నా శరీరంపై హక్కు నాదేనా?! -పి. ప్రశాంతి

సరిగ్గా నెలరోజులైంది ఈ ఊరికొచ్చి. నెల్లాళ్ళ తర్వాత మళ్ళీ వస్తుంటే మనసులో తెలియని సంతోషపు పొర. ఊళ్ళో కొచ్చేసరికి… అదే నిశ్శబ్దం, అదే కొండగాలి రవళి, పిట్టల పాటలు, పిల్లల ఆటల నవ్వుల చప్పుడు తప్పించి మరో అలికిడి లేదు. ఊర్లోని పెద్దలంతా ఎటన్నా

ఎల్లిపోయారా అన్నంత నిశ్శబ్దం. ఉండీ ఉండీ వస్తున్న టక్‌ టక్‌ చప్పుడు గుర్తుపట్టింది శాంతి. ఊరికి అన్నివైపుల నుంచి వస్తున్న ఆ చప్పుడు మగవారు ఊర్లో ఉన్నారని తెలియచేస్తోంది. అది వెదురు బద్దలతో తడకలల్లుతూ బద్దల్ని దగ్గరగా కూర్చడానికి కత్తిని వెనక్కి తిప్పి వరసలమీద కొడుతున్న చప్పుడు. సగం మందైనా మగవారు ఊర్లోనే ఉంటున్నారన్న మాట. ఆడవాళ్ళు మాత్రం చిన్నపిల్లల్ని ఎత్తుకుని కూర్చోడమో, వెదురు బుట్టల అల్లుతూ ఉండడమెమో, ఒకరికొకరు తలదువ్వు కుంటూ ఉండడమో చేస్తుంటారు. ఇవేవీ కాకపోతే ఊరికి అల్లంతదూరంలో కొండ బండల మధ్య
ఉన్న చెలమ నుంచి మంచినీళ్ళు తెచ్చుకోడానికి ఐదారుగురు కలిసి గుంపుగా అన్నా వెళ్తుంటారు. వాళ్ళతో తప్పకుండా కొందరు పిల్లలు కూడా తల్లులతో పాటు నీళ్ళు తేడానికి రెండో మూడో బాటిల్స్‌ పట్టుకుని బయలుదేరతారు. కానీ వాళ్ళెవరి మధ్య పెద్ద మాటలుండవు. ఎప్పుడన్నా చిన్న చిన్న మాటలు తప్ప. అవి కూడా దగ్గరగా ఉంటే తప్పించి పెద్దగా వినపడవు.
ఇవన్నీ మనసులోకి రాగానే కలగలుపు భావం ఒకటి ముఖంమీద పారాడిరది. చింత చెట్టు కింద బుట్టలల్లుతున్న కన్నమ్మని ‘గోపిక లేదా’ అని అంటుండగానే సమాధానం ఇంకోవైపు నుంచి వచ్చింది. ‘గోపిక పాకలో ఉంది మేడం. మీరు బాగున్నారా’ అంటూ. ‘నేను బాగున్నా కానీ గోపిక డెలివరీ ఎప్పుడైంది. అంతా బాగుందా, హాస్పిటల్‌కి వెళ్ళొచ్చిందా’ అని వరస ప్రశ్నలు వేసేసరికి నవ్వుతూ భూమిక సమాధానం చెప్పింది ‘ఇప్పుడే డెలివరీ అయింది. పాప మేడం. బాగుంది చూస్తారా’ అని. ‘చూద్దాం పద’ అని లేచి పాకవైపు అడుగులేస్తూ ‘చెల్లమ్మా , చామంతి ఎలా ఉన్నారు’ అని అడిగింది శాంతి. ‘ఆళ్ళిద్దరూ కూడా పాకలో ఉన్నారు మేడం’ అంది. ఒక్క క్షణం అడుగులు ఆగిపోయాయి. నెల్లాళ్ళలో మూడు పుట్టుకలు… నిండా 40 కుటుంబాలు లేని ఈ చిన్న ఊర్లో కనీసం నెలకొకరో, ఇద్దరో బిడ్డలు పుడుతున్నారు. దాదాపు అందరూ ఇళ్ళల్లోనే ప్రసవం. డెలివరీ అయ్యాక వెళ్తే ఆసుపత్రికెళ్ళడం, జనన నమోదు చేయించుకుని, డెలివరీ బెనిఫిట్స్‌ అందుకుని మూడోరోజుకి ఊరికొచ్చేసి తమకోసం సిద్ధంగా ఉన్న కీడు పాకలో చేరిపోవడం. ఇక రెణ్ణెల్లు బిడ్డతో సహా అందులోనే.
