యువత హక్కులు – ప్రచారోద్యమం

పరిచయం:

యువ జనం ఈ నాటి సృజన కారులు, అన్వేషకులు, నిర్మాతలు, నాయకులు. స్వాతంత్య్రపు 74వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న భారతదేశం 29 సం||రాల సగటు వయస్సు ప్రపంచంలో యువ జనాభాకు ఆవాసంగా ఉన్న దేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది. మొత్తం జనాభాలో యువత 28%గా ఉండి ఆర్థికాభివృద్ధి పెంపుదలకు అవసరమైన శక్తిని ఇచ్చే జనభాగం కలిగి ఉంది. అలాగే ప్రపంచంలోనే అత్యధికంగా 24.3 కోట్ల మంది కౌమార వయస్కులను కలిగిన దేశం మనది. భవిష్యత్తు పౌరులుగా ఎదిగేందుకు ఈ పెద్ద సమూహానికి అవసరమైన మద్దతును ఇచ్చి బలం చేకూర్చడానికి సృజనాత్మకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే అభివృద్ధి గణాంకాలు గత దశాబ్దంలో మందగించడం, సేవారంగం తక్కువ వేతనం నైపుణ్యం లేని ఉపాధి వైపుగా విస్తరించడం మనం గమనిస్తున్నాం. నాణ్యమయిన విద్యా అవకాశాలు కొరవడడం, వృత్తి నైపుణ్యాలు, అభివృద్ధి పథకాలు సరిపడేంతగా లేకపోవడం అనేవి యువజనం గౌరవప్రదమైన ఉపాధి, సంక్షేమం పొందగలగడంపై ప్రభావం చూపుతున్నాయి.

డిజిటల్‌ సాంకేతికత, మీడియాలు కలిసి నిర్దేశిస్తున్న ఈ కొత్త లోకంలో అసమానత కొత్త రూపాలు సంతరించుకుంది. అదే సమయంలో కొనసాగుతున్న పాత లింగ, కుల, వర్గ వివక్షతలు రూపం మార్చుకుని కొత్త వాటితో జతకట్టే కొత్త దారులు కనిపెడుతున్నాయి. డిజిటల్‌ విభజనలో లింగ, కుల, వర్గాలన్నింటిలో అగాధాలు పాత కొత్తల అసమానతల మిశ్రమం ఒక శాస్త్రీయ ఉదాహరణ. 8% మంది యువతకు మాత్రమే (ఎన్‌ఎస్‌ఎస్‌ 2017-18) కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంది. భారతదేశంలో ఇంటర్నెట్‌ లభ్యత 40% కాగా అది వనరులు గల పట్టణ జనాభావైపు మొగ్గు చూపుతోంది. ఇక డిజిటల్‌లో జెండర్‌ అంతరం చాలా లోతయినది. మన దేశంలో ఇంటర్నెట్‌ అందుబాటు కలిగిన 26% జనాభాలో 89’% పురుషులే. సెల్‌ఫోన్‌ వాడకంలో కూడా స్త్రీలకు, పురుషులకు మధ్య 21% అంతరం ఉంది. డిజిటల్‌ ప్రపంచాన్ని అందుకోవడంలో ఆడపిల్లలను ఆఖరి వరుసలోనే ఉంచుతారు. దళిత, మైనారిటీ సమూహాలకు చెందిన అమ్మాయిలు ఈ ప్రపంచానికి మరింత దూరం.

కోవిడ్‌తో ఈ కొత్త తరహా అసమానత మరింత పెరిగింది. ఆర్థిక మాంద్యం ఎదురుగా కనబడుతున్నప్పుడు, విద్యాలయాలు ఇంకా మూతబడే ఉండగా, విద్యార్థులు పరీక్షలు ఎట్లా రాయాలి? ఏటా ఆన్‌లైన్‌ తరగతులకు ఎవరు హాజరు కాగలరు? ఈ అభ్యసించే పటాల నుంచి ఎంత మంది జారి పడిపోనున్నారు? అనే ప్రశ్నలు వస్తాయి. యువజనంలో ఈ ప్రశ్నలు తీవ్రమయిన అభద్రతా భావాన్ని రేకెత్తిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో లక్షల మంది యువత భవిష్యత్తు ఫణంగా మారింది. దీనికితోడు ట్రాన్స్‌జెండర్‌ యువత అత్యంత నిస్సహాయులుగా, నివాసం లేనివారుగా, ప్రభుత్వ సానుభూతి లేనివారుగా ఉన్నారు. పథకాలలో విపత్తు, సహాయ చర్యల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు కోర్టులు, అవసరమైన ఇతర పత్రాలు/డాక్యుమెంట్లు లేనివారిని భాగస్వాముల్ని చేసే ప్రత్యేక చర్యలు చేపట్టడం లేదు.

