరిచితం మార్చి నెలాఖరు వరకూ – అది పరిచయమై, అర్థమై అనుభవిస్తునా&్నం అరదరితోపాటు. తప్పనిసరి బందీలం ఇంటికి. పైగా నేనూ, కుటుంబరావు మూడు నెలలు మనవరాలితో గడుపుదామని చెన్నై వచ్చాం జనవరి 29న. అక్కడే చిక్కడిపోయాం మే, జూన్‌లలో కూడా!
మాకు తిరగడం, ప్రయాణాలు, మీటింగులు బాగా అలవాటు. రెండేళ్ళ నుంచీ అరతర్రాష్ట సాహిత్య సమావేశాలకు చాలా ప్రయాణాలు చేస్తున్నా. అన్నీ ఆగిపోయాయి. మార్చి 7, 8 తేదీలలో మైసూర్‌లో అరతర్జాతీయ మహిళా దినోత్సవ సభకు అతిథిగా వెళ్ళాను. ఆ సభ మారడ్యాలో ఎంతో బాగా జరిగింది. కొత్త స్నేహితులు దొరికారు. పాత స్నేహితులతో అనుబంధాలు మరింత పెరిగాయి. మైసూర్ నుంచి వచ్చాక ఇక ఇంట్లోంచి కాలు బైట పెట్టలేదు. చాలా రోజులు ఏమీ రాయాలని కూడా అనిపించలేదు. మా మనవరాలు ఇల మమ్మల్ని ఉత్సాహపరుస్తూ, ఆనందింపజేస్తూ ఉంది. కానీ లాక్‌డౌన్‌కి మురదు ఇలతో పార్కులు, బీచ్, షాపింగ్‌లు – ఎక్కడికో ఒక చోటకి వెళ్ళేవాళ్ళం. సినిమాలకు కూడా. ఇంటికి పది నిమిషాల దూరంలో పెద్ద మల్టీప్లెక్స్. పారసైట్స్, థప్పడ్ సినిమాలు చూశాం. అరతే ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్. ఇదంతా పై పై వ్యవహారం.
వలస కార్మికుల స్థితి గురించి ఆలోచిస్తే, గుండెలు అవిసిపోయేవి. వారి గురించి ఏమీ చెయ్యలేని పరిస్థితిలో చిక్కుకున్నాను. ఈ చెన్నైలో ఏం చెయ్యాలో తెలియలేదు. పైగా వయసు కారణంగా మా అబ్బాయి నన్ను బైటికి వెళ్ళొద్దన్నాడు. హైదరాబాదులో కొండవీటి సత్యవతి, సుమిత్రలు చేస్తున్న పని గురించి ఫేస్‌బుక్‌లో చూసి ఇద్దరికీ చెరొక పాతికవేలు పంపాను. అది కేవలం నా అరతరాత్మ శాంతికోసమే. ఇన్ని కోట్ల మంది ఇలా రోడ్డున పడటం – ఆ దారుణాన్ని చూస్తూ కూర్చోవలసి రావటం చాలా దుర్భరంగా అనిపించింది. దాన్నించి బైటపడటం ఇప్పట్లో అసాధ్యం. ఫేస్‌బుక్‌లో ఇళ్ళకు వెళ్లినవారి సమాచారం తెలుసుకుని హమ్మయ్య! అనుకోవటం. కల్పన కన్నబిరాన్ ూషతీశీశ్రీశ్రీ లో చాలా మంచి వ్యాసాలు రాశారు.అవి చదవటం, మాట్లాడుకోవటం ఒక పని.
ముంబై నుంచి మార్గ్ ఫౌండేషన్ వాళ్ళు ఒక ఆర్టికల్ రాసి తీరాలని పట్టుపట్టారు. How to bridge the gap between common people and intellectuals 1500 words english లో రాయటమంటే విముఖత. కానీ తప్పలేదు. రాసి పంపాను. డా. యమ్.శ్రీధర్ రాసిన ‘తొలి భారతీయ నవలలు’ పుస్తకం పూర్వం చదివిందే మళ్ళీ చదివి సమీక్ష రాశాను.
హార్పర్ కావిన్స్ వాళ్ళకు ఒక కథల పుస్తకం – తెలుగు నుంచి ఇంగ్లీష్ అనువాదం కోసం సంపాదకురాలిగా పని చేశాను. కథల ఎంపిక పూర్తయి ఉమ, శ్రీధర్‌లకు ఇచ్చాను. వాళ్ళు ఆ కథలన్నీ 1st draft అనువాదం కూడా చేశారు. నేను రాయాల్సిన మురదుమాట నత్తనడక నడుస్తోంది. రెఫరెన్సు పుస్తకాలు లేవు. ఒక స్కెచ్ లాగా రాసి హైదరాబాద్ వెళ్ళాక పూర్తి రూపం ఇస్తానని అనుకుంటున్నాను.
ఇంతలో రెరడేళ్ళనాడు అయిపోయిరదనుకున్న దక్షిణాయణ పని ఓరియరట్ బ్లాక్ స్వాన్ వారితో ఇప్పుడు మొదలైంది. వాళ్ళిప్పుడు కాపీ ఎడిటింగ్ మొదలుపెట్టారు. నేనూ, కల్పన, వసంత్ ఆ పనిలో ఉన్నాం.
స్నేహితులతో మాట్లాడటం తప్ప మరో సంతోషం ఏముంది.
