ముందడుగు – డా. బండారి సుజాత

చీకటి పరదాలను తొలగించుకుంటూ…
ప్రకృతిలా మునుముందుకెళ్తూ
విద్యా, వివేకాలతో విచక్షణ జ్ఞానంతో

తమ్ము తాము నిరూపించుకుంటూ
మగువ ముందుకెళ్తోంది వెల్లువైన చైతన్యంతో

పితృస్వామ్య నీడలనే ఛేదిస్తూ అబల కాదు సబలనని అవవోకగా శ్రమ చేస్తూ,
కలిమి, లేముల వ్యథను
సహనంతో భరిస్తూ, కాలాన్ని
ఎదిరిస్తూ కాంతి పుంజమై
సాగుతోంది నలుదెసల
ఆధిపత్య వర్గాల ఆగడాలను భరిస్తూ
భూదేవిగా, శాంతికి వారధిగా ఆడపిల్లల బతుకు దిద్దిన మొదటి గురువు సావిత్రమ్మ వారసులుగా
సదా ముందుకెళ్తోంది సవ్యసాచిలా

కష్టనష్టాలను కంటి కొసలతో శాసిస్తూ
సకల విద్యలతో, సామరస్య పాలనతో
ధైర్యమే ధ్యేయంగా, ఆత్మవిశ్వాసంతో సాగుతోంది
అరుదైన గెలుపులతో

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.