రాన్రాను ఒక శిక్షా సంస్థగా మారిన ప్రభుత్వం కూడా యువతను ప్రభావితం చేస్తోంది. 2006 బాల్య వివాహ నిషేధ చట్టం ద్వారా యువతను రక్షిస్తున్నామనే పేరుతో ఇళ్ళ నుండి పారిపోయిన యువ జంటల్లోని యువకులపై అత్యాచారం కేసులు నమోదుచేసి వారిని నేరస్థులుగా మారుస్తున్నారు. ఇటీవల ప్రధాని బాలికల కనీస వివాహ వయస్సును పెంచుతామని ప్రకటించారు. దీనివల్ల దారిద్యం, విపరీతమైన కష్టం కారణంగా జరిగే ఇటువంటి వ్యవహారాలను యువత సంక్షేమం గురించి కేటాయింపులు జరపకుండా చట్టంతో పరిష్కరించవచ్చనే అభిప్రాయం బలపడుతుంది. బాల్య వివాహాలు ఒక వాస్తవమే అయినా గత కొద్ది దశాబ్దాలుగా 18 సం||రాలలోపు వివాహం చేసుకునేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇంకా తగ్గుతూ పోతుందని కూడా సూచనలు ఉన్నాయి.

ప్రధాన స్రవంతి రాజకీయాలను, భావాలను ప్రశ్నిస్తున్న యువ సామాజిక కార్యకర్తలపై దేశద్రోహం కేసులు బనాయించి అసమ్మతిని నేరం చేయడం ఈ మధ్యకాలంలో జరిగిన ఒక తీవ్ర పరిణామం. సి.ఎ.ఎ., ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ చట్టాలకు వ్యతిరేకంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొన్నారు. వారిపై రాజ్యాంగం ఇచ్చిన నిరసన హక్కును కాలరాస్తూ ప్రభుత్వం క్రూరమయిన నల్ల చట్టాలతో అరెస్టులతో విరుచుకుపడుతోంది. ఆన్‌లైన్‌లోనూ, బయటా మెజారిటీ భావజాలంవైపు నెట్టేలా పెరుగుతున్న హింసకు తోడుగా జాతి ప్రతిష్ట, భయభ్రాంతులకు గురిచేయడం, హేతుబద్ధ ఆలోచనలను ప్రక్కకు నెట్టేయడం వంటి వాటిని విపరీత పురుషాధిక్య భాషతో జోడించి వాడడంతో యువతకు ఒక ఆధిక్య భావజాలపు వాతావరణం సృష్టించబడింది.

వాస్తవాలు – గణాంకాలు : ఇతర వయస్సుల వారితో పోలిస్తే ఉపాధి కోల్పోయే దీనస్థితి యువతకే ఎక్కువని గణాంకాలు సూచిస్తున్నాయి.

– అంతర్జాతీయ శ్రామిక సంస్థ ప్రకారం ప్రతి ఆరుగురిలో ఒక యువత ఉద్యోగం కోల్పోయారు. ఈ మహమ్మారి వల్ల యువత అతి ఎక్కువ నిష్పత్తిలో ప్రభావితమవుతున్నారు.

– సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (జవీIజు) ప్రకారం 2018-19లో 15-29 సం||రాల మధ్య యువతలో 17.3 % నిరుద్యోగం ఉంటే మే 2020కి అది 41%కి పెరిగింది. ఏప్రిల్‌ 2020లో 20-30 మధ్య వయస్సు వారు 2.7 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. డిజిటల్‌ సవాళ్ళు, నాణ్యత అనే అంశాలతో విద్య లభించడం రాన్రాను క్లిష్టతరం అవుతోంది. 18-23 సం||రాల వయస్సు వారిలో కేవలం 24.6% మాత్రమే ఉన్నత విద్యలో నమోదయ్యారని 2016 మానవాభివృద్ధి మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి.

– కోవిడ్‌-19 ప్రస్తుతం బడిలో ఉన్న కౌమార వయస్కులపై, బడి పర్యావరణంపై ప్రభావం చూపడంతో రానున్న రెండేళ్ళలో వారు ”పని”లోకి ప్రవేశించవచ్చు. కొత్త ఉపాధి, కొత్త తరహా నైపుణ్యాలు కోరుకుని చదువుకుందామనుకున్న అసంఖ్యాకమైన యువతుల స్థితి కూడా ఇదే.

– 2017-18 జాతీయ శాంపిల్‌ సర్వే నివేదిక ప్రకారం కేవలం 24% భారతీయుల ఇళ్ళల్లోనే ఇంటర్నెట్‌ సదుపాయం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 15%, పట్టణ ప్రాంతాల్లో 42% గృహాలకు ఇంటర్నెట్‌ ఉంది. ఆన్‌లైన్‌ విద్య అంటే బోధన, పరీక్షలు కూడా అన్‌లైన్‌లోనే అంటే లక్షలాదిమంది విద్యార్థులు విద్యావకాశాలు కోల్పోవడమే.

– ప్రధాని అతి ప్రధాన పథకం ”ప్రధాన మంత్రి కుశల వికాస్‌ యోజన (ూవీఖజ్‌ు)” కింద స్కిల్‌ ఇండియా మిషన్‌ ఆధ్వర్యంలో 2016-20 మధ్య కోటి మంది యువతకు ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు కలిగించాలి. 2019లో ప్రభుత్వం ప్రకటించినదాన్ని బట్టి 64 లక్షల మంది శిక్షణ పొందితే వారిలో 24% అంటే 14,43 లక్షల మంది మాత్రమే ఉపాధి పొందారు.

– 20-24 మధ్య వయస్సులో ఉన్న స్త్రీలలో 26% మంది 18 సం||రాలలోపే వివాహం చేసుకున్నారని 2015-16 (చీఖీనూ) జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలు వెల్లడించాయి. ఈ వయస్సు వారిలో 56% మందికి 21 సం||రాల లోపునే వివాహం జరిగింది. ఇది చాలా తక్కువ అంచనా. దారిద్య్రం వల్ల వివాహంలోకి నెట్టబడుతున్న అమ్మాయిలకు కనీస వివాహ వయస్సు పెరగడం వలన వారి పెళ్ళి వలన అత్తింటిలో లభించే స్థానం, హక్కులు కూడా తృణీకరించబడతాయి. బతుకు అవసరాల వల్ల బాల్య వివాహాలు చేసి, ఉపాధిలోకి ప్రవేశించే కుటుంబాలను నేరస్థులు చేయడం ఎవరికి ఉపయోగం? స్త్రీలకు, పురుషులకు కనీస వివాహ వయస్సు 18 సం||రాలు అనేది ప్రపంచవ్యాప్త ప్రమాణంగా ఉంటే భారత్‌ ఎందుకు దాన్ని అధిగమించాలని భావిస్తోంది?

ఆరోగ్య సేవలు-పౌష్టికాహారం అవకతవకలు – ూ=న= కేంద్రీకరణ పరిమితులు :

కోవిడ్‌-19తో పోరాటం అనగానే కౌమార వయస్సు అమ్మాయిల ఆరోగ్య సేవల్లో ప్రత్యేకించి ూ=న= సేవల్లో అంతరాయం ఏర్పడింది. స్కూళ్ళు మూతబడడం వలన ఆరోగ్యం, పౌష్టికాహారానికి సంబంధించిన పథకాలు… మధ్యాహ్న భోజనం, శానిటరీ ప్యాడ్‌ల పంపిణీ వంటివి ఆగిపోయిన ప్రభావం ఈ వయస్సు బాలికలపై పడింది.

బడి నుంచి దూరమైన బాలికలు గర్భం దాల్చే ప్రమాదం పెరిగింది. ఇప్పటికే 15-19 సం||రాల మధ్య వయస్సు గల కౌమార బాలికలలో 54% మంది రక్తహీనతతో ఉన్నారు. ఆహారం కొరత, ఆహార లేమితో ఇది ఇంకా పెరగవచ్చు.

ఇంటి పనిభారం, బాల్య వివాహం, ఇతర ఒత్తిడులతో సతమతమవుతున్న కౌమార వయస్సు బాలికల ఆరోగ్యం ఒక పెద్ద సమస్యగా ఇప్పుడు ముందుకు వచ్చింది.

జవాబుదారీతనం ఉండాలి: – ఏ వయస్సు వారయినా సరే తప్పుడు కేసులతో అరెస్టు చేసిన రాజకీయ ఖైదీలందర్నీ తక్షణం విడుదల చేయాలి. ఉపా చట్టాన్ని ఉపసంహరించాలి.

– విద్యలో అందరినీ కలుపుకునేందుకు గాను ఆన్‌లైన్‌ పరీక్షలను రద్దు చేస్తూ యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ మార్గదర్శక సూత్రాలు జారీ చేయాలి. గతంలోని వారి విద్యా పరీక్షల ప్రాతిపదికన విద్యార్థులందర్నీ పై తరగతులకు పంపాలి. తర్వాత వారి స్థితి మెరుగు పర్చుకునేందుకు మళ్ళీ పరీక్షలు రాసే వీలు ఉండాలి.

– నిరుద్యోగ యువతకు కోవిడ్‌-19 ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి. ఉద్యోగాలు లేని వారి స్వల్పకాలిక అవసరాలకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకిచ్చే అప్పులకు మధ్య సమతుల్యం పాటించాలి. యువత విద్యకు, నైపుణ్యాల శిక్షణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి మహమ్మారి వలన ఆర్థికంగా దెబ్బతిన్న వారికి వీటిని స్కాలర్‌షిప్‌లుగా పంపిణీ చేయడం ఈనాటి తక్షణ అవసరం.

– ూవీఖజ్‌ులో నైపుణ్య శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు ఎందుకు రావడంలేదో వివరమైన అధ్యయనం వెంటనే జరపాలి. ఈ పథకం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.

– అనేక ఆటంకాలను అధిగమించి ఉన్నత విద్య పూర్తి చేసిన యువతులకు ఉద్యోగావకాశాలు, వృత్తి నైపుణ్య శిక్షణల కోసం ప్రత్యేక పథకాలు / ప్రోత్సాహకాలు ఉండాలి.

– కరోనా మహమ్మారిని అరికట్టే ప్రక్రియలో భాగంగా నియంత్రించబడిన ప్రాంతాల్లో యువతకు హక్కులు, సేవల పట్ల అవగాహన కోసం ఆరోగ్యం, సంక్షేమం, అందుబాటు గురించిన పూర్తి సమాచారం కౌమార వయస్కులకు, యువతకు అందించాలి.

– తమకు నచ్చిన వారిని ఎంచుకునే యువత హక్కులపై దెబ్బకొడుతున్న చట్టాలను సవాలు చేయాలి. యువతుల లైంగికత ఇతర హక్కులను ప్రభావితం చేసే కనీస వివాహ వయస్సు పెంపుదల ప్రతిపాదనలకు అడ్డుకట్ట వేయాలి.

– యువత దగ్గరకు ప్రత్యేకించి స్త్రీలు ఇతర భిన్న లైంగికతలు కలవారు ఎవరయితే వారి అవసరాలు, హక్కులు ప్రకటించలేరో వారి దగ్గరకు వెళ్ళేటప్పుడు ఆరోగ్య కార్యకర్తలు వారి వ్యక్తిగత గోప్యతను, సౌకర్యాన్ని గమనించేలా వారికి శిక్షణ ఇవ్వాలి.

