ముస్లిం స్త్రీల తొలి తెలుగు కథా సంకలనం మొహర్‌ -బొమ్మదేవర నాగకుమారి

ముస్లిమ్‌ స్త్రీలతో మొదటి మొహర్‌ :
నేను కోఠి ఉమెన్స్‌ కాలేజీలో డిగ్రీ చదువుకునే రోజుల్లో, మా కాలేజీ గేటు దగ్గర ముస్లిం అమ్మాయిలకోసం కేటాయించబడిన ఒక ప్రత్యేకమైన గది ఉండేది. ఉదయాన్నే కాలేజీలోకి ప్రవేశిస్తూనే ముస్లిం యువతులు ఆ గదిలోకి వెళ్ళి అప్పటిదాకా తాము ధరించిన బురఖాలను తీసేసి వచ్చేవాళ్ళు!

మళ్ళీ సాయంత్రం కాలేజి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ బురఖాలను వేసుకుని వెళ్ళేవాళ్ళు.
మా అందరికీ చాలా వింతగా, ఆశ్చర్యంగా, కుతూహలంగా ఉండేది. ఆ పరదాలో ఊపిరి ఎలా ఆడుతుంది? ఎండాకాలంలో ఎంత కష్టం? అమ్మాయిలు అసలు పరదా ఎందుకు వేసుకోవాలి?
ఎందుకెందుకు?? ఎన్నెన్నో ప్రశ్నలు!!
వారిని ప్రశ్నిస్తే నిశ్శబ్దంగా నవ్వి ఊరుకునేవాళ్ళు. పెద్దగా మాట్లాడేవాళ్ళు కాదు. ఒక నీడలా కదిలి వెళ్ళిపోయే వాళ్ళు. నీడల ముఖ కవళికలు, భావావేశాలు, ఆలోచనలు, ఆకాంక్షలు, ఆశలు, ఆశయాలు మనకు తెలియవు కదా!
మనకు తెలియని సమాజాన్ని సాహిత్యం పరిచయం చేస్తుంది. కానీ ఇన్నాళ్ళుగా తెలుగు, ఇంగ్లీష్‌ సాహిత్యాల్లో ఎక్కడా అలాంటి సమాజం కన్పించలేదనే చెప్పాలి.
ఆ మధ్య కాలంలో నిషేధించబడిన బంగ్లాదేశ్‌ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ సృజన ‘లజ్జ’ ఓ సంచలనం.
రకరకాల సందర్భాల్లో గ్లామరస్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాపై మత ఫత్వాలు విభ్రమానికి లోను చేసేవి. ఇంతే తప్ప ముస్లిం స్త్రీల గురించి మరింకేం తెలీదు. ఇన్నాళ్ళూ ముస్లిం వాద సాహిత్యంలో కూడా ముస్లిం స్త్రీల కోణాన్ని స్పష్టంగా దర్శించలేకపోయామని నిర్మొహమాటంగా చెప్పాలి.
అవమానాల మధ్య, అభద్రతల మధ్య, అసమానతల మధ్య, అణచివేతల మధ్య అతలాకుతలమవుతున్న ముస్లిం స్త్రీల అస్తిత్వ వేదనను ఈ కథా సంకలనం రికార్డు చేయడానికి నిజాయితీగా ప్రయత్నించింది.
ముస్లిం సాహిత్యంలో కవయిత్రిగా, రచయిత్రిగా, పరిశోధకురాలిగా, సంపాదకురాలిగా మనందరికీ పరిచితురాలైన డాక్టర్‌ షాజహానా ఈ కథా సంకలనానికి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. చారిత్రాత్మకమైన ఈ ప్రయత్నానికి షాజహానా అభినందనీయురాలు.
భిన్న పార్శ్వాలున్న ఈ కథా సంకలనాన్ని నేను ఇష్టంగా, ఉత్సాహంగా చదివాను. ఈ సంకలనంలో సీనియర్‌ రచయిత్రి శ్రీమతి షెహనాజ్‌ బేగమ్‌ దగ్గర్నుంచి నిన్నా మొన్నా రాయడం మొదలుపెట్టిన రచయిత్రుల దాకా ఇరవై ముగ్గురి రచయిత్రుల ఇరవై ఆరు కథలున్నాయి. ఇందులో చాలామంది రచయిత్రులకు ఇవి మొదటి కథలు. తమకు తెల్సిన, తాము అనుభవించిన జీవితాల్ని అక్షరబద్ధం చేయాలన్న తపన ఈ రచనల్లో కన్పించింది. ముందుగా ఆ తపనకు సలామ్‌లు!!
ఈ సంకలనంలో ప్రత్యేకమైన మొహర్‌…
మెట్రో జీవితాల్లో, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల జీవితాలకు సంబంధించిన కథలను రాసేటప్పుడు పాత్రల సంభాషణల్లో ఇంగ్లీష్‌ పదాలు ఎక్కువగా వాడటం మనం చూస్తుంటాం. దాదాపుగా ఈ సంకలనంలోని కథలన్నింటిలో సంభాషణలు హిందీలో ఉన్నాయి. సగటు ముస్లిం స్త్రీల జీవితాన్ని ప్రతిబింబించిన కొన్ని కథలను మీకు పరిచయం చేస్తున్నాను.
రుబీనా పర్వీన్‌ ‘ఖులా’ కథ ఆవిష్కరణ వేదిక మీద సంకలనంలోని ఉత్తమ కథగా పెద్దలందరూ కొనియాడారు. మనందరికీ ‘తలాక్‌’ అన్న పదం పరిచయమే. ‘తలాక్‌’ అంటే ముస్లిం భర్త తన భార్యకు ఇచ్చే విడాకులు. ‘ఖులా’ అంటే తన భర్త నుంచి ముస్లిం స్త్రీ కోరే విడాకులు. ఈ సరికొత్త పదాన్ని, స్త్రీల హక్కుని పరిచయం చేసిన రుబీనాకి అభినందనలు.
తెలంగాణ మాండలికంలోని భాషా సౌందర్యాన్ని దర్శించాలన్నా, స్త్రీ తిరుగుబాటుని అర్థం చేసుకోవాలన్నా ఈ కథ చదివి తీరాల్సిందే!
ఫేస్‌ బుక్‌ సెలబ్రిటీ శ్రీమతి సయ్యద్‌ నజ్మా షమ్మీ కథ ‘ఆపా’. స్వయంకృషితో, ఆత్మగౌరవంతో తన జీవనాన్ని నడుపుకునే ఆపా, తమ పెరట్లోని మొక్కల్ని ఖాదర్‌ పెంపుడు మేక రోజూ వచ్చి తింటుంటే పెద్ద నోరుతో అతడ్ని తిడుతూ ఉంటుంది. చేసిన అప్పు తీర్చలేక అతడా మేకని అమ్మేస్తే ఆపా ఏం చేసింది? ఫీల్‌ గుడ్‌ స్టోరీ.
చెయ్యి తిరిగిన రచయిత్రి షాజహానా రచించిన మూడు కథల్లో మొదటి కథ ‘సిల్‌ సిలా’లో ముస్లింలలో ఉప సమూహమైన దూదేకుల వారి పేదరికాన్ని అక్షరాలా అక్షరీకరించింది. వారు సమాజంలో ఎదుర్కొనే అవమానాలను మన ముందుంచింది. నడి వయస్సు స్త్రీ అన్ని రకాల వ్యవసాయపు పనులు చేస్తూ, అష్టకష్టాలు పడుతూ కుటుంబాన్ని పోషిస్తూ, తాగుబోతు భర్తతో చావు దెబ్బలు కూడా తింటుంటుంది. ఆ భర్త గురించి బడెమ్మ తన చెల్లెలి కూతురితో ఇలా అంటుంది. ‘‘మీ బడే బాపు సుత మంచిగనే ఉంటడు గని గా సార తాగినపుడు సిందులేస్తడు’’. స్త్రీలు ఇలా ఆలోచించలేకపోతే ఎన్ని సంసారాలు నిలబడ్తాయ్‌?
