వీరయ్య చెప్పిన మరో విషాద గాథ -ఆర్‌.ఎస్‌.వెంకటేశ్వరన్‌

ఆఫ్రికా సాంప్రదాయం ప్రకారం బిడ్డ పుట్టగానే మొదటి సారిగా బిడ్డ చెవిలో మాత్రమే తన పేరు మెల్లగా చెప్పాలి ఆ తర్వాతే సమాజానికి తెలియజేయాలి. తనెవరో తనకే ముందు తెలియాలన్న పురాతన ఆఫ్రికా సాంప్రదాయాన్ని వారు ఇప్పటికీ పాటిస్తూ వస్తున్నారు.

అమెరికాలో ఉంటూ ఏడవ తరానికి చెందిన అలెక్స్‌ హేలీకి తన ముందు తరాల వారెవరో, ఎక్కడ నుంచి వచ్చారో తెలుసుకోవాలన్న జిజ్ఞాస.
ఁRూూుూఁ అన్న ప్రపంచ ప్రసిద్ధ పుస్తకం రాయడానికి ప్రేరణ అయ్యింది. ప్రపంచ సాహిత్యంలో ఆ పుస్తకం గురించి తెలియని వారుండరు. తెలుగులో ‘‘ఏడు తరాలు’’ అన్న పేరుతో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు సంక్షిప్త అనువాదం కూడా ప్రచురించారు. ఆ కోవలోకి చెందిన పుస్తకమే ఈ ‘‘వీరయ్య’’ నవల.
ఈ రచయిత గుబిలి కృష్ణగారి ముత్తాత వీరయ్య గారు బ్రిటిష్‌ సామ్రాజ్యపు చెరుకు ఫారాలలో పని చేయడానికి బానిసల స్థానంలో వివిధ దేశాలకు పంపబడిన 13 లక్షల భారతీయుల్లో ఒకరు. వీరయ్య గారి గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస కృష్ణగారి చేత ఈ పుస్తకం ఆంగ్లంలో రాయిస్తే దాన్ని కృష్ణ గారి తండ్రి గుబిలి గురుమూర్తి గారు తెలుగులోకి అనువదించారు. సాహితీ ప్రపంచంలో అరుదైన సంఘటన ఇది.
2.10.2020 హిందుస్తాన్‌ టైమ్స్‌ పేపర్‌లో వచ్చిన వార్త ప్రకారం బ్రిటిష్‌ పార్లమెంట్‌ అనుబంధ మ్యూజియంలో 9500 కళా సంగ్రహాలను సమీక్షిస్తూ అందులో 232 కళా సంగ్రహాలు బ్రిటిష్‌ సామ్రాజ్యం 17, 18 ఇంకా 19వ శతాబ్దాలలో జరిపిన ఖండాంతర బానిస వ్యాపారంతో సంబంధం ఉన్నవే అని స్పీకర్‌ పేర్కొనడం జరిగింది. అంతేకాదు స్పీకర్‌ తన మాటలలోనే ఇలా అన్నారు ఁ…నశీషవఙవతీ, ఎaఅవ దీతీఱ్‌ఱంష్ట్ర జూవశీజూశ్రీవ షశీఅ్‌ఱఅబవస ్‌శీ ష్ట్రaఙవ సఱతీవష్‌ టఱఅaఅషఱaశ్రీ స్త్రaఱఅ టతీశీఎ ్‌ష్ట్రవ ్‌తీaసఱఅస్త్ర aఅస బంవ శీట వఅంశ్రీaఙవస శ్రీaపశీబతీ aఅస ఱఅసవఅ్‌బతీవస శ్రీaపశీబతీ ఱఅ ్‌ష్ట్రవ ఔవర్‌ Iఅసఱవం, Aఎవతీఱషa, Iఅసఱa aఅస వశ్రీంవషష్ట్రవతీవ.ఁ ఇద్దరు బ్రిటిష్‌ ప్రధాన మంత్రులు పీల్‌, గ్లేడ్సస్టోన్‌ కాక 1742 నుంచి 1811 మధ్య కాలంలో ఎందరో రాజకీయ నాయకులు బానిస కూలీల వ్యాపారం వల్ల లాభం పొందారని పేర్కొన్నారు.
యాంత్రిక విప్లవం తరువాత బ్రిటన్‌ దేశంలో చేనేత పరిశ్రమ విపరీతంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో వారికి ‘‘నీలిమందు’’ ఎంతో అవసరమయింది. తమ ఆధీనంలో ఉన్న భారతదేశంలో బీహార్‌ ప్రాంతం నీలి మందు పంటకు ఎంతో అనుకూలమని రైతులు తమ పొలాల్లో కొంత భాగం ఆ పంటనే పండిరచి తమకే ఆ పంటను తాము నిర్ణయించిన ధరకే అమ్మాలని ఒత్తిడి చేయడంతో గాంధీ నాయకత్వంలో జరిగిన ‘‘నీలిమందు పోరాటం’’ మనకు కొంతైనా తెలుసు. కానీ అదే సమయంలో బ్రిటిష్‌ సామ్రాజ్యం ఆధీనంలో ఉన్న దేశాలలో విపరీతంగా లాభాలు తెచ్చిపెట్టే చెరుకు ఫారాలలో రోజుకు 14`15 గంటలకు పైగా బానిసల్లా పనిచేయించుకోవడానికి భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 13 లక్షల మందికి పైగా కాంట్రాక్ట్‌ పద్ధతిలో రప్పించుకోవడం జరిగింది. అక్కడ వారు పడిన బాధలు మనం తెలుసుకోవాల్సిన ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. చెరుకు తోటల్లో పనిచేయడానికి సరే అంటే ఐదు రూపాయల జీతమే కాక (ఆ రోజుల్లో ఆ జీతం ఎక్కువే) ఉచితంగా ఇతర వసతులు కూడా కల్పిస్తామని ఆశలు కల్పించి వారితో ఐదేళ్ళకు కాంట్రాక్ట్‌ రాయించుకుని తీసుకువెళ్ళేవారు. 1917లో ఇండెంచెర్‌ వ్యవస్థ అంతమయ్యే వరకూ ఆ ఉచ్చులో చిక్కుకున్న 13 లక్షల మందిలో వీరయ్య గారు ఒకరు. ఒక్క సౌతాఫ్రికా దేశానికే భారత దేశంనుంచి వీరయ్యగారితో పాటు 1,52,184 మంది ఇండెంచర్‌ కూలీలుగా వెళ్ళారు.
చిన్నప్పుడు కృష్ణ గారికి నాయనమ్మ నాంచారమ్మ గారు చెప్పిన అనేక కథలలో ఒకసారి కృష్ణగారి ముత్తాత వీరయ్య సౌతాఫ్రికా జీవిత విశేషాలు చెప్పడంతో ఆయన గురించి మరింత తెలుసుకోవాలన్న కోరిక కృష్ణగారితో వయసుతో పాటు పెరుగుతూనే వచ్చింది. కృష్ణ గారికి బాల్యంలో ఒకసారి వేసవి సెలవుల్లో అటకపై సామానులన్నీ దించి శుభ్రం చేస్తూ ఉండగా సౌతాఫ్రికా స్టాంపులు అతికించి ఉన్న ఒక ఉత్తరం దొరికింది. దాన్ని మర్చిపోలేక ఆ చిరునామాకే ఎన్నో సంవత్సరాలుగా
ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు. చివరకు 1995 మార్చి నెలలో సౌతాఫ్రికా నుంచి ఒక ఉత్తరం వచ్చింది. అది తాతగారి అక్క చెంగమ్మగారి మనవడు, కృష్ణగారికి వరసకు అన్నయ్య అయిన ‘‘డేనియల్‌ నాయుడు’’ రాసినది. వర్ణవివక్షత సౌతాఫ్రికాలో అంతమై 1994 ఏప్రిల్‌ 26న నల్ల వీరుడు నెల్సన్‌ మండేలా విడుదలై స్వతంత్ర ఎన్నికలు జరిగాక వీస్తున్న స్వేచ్ఛాగాలి పీలుస్తున్నాననీ, ఇంతవరకూ రాసిన ఉత్తరాలన్నీ చేరాయనీ ‘‘అపార్ధియడ్‌’’ వల్లనే ఇన్నాళ్ళూ జవాబు రాయలేకపోయానని ఆ ఉత్తరం సారాంశం. ఆనీ ఆ సంతోషం ఎంతోకాలం నిలువలేదు. అక్కడి నుంచి ఉత్తరాలు రావడం మళ్ళీ ఆగిపోయాయి. కృష్ణగారు పెళ్ళి చేసుకుని నాయనమ్మ ప్రోద్భలంతో 1998లో అమెరికా వెళ్ళిన తర్వాత మళ్ళీ వీరయ్య గారి గురించి ఇంటర్నెట్‌ సహాయంతో వెతుకులాట ప్రయత్నాలు కొనసాగించినా ప్రయోజనం లేకపోయింది. దాంతో చాలా కాలం పాటు ఆయన ఆ ప్రయత్నాలను వదిలేశారు. కానీ మండేలా ఆత్మకథ ‘‘ూశీఅస్త్ర Rశీaస ్‌శీ ఖీతీవవసశీఎ’’ ను చదివాక కృష్ణ గారు మళ్ళీ వెదుకులాట కొనసాగించారు.
