ఒడిశాలోని బోండా తెగ, వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి వలస వచ్చిన మొదటి తరంలోని వారుగా కొందరు మానవ శాస్త్రవేత్తలు నమ్ముతారు. వారు భారతదేశంలో మొదటి అటవీ స్థిరనివాసులు అని, వారు ఆస్ట్రోయాసియాటిక్ తెగల సమూహంలోని వారని,
వారు పురాతన కాలంలో వలస వచ్చి జైపూర్ అడవి కొండలలో సుమారు 130 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో స్థిరపడ్డారు అని చెప్తారు. ప్రపంచంలోని పురాతన తెగలలో ఒక తెగగా చెప్పే ఈ బోండా తెగ వారు చాలా అరుదుగా మాత్రమే కనిపించేవారు. అడవి వీరి అవసరాలను తీర్చలేకపోవటం చేత జీవనోపాధి కోసం సమీప పట్టణాలలో కనిపిస్తున్నారు, ముఖ్యంగా మల్సన్‌గిరి జిల్లా ఓనకడేల్లిలోను మరియు కైరోపుట్‌లలో జరిగే సంతలకి వీళ్లు వస్తుంటారు.
ఇతర వర్గాలతో పోలిస్తే బోండాతెగలో జనాభా పెరుగుదల రేటు చాలా నెమ్మదిగా ఉందని చెప్తారు. సెన్సస్ 2011 ప్రకారం కేవలం 12,000 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. ఒడిశాలో ఉన్న 13 ఇతర అదివాసీ సముహాలలాగానే వీరు తొందరగా బయటవారిని నమ్మరు. దాడిచేయడానికైనా సిద్ధంగా ఉంటారు. బోండా తెగ ఎన్నో సంవత్సరాలుగా వారి గుర్తింపు మరియు సంస్కృతిని నిలుపుకుంటున్నారు.
విలక్షణమైన సంస్కృతి: వీరు ముండారి సమూహానికి చెందిన Aబర్‌తీశీaంఱa్‌ఱష భాష అయిన రేమో భాష మాట్లాడతారు. వీరు ప్రత్యేకమైన వస్త్రధారణను కలిగి ఉంటారు. చెవులకు, ముక్కుకు అభరణాలు, మెడలో గుండ్రని పెద్ద కడియాలు ధరిస్తారు శరీరం అంతా రంగు రంగుల పూసలతో కప్పుకొని ఆకర్షణీయంగా వుంటారు. పురుషులు ప్రాణాంతకమైన విల్లు మరియు బాణాలను కలిగి ఉంటారు.
మాతృస్వామ్య సమాజం: మహిళలు కనీసం 5-10 సంవత్సరాల వయస్సులో చిన్న వాళ్ళైన పురుషులను వివాహం చేసుకోవటానికి ఇష్టపడతారు, భవిష్యత్తు లో తమకంటే చిన్న వాళ్ళైన పురుషులు రక్షణగా ఉంటారని వీరి అభిప్రాయం. వీళ్ళు మైదాన ప్రాంత మనుషులను విశ్వసించరు. మైదాన ప్రాంతాల్లో పని చేయటానికీ ఇష్టపడరు. ప్రస్తుతం అడవి వీరి అవసరాలను తీర్చలేక పోవటంచేత వీరు సేకరించిన వాటిని సంతలో అమ్మి తమ అవసరాలను తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరి ఆహారంలో పంది, గొడ్డు మాంసాలను తీసుకుంటారు. కాబట్టి వీటిని పెంచుతారు. పిల్లల్లో పొష్టికాహారలోపం కనిపిస్తుంటుంది.