స్పందించండి

ప్రముఖ రేడియో ప్రయోక్త, రచయిత, అరసం సభ్యులు చిరంజీవిగారికి ఆరోగ్యం బాగా లేదని తెలిసి నేను, శారదా శ్రీనివాసన్‌ గారు చూడ్డానికి వెళ్ళినపుడు ఆయన నా చేతికి 25-5-09 నాటి ఈనాడు పేపర్‌, రెండు కాయితాలు ఇచ్చారు. ”ఇందులో తప్పెవరిది?” అంటూ ఆయన రాసిన రెండు పేజీలు నేను చదువుతుంటే ఆయన మహోద్వేగంగా మాట్లాడ్డం మొదలుపెట్టారు. నిజానికి ఆయన మాట్లాడగలిగిన స్థితిలో లేరు. క్షణానికొకసారి ఆక్సిజన్‌ తీసుకుంటూ, నెబులైజర్‌ పీలుస్తూ, నీళ్ళు తాగుతూ, ఆయాసపడుతూ, మంచానికి అంకితమై వున్నారు. మాట్లాడుతూ దుఃఖంతో ఉక్కిరిబిక్కిరవుతూ క్షమించండి, క్షమించండి అంటూంటే మేము కన్నీళ్ళ పర్యంతమైనాం. అలాంటి స్థితిలో వుండి కూడా సమాజం గురించి, ప్రపంచశాంతి గురించి తపన పడుతున్న ఆయన రెండు చేతులూ పట్టుకుని ఉద్వేగపడొద్దని చెప్పడం మినహా ఏం చేయలేకపోయాను. ఆయనకేమైనా అవుతుందేమోనని ఒణికిపోయిన సందర్భమది. చిరంజీవి గారు కోరిన విధంగా ఎవరైనా ఈ అంశం మీద నాటకం, కథ రాసి పంపితే, అత్యుత్తమమైన రచనకుి నగదు బహుమతి వుంటుందని ప్రకటిస్తూ భూమిక పాఠకులు స్పందించాల్సిందిగా కోరుతున్నాను. – ఎడిటర్‌ ఇందులో తప్పెవరిది? – చిరంజీవి రిఫర్‌ ‘ఈనాడు’ రిపోర్ట్‌ ఆన్‌ 25-05-09 పటేల్‌ సుధాకర్‌రెడ్డి ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. అతని తల్లి ఏడుస్తున్నది. ఫోటోగ్రాఫ్‌ చూడండి. పోలీస్‌ ఆఫీసర్‌ ఉమేశ్‌చంద్ర మరణానికి కారణం ఇతడట. ఇద్దరి తల్లులూ ఏడుస్తారు. ఆ తల్లుల ఏడ్పుకి కారణమేమిటి? మూలం ఏమిటి? వాళ్లిద్దరి మధ్య విరోధం లేదు. ఫోటోగ్రాఫ్స్‌ చూడండి. సుధాకర్‌రెడ్డి ప్రజలసేవ కోసం, మంచికోసం ఉద్యమంలోకి వచ్చాడు. అలాగే ఉమేశ్‌చంద్ర ప్రజల మేలుకోసం పోలీసు ఉద్యోగంలోకి వచ్చాడు. ఎంతో మంచివాడని పేరుప్రతిష్ఠలు తెచ్చుకున్నాడు. అయినా ఒకరినొకరు చంపుకోవడం, నెత్తురు, ఏడ్పులు, కల్లోలం. కుటుంబాల ధ్వంసం. సామాజిక అశాంతి. ప్రపంచ ప్రసిద్ధ జపాన్‌ చిత్రం ‘రేషోమన్‌’ అంత గొప్ప చిత్రంగా దీన్ని తీయవచ్చు. కథామూలం అంత బలమైనది. నాకు ఓపిక లేదుగాని, ఉన్నట్లయితే గొప్ప నాటకంగా రాసేవాణ్ణి. దీన్ని మన రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, యావత్తు ప్రపంచానికి – ప్రపంచశాంతికి పనికొచ్చే విధంగా తీర్చిదిద్దవచ్చు. ఎంత ఊహించగలిగితే అంతెత్తున ఎదగగల సబ్జెక్ట్‌. మెటీరియల్‌ కూడా కావలసినంత దొరుకుతుంది. కూర రాజన్న కుటుంబం, అరుణావ్యాస్‌ కుటుంబం, ఉమేశ్‌చంద్ర కుటుంబం, రంగవల్లి కుటుంబం, వగైరా వగైరాలు. అటువైపునుంచి, ఇటువైపునుంచి అనేకమంది బాధితులున్నారు. ఒక్కొక్కరిది ఒక చరిత్రలా వుంటుంది.

Share
This entry was posted in ఆహ్వానం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.