2005లో ఇంటర్నెట్‌ ద్వారా భారతదేశం నుంచి సౌతాఫ్రికాకు వెళ్ళిన 1,52,184 ఇండెంచర్‌ కూలీల జాబితాలో వీరయ్య గారి పేరు వెతికినా ఫలితం లేకపోయింది. రచయిత తన సమస్యను గ్రీకు పురాణాల్లో ‘‘సిసిఫస్‌’’తో సరిపోల్చుకుంటారు. ఆ తర్వాత 2010లో సౌతాఫ్రికా ప్రభుత్వం ప్రచురించిన డాటాబేస్‌లో వెతికినా వీరయ్య గారి గురించి సమాచారమేమీ లభించలేదు. 2011లో హైదరాబాద్‌లో నాయనమ్మకు కాలు విరగడంతో చూడడానికి వెళ్ళినపుడు అక్కడ అనుకోకుండా మనవలూ, మనవరాళ్ళతో ఉన్న వీరయ్య గారి ఫోటో దొరకడంతో వెతుకులాటను మళ్ళీ కొనసాగించారు. 2013లో ఆ ఫోటో సహాయంతో ఫేస్‌బుక్‌ ద్వారా వీరయ్యగారి అక్క చెంగమ్మగారి మనవడు డేనియల్‌ నాయుడి కూతురు ‘‘డనే’’ పరిచయం లంకెతో మళ్ళీ చిగురించిన ఆశతో వీరయ్య గారి గురించి పడిన 30 ఏళ్ళ శ్రమకు ఫలితం దక్కింది. కొంతకాలం పాటు వారితో సంప్రదింపులు జరిగినా వీరయ్య గారి గురించి వారికి ఎక్కువ వివరాలు తెలియకపోవడం వల్ల 2014లో కృష్ణ గారు స్వయంగా సౌతాఫ్రికా వెళ్ళి డర్బన్‌ నగరంలో ఇండెంచర్‌ కూలీల అర్కైవ్స్‌లో వెతకాలని నిర్ణయించుకుని వెళ్ళి చూసినా ఏమీ దొరకలేదు. చివరికి గాంధీ గారిని రైలు పెట్టె నుంచి కిందకు తోసేసిన పీటర్‌ మారిట్జ్‌ బెర్గ్‌ నగరంలో ఉన్న ఆర్కైవ్స్‌ పరిశీలించమని ఎవరో చెప్పడంతో అక్కడికి వెళ్ళారు. 2014 క్రిస్మస్‌ పండుగ ముందు రోజున అక్కడ 1932 రికార్డులలో వీరయ్యగారి వివరాలు లభ్యమయ్యాయి. సౌతాఫ్రికాలో ఉన్న బంధువులందరికీ కృష్ణ గారు అక్కడికి వచ్చారని తెలియడం, వారందరినీ ఆయన కలవడం జరిగింది. కానీ ఇదంతా జరిగేలోగా వీరయ్య గారి వివరాలు తెలుసుకుని సంతోషపెడదామనుకున్న కృష్ణ గారి నాయనమ్మ, అలాగే తనకు వరుసకు అన్నయ్య అయిన సౌతాఫ్రికా నివాసి డేనియల్‌ నాయుడు చనిపోవడం కూడా జరిగింది. సౌతాఫ్రికాలోని మిగిలిన బంధువులందరినీ కృష్ణ గారు 2015లో కలిశారు.
