21వ శతాబ్దంలో ఇరవై యేళ్ళు గడిచాక కూడా ఇంకా మనం స్త్రీ వాదం గురించి మాట్లాడుకోవాల్సి వస్తోందంటే ఆ స్త్రీ వాదపు అవసరం ఇంకా ఉందనే కదా! ఉందను కోవడం ఏంటి… ఉంది. జెండర్ సమానత్వం గురించి చెప్పుకో వడానికి చాలా బాగుం టుంది. నిజంగా అది సాధించగలిగితే ఆనందదాయకమే. కానీ అది జరుగుతుం దన్న నమ్మకం మనలో ఎవరికైనా
ఉందా?
ప్రముఖ నైజీరియన్ రచయిత్రి చిమామంద అడిచీ ‘పర్పుల్ హైబిస్కస్’ పుస్తకం రాసినప్పుడు ‘‘నువ్వు ఫెమినిస్టువా’’ అని ఒక జర్నలిస్టు అడిగాడు. ఆ అడగడం ఒక ప్రశ్నలా కాకుండా తనకి ఒక పెద్దరికపు సలహా ఇస్తున్నట్లు ఉంది అంటుంది అడిచీ. అతని ఉద్దేశంలో స్త్రీవాదులంటే ‘‘మంచి భర్తలు దొరక్క ఎప్పుడూ అసంతృప్తితో వేగిపోయే స్త్రీలు అని కాబోలు’’ అంటుందామె. అప్పుడు, తాను వాళ్ళకి తానొక ‘హాపీ ఫెమినిస్ట్’ని అని చెప్పుకోవాల్సి వచ్చిందని అంటుంది. కథ అంతటితో అవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన ప్రశ్నలకి తాను సమాధానాలు చెప్పుకొంటూ పోయి చివరకు ఁI aఎ a ష్ట్రaజూజూవ ఖీవఎఱఅఱర్ షష్ట్రశీ ఱం అశ్‌ీ aఅ aఅ్‌ఱ Aటతీఱషaఅ, షష్ట్రశీ సశీవంఅః్ ష్ట్రa్‌వ వీవఅ aఅస షష్ట్రశీ శ్రీఱసవం ్‌శీ షవaతీ ూఱజూ Gశ్రీశీంం aఅస నఱస్త్రష్ట్ర నవవశ్రీం టశీతీ ష్ట్రవతీంవశ్రీట aఅస చీశ్‌ీ టశీతీ వీవఅఁ అంటుంది.
అడిచీ మాటల్లో అర్థమయింది కదా, ఈ ప్రపంచం స్త్రీ వాదాన్ని ఎలా అనుకుంటోంది అని.
నేను స్త్రీ వాదిని అని చెప్పుకోవడానికి స్త్రీలు కూడా ఇష్టపడని పరిస్థితి. స్త్రీ వాదాన్ని స్త్రీలే ఒక జోక్‌గా తీసుకునే పరిస్థితి సమాజంలో ఉందంటే స్త్రీ వాదపు అవసరం ఇంతకు ముందుకన్నా ఇప్పుడే ఎక్కువగా
ఉందనే అర్థం.
ఒకే ముక్కలో చెప్పొచ్చు. ఆమెకు కావాల్సింది ఆమె అస్తిత్వం. తనని తనుగా చూసే ఒక అస్తిత్వం. ఆ మాటకొస్తే స్త్రీ పురుషులు ఎవరైనా కోరుకునేది అదే కదా. అందరూ గేలి చేస్తున్నప్పుడు పురుషులు చేసే ప్రతి పనినీ స్త్రీలుగా తామూ చెయ్యాలని అనుకోవడం కాదు స్త్రీ వాదం అంటే.
స్త్రీ వాదం ఒక తత్త్వం.