– గ్రామీణ సమాజాలకు ఆరోగ్య సేవలందించే కార్యక్రమాలలో భాగంగా యువతకు మానసిక ఆరోగ్యంపై అవగాహన అందించేందుకు చొరవ తీసుకోవాలి. మానసిక, ఆరోగ్య సేవలు వారికి అందుబాటులోకి తేవాలి.

– యువత బాధలోనూ, హింసలోనూ ఉన్నప్పుడు వారి మద్దతుకు, వారికి చేరువ కావడానికి అవసరమైన తక్షణ సహాయ సేవలకు జీవం పోయాలి.

కార్యాచరణ పిలుపు :

– దేశంలో విభిన్న ప్రదేశాల నుంచి భిన్న సమూహాలకు చెందిన సంగీతకారులు, నటులు, నృత్యకారులు, చిత్రకారులు, కవులు మొదలయిన కళాకారులతో ఆన్‌లైన్‌ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. విభిన్నమయిన యువ గళాలకు ఇది వేదికయ్యే వీలుంది. దీనిద్వారా నిధులు సేకరించి నిరుద్యోగ యువత కొరకు వినియోగించవచ్చు.

ఆశారేఖ :

”కాంమ్యుటిని” (జశీఎవీబ్‌ఱఅవ) ఇది ఒక సంఘటితమైన యువత నెట్‌వర్క్‌. దేశంలోని 20 రాష్ట్రాల నుండి 130 యువజన సంఘాలు కలిసి సమాజాన్ని, తమను మార్చుకునేందుకు యువతలో నాయకత్వ సామర్ధ్యాన్ని పోషించే స్థలాలను సశక్తీకరణ చేసే లక్ష్యంతో పనిచేస్తున్నాయి. ఈ నెట్‌వర్క్‌లోని సభ్యులు కోవిడ్‌-19 పునరావాస కార్యక్రమాల్లో ఆహార పంపిణీ, భద్రత, భౌతిక దూరంపై అవగాహన వంటి వాటిలో చురుకుగా పాల్గొన్నారు. ఈ గొడుగు కింద చేసిన కొన్ని నిర్దిష్ట కార్యక్రమాలు :

– ”శత్రక్‌” పేరుతో 30 మంది యువ నాయకులు ప్రధాన స్రవంతిలో లేని సమూహాలతో నిత్యావసర వస్తువులు, వైద్య సహాయం, నిధుల సేకరణ, వలస కార్మికులకు రవాణా సదుపాయం వంటి వాటిపై పనిచేస్తున్నారు. వారికి సభ్యత్వం, ఫోన్‌ రీఛార్చికి డబ్బు, ఆరోగ్యం, ఇంధనం వంటి సదుపాయాలు అందిస్తున్నారు.

– కలకత్తాలో ప్రాంతకథ ఇప్పటిదాకా కలకత్తా చుట్టుపక్కల నాలుగు జిల్లాల్లోని 5000 కుటుంబాలకు బాలల ఆహారం అందించారు.

– అస్సాంలోని ఫాం టు ఫుడ్‌ వారు 2500 నిరుపేద కుటుంబాలకు (ప్రత్యేకించి తేయాకు తోటల వారికి) కూరగాయలు, సరుకులు అందించారు.

– ”అగ్రని” బృందం మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో రోజువారీ కార్మిక కుటుంబాలకు సరుకులు, ఇతరత్రా అందించారు. మధ్యప్రదేశ్‌-మహారాష్ట్ర సరిహద్దులు దాటుతున్న వలస కార్మికులకు ఆహారం, నీరు ఏర్పాటు చేశారు.

ఉమ్మడిగా ‘కాంమ్యుటిని’ సభ్యులు 11 వేల కుటుంబాలకు సరుకులు అందించారు. 20 వేల కుటుంబాలను చేరాలన్న వారికి లక్ష్యానికి సహాయం అవసరం. ఒక అర్థవంతమయిన మార్పు దేశవ్యాప్తంగా తీసుకురావడానికి యువతను ఒకచోట చేర్చడంలో వీరు ముందున్నారు.

Share
This entry was posted in మనం గళమెత్తకపోతే . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.