సాంఘి’కుల’ జడ్జిమెంట్స్‌ – ఉమా నూతక్కి

స్త్రీల పట్ల ప్రపంచ దృక్పథం చాలా మారింది. ప్రస్తుత సమాజంలో చాలామంది అభిప్రాయం ఇది. నిజమే… చాలా మారింది. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలు విద్యావంతుల వుతున్నారు. మగవాళ్ళతో సమానంగా

ఉద్యోగావకాశాలను అందిపుచ్చు కుంటున్నారు. మగవాళ్ళకే పరిమిత మనుకున్న అన్ని రంగాల లోనూ వాళ్ళతో సమానంగా రాణిస్తున్నారు. ఆర్థిక సమానత్వం వైపు అడుగులేస్తున్నారు.

కానీ అంతిమంగా ఈ ఫలాలన్నీ ఎవరికి చేరుతున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న ఆర్థిక అవసరాలను ఒక్క సంపాదనతో తీర్చడం కష్టమై, తనకు ఆర్థికంగా చేయూత కోసం తన ఇంట్లోనే సంపాదనాపరులైన స్త్రీ ఉంటే అన్ని విధాలా తనకు శ్రేయస్కరం అనుకున్న పురుష భావజాలం నుండి మహిళలకు కొన్ని అవకాశాలు వచ్చాయి.

నిజంగా ఆ అవకాశాలు స్త్రీల జీవితాల్లో ఎటువంటి వెలుగులను నింపగలిగాయని ఆలోచిస్తే అర్థమవుతుంది వాటిలోని డొల్లతనం.

మహిళలుగా మనం చదివే చదువులు నాన్నల ఇష్టం. మన ఉద్యోగమో… నటనో… క్రీడారంగమో… వృత్తి… ఏదైనా సరే మన వృత్తిగతమంతా భర్తల దయాదాక్షిణ్యం.

ఉద్యోగాల్లో మన శ్రమకు విలువేమో అధికారుల క్రింద… మనమీద మనకి యజమానిత్వం
ఉందా? మనకి మనం యజమానులుగా ఉండలేనప్పుడు మనకి స్వేచ్ఛ ఉన్నట్లా లేనట్లా?

మనల్ని శక్తి స్వరూపిణులంటూనే అశక్తులను చేయడం, పూజనీయులంటూనే మానప్రాణాలను హరించడం, మా ఇంటి మహాలక్ష్మి అంటూనే వరకట్నాల కోసం హింసించడం… ఏది మారింది? ఏదీ మారలేదు.

ఒకప్పుడు మనం కట్టూ బొట్టులను ఇంట్లోవాళ్ళ వరకే కంట్రోల్‌ చేసేవాళ్ళు. ఇప్పుడైతే ప్రపంచమంతా కంట్రోల్‌ చేద్దామని చూసేవాళ్ళే. అంతా సోషల్‌ ఇంజనీరింగ్‌.

సింగర్‌ సునీత రెండో పెళ్ళి చేసుకుందా…

వెంటనే రెడీ… ‘మా పర్మిషన్‌ లేకుండా అలా ఎలా చేసుకుంటుంది…? ఈ వయసులో రెండో పెళ్ళా? హవ్వ…లోకాన్ని భ్రష్టుపట్టించడం కాదా ఇది! సభ్యసమాజంలో బ్రతుకుతూ అందులోని సభ్యులందరినీ లెక్కచేయకపోవడం కదూ ఇది’ అంటూ. ఎవరండీ వీళ్ళు…? ఒక మనిషి యొక్క వ్యక్తిగత జీవితంలోకి పీపింగ్‌ టామ్స్‌లా తొంగి చూస్తూ ఆ మనిషి వ్యక్తిత్వం మీద ఇష్టం వచ్చిన తీర్పులు ఇవ్వడానికి?

గుత్తా జ్వాల ఫోటో ఏదైనా పోస్ట్‌ చేసిందా… పరిగెత్తుకుని వచ్చేస్తారు… ”ఫోటోల మీద ఉన్న శ్రద్ధ ఆట మీద పెట్టు తల్లీ” అంటూ. ఆట మీద శ్రద్ధ లేకుండానే ఆమె ఆ స్థాయికి వెళ్ళిందా అన్న సంగతి మాత్రం చాలా బాధ్యతగా విస్మరిస్తారు.

మిథాలీ ఆర్మ్‌ పిట్స్‌లో చెమట పట్టినా హేళన చేస్తారు. ప్రియాంకా చోప్రా ప్రధాని ముందు ఎలాంటి డ్రెస్‌లు వేసుకోవాలో, ఎలా కూర్చోవాలో వీళ్ళే చెబుతారు.

దేవత అంటూ బానిసగా చేసుకున్న వారి వారసత్వాలలో ఇలాంటి కామెంట్లని కాక మనం మంచిని ఎలా పొందగలం? ఫలానా మతంలో మన బ్రతుకులు బాగుంటాయి అనుకునేలా ఏ మత గ్రంథమూ మన బ్రతుకులకి భరోసా ఇవ్వలేదు. అన్ని మతాల సారమూ ఒక్కటే… అదే పురుష దాస్యం. మన విధులన్నీ పురుషుల కొరకే, వారి బాధ్యతలూ మన వంతే అన్నట్లు గానే చెబుతాయి అన్ని మతాలు.