అస్తవ్యస్తంగా ఉన్న ఇంటిని సర్దినట్లు గానే… అస్థిమితంగా ఉన్న సమాజాన్ని స్థిమితపరిచే ఒక శాంతి తత్త్వం అది. అలాంటి తత్త్వం స్త్రీలలోనే కాదు పురుషు ల్లోనూ చూడవచ్చు. కాబట్టి స్త్రీ వాదాన్ని స్త్రీలకి మాత్రమే సంబంధించిన వాదం అనుకుంటే అది పెద్ద పొరపాటు. అలానే స్త్రీ వాదం అనగానే అలా జెండర్ డిఫరెన్స్ ఏమిటి మానవతావాదిగా ఉండాలి కానీ అని అనుకోవడం కూడా సర్వసాధారణంగా కనిపిస్తుంది ప్రస్తుత కాలంలో. మానవతా వాదం అన్నది స్త్రీవాదంలోని ఒక పార్శ్వం మాత్రమే తప్ప దాన్ని మించింది కాదు.
స్త్రీలుగానీ, పురుషులుగానీ ఒకరికంటే ఒకరు హీనమని, ఉన్నతమని అన్న ఆలోచనే తప్పు కాబట్టి నేను మానవతావాదిని అని చెప్పుకోవడంలో నేను ఉన్నత వ్యక్తీకరణ చేస్తున్నానని ఎవరైనా అనుకుంటే అది తప్పే అవుతుంది. ఎందుకంటే స్త్రీ వాదమంటే స్త్రీలు చేసే ప్రతి పనినీ సమర్థించడం కాదు. స్త్రీ వాదం ఎప్పుడూ కూడా ‘‘స్త్రీ’’ మాత్రమే అని అనుకోలేదు. స్త్రీ వాదంలో విశ్వ స్వేచ్ఛ ఉంది కాబట్టి అన్ని వాదాలూ అందులోనే ఇమిడి ఉన్నట్లే.
స్త్రీలు తమ జీవితానుభవాల ద్వారా తీవ్రమైన వేదనకూ, మానసిక సంక్షోభానికి గురవడాన్ని స్త్రీ వాదం ఒక్క రోజులో ఆపేస్తుందన్న భ్రమ స్త్రీ వాదులకు లేదు. మహిళలకు ఓటు హక్కు, ఆస్తి హక్కు కల్పిస్తే స్త్రీ వాద ఫలితాలు సిద్దించినట్లుగా అనుకుని విజయం సాధించామని నిజమైన స్త్రీ వాది ఎవరూ ఉత్సవాలు చేసుకోలేదు. ఎందుకంటే స్త్రీ వాదం కోరుకునేది సమాజంలో అవకతవకల్లో సమూలమైన మార్పే తప్ప ఎప్పటికప్పుడు ఆశ చూపే చిన్న చిన్న తాయిలాలు కాదు.
జెండర్ డిఫరెన్స్‌ని, మూస పద్ధతుల్లోని అసంబద్ధతలను గుర్తించి వాటిని సమూలం గా విచ్ఛిన్నం చేసే దిశగా సమాజాన్ని సిద్ధం చేసే ప్రయత్నం చేస్తుంది స్త్రీ వాదం. ఒక భావజాలపు ఆధిక్య సమాజాన్నుండి సమానత్వ సమాజానికి చేసే ప్రయాణమే అది. మనమూ ఆ ప్రయాణంలో భాగమవ్వడమే మనం సమాజానికి ఇచ్చే గొప్ప బహుమతి.
సమాజపు చలన సూత్రాలని కొత్తగా లిఖించి సమాజాన్ని ఒక స్థిరమైన కక్ష్యలో నడిపించగలనన్న నిజాయితీ నిజమైన స్త్రీ వాదంలో కనిపిస్తుంది కాబట్టే నాకు ఎప్పటికీ స్త్రీ వాదిగా ఉండిపోవాలనిపిస్తుంది.
నాకు తెలిసి సమాజపు చైతన్యమే స్వేచ్ఛ. అది ఒకరు ఇచ్చేది కాదు. ఇంకొకరు పుచ్చుకునేది కాదు. స్త్రీ వాదం మనకు స్వేచ్ఛనివ్వదు… స్వేచ్ఛగా మసలుకునే ధైర్యాన్ని తప్ప.