గోపికని పలకరించి, ఆమె రెండేళ్ళ కొడుకుకి చాక్లెట్లిచ్చి, పాపని ఎత్తుకుని ‘ఇంక ఆపరేషన్‌ చేయించేసుకుంటావా గోపికా’ అని అడిగానో లేదో ఒకసారి చురుగ్గా చూసి ‘ఇద్దరేగా ఉంది! వాడిష్టం’ అంటూ భర్తమీదకి నెట్టేసింది బాధ్యతని. పద్దెని మిదేళ్ళ గోపికకి మూడు కాన్పులు. మొదటి బిడ్డ రెండేళ్ళ వయసులో మరణం. తర్వాతి పిల్లల ఆయుష్షెంతో అన్న సందేహం. అందుకే ఆపరేషన్‌ అన్న మాటకి అంత చురుగ్గా చూసింది. అశుభ్రం గా ఉన్న చంటిబిడ్డను తడిబట్టతో తుడుస్తూ
‘శుభ్రత పాటిస్తూ, టైంకి టీకాలు వేయించి, అంగన్వాడీ లో ఇచ్చే పోషకాహారం ఇస్తూ, జాగ్రత్తగా చూసు కుంటే, ఇద్దరు పిల్లలు చాలు గోపికా. వాళ్ళకి మంచి ఆహారం, చదువు, మంచి బట్టలు ఇవ్వగలిగితే బాగుంటుంది. పదిమంది పిల్లలుండి, ఎవ్వరికీ సరైన తిండి కూడా పెట్టలేక పోతే అనారోగ్యంతో పాటు, ఆయుష్షు కూడా గ్యారంటీ ఉండదు మరి’ అంటూ శాంతి చెప్పిన మాటలు ఎంత రుచించాయో తెలియదుగాని నేల మూలలు చూస్తూ ‘ఆఁ’ అని పొడి సమాధానం వచ్చింది గోపిక నుంచి. కాసేపు తన జాగ్రత్త గురించి కూడా మాట్లాడి మిగిలిన ఇద్దర్నీ చూడ్డానికి వెళ్ళింది శాంతి.
చామంతికి ముందు ఇద్దరు కూతుళ్ళు, ఇప్పుడు మళ్ళీ పాప. ముగ్గురు పిల్లలు చాలా కదా అంటే ‘ఇంకొకరు కావాలి. బాబు అయితే బాగుంటుంది. కాకపోయినా ఫర్వాలేదు. ఇంకొక్కసారి చూస్తాం’ అని చామంతి భర్త సమాధానం.
చెల్లమ్మకి ఏడుగురు కొడుకులు. ఇప్పుడు ఏడో సంతానం కొడుకే. ‘ఇంకెంతమందిని కంటావ’ని అంటే ‘పోయినసారే ఆపరేషన్‌ చెయ్యమంటే క్యాంపు పెట్టినప్పుడు చెప్తాము. అప్పుడు చేయించుకో అంది డాక్టరమ్మ’ అంది చెల్లమ్మ. ‘మరి ఇంకో సంవత్సరం దాకా క్యాంపు పెట్టకపోతే మళ్ళొకర్ని కంటారా’ చురుగ్గా అని ‘ఇంకా చాలా పద్ధతులున్నాయి. ఆశ వర్కర్నో, అంగన్వాడీ టీచర్నో, ఏఎన్నెంనో అడగాలి కదా’ అంది శాంతి. ‘అడిగా, కొన్ని నిరోధులిచ్చారు’ అని సగంలో ఆపేసింది. అంతలో భారతి కూడా వచ్చింది రెండు నెలల బాబునెత్తుకుని. ఇద్దరు కూతుళ్ళు, నలుగురు కొడుకులున్న భారతి ‘అక్కా, నాకూ ఆపరేషన్‌ చేయించు’ అంది. చెల్లమ్మ కూడా సిద్ధం అంటూ ‘మంజుల కూడా చేయించుకుంటానంది. కానీ క్యాంప్‌ పెడ్తేనే ఆపరేషన్‌ చేస్తామన్నారు. నువ్వే ఏదన్నా చెయ్యి మేడం’ ప్రాధేయపడుతున్నట్టుంది చెల్లమ్మ గొంతు. ఇంకా మూడు, నాలుగు కుటుంబా లున్నాయి నలుగురు నుంచి ఏడుగురి వరకు పిల్లలున్నారు. వీళ్ళందర్నీ మోటివేట్‌ చేస్తేనేగాని ఆ కుటుంబాల పరిస్థితి మెరుగవ్వదు. ఆదివాసీల ప్రత్యేక పథకంలో ఇచ్చే 35 కిలోల బియ్యం ఆరు నుంచి పదిమంది ఉన్న కుటుంబాలకి ఏ మూల కొస్తాయి! చాలాసార్లు పెద్దవాళ్ళు రెండు పూట్ల తిని మూడో పూట కడుపు మాడ్చుకోవడమే అవుతుంది. మగవారైతే టీనేజి నుంచే కల్లు, సారా తాగి కడుపు నిండిరదనుకుంటారు. ఆ డబ్బుంటే ఇంకో ఇద్దరికి కూడా తిండొస్తుందని శాంతి వాదన. అందుకు ఒక నవ్వో, మౌనమో సమాధానంగా వస్తుంది వారినించి.
ఈ సంవత్సర కాలంగా మరో విచిత్రమైన పరిస్థితి వచ్చిందంది భవానికి. ‘కరోనా, లాక్డౌన్‌ వలన చాలాకాలం పాటు సంతలకి గాని, పైఊర్లకి గాని వెళ్ళటం లేనందున, అడవికెళ్తే ఎల్లడం, లేపోతే ఇక ఇంట్లోనే… ఆడోళ్ళకి ఒళ్ళు హూనం!’ అంటూ హాస్యమాడినా దాని వెనుక ఉన్న విషాదం అర్థమ వుతోంది. మిగతావారు కూడా సమర్ధించారు. గ్రూపు లీడరు కన్నమ్మ ‘మేడం, నువ్వొచ్చినందుకు ఇప్పుడు ఇవి మాట్లాడగలుగుతున్నాం. ఏదన్నా చేసి ఈ అమ్మాయిలకి ఆపరేషన్‌ చేయించు. నీకు మొక్కుతాం’ అంటుంటే ఎన్నోచోట్ల ఆపరేషన్‌ కోసం చైతన్యపర్చాల్సిన పరిస్థితి, అందుకు పడ్డ శ్రమ గుర్తొచ్చాయి శాంతికి. ఇక్కడ వీళ్ళందరూ ఆపరేషన్‌ చెయ్యమన్నా చెయ్యని పరిస్థితి విచిత్రంగా అనిపించింది. అసలు ఈ క్యాంపులు ఎవరికోసం? ఎవరి నిర్ణయం? ఆపరేషన్‌ చేయించుకుంటామంటే కూడా పెడచెవిన పెట్టడమేంటి! ఇక ‘నీ శరీరంపై నీదే హక్క’ని మాట్లాడ్డంలో అర్థం లేదు. ఏరియా ఆసుపత్రి డాక్టర్‌తో మాట్లాడాలి. అవసరమైతే పై అధికారులదాకా తీసుకెళ్ళాలి అని నిశ్చయించు కుంది కానీ మనసులో సుడులు తిరుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు దొరకలేదు.
ప్రభుత్వ పథకాలు అందరికీ ఒకేలా వర్తి స్తాయి కదా! కొన్ని ప్రత్యేక తెగలు, జాతులకి ప్రత్యేక పథకాలు ఉన్నాయి సరే, ఇద్దరికి మించి పిల్లలుంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హు లౌతారు కదా! అంటే ఈ ఆదివాసీలు ఎన్నటికీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారా? ముందు ఇంటిల్లిపాదికీ మూడు పూట్లా కడుపు నిండితే కదా! ఉట్టికెగర గలిగితే కదా స్వర్గం గురించి ఆలోచించగలిగేది!!

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.