ఈ మధ్య ‘టూల్‌ కిట్‌’ కేసులో అరెస్టయిన ‘దిశ రవి’ నిజంగా నేరస్థురాలా కాదా అన్నది న్యాయస్థానాల పరిధిలోని విషయం. కానీ మన ట్రోల్‌ వీరులు ఆమెకి వ్యతిరేకంగా పుంఖాను పుంఖాలుగా తీర్పులు ఇచ్చేస్తూ ఉంటారు. వీళ్ళంతా అన్‌లైన్‌ న్యాయమూర్తులు కదా మరి. వీళ్ళలో చాలా మందికి అసలు ఆమె ఎవరో తెలియదు… ఆమె చేసిన నేరమేంటో తెలియదు. అసలు టూల్‌ కిట్‌ అంటే ఏంటో కూడా తెలియదు. కానీ ఇన్‌స్టెంట్‌ జడ్జిమెంట్‌ అయితే ఇచ్చేస్తారు. ఈమె గురించే కాదు సోషల్‌ పోలీసింగ్‌ బారిన పడ్డ ప్రతివాళ్ళ గురించీ ఇలానే జడ్జిమెంట్స్‌ ఇస్తూ ఉంటారు.

”ప్రకృతి విరుద్ధంగా… అసహజంగా… దేశాలకూ, సమాజాలకూ వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళ ముఖాల్లో ప్రశాంతత ఎందుకుండదు? ఎప్పుడూ తీవ్ర ఆందోళనతో, చూడగానే సదాభిప్రాయం కలుగని ముఖ కవళికలతో

ఉంటారెందుకు?? మాన్యు ఫాక్చరింగ్‌ డిఫెక్టా లేక జన్యులోపమా?” అంటూ ఓ ప్రబుద్ధుడెవరో పెట్టిన ఒక పోస్ట్‌ని ఈ మధ్య ఫేస్‌బుక్‌లో ఒక వాల్‌ మీద చదివాను. పైగా ఆ పోస్ట్‌కి పెట్టిన ఫోటోలన్నీ సమాజంలో తమ గొంతుకను బలంగా వినిపించే మహిళలవే.

ఈ పోస్ట్‌ పెట్టినవాడు ఎవడో మానసిక రోగిలే అనుకున్నాను. కానీ పోస్ట్‌ కింద ‘గుడ్‌ అబ్జర్వేషన్‌ సర్‌’ అన్న కామెంట్‌ ఒకటి చదివాక ఒక్కసారిగా నిస్సత్తువ. ఆ తరువాత అది పెట్టిన మనిషి మీద చాలా చాలా అసహ్యం వేసింది. ఎందుకంటారా?

తెలుగులో క్షుద్ర సాహిత్యాన్ని పాపులర్‌ చేసి ఆ తరువాత వ్యక్తిత్వ వికాసం మీద పుస్తకాలు రాసి, తరగతులు నిర్వహిస్తూ బాగా ఇంటలెక్చువల్‌గా పేరుబడిన ఓ ప్రముఖ రచయిత గారి కామెంట్‌ అది.

ఇలాంటివాళ్ళని కదా మాన్యుఫాక్చరింగ్‌ డిఫెక్ట్‌తో ఉన్నారనో, జన్యులోపంతో పుట్టారనో అనాల్సింది. వ్యక్తిత్వ వికాసం జరగాల్సింది ఎవరికి?? ఇలాంటివాళ్ళకు కాదూ?

ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇతననే కాదు, సమాజంలో కింద వాళ్ళ నుండి పై వాళ్ళ వరకూ నూటికి తొంభై మందికి పైగా ఒక్కసారైనా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మహిళలను కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నవారే. ఇంట్లోనో, వీథిలోనో మాత్రమే కాదు… సోషల్‌ పోలీసింగ్‌. క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేసే వేగం దీని సొంతం.

కేవలం సెలబ్రిటీస్‌ని మాత్రమే కాదు, సోషల్‌ మీడియాలో కానీ, వర్క్‌ ప్లేసెస్‌లో కానీ, కాలేజీల్లో కానీ కాస్త యాక్టివ్‌గా ఉన్న ఏ స్త్రీనీ వదలరు… భరించలేనితనం.

జన్మలో నువ్వూ, నేనూ చూడని వాళ్ళచేత, మన వ్యక్తిత్వాల గురించి ఆవగింజంత కూడా అవగాహన లేని వారిచేత మన వ్యక్తిత్వాలు ఫేస్‌బుక్‌ గోడల మీదనో, వాట్సాప్‌ గ్రూప్‌ల లోనో ఛిద్రం చేయబడుతూ ఉంటాయి. అదిగో అక్కడ నిన్ను డిఫెండ్‌ చేయడానికి నేను రాను… నన్ను డిఫెండ్‌ చేయడానికి నువ్వూ రావు. ఎందుకంటే… ఇదిగో ఈ సోషల్‌ పోలీసుల భయం. సపోర్ట్‌గా వస్తే నన్నేమంటారో అని నాకూ, నిన్నేమంటారో అని నీకూ భయం.

ఈ భయాలని వదిలించుకోవడమే మన ప్రధాన కర్తవ్యమై మనల్ని మన నిజమైన గోల్స్‌ మీద ఫోకస్‌ పెట్టకుండా చేస్తూ ఉంటుంది.

అందుకే ఓ అమ్మాయీ… ఇలాంటి బార్కింగ్‌ డాగ్స్‌ గురించి పట్టించుకోకుండా వాటి ఆదిమత్వాన్ని తలచుకుని నవ్వుకుంటూ నీ పనిలో నువ్వు ముందుకు సాగిపో.

Share
This entry was posted in మంకెన పువ్వు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.