మా రెండేళ్ళ మనవరాలితో కలిసి మాయాబజార్ సినిమాలో కొన్ని ఘట్టాలు నాటకంగా వేయడం, ఆ తర్వాత బాలనాగమ్మ నాటకం వేయడం ప్రతిరోజూ తప్పదు. మాయాబజార్‌లో నేను సుభద్రని, ఇల అభిమన్యుడు + శశిరేఖ డబుల్ యాక్షన్. కుటుంబరావు ఘటోత్గజుడు. బాలనాగమ్మలో నేను బాలనాగమ్మని, ఇల బాలవర్థిరాజు, కుటుంబరావు మాయల ఫకీరు. ఈ నాటక సమయం చాలా ఆనంద సమయం.
మురదుమాటలు రాయమని ఎవర ఒకరు పుస్తకాలు పీడీఎఫ్ పంపుతుంటారు. కె.వరలక్ష్మి గారి ఆత్మకథ ఎంతో బాగుంది. నేను మురదుమాట నాకు తోచినట్లు రాశాను. ఇంకా రాయాల్సిన పుస్తకాలు ఉన్నాయి.
హైదరాబాద్ అపార్ట్‌మెంట్‌లో మనీప్లాంట్ తప్ప మరో మొక్క ఉండేది కాదు. ఇక్కడ కాస్త చోటు ఉంటే మల్లె, మందారం, పారిజాతం, కనకాంబరం, దేవగన్నేరు, తులసి మొక్కలు ఫిబ్రవరిలో మా శరత్ నాటాడు. నేను నీళ్ళు పోస్తుంటే అవి పెరిగి పెద్దవవటం, పూలు పూయటం, ఇదొక కొత్త సంతోషం నాకు చెన్నైలో.
చదవటానికి ఇక్కడికి తెచ్చుకున్న పుస్తకాలు ఎప్పుడో చదివాను. మను పిళ్ళై ‘రెబల్ సుల్తాన్స్’, గోహర్ జిలానీ ‘రేజ్ అరడ్ రీజన్’ కాశ్మీరీలను లాక్‌్‌్‌డౌన్ చేసినపుడు దేశం మౌనం వహించింది. చాలామంది సంతోషం వ్యక్తం చేశారు. ఆ పాపం దేశాన్నంతా కట్టి కుదుపుతోంది. ‘పాపం, పుణ్యం నమ్ముతారా అని అడగకండి సత్యవతిగారూ’ అలవాటైన పలుకుబడులు. తేలికగా అర్థమయ్యే పలుకుబడులు.
నాకు నెట్‌లో చదవటం ఇష్టముండదు. ప్రయత్నించినా కుదరలేదు. నెట్‌ఫ్లిక్స్‌లో రోజూ రెరడు గంటలు ఒక సినిమా చూస్తున్నా. ‘ది లాస్ట్ జార్’, ‘క్రౌన్’, ‘ఎలియాస్ గ్రేస్’ సీరిస్ చూడని వాళ్ళుంటే చూడండి. సినిమాలు మలయాళం, మరాఠి, తమిళం, బెంగాలీ అన్ని భాషలవీ చూస్తున్నాం. వంట చేయటం మానేసి 17 ఏళ్ళయింది. ఇపుడు డి.కామేశ్వరి గారు చెప్పిన విధంగా చారు పెడుతున్నాను. రాగి హల్వా చేస్తున్నాను. మా మనవరాలి కోసం తేలికగా చేయగలిగే చిరుతిళ్ళు చేస్తున్నాను. ఒకోసారి బాధ, దిగులు కమ్మేస్తుంటాయి. వాటిని పారదోలటానికి మంచి రోజులను గుర్తు చేసుకుంటూ శ్రీశ్రీ రాసిన ‘ఉందిలే మంచి కాలం మురదు మురదునా, అరదరూ సుఖపడాలి నందనందనా’ అని పాడుకుంటున్నా. ఫేస్‌బుక్‌లో అరదరూ జూమ్‌లో మాట్లాడుతుంటే ఆహా! ఏం మాయ. ఏం మాట అని ఆశ్చర్యంగా ఆనందించే నేను ఇవాళ విజయవాడ అభ్యాస విద్యాలయం వారికోసం లింగ వివక్ష గురించి నాకు తోచిన మాటలు మాట్లాడి జూమ్ జూమ్‌గా ఉత్సాహపడిపోయాను.
రోజులు గడుస్తున్నాయి. మళ్ళీ అరదరం కలిసి కరచాలనాలు, ఆలింగనాలు చేసుకునే రోజుల కోసం కలలు కనాలనుకుని రాత్రులు నిద్రకోసం కష్టపడతాను. కష్టం మీద పట్టిన నిద్రలో పీడకలలు. పాడు కలలు. మనసు లోపలెక్కడో ఉన్న భయాలు కలల రూపం దాలుస్తున్నాయి.
మంచి కలలు కూడా కరువైన కాలం.
కునుకు పడితే మనసు కాస్త కుదుపట పడతది
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది
కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకు –
ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు?
ఆ దొరల నుంచి విముక్తి కావాలి. ఎప్పుడు దొరుకుతుంది?
అమెరికా నుంచి తన జీవిత భాగస్వామి డా|| గవరసాన సత్యనారాయణ గారిని కరోనా వల్ల కోల్పోయిన నా ప్రియమిత్రురాలు సుభద్రను తల్చుకుంటే కన్నీళ్ళాగవు. కానీ ధైర్యం చెప్పి ఆమె కన్నీటిని ఆపాల్సిన బాధ్యత మా యిద్దరి మీదా ఉంది కదా –
ఒక వింత కాలం. వింత జీవితం. గడ్డు రోజులు గడుస్తూనే ఉన్నాయి.