ఇంటి పనివారి గురించిన వాస్తవాల ప్రకటన – ప్రచారోద్యమం

సంక్షిప్త పరిచయం: దేశ, రాష్ట్ర చట్టాల రక్షణ లేకుండా ఇళ్ళల్లో మూసి ఉన్న తలుపుల వెనుక కనబడకుండా చాకిరీ చేస్తూ ఉండే తరగతి శ్రామికులు పనివారలు. కుటుంబంలో స్త్రీలు చేసే చాకిరీకి, ఇంటి పనికి సామాజికంగా విలువలేని తనాన్ని ప్రతిబింబిస్తూ ఈ పనివారు చేసే పనులు ”శ్రమ”గా గుర్తింపబడవు. నిజానికి 90% ఇంటి వనివారు స్త్రీలే. ఆసియాలో స్త్రీలకు ఇది సాధారణంగా లభించే వృత్తి. ఈ ప్రాంతంలో ఇంటిపని మొత్తంగా స్త్రీలకు లభించే ఉపాధిలో మూడో వంతుగా ఉంది.

ఏడు దశాబ్దాల స్వాతంత్య్ర భారతావనిలో ఇంటి పనివారలు వాళ్ళ ఉనికి కోసం, గుర్తింపు కోసం పోరాడుతూనే ఉన్నారు. కనీస వేతనాలు, వారి పని పరిస్థితులు, రక్షణ, సామాజిక భద్రత, యజమాని-ఉద్యోగి సంబంధాలు వంటి ఇంటి పనివారి కనీస హక్కులు ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఇతర కార్మికుల మాదిరిగానే ఇంటి పనివారికి కూడా పై హక్కులన్నీ అనుభవించే అధికారం ఉంది. 2008 అసంఘటిత రంగ సాంఘిక భద్రతా చట్టం, పని ప్రదేశాలలో లైంగిక హింస నివారణ చట్టం 2013, కనీస వేతనాల ప్రకటనల్లో ఇంటి పనివారిను చేర్చారు. అయినా గౌరవప్రదమయిన షరతులతో కూడిన ఉపాధి, మంచి పని పరిస్థితులు హామీ ఇచ్చే ఒక సమగ్ర చట్టం దేశవ్యాప్తంగా ఒకేరకంగా అమలు చేయడానికి వీలుగా ఇంతవరకూ రాలేదు.

2011 అంతర్జాతీయ శ్రామిక సదస్సులో (Iకూూ లో 189 సదస్సులో) జరిగిన 201 సిఫార్సుల ప్రకారం ఇంటి పనికి నిర్దేశించిన అంతర్జాతీయ ప్రమాణాలు ఇంటి పనివాళ్ళకు గౌరవప్రదమయిన ఉపాధిని గుర్తించడంలో కీలకమైన మైలురాళ్ళుగా గుర్తించవచ్చు. Iకూూ ఇంటి పనిని గుర్తించడం, గౌరవప్రదమైన ఉపాధిని కోరడం అనేవి చాలా మంచి పరిణామాలు. ఇది భారతదేశం ఇంటి పనివారల హక్కుల కోసం సంఘటితమైన బృందాలకు ఊరటనిచ్చింది. ఇంటి పనిని ఒక ఉత్పాదక శ్రమగా గుర్తింపచేయడానికి ఒక సదస్సు నడపడం ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల ఈ పని గుర్తింపబడి, భద్రత పొంది, నియంత్రించబడే అవకాశాలు ఏర్పడతాయి.

ఇప్పటిదాకా శ్రామికులుగా కానీ, కనీసం మానవులుగా గానీ పరిగణింపబడని ఇంటి పనివారల స్థితిగతులపై ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించడానికి కూడా ఇది దోహదం చేస్తుంది.

సామాజిక, చట్టపరమైన భద్రతలు లేకపోవడంతో అధిక భాగం ఇంటి పనివాళ్ళు అతి తక్కువ వేతనంతో ఎక్కువ చాకిరీ చేస్తూ రకరకాల హింసలకు గురవుతున్నారు. బెంగుళూరులో ప్రభుత్వాన్ని సామాజిక, చట్టపరమైన భద్రత కోరిన ఇంటి పనివాళ్ళు తమకు గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు.

వాస్తవాలు-గణాంకాలు:

కార్మిక చట్టాలు కొంతవరకూ ఉన్నాగానీ ఈనాటికి కూడా అత్యధిక భాగం ఇంటి పనివాళ్ళు కార్మిక చట్టాల పరిధికి బయటే ఉన్నారు. ఇంటి యజమానుల హింస, వేధింపులు, దోపిడీ, భౌతిక చిత్రహింసలు, లైంగిక హింసలకు ఇంటి పనివారి రోజువారీ బాధితులు. ఈ హింస నుండి కాపాడేందుకు ఇంటి పనివారలకు అవసరమైన సాధారణ భద్రతా వ్యవస్థలు లేవు. వారు దోపిడీకి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. స్త్రీలను సామాజికంగా అణిగి ఉండాల్సిన వారుగా, పరాయిగా చూసే స్థితి కూడా దీంతో నేరుగా సంబంధం కలిగి ఉంది. లింగం, వర్ణం, వర్గం, కులం, జాతీయత అన్నీ వివక్షకు కారణభూతాలే.

