తమకు కష్టమన్నది లేకుండా ఇతర పరాయి ప్రాంతపు పాడి పంటలను, ప్రకృతి ఫలాలను దోచుకు బ్రతకాలనుకునే దూరప్రాంతాల ఆక్రమణదారులు చరిత్రలో తక్కువేమీ లేరు. తాము అడుగుపెట్టిన ఇతర ప్రాంతపు భూమిపుత్రుల్ని నిర్మూలించి, తాము సుఖరీతిలో బ్రతుకు
సాగించడం అన్నది చిరకాల తరతరాల జీవన రీతి, నీతి. ఆర్యగనాల బ్రతుకు మనుగడకు ఈవిధమైనవే. వృత్తిరీత్యా వీరందరూ ఆది కాలపు పశువుల కాపరులు. తమ పశు గ్రాసం కోసం పరాయి భూములను, గడ్డి మైదానాలను వెతుక్కుని, అవి కంటికగుపడిన చోట్లకు పరుగులు బెడుతుండిన జనాలు వీరు. ఆ చోట్లకు చెందిన స్థానిక మానవులు, తమనడ్డగించినపుడు వారితో తీవ్ర ఘర్షణలకు దిగుతూ, దాడులు జరిపి తెగువలున్నవారు. పరాయి భుములవారి నివాసాలు కూల్చి, వారి భూములన్నీ ఆక్రమించడమే గాక, స్వంతదారులందర్ని చంపిపడేయడం, ఆర్యుల మనుగడ రీతిగా పురాణ చరిత్రలు తెలియజేస్తున్నాయి మనకు. ఆక్రమణలు, హత్యల వైఖరుల్ని ఆర్యగనాలు క్రీస్తుకు ముందు కాలాన్నే ఈ జంబూ ద్వీపం మీద అడుగుబెట్టాయి. ఆ నాటికే ప్రవృధ్ధ మానమై ఉండిన సింధు నాగరికతను, నిర్మాణాన్ని విధ్వంసపరిచాయి. సింధు నది, తన పంచ ఉపనది చెలులతో ఆ ప్రాంతపు వ్యవసాయ ఫలాలను అత్యధిóకంగా ఆ భూమి జనులకు అందజేస్తూ ఉండేది. అందుకు తోడుగా అమితమైన మత్స్య సంపద..! చూపులకందని పచ్చిక బయల్లు, అత్యంత సుందర నగర, పట్టణ నిర్మాణ భవంతులు. ఇటీవల 20వ శతాబ్ద తవ్వకాలలో బయటపడిన అద్భుత హరప్పా, మోహంజోదారో శిథిల నిర్మాణాలు ఇందుకు ప్రబల నిదర్శనాలు.
మన పురిటి గడ్డ దురాక్రమణకు, అకారణ యుద్ధాలకు, ధమర్ వ్యాస హత్యలను నడిపించాయి. ఆర్య మూకలు వీటికి జతగా- దైవాలు, దేవతల కథలను అనేకంగా సృష్టించి కపట మెరగని ప్రజలను నమ్మించారు. ఈ కల్పన ఇంతటితో ఆగలేదు. మానవులను సృష్టించి, రక్షించుతున్నవారు ముగ్గురు దేవుళ్ళు విష్టువు, ఈశ్వర, బ్రహ్మ అన్న ఈ మువ్వురు త్రిమూర్తులని, వీరి రక్షణ లేనిదే ప్రపంచం నిల్వదని ఉద్బోధించి, ఈ మువ్వురిలో విష్ణువు ప్రధాన దేవునిగా, ఒక్కొక్క తరుణాన, ఒక్కొక్క రూపాన పదిమార్లు అవతరించి దశావతారుడు అయినాడని కథలు కల్పించారు. ఆ అవతారాలను మానవులు గుర్తించి పూజలు అర్పించుట అవశ్యమమని ప్రవచించి మనుషుల మేధస్సును మర్మపరిచారు.
దశావతారము అన్నవి మస్త్య, కూర్మ, నరసింహ, వామన, పరశురామ, శ్రీకృష్ణ, శ్రీరామ పది అవతారాలుగా ఇవి లెక్కకు వచ్చేందుకు 9వ అవతారంగా బుద్ధున్ని ప్రస్తుత కాలానికి సంబంధించి అవతారాన్ని చెబుతున్నారు. క్రీ.పూ. 500 ఎ.డి.లో నిష్కామ ప్రధానