నిరుడు వెలిగిన దీపశిఖలు – డా|| షేఖ్‌ మహబూబ్‌ బాషా

బ్రిటిషాంధ్రలో మహిళోద్యమం ముమ్మరంగా నడిచింది. తమ రచనల ద్వారా, మహిళా సంఘాల నిర్మాణం ద్వారా బలమైన మహిళోద్యమాన్ని నిర్మించారు బ్రిటిషాంధ్రలోని స్త్రీలు. వీరు ముఖ్యంగా స్త్రీల పత్రికలైన ‘తెలుగు జనానా’, ‘హిందూ సుందరి’, ‘సావిత్రి’, ‘వివేకవతి’, ‘అనసూయ’, ‘ఆంధ్రలక్ష్మి’, ‘గృహలక్ష్మి’, ‘ఆంధ్రమహిళ’ మొదలైన వాటిలో తమ రచనల్ని ప్రచురించేవారు. 1910 చివరినాటికే మహిళా రచయితల సంఖ్య ఎంతగా పెరిగిందంటే 1902లో ప్రారంభమైన ‘హిందూ సుందరి’లో 1909 నాటికి సుమారు వందమంది స్త్రీలు తమ రచనల్ని ప్రచురించారు. జూన్‌ 1909 నాటికి తమ రచనల్ని ప్రచురించిన 84 మంది స్త్రీల పేర్లను ఇచ్చారు ‘హిందూసుందరి’ స్థాపకులైన సత్తిరాజు సీతారామయ్య. 1910 నాటికే ఇంతమంది మహిళా రచయితలుంటే వలస పాలనానంతరం నాటికి ఎంతమంది మహిళలు రచయితలుగా రూపుదిద్దుకుని ఉంటారో సులభంగా ఊహించవచ్చు.

బ్రిటిషాంధ్రలో వందకు పైగా మహిళా సంఘాలుండేవి. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా ఇవి స్థాపించబడ్డాయి. స్త్రీలు ఇక్కడ తరచూ కలుసుకోవడం, తమ సమస్యల్ని చర్చించడం, ఉపన్యాసాలివ్వడం, తీర్మానాలు పాస్‌ చేయడం మొదలైన పనులు చేసేవారు. కాకినాడలోని ”శ్రీ విద్యార్థినీ సమాజం” లాంటి సంఘాలైతే కార్యకలాపాల్నీ, మహిళల ఉపన్యాస వివరాల్నీ విశేషంగా ప్రచురించేవి. 1910లో యావదాంధ్ర స్త్రీల విశాల వేదికగా ”ఆంధ్ర మహిళా మహాసభ” ఉనికిలోకి వచ్చింది. ప్రతి సంవత్సరం ఆంధ్రలోని వివిధ ప్రాంతాల్లో మహిళా సమావేశాలు ఏర్పాటు చేసేది ”ఆంధ్ర మహిళా మహాసభ”. ూశ్రీశ్రీ Iఅసఱa ఔశీఎవఅఃర జశీఅటవతీవఅషవ ఆంధ్ర శాఖగా ”ఆంధ్ర రాష్ట్ర మహిళా మహాసభ” 1927లో ఏర్పాటు చేయబడి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మహిళా సమావేశాలను నిర్వహించేది. కమ్యూనిస్టు మహిళా సంఘమైన ”ఆంధ్ర మహిళా సంఘా”నికి మారుమూల గ్రామాల్లో కూడా శాఖలుండేవి. ఈ విధంగా బ్రిటిషాంధ్రలో మహిళోద్యమం ఉధృతంగా నడిచింది. సరైన పరిశోధన జరగని కారణంగా వలసాంధ్రనాటి మహిళోద్యమ వివరాలు వెలుగులోకి రావడంలేదు. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయమేమిటంటే గాంధీజీ మహిళల్ని స్వాతంత్య్రోద్యమంలోకి తేవడానికి రెండు శతాబ్దాలకు ముందే ఆంధ్ర స్త్రీలు ఆంధ్ర సార్వజనిక క్షేత్రం (జూబపశ్రీఱష రజూష్ట్రవతీవ )లో పనిచేయడం మొదలుపెట్టారు.

నేను ”ూతీఱఅ్‌ జబశ్ర్‌ీబతీవ aఅస ఔశీఎవఅఃర హశీఱషవర: ూ ూ్‌బసవ శీట ువశ్రీబస్త్రబ జీశీబతీఅaశ్రీర, 1902-1960” అనే అంశం మీద పిహెచ్‌డి సిద్ధాంత వ్యాసాన్ని న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రు యూనివర్శిటీకి సమర్పించాను. ప్రధానంగా బ్రిటిషాంధ్రలో వెలువడిన స్త్రీల పత్రికలపై చేసిన అధ్యయనం ఇది. ఈ కృషిలో భాగంగా సుమారు వెయ్యిమంది మహిళా రచయితల రచనల్ని చదవగలిగే భాగ్యం కలిగింది నాకు. అంతేకాకుండా వివిధ మహిళా సంఘాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన క్షేత్రస్థాయి మహిళా నాయకులు, కార్యకర్తల వివరాలు తెలుసుకోగలిగాను. సిద్ధాంత వ్యాసంలో ప్రస్తావించిన మహిళా రచయితలు, మహిళోద్యమ నాయకులు, కార్యకర్తల జాబితా తయారుచేశాను. దాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. వీరందరూ రచయిత్రులు కారు, కానీ చాలామంది రచయిత్రులు. కొందరు కేవలం మహిళా సంఘాల్లో పనిచేసిన నాయకురాళ్ళు, కార్యకర్తలు. రచయిత్రులైన వారిలో అత్యధిక శాతం మంది అభ్యుదయ దృక్పథాన్ని కనబరిస్తే, పులుగుర్తి లక్ష్మీ నరసమాంబ లాంటివారు బాల్య వివాహాల్ని సమర్థించడం, వితంతు పునర్వివాహాలను వ్యతిరేకించడం ద్వారా తిరోగమన భావాలు వెలిబుచ్చారు.

పొందుపరుస్తున్న జాబితా వాస్తవంగా నేను కనుగొన్న వారిలో 1/3 వ వంతు కూడా ఉండదు. జాబితాలోని సుమారు 95% మంది పేర్లు కూడా మనకు తెలియవు. ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగునపడి కనిపించకుండా పోయిన నిరుడు వెలిగిన దారిదీపాల్ని పాఠకులకు పరిచయం చేయడమే ఈ వ్యాసం ఉద్దేశం. పేర్లను ప్రాధాన్యతా క్రమంలో కాకుండా ఇంగ్లీషు అక్షర క్రమంలో ఇచ్చాను. 1902-1947 మధ్య సక్రియంగా ఉన్న వారి పేర్లను మాత్రమే ఈ జాబితాలో ఇచ్చాను.