– 2011లో జ 189 సదస్సును ఆమోదించడం ద్వారా Iకూూ ఇంటి పనివారలను శ్రామికులుగా గుర్తించి వారికి గౌరవప్రదమైన ఉపాధి ఉండాలని తీర్మానించింది. 26 దేశాలు ఈ తీర్మానంపై సంతకాలు చేసి ఆమోదించాయి. సభ్య దేశంగా ఉన్న భారతదేశం ఇంకా సంతకం చేయలేదు.

– 2011 జనాభా లెక్కలు, చీూూూ 2004-05 61వ రౌండు ఉద్యోగికత-నిరుద్యోగికత సర్వే ప్రకారం దేశంలో 40.75 లక్షల నుండి 60.5 లక్షల దాకా ఇంటి పనివాళ్ళు ఉండొచ్చని అంచనా. ఇవి చాలా కీలకమైన గణాంకాలు. కొన్ని అనధికారిక అంచనాల ప్రకారం ఈ రంగంలో ఉపాధి పొందుతున్న వారు 9 కోట్ల వరకూ ఉండొచ్చును.

– ఏ ప్రత్యేక నైపుణ్యాలు అవసరం లేని స్త్రీల పనిగా ఇంటి పనిని భావించడం వల్ల ఈ రంగంలో ప్రధానంగా స్త్రీలే పనిచేస్తున్నారు. ఇతర ఉపాధి అవకాశాలు లేకపోవడం, మిగిలిన అసంఘటిత రంగపు ఉపాధితో పోలిస్తే తమ స్వంత ఇంటి పని, సేవలకూ-బయట వేతన ఉపాధికి మధ్య సమతుల్యత కోసం కూడా స్త్రీలు ఇంటి పనిని వృత్తిగా స్వీకరించడానికి ఇష్టపడతారు.

– ఏ ఇతర వృత్తుల వారికి పోలీసుల దగ్గర నమోదు చేయించుకోవలసిన అవసరం లేదు. 93% శ్రామిక శక్తి అసంఘటిత రంగంలో ఉన్న దేశంలో కార్మిక చట్టాల పరిధికి బయట ఉండి ఏ అధికారాలు లేకపోవడంతో అసహాయతతో ఇంటి పనివారు అతి తక్కువ హోదాలో ఉన్నారు. శ్రామికులుగా గుర్తింపుకు నోచుకోకపోవడమే కాదు, కాబోయే నేరస్తులుగా కూడా ముద్ర పడిపోతారు. వారి పని వంట చేయడం, శుభ్రం చేయడం, అంట్లు తోమడం, పిల్లల సంరక్షణ అనే వాటిని ప్రభుత్వం పనిగా గుర్తించలేదు. 2000 తర్వాత భారతదేశం అధిక ఆర్థిక ఎదుగుదల నమోదు చేస్తున్న కాలంలో ఈ రంగంలోకి ప్రవేశించే స్త్రీల సంఖ్య బాగా పెరిగింది. సాధారణ శ్రామిక రంగంలోని ఆర్థికాభివృద్ధి స్త్రీలను దూరంగా ఉంచిందనేది స్పష్టం. కుటుంబ ఆదాయానికి మరింత జోడించాల్సిన దుర్భర పరిస్థితులు, పెరుగుతున్న అసమానతల్లో స్త్రీలకు ఇంటి పని ఉపాధి ఒకే ఆదాయ మార్గం అయ్యింది. మధ్య తరగతి సంఖ్య విస్తరించడంతో ఇంటి పనివారల అవసరం కూడా పెరిగింది.

– దాదాపుగా బడి మొఖం చూడని చదువురాని వారిలో అత్యధికం ఇంటి పనివారే. ఇంటి పని వారిలో 54% నిరక్షరాస్యులని 2009-10 ఎన్‌ఎస్‌ఎస్‌ గణాంకాల్లో తేలింది.

– వారంలో ప్రతిరోజూ రోజుకి 16-18 గంటలు ఇంటి పనివారలు పనిచేస్తారు. వారికి సెలవులు ఉండవు. తక్కువ వేతనం లేదా చాలా కాలం వేతనం ఇవ్వకపోవడం, వేధించడం, హింసించడం, ఇంటిలో బంధించడం, కుటుంబంతో మిత్రులతో ఇంట్లో పనివ్వకపోవడం, ఏ నోటీసూ లేకుండా పని నుండి తొలగించడం సర్వసాధారణం.

