పోరాటం చేస్తే పోయేదేముంది… -పి. ప్రశాంతి

చాలా రోజుల తర్వాత స్నేహితురాళ్ళు ముగ్గురూ ఊరిచివర చెరువు గట్టు మీదున్న చింతచెట్టు కింద కలిశారు. అదే ఊర్లో పుట్టి పెరిగి పదో తరగతి వరకు కలిసి చదువుకున్న పూల, సరిత, పర్వీన్‌ ప్రాణ స్నేహితులు. దాదాపు మూడేళ్ళు దాటింది వాళ్ళు కలిసి. ముగ్గురూ మూడు రకాల కారణాలతో ఊరికి దూరమై మూడేళ్ళు గడిచాక ఈ మధ్యనే తిరిగి ఊరికి వచ్చారు. గత నాలుగు నెలలుగా అనేకసార్లు చర్చించుకుని ఒక నిర్ణయానికొచ్చి తమ శక్తేంటో చూపించాలని పట్టుదలతో వచ్చారు.

పూలకి చిన్నప్పటినుంచి చదువంటేనే తిండి, నిద్ర గుర్తొచ్చేవి కాదు. చదువులోనే కాక ఆటల్లోను, వక్తృత్వం, వ్యాసరచన పోటీల్లోనూ ఎప్పుడూ ఫస్టొచ్చే పూల అంటే టీచర్లందరికీ ఎంతో ఇష్టం. చదువుకుంటూనే ఇంటి పనిలో తల్లికి సాయం చేసేది. సెలవు రోజుల్లో తండ్రితోపాటు పొలం పనులు చేసేది. కాయకష్టం చేస్తూ మంచి ఆహారం తీసుకోవడం వల్ల 15 ఏళ్ళ పూల ఎత్తుగా, బలంగా వయసుకి మించి కనబడేది. ఆ ఊరి పటేలు బాల్‌రెడ్డి కొడుకు హేమంత్‌ రెడ్డికి పూలని చూస్తే కోపంగా ఉండేది. దళిత వాడ నుంచి వచ్చిన ఒక ఆడపిల్ల ఆటల్లో తనకంటే ముందుండడం, జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో ఆమె టైమింగ్స్‌ రికార్డు సృష్టించడం హేమంత్‌రెడ్డికి మింగుడుపడని విషయం. చదువులో తానెలాగూ గెలవలేడు కనుక పూలని పదో తరగతి పరీక్షలు రాయకుండా చేసి ఓడించాలని అనుకున్నాడు. ఎవరూ చూడకుండా ఆమె మీద యాసిడ్‌ విసిరి పారిపోవాలని రోజూ యాసిడ్‌ బాటిల్‌ జేబులో పెట్టుకుని తిరిగేవాడు. కానీ స్నేహితు రాళ్ళు ముగ్గురూ కలిసే వెళ్ళి వస్తుండడంతో అవకాశం చిక్కలేదు. చివరి పరీక్ష అయ్యాక పూల ఊరుదాటి వాడవైపు వెళ్తున్న టైంలో కాపుకాసిన హేమంత్‌ సైకిల్‌ మీద స్పీడుగా వచ్చి ఒక చేత్తో యాసిడ్‌ సీసాను జేబులోంచి తీస్తూ సైకిల్‌ రాయిమీద ఎక్కడంతో బ్యాలెన్స్‌ తప్పి సైకిల్‌తో సహా బండమీద పడ్డాడు. బాటిల్‌ వెళ్ళి పూల దగ్గర పడింది. అది తనమీద పడుంటే ఏమయ్యేదోనని ఊహించుకున్న పూల భయపడిపోయి పరుగున ఇంటికి చేరుకుంది. ఎలాగో ఇంటికి చేరుకున్న హేమంత్‌ తనకి తగిలిన దెబ్బకి కారణం పూల అని, తనని ప్రేమించానని చెప్తే కాదన్నందుకు కొట్టించిందని చెప్పడంతో రెడ్డిలకు, దళితులకు మధ్య పెద్ద ఘర్షణే అయ్యింది. కూతురి నిజాయితీ తెలిసినా అవమానం భరించలేక, ఆడపిల్లల తండ్రిగా రేపెలా ఉంటుందో అన్న భయంతో పూల తండ్రి కుటుంబంతో సహా ఊరొదిలి వెళ్ళిపోయాడు. తప్పు చెయ్యబట్టే పారిపోయా రని చెప్పి వాళ్ళ ఎకరంన్నర పొలాన్ని తప్పు కింద లెక్కగట్టి ఆక్రమించుకున్నాడు బాల్‌రెడ్డి.

ఈ సంఘటనప్పుడు సరిత చాలా గొడవ పెట్టింది. హేమంత్‌కి పెదనాన్న కూతురైన సరితకు పూల ప్రాణస్నేహితురాలు కాబట్టి ప్రేమలాంటిదేదైనా ఉంటే తనకి తెలియకుండా ఉండదని అదంతా హేమంత్‌ కల్పించిన కట్టుకథని చెప్పడానికి చాలా ప్రయత్నించింది. మహిళలపై జరుగుతున్న హింస గురించి చెప్తూ ఇప్పుడు మనింట్లోవాళ్ళే హక్కుల అణచివేతకి పాల్పడుతున్నారని గోలచేసింది. తన మాటెవరూ వినిపించుకోకపోగా పెద్దం తరం, చిన్నంతరం లేకుండా మాట్లాడుతున్నా వని తనమీదకే దాడికి దిగారు. అక్కడితో ఆగకుండా ఇలా వదిలేస్తే తమకే ఎసరు పెడ్తుందని అంటూ పెళ్ళి చేసి పంపించెయ్యా లని నిర్ణయించారు. సరితకన్నా పదేళ్ళు పెద్దవాడైన మేనమామకిచ్చి పెళ్ళి చేయడానికి ముహూర్తం పెట్టారు. పెళ్ళికి రెండురోజులు ందనగా ఉత్తరం రాసిపెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది సరిత.

అప్పటివరకు పర్వీన్‌ గురించి పెద్దగా పట్టించుకోని బాల్‌రెడ్డి కుటుంబం సరితకి ఇంకో ప్రాణ స్నేహితురాలు పర్వీన్‌ కనుక సరిత గురించి ఆమెకు తెలిసే ఉంటుందని, చెప్పకపోతే చంపేస్తామని ఇంటిమీద పడి భయపెట్టారు. పర్వీన్‌ తండ్రి టైలర్‌ షాపుతో పాటు బట్టల వ్యాపారం కూడా చేస్తాడు. దానికి గట్టి సహకారం ఇచ్చే బాల్‌రెడ్డి కుటుంబంతో గొడవ తమ జీవనానికే కాదు, జీవితాలకు కూడా ప్రమాదమని అర్థం చేసుకున్న పర్వీన్‌ తండ్రి కూతురితో సహా బాల్‌రెడ్డి ఇంటికెళ్ళి వాళ్ళ కాళ్ళమీద పడ్డాడు. ఆమెని వదిలేస్తే వాళ్ళ అమ్మమ్మగారి ఊరికి పోయి అక్కడే ఉండి చదువుకుంటుందని వేడుకున్నాడు. అమాయకంగా ఉండి, వణుకుతూ నిలబడ్డ పర్వీన్‌ని చూసి ఆమెకి ఏమీ తెలిసుండ దని నమ్మి ఇక పొమ్మన్నారు.

అదిగో అలా మూడేళ్ళ క్రితం విడిపోయిన స్నేహితురాళ్ళు మళ్ళీ ఇప్పుడే కలుసుకున్నారు. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవంలో రైఫిల్‌ షూటింగ్‌లో, మార్చ్‌పాస్ట్‌లో మెడల్‌ సాధించిన పూలని ఇంటర్వ్యూ చెయ్యమని జర్నలిజం కోర్సు చేస్తున్న పర్వీన్‌కి బాధ్యత ఇచ్చారు ఆమె లెక్చరర్లు. పూల గురించి విని ఎగిరి గంతేసి నాలుగ్గంటల ప్రయాణ దూరమైనా మర్నాడే వెళ్ళి పూలని కలిసింది. ఒకర్నొకరు చూసుకుని ఉద్వేగంతో కౌగిలించుకుని ఏడ్చారు. ఎన్నో విషయాలు చెప్పుకుని సరితని వెతికి పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు వారాల్లో కాలేజి సావనీర్‌ ప్రింటయ్యింది. పేరున్న అన్ని కాలేజీలకు పోస్ట్‌లో పంపారు. రాష్ట్రంలో పేరున్న కళాశాలల్లో ఒకటైన ఉమెన్స్‌ కాలేజీ లైబ్రరీ కమిటీ ఇన్‌ఛార్జ్‌ సరిత చేతికి అందింది. పూల వివరాలు చూసి కాలేజికి ఫోన్‌ చేసి పర్వీన్‌ని, తనద్వారా పూలని దొరికిచ్చుకుంది.

ఇంట్లోంచి వచ్చేసిన సరిత సరాసరి దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ ప్రారంభించిన బాలికల వసతి గృహానికి చేరుకుంది. పదో తరగతిలో

ఉన్నప్పుడు వాళ్ళ సోషల్‌ టీచర్‌ ఈ హాస్టల్‌ గురించి పాఠంలో భాగంగా చెప్పింది గుర్తొచ్చి వెతుక్కుంటూ వచ్చింది. అక్కడ వార్డెన్‌తో తనకి బాల్య వివాహం చేయాలని చూస్తున్నా రని, ఇంట్లోనుంచి పారిపోయి వచ్చానని చెప్పింది. బలవంతపు పెళ్ళిళ్ళకు వ్యతిరేకి అయిన ఆ వార్డెన్‌ సరితని సొంత కూతురిలా చూసుకుంటోంది. డిగ్రి చేస్తున్న సరిత అన్ని రకాల హక్కుల పోరాటాలలో చురుగ్గా పాల్గొంటుంది. తను బి.ఎ.లో చేరాక మొట్ట మొదటిసారి ఇంటికి ఫోన్‌ చేసింది. తల్లి ఏడ్చింది. తండ్రి ముందుగా నానామాటలు అన్నా తర్వాత బేలగా ఏడ్చాడు. తమ్ముడే తనని చీదరించాడని, వెలేసినట్లే చేశాడని చెప్పి నువ్వొక్కసారి వచ్చిపోతే సమస్య తీరుతుందని అర్థించాడు.

ఆనాటినుంచి స్నేహితురాళ్ళు ముగ్గురూ అన్ని కోణాల్లో చర్చించుకుని తమమీద పడ్డ మచ్చల్ని పోగొట్టుకోవాలని, తమ శక్తేంటో తెలియచేయాలని, అందుకు ముగ్గురూ ఒకేసారి ఊరికి వెళ్ళి అంతా సర్దుకునేలా చెయ్యాలని నిర్ణయించుకున్నారు. వెళ్ళేముందే తమ ప్రాంతంలోని పోలీసులకి ముందస్తు సమాచారం ఇచ్చారు. పూల తండ్రితో వాళ్ళ పొలం గురించి ఆర్డీఓకి కంప్లెయింట్‌ పెట్టించారు. ఎస్సీ కమిషన్‌కి, మైనారిటీస్‌ వెల్ఫేర్‌ బోర్డుకి పిటిషన్లు ఇచ్చారు.

ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదిరించి నిలబడాలని, పోరాడితే పోయేదేం లేదని, నవీన భావాలతో ఉన్న తాము కుల, వర్గ, సామాజిక నీచ రాజకీయాల్ని ఓడించగలమని గట్టి నమ్మకం తో, ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మహిళా శక్తి దేనికీ తీసిపోదని బావిలో కప్పల్లాంటి తమ ఊరిజనానికి ఎలుగెత్తి చెప్పడానికి సిద్ధమ య్యారు. ఇక విజయం సాధించాల్సిందే కదా! ఈ శక్తిముందు ఇక ఏ శక్తైనా వెనుకడు గెయ్యాల్సిందే కదా!!

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.