స్నేహం
స్నేహం ఒక మనిషి జీవితంలో ప్రత్యేకత విషయం
ఏదైనా, ఏమైనా స్నేహితుడితోనే పంచుకుంటాం
స్నేహంలో నిజాయితీ ఉంటుంది
స్నేహంలో సహాయత గుణం ఉంటుంది
స్నేహం అనే గుణం మనుషులకు మాత్రమే కాదు
చాలా రకాలైన జంతువులు కూడా స్నేహం చేస్తాయి
స్నేహంలో కులమతాలు, గొప్పవాళ్ళు,
పేదవాళ్ళు అనే బేధాలు ఉండవు
స్నేహం యొక్క గొప్పతనం చాలా గొప్పగా ఉంటుంది.
` కె.అఖిల, 9వ తరగతి
ఒకరికొకరు తోడుగా నిలిచేది స్నేహం,
ఆనందాల హరివిల్లును కురిపించేది స్నేహం,
మరువలేని ప్రేమను పంచేది స్నేహం,
కొత్త కొత్త విషయాలను నేర్చుకునేది స్నేహం,
సంతోషంగా కలిసిమెలిసి విహరించేది స్నేహం,
గౌరవాన్ని అందించేది స్నేహం,
ఆపదలో ధైర్యం చెప్పేది స్నేహం,
ఎన్నో కథలను అల్లేది స్నేహం,
బడిలో సహాయం చేసేది స్నేహం,
బాధలను మర్చిపోయేలా చేసేది స్నేహం,
విరోధం అనే పదం లేనిది స్నేహం,
కుటుంబ బంధమే ఒక అందమైన స్నేహబంధం!
‘‘స్నేహానికున్న మిన్న దేశాన లేదురా!’’
` డి.ఉషశ్రీ, 9వ తరగతి
మరువరాని జ్ఞాపకం స్నేహం,
తియ్యనైన పలుకులు స్నేహం,
పంచుకునే ఒక గుణం స్నేహం,
మంచి పనులు చేసే స్నేహం,
సుఖాలను పంచుకునే స్నేహం,
దుఃఖాలను ఎదిరించే స్నేహం,
కులమత భేదాలు లేని స్నేహం,
ఏదైనా సాధించగలిగే పట్టుదల స్నేహం,
రహస్యాలను దాచే స్నేహం,
ఇది నాకు తెలిసిన స్నేహం,
మరి మీకు…?
` జి.గౌమిక, 9వ తరగతి
స్నేహం వర్ణించ కుదరదు,
స్నేహాన్ని ప్రతిక్షణం ఆస్వాదించాలి,
మిత్రుడు స్నేహాన్ని పంచుతాడు,
నమ్మకం స్నేహాన్ని బలపరుస్తుంది.
అమ్మ నా ప్రతి అనుభూతిని అర్థం చేసుకుని,
నా జీవితానికి సరిపడే విలువైన పాఠాలు నేర్పిస్తుంది.
జీవితంలో ప్రతి మనిషి స్నేహాన్ని ప్రతిబింబిస్తారు,
చిన్ననాటి స్నేహం ప్రకృతివలె స్వచ్ఛమైనది.
చెలిమిలో కోరికలకు స్థానం లేదు,
నేస్తం మన జీవితానికి నిజమైన అర్థం.
స్నేహం వల్ల జీవితం అందమైన బృందావనం.
` డి.నీలిమ కృష్ణ, 9వ తరగతి