మొదటి రెండు అధ్యాయాలలో చిన్నప్పటి నంచి వీరయ్య గారి వివరాలు తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాల గురించి రాస్తే మూడవ అధ్యాయం నుంచి పన్నెండు వరకూ వీరయ్య గారి సౌతాఫ్రికా ప్రయాణం, మళ్ళీ భారతదేశానికి తిరుగు ప్రయాణం వివరాలను కృష్ణ గారు ఫ్లాష్‌ బ్యాక్‌ పద్ధతిలో రాశారు. ఈ అధ్యాయాలలో ఎంత కల్పన జోడిరచారో ఆయనే పుస్తకంలో వివరించారు.
అయితే కృష్ణ గారు సౌతాఫ్రికాలో బంధువులందరినీ కలవడం వరకూ ఆయన కథ సుఖాంతమైనా నవలకు ఆయన ఎవరూ ఊహించని మలుపునిచ్చారు.
పదమూడవ అధ్యాయంలో కృష్ణగారు ఉద్యోగరీత్యా అమెరికా`భారతదేశాల మధ్య ప్రయాణించే సమయంలో దుబాయ్‌, దోహా వంటి గల్ఫ్‌ దేశాల్లో కొన్ని రోజులపాటు ఆగవలసి రావడం వలన ఆ దేశాల్లో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న భారతీయుల పరిస్థితిని గమనించి దాని గురించి వివరించారు. ఆనాడు సౌతాఫ్రికా చెరుకు ఫారాలలో పనిచేసిన ఇండెంచర్‌ కూలీల జీవితాలు, ఈనాడు గల్ఫ్‌ దేశాల్లో ఏ విధమైన రంగంలో ప్రత్యేక నిపుణత లేక అక్కడ పని కోసం చేరిన భారతీయల పరిస్థితీ ఒక్కలాగే ఉందని వివరించారు. ఆ దేశాలకు వెళ్ళి సంపాదించుకోవాలన్న కోర్కెతో మోసపోయిన వాళ్ళ కథనాలు చదివాం కానీ అక్కడ చేరాక వాళ్ళ జీవితం ఎలా ఉందో పుస్తకంగా రాసే ప్రయత్నం ఎవరూ చేయలేదు. కృష్ణ గారు ఆ ప్రయత్నం కొంత వరకూ చేసి దుబాయ్‌లో కట్టుబానిసలుగా (దీన్ని ‘కఫాలా’ పద్ధతి అంటారు) పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్న బసంత్‌రెడ్డి గారి వివరాలు ఈ అధ్యాయంలో పొందుపరిచారు.
అలా ఆ దేశాల్లో పనిచేయడానికి మన దేశం నుంచి చాలామంది వెళ్తున్నారు. వారి పరిస్థితిని మెరుగుపరచడానికి అక్కడ మన దేశపు దౌత్య కార్యాలయాలు కూడా ఏమీ చేయడం లేదు. వీరయ్యగారి గురించి మొదలైన ప్రయత్నం దానితో ముగించక తన ముత్తాత కూలీగా అనుభవించిన వ్యథలూ, ఈనాడు కఫాలా పద్ధతిలో గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల బాధలూ ఏ మాత్రం భిన్నంగా లేవని అది బాగుపడాలని కోరుకుంటూ ముగించడం గొప్ప విషయం. ‘‘ఈ మాట’’ అంతర్జాల పత్రికలో గత అయిదు నెలలుగా దాసరి అమరేంద్రగారు రాస్తున్న హృద్యమైన యాత్రా కథనం ‘‘గల్ఫ్‌ గీతం’’ కాక మరొక ఛిద్రమైన ‘‘విషాద గీతం’’ కూడా ఉందని ఈ పుస్తకం చదివాక అవగతమయింది. అలెక్స్‌ హేలీ ‘‘ఏడు తరాలు’’ సరసన నిలబడుతుంది ఈ ‘‘వీరయ్య’’ నవల.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.