1. ఎ. రాజమ్మ 2. ఆవుల సుబ్బాయమ్మ 3. ఆచంట లక్ష్మీదేవి 4. ఆచంట రుక్మిణమ్మ 5. ఆచంట సత్యవతమ్మ 6. అద్దంకి అనసూయాదేవి 7. ఆదిపూడి వసుంధరాదేవి, ఎం.ఎ, బియస్సీ 8. ఆదుర్తి భాస్కరమ్మ 9. ఆదుర్తి లక్ష్మీబాయి 10. అక్కరాజు సీతారామమ్మ 11. అల్లాడ రామ అహల్యాదేవి 12. అమూల్యమ్మ చౌదరి 13. ఆండాళమ్మ (లేడీ వెంకట సుబ్బారావు) 14. అన్నపూర్ణాదేవి 15. అన్నే అనసూయ 16. అచ్యుతుని గిరిజ 17. ఆత్కూరి వెంకట రమణమాంబ 18. అట్లూరి సీతాలక్ష్మమ్మ 19. అట్లూరి వెంకట సీతమ్మ 20. ఆత్మూరి అన్నపూర్ణమ్మ 21. అత్తిలి సుబ్బమ్మ 22. అత్తోట శేషమ్మ 23. అత్యం సత్యవతీదేవి 24. అయ్యగారి వెంకటరత్నం 25. బి.లక్ష్మీనరసమ్మ 26. బి.రాజమ్మ 27. బి.సీతాబాయి 28. బాలాంతపు శేషమ్మ 29. బసవరాజు రాజ్యలక్ష్మమ్మ 30. బత్తుల కామాక్షమ్మ 31. బెంగుళూరు నాగరత్నమ్మ 32. భండారు అచ్చమాంబ 33. భారతీదేవి రంగా 34. భావరాజు మహాలక్ష్మమ్మ 35. భూపతిరాజు అప్పల సరసయ్యమ్మ 36. భూపతిరాజు వెంకమ్మ 37. బోడపాటి అలివేలమ్మ 38. బ్రహ్మాండం కనకసుందరమ్మ 39. బుద్ధవరపు వీరలక్ష్మమ్మ 40. బులుసు సూరమ్మ 41. బుఱ్ఱా బుచ్చి బంగారమ్మ 42. బుఱ్ఱా వెంకట సుబ్బమ్మ 43. సి.పంకజమ్మ 44. సి.హెచ్‌.పద్మ 45. చేబ్రోలు సరస్వతీదేవి 46. చెదలపాక వరలక్ష్మీదేవి 47. చెరుకూరు నాగభూషణమ్మ 48. చిలకపాటి సీతాంబ 49. చీమకుర్తి సత్యవతీదేవి 50. చింతలపూడి సీతాదేవమ్మ 51. చింతలపూడి వెంకట రమణమ్మ 52. చింతపెంట వెంకట నరసమాంబ 53. చోరగుడి కైలాసమ్మ 54. చోరగుడి సీతమ్మ 55. చుండూరి రత్నమ్మ 56. డి.అనసూయమ్మ 57. డి.సూర్యకాంతమ్మ 58. దామరాజు సుందరమ్మ 59. దామెర్ల భ్రమరాంబ 60. దామెర్ల కమలారత్నమ్మ 61. దామెర్ల సీతమ్మ 62. దామెర్ల సుందరమ్మ 63. దరిశి అన్నపూర్ణమ్మ 64. దరిశి సుభద్రమ్మ 65. దావులూరి దామేశ్వరమ్మ 66. దావులూరి వీరలక్ష్మమ్మ 67. దేశిరాజు భారతీదేవి 68. దేవులపల్లి సత్యవతమ్మ 69. ధర్మవరం లక్ష్మీదేవి 70. దిగుమర్తి రాజ్యలక్ష్మమ్మ 71. దిగుమర్తి సువర్ణాబాయి 72. డాక్టర్‌ దానమ్మ 73. డాక్టర్‌ కె.వి.లక్ష్మి 74. డాక్టర్‌ రంగనాయకమ్మ 75. ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ 76. దుగ్గిరాల రమణమ్మ 77. దుగ్గిరాల శేషారత్నమ్మ 78. దువ్వూరి సుబ్బమ్మ 79. ఇ.వెంకటరత్నమ్మ 80. ఇ.ఎస్‌.మెకాలె 81. ఏడునోట్ల శేషమ్మ 82. ఏకా వెంకట రత్నమ్మ 83. ఎర్రంరెడ్డి కృష్ణమ్మ 84. జి.వీరమ్మ 85. జి.వెంకమ్మ 86.గాదె చూడుకుడుతమ్మ 87. గాడిచర్ల రమాబాయి 88. గజవిల్లి సుభద్రమ్మ 89. గంపా శివకాంతమ్మ 90. గోకరాజు వెంకాయమ్మ 91. గోపరాజు సీతాదేవి 92. గోపిశెట్టి సూర్యనారాయణమ్మ 93.గోడేటి లక్ష్మీకాంతమ్మ 94. గోవిందరాజు ఆదిలక్ష్మమ్మ 95. గూడపాటి లక్ష్మీనరసమ్మ 96. గుడిపూడి ఇందుమతీదేవి 97. గుమ్మడిదల దుర్గాబాయమ్మ 98. గుండాల సుభద్రమ్మ 99. గుండు అచ్చమాంబ 100. ఇమ్మిడిసెట్టి సీతారత్నం 101. ఇంటూరి ప్రేమావతమ్మ 102. ఇనుగంటి రామతులసమ్మ 103. ఇప్పగుంట వెంకమాంబ 104. జె.శ్యామల 105. జాస్తి సీతామహాలక్ష్మి 106. జూలూరి తులసమ్మ 107. కె.ఆగ్నెస్‌ దానియేలు 108. కె.రామలక్ష్మి 109. కె.రంగమ్మ రెడ్డి 110. కె.సరోజినీదేవి 111. కె.వెంకటలక్ష్మమ్మ 112. కె.వరలక్ష్మి 113. కడప రామసుబ్బమ్మ 114. కలగర పిచ్చమ్మ 115. కాలంగి శేషమాంబ 116. కాళ్ళకూరి మహాలక్ష్మీ సుందరమ్మ 117. కళ్ళెపళ్ళె వెంకటరమణమ్మ 118. కమలాక్షమ్మ 119. కామరాజు మైత్రేయి 120. కామేశ్వరమ్మ 121. కనకవల్లి తాయారమ్మ 122. కాంచనపల్లి కనకమ్మ 123. కంచర్ల సుగుణమణి 124. కందుకూరి రాజ్యలక్ష్మమ్మ 125. కందుకూరి వెంకాయమ్మా రావు 126. కనుపర్తి వరలక్ష్మమ్మ 127. కర్లపాటి చంద్రమ్మ 128. కాశీభట్ట సూరమ్మ 129. కాశీనాధుని రమాబాయమ్మ 130. కత్తిరశెట్టి కేశవమ్మ 131. కిలారు త్రిపురాంబ 132. కొడాలి సీతారమాదేవి 133. కోకా కృష్ణవేణమ్మ 134. కొల్లా కనకవల్లి తాయారమ్మ 135. కొల్లూరి సత్యనారాయణాంబ 136. కొమఱ్ఱాజు అచ్చమాంబ 137. కొమఱ్ఱాజు పద్మావతి 138. కొమ్మూరి లక్ష్మీనరసమ్మ 139. కొనకంచి లక్ష్మమ్మ 140. కొండా పార్వతీదేవి 141. కొండా విజయలక్ష్మీబాయి 142. కొండపల్లి కోటేశ్వరమ్మ 143. కొంగర అన్నపూర్ణమ్మ 144. కోటా కనకమ్మ 145. కొటికలపూడి సీతమ్మ 146. కృష్ణవేణి భిషగ్రత్న 147. క్రొత్త లక్ష్మీ రఘురాం 148. కుడితిపూడి అచ్చమాంబ 149. లింగం సుందరమ్మ 150. బాసీ అమ్మాల్‌ 151. యం.రమణమ్మ 152. యం.సుభద్రమ్మ 153. యం.వరలక్ష్మి 154. యం. వేదవల్లి తాయారమ్మ

155. యం.యన్‌.కమలమ్మ 156. యం.యస్‌.పద్మావతమ్మ 157. మావూరి సీతమ్మ 158. మాడభూషి చూడమ్మ 159.మద్దాలి రాజ్యలక్ష్మమ్మ 160. మద్దాలి సీతారామమ్మ 161. మద్దుల దమయంతీ దేవి 162. మాగంటి అన్నపూర్ణాదేవి 163. మహాలక్ష్మి 164. మాకం కామాక్షమ్మ 165. మల్లాది లక్ష్మీదేవమ్మ 166. మల్లిమడుగుల లలితాంబ 167. మామిడన్న కామేశ్వరమ్మ 168. మామిడిపూడి వైదేహి 169. మంచికంటి వెంకటరత్నమ్మ 170. మందా శివమ్మ 171. మండపాక జోహానమ్మ 172. మంత్రిప్రగడ కామరాజమ్మ 173. మన్యం వెంకటసుబ్బమ్మ 174. మరువాడ సూరమ్మ 175. మీనాక్షమ్మ 176. మెల్లీ జొల్లింగర్‌ 177. మొగసాటి అప్పలనరసమ్మ 178. మొసలికంటి రమాబాయమ్మ 179. మోటుపల్లి రాజాబాయమ్మ 180. మోటూరి శేషారత్నం 181. మూలవిసాల రాజేశ్వరి 182. మునుపల్లె రామకోటమ్మ 183. ముప్పలనేని పుష్కరాంబ 184. ముచ్చర్ల భ్రమరాంబ 185. ముత్తులక్ష్మీరెడ్డి 186. మైదవోలు పద్మావతీదేవి 187. యన్‌.రాజ్యలక్ష్మమ్మ 188. యన్‌.సరోజినీదేవి 189. యన్‌.కె.మీనాక్షీ సుందరమ్మ 190. నాధావఝ్జల సరస్వతమ్మ 191. నడుంపల్లి బుచ్చి వెంకటసుబ్బమ్మ 192. నాగల్ల రాజేశ్వరమ్మ 193. నాళం రాఘవమ్మ 194. నాళం సుభద్రమ్మ 195. నాళం సుశీలాదేవి 196. నందగిరి ఇందిరాదేవి 197. నండూరి కామేశ్వరి 198. నరహరిశెట్టి నాగమణి 199. నైనా రాజ్యలక్ష్మి 200. ఒంగోలు భువనేశ్వరమ్మ 201. ఓరుగంటి సుందరీరత్నమ్మ 202. పి.లక్ష్మీకాంతమ్మ 203. పి.లక్ష్మీబాయి 204.పి.త్రిపుర సుందరమ్మ 205. పాలగుమ్మి సత్యానందం 206. పందిరి జగదాంబ 207. పరుచూరి సూర్యాంబ 208. పసుపులేటి లలితాదేవి 209. పత్రి శేషగిరమ్మ 210. పెద్దాడ కామేశ్వరమ్మ 211. పెద్దాడ సుబ్బమ్మ 212. పెమ్మరాజు లక్ష్మీదేవమ్మ 213. పేర్ల అన్నపూర్ణమ్మ 214. పోలేపల్లి మంగమ్మ 215. పోలేపల్లి రంగనాయకమ్మ 216. పోలేపల్లి రుక్ష్మిణమ్మ 217. పోలూరి మాణిక్యాంబ 218. పొణకా కనకమ్మ 219. ప్రభల సత్యవతమ్మ 220. పులపర్తి ఈశ్వరమ్మ 221. పులపర్తి కమలావతీదేవి 222. పులిపాక బాలాత్రిపుర సుందరమ్మ 223. పులుగుర్త లక్ష్మీనరసమాంబ 224. పురిటి సూర్యనారాయణమ్మాల్‌ 225. ఆర్‌.రుక్మిణి 226. ఆర్‌.ఎస్‌.సుబ్బలక్ష్మి అమ్మాల్‌, బి.ఎ.యల్‌.యల్‌.బి 227. రాచర్ల రత్నమ్మ 228. రాజ్యలక్ష్మి 229. రామ తులసమ్మ 230. రామినేని రామానుజమ్మ 231. రత్నాల కమలాబాయి 232. రావి నరసమ్మ 233. రాయప్రోలు శేషసోమిదేవమ్మ 234. రాయసం రత్నమ్మ 235. రుక్మిణీ గోపాల్‌ 236. ర్యాలి జానకీ రామాయమ్మ 237. యస్‌.అన్నపూర్ణాదేవి 238. యస్‌.మనోరమాదేవి 239. యస్‌.రాజమ్మాదేవి 240. యస్‌.రాజ్యలక్ష్మి 241. యస్‌.సుందరమ్మ 242. సల్లా సౌందర్యవల్లి అమ్మ 243. సమర్థి స్వర్ణమ్మ 244. సమయమంత్రి రాజ్యలక్ష్మీదేవి 245. సంగం లక్ష్మీబాయమ్మ 246. సారంగు సీతాదేవి 247. సత్తిరాజు శేషమాణిక్యాంబ 248. సత్తిరాజు శ్యామలాంబ 249. సత్యంవద 250. సత్యవతీదేవి 251. సావిత్రమ్మ 252. సావిత్రి 253. సీరిపి అచ్చమాంబ 254. శనగవరపు లక్ష్మీబాయమ్మ 255. శిఖరం కమలాంబ 256. సింగిదము వెంకట లక్ష్మమ్మ 257. సీతమ్మ 258. జానమ్మ 259. సూరపరాజు రుక్మిణమ్మ 260. సుభద్ర

261. సుందరమ్మ 262. సుసర్ల లక్ష్మీ నరసమాంబ 263. టి.సావిత్రి 264. టి.సింగమ్మ 265. తాడికొండ రామలక్ష్మమ్మ 266. తల్లాప్రగడ విశ్వసుందరమ్మ 267. తాపీ రాజమ్మ 268. తాయి వెంకట సుబ్బమ్మ 269. తెలికిచర్ల వసుంధరాదేవి 270. తెన్నేటి హేమలత 271. తెన్నేటి వెంటక రత్నావళి 272. తిక్కవరపు శకుంతలాదేవి 273. తిరునగరి తాయారమ్మ 274. తుంపూడి సత్యవతీ భగవతమ్మ 275. తుంపూడి సుశీలా భగవతి 276. తూము వెంకట సరసయ్యమ్మ 277. తూనుగుంట్ల వెంకట సుబ్బమ్మ 278. తురగా కృష్ణవేణమ్మ 279. తుర్లపాటి రాజేశ్వరమ్మ 280. యు.సుందరమ్మ 281. ఉన్నవ లక్ష్మీబాయమ్మ 282. ఉన్నవ మహాలక్ష్మమ్మ 283. ఉన్నవ విజయలక్ష్మి 284. ఉప్పల నరసమాంబ 285. ఉప్పులూరి నాగరత్నమ్మ 286. ఉప్పులూరి సుందరమ్మ 287. వి.ప్రభావతి 288. వి.సరస్వతి 289. వాడ్రేవు పద్మనాభమ్మ 290. వాడ్రేవు సుందరమ్మ 291. వలివేటి బాలిత్రిపుర సుందరమ్మ 292. వల్లభనేని రంగాదేవి 293. వల్లూరి వెంకటేశ్వరమ్మ 294. వల్లూరు పార్వతమ్మ 295. వరాహగిరి వెంకట సుబ్బమ్మ 296. వారణాసి అన్నపూర్ణమ్మ 297. వారణాసి కామేశ్వరి 298. వట్టి అమ్మాజి 299. వావికొలను పద్మాసనమ్మ 300. వేదవల్లి తాయారమ్మ 301. వేదుల మీనాక్షీదేవి 302. వీరమతీదేవి 303. వెలగపూడి సరస్వతమ్మ 304. వెలిదండ చూడికుడుతమ్మ 305. వెల్లంకి అన్నపూర్ణాదేవి 306. వెంపలి శాంతాబాయమ్మ 307. వెంపటి శారదాదేవి 308. వేముగంటి పాపాయమ్మ 309. వేములూరి అమ్మిరాజు 310. వేములూరి భ్రమరాంబ 311. వెంకట రమణమ్మ 312. వెన్నా మంగతాయారు 313. విద్వాన్‌ మజుందార్‌ సావిత్రీదేవి 314. వింజమూరి వెంకటరత్నమ్మ 315. వూతట్టూరు అమృతవల్లి తాయారమ్మ 316. ఉన్నవ మహాలక్ష్మమ్మ 317. ఉప్పల సుందరమ్మ 318. యల్లాప్రగడ సీతాకుమారి 319. యామినీ పూర్ణ తిలకమ్మ

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.