– వారంలో ప్రతిరోజూ రోజుకి 16-18 గంటలు ఇంటి పనివారు పనిచేస్తారు. వారికి సెలవులు ఉండవు. తక్కువ వేతనం లేదా చాలా కాలం వేతనం ఇవ్వకపోవడం, వేధించడం, హింసించడం, ఇంటిలో బంధించడం, కుటుంబంతో మిత్రులతో ఇంట్లో పనివ్వకపోవడం, ఏ నోటీసూ లేకుండా పని నుండి తొలగించడం సర్వసాధారణం.

జవాబుదారీతనం ఉండాలి:

– ఇంటి పనివారలను అవసర సేవారంగ కార్మికులుగా గుర్తించాలి. ఇంటి పనివారల బృందాలకు సదస్సు ఒక ప్రారంభం. ఇది కలవడానికి, సంఘటితం కావడానికి ఇంటి పని వారలకు గల హక్కులను కాపాడుతుంది. వారం వారం సెలవులు, వేతనంతో కూడిన సెలవు, ట్రేడ్‌ యూనియన్‌లో కానీ ఇతర సామాజిక కార్యక్రమాల్లో కానీ సభ్యులుగా ఉంటే, భాగస్వామ్యులయితే వారిని తొలగించడాన్ని నిషేధిస్తుంది. ఏ గుర్తింపు నమోదు లేని ఇంటి పనివారలను శ్రామికులుగా గుర్తించడం ద్వారా వారి వలస వచ్చిన స్థితితో సంబంధం లేకుండా ఇంటి పనివారలందర్నీ కాపాడేందుకు ఈ సదస్సు ఒక సాధనం. దేశంలో ఒక జాతీయ చట్టం ప్రస్తుతం లేదనే దాని ఆధారంగా ఈ సదస్సుపై సంతకం నిరాకరించరాదు. భారతదేశం Iకూూ సదస్సుపై సంతకం చేయాలి.

– ఇంటి పనివారల పరిస్థితులు నియంత్రించేటపుడు 18 సం||రాలలోపు వారి అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. జాతీయ చట్టాలు, నియమాల నిర్వచనం ప్రకారం కనీస వయస్సును పరిగణించాలి. పరిమితమైన పనిగంటలు, రాత్రివేళ పని నిషేధం, శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురిచేసే పనులపై ఆంక్షలు, వారు నివసించే, పనిచేసే పరిస్థితులపై పర్యవేక్షణా వ్యవస్థల ఏర్పాటు వంటి చర్యలతో వీరికి భద్రత కల్పించాలి.

– జనవరి 2020న ఇంటి పనివారి ‘పని నియంత్రణా, సామాజిక భద్రతా చట్టం 2016’కు ఇంటి పనివారల జాతీయ వేదిక / ముసాయిదా బిల్లు సమర్పించింది. ప్రభుత్వ సంక్షేమ చర్యలను దాటి యజమాని-పనివారలు తప్పనిసరిగా ”ఇంటి పనివారల జిల్లా స్థాయి నియంత్రణా బోర్డు” వద్ద నమోదు చేయించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. అసంఘటిత రంగ కార్మికుల కంటే భిన్నమయిన పని పరిస్థితులు, వాస్తవాలు ఉన్నందున ఒక ప్రత్యేక జాతీయ చట్టం అవసరాన్ని ఈ సదస్సు నొక్కి చెప్పింది.

– ప్రైవేటు సంస్థల మోసపూరిత వ్యవహారాల నుండి, హింస నుండి ఇంటి పనివారలను, ప్రత్యేకించి వలస ఇంటి పనివారలను కాపాడి ఈ సంస్థలను నియంత్రించి, వారి నమోదు చేయించేందుకు ఒక ప్రత్యేక అధికార వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు ఈ ఇంటి పనివారల చట్టం ఉపయోగపడాలి.

కార్యాచరణకు పిలుపు : ఇతర శ్రామికులతో సమానంగా హక్కులు, సామాజిక భద్రతతో శ్రామికులుగా గుర్తింపు, గౌరవం ఆశిస్తూ సంఘటితమైన ఇంటిపనివారు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. పౌరులుగా మనం…

– ప్రజలకు వినిపించే సభలు, సమాచారం అందించడం, సర్వేలు చేయడం, ఇతరులకు అవగాహన కల్పించడానికి వీధి సమావేశాలు నిర్వహించడం చేయవచ్చు.

– స్వయం సహాయ బృందాలు, స్వచ్ఛంద సంస్థల సిబ్బందికి సమావేశాల నిర్వహణ, ఇంటి పనివారల సమస్యలపై అవగాహన కల్పించడం, గ్రామ, మండల, జిల్లా, ప్రాంతీయ, నగర స్థాయిలో జెండర్‌ దృక్పధంతో ఇంటి పనిపై అవగాహన కల్పించడం.

– ఇంటి పనివారలు పనిచేసే అపార్టుమెంట్లు, గృహసముదాయాల వద్ద ప్రచారం చేసి ఇంటి పనివారు సంఘటితం కావడానికి కొత్త మార్గాలు అన్వేషించవచ్చు.

– పని ప్రదేశంలోనూ, ఇంటి వద్దా హింసకు గురవుతున్న మహిళలకు కౌన్సిలింగ్‌ నిర్వహించవచ్చు.

ఆశారేఖలు : కోవిడ్‌ – సామాజిక భద్రత.

సమాజంలోని ఉన్నత తరగతులు, ప్రత్యేకించి ప్రభుత్వాలు, అధికారుల అమానుషత్వం, నిర్లక్ష్యం మధ్యన వివిధ ప్రదేశాల్లో పనిచేస్తున్న ఇంటి పనివారికి మద్దతుగా ఒక బృందం పనిచేసింది. కోవిడ్‌-19 కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటన రాగానే అనేక సమాజాలు (గురుగ్రాం) ఇంటి పనివారలను నిర్లక్ష్యం చేయడం, వారిని దూరం ఉంచడం వంటివి చేశారు. వారి గృహ సముదాయాల ఆవరణలోకి ప్రవేశ అనుమతి లేదని రాత్రికి రాత్రే నోటీసులు జారీ చేశారు. కానీ ఒక సొపైటీ ఖీ=జుూజూ- నిర్వాణ కంట్రి (గురుగ్రాం) లోని కొంతమంది మహిళలు మాత్రం ఇంటి పనివారికి జీతాలు కొనసాగించాలని, పూర్తిగా నియంత్రించబడి ఒంటరి అయిన ప్రాంతాల్లో ఆహారం అందించాలని భావించారు. ఇంటి పనివారి కుటుంబాలు బీహార్‌, బెంగాల్‌లోని వారి గ్రామాలకు వెంటనే వెళ్ళిపోవాల్సిన అగత్యం లేకుండా చేశారు.

తిరిగి పనిలోకి రాలేని ఇంటిపని వారికి కూడా కొంతమంది మహిళలు వారి జీతాల్లో కోత లేకుండా ఇప్పటికీ చెల్లిస్తూనే

ఉన్నారు. ప్రయాణం చేసే అవకాశం రాగానే కొంతమంది గృహస్థులు వారి ఇళ్ళల్లో పనిచేసే వారు సురక్షితంగా గ్రామాలకు చేరేలా చూశారు.

స్త్రీ జాగృతి సమితి కథ :

శ్రామికులుగా దోపిడీకి గురయ్యే వారి హక్కులతో పాటు ప్రత్యేకించి ఇంటి పనివారి హక్కులు కాపాడడానికి కృషి చేసే స్త్రీ జాగృతి సమితి (ఎస్‌జెఎస్‌) సంస్థ బెంగుళూరులో ఉంది. ఇంటి పనివారలు శ్రామికులుగాదు, యంత్రాలు కాదనే భావనపై ఇది ఆధారపడింది. వారు కార్మికులు. వారు ఉత్పాదక ఆర్థిక వ్యవస్థలో భాగం. శ్రామికులుగా వారిని గుర్తించాలి, గౌరవించాలి, రక్షించాలి.

వీరు ప్రతి ఏటా 40 లక్షల రూపాయలను ఆర్థిక వ్యవస్థలో జమ చేస్తున్నారు. ఈ పనికి విలువ కట్టాలని కూడా ఎస్‌జెఎస్‌ భావిస్తోంది. 2006లో ఇంటి పనివారల హక్కుల యూనియన్‌ ఏర్పాటయ్యింది. ఇంటి పనివారలను ఐక్యం చేయడానికి, వారి వేతన బేరసారాల శక్తిని పెంచడానికి, గౌరవప్రదమైన ఉపాధి వేతనం కోసం పోరాడడానికి ఈ సంస్థ పనిచేస్తుంది.

ఉదాహరణకు దసరా పండుగ రోజున రిక్షాలు, బస్సులు ఎవరి పని సాధనాలను వారు పూజిస్తారు. ఎస్‌జెఎస్‌ చీపురుకు పూజలు నిర్వహించింది. చీపురు… మురికిగా భావించి కొంతమంది స్త్రీలు దానికి అభ్యంతరం చెప్పారు. అన్ని పనులూ గౌరవప్రదం అయినవేనని వారికి ఎస్‌జెఎస్‌ వారు తెలియచెప్పారు.

Share
This entry was posted in మనం గళమెత్తకపోతే . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.