నస్రీన్‌ఖాన్‌ కథ ‘లాపత్త’లో పదో తరగతి చదువుతున్న రాహీల్‌ని పోలీసులు ఢల్లీి గొడవల సందర్భంగా అరెస్ట్‌ చేస్తారు. మరో వ్యాపకమేదీ లేకుండా బిడ్డ పెంపకమే జీవిత పరమార్ధంగా బ్రతికే రఫీఖా ఆ వార్తతో అల్లాడిపోతుంది. తన కొడుకుని విడుదల చేసినా ఆమె ప్రశాంతంగా నిద్రపోదు. (ప్రాణమొక ఎత్తుగా అపురూపంగా పెంచుకున్న కొడుకు అకారణంగా కనబడకపోతే ఆ తల్లిదండ్రులకు ఎంత క్షోభ? ఎంత నరకయాతన? తరచుగా ముస్లింలు ఎదుర్కొనే వేదనని ప్రతిబింబిస్తుంది). తన కొడుకుతో పాటుగా అరెస్ట్‌ చేసిన వారందరినీ విడిపించేదాకా ఆమె చేసిన పోరాటాన్ని చూసి, ఆమె భర్తతో పాటు పాఠకులు కూడా ఆశ్చర్యపోతారు.
‘పోనీలే’ కథలో రచయిత్రి డాక్టర్‌ జరీనా బేగమ్‌ బాగా చదువుకుని, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తూ కూడా తమ ఏటీఎం కార్డులను భర్తలకిచ్చేసి, ఏ మాత్రం ఆర్థిక స్వాతంత్య్రం లేకపోయినా పోనీలే అని స్త్రీలు ఎలా సరిపెట్టుకుంటారో చెబుతుంది.
సలీమా షేక్‌ ‘అమ్మ దిద్దిన బిడ్డ కథ’లో సానుకూల ఆలోచనా ధోరణితో సమస్యమై పోరాట పటిమను పెంచుతుంది.
షెహనాజ్‌ ‘స్వయంకృతం’ కథ చదివిన తర్వాత ఇస్లామ్‌ మతంలోని ఒక గొప్ప ఆచారాన్ని తెలుసుకుని ఆనందించాను. ‘తలాక్‌’ ద్వారా భార్యకి విడాకులిచ్చేశాక, ఆ పురుషునికి బుద్ధి వచ్చి మళ్ళీ ఆ స్త్రీనే వివాహమాడాలని అనుకుంటే ఏ ఆచారాన్ని పాటించాలో ఈ కథ చదివి తెలుసుకోవాల్సిందే.
ఈ తరానికి చెందిన కరిష్మా మహమ్మద్‌ తన కథ ‘ఇట్స్‌ మై లైఫ్‌’లో ఎలాగైనా చదువుకోవాలన్న ముస్లిం అమ్మాయి ఇంటా బయటా ఎదుర్కొనే వివక్షను మనస్సాక్షిగా ఏకరువు పెట్టింది.
తస్లీమా మహమ్మద్‌ రచించిన ‘మన్నెం బిడ్డ’ నిజంగా భిన్నమైన కథ. ముస్లిం స్త్రీలు రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షని వెలిబుచ్చిన కథ.
ఈ ముస్లిం రచయిత్రులందరికీ ఒక్కొక్కరికీ పేరు పేరునా ప్రియామారా, ప్రేమారా ‘అలాయ్‌ బలాయ్‌’

Share
This entry was posted in పుస్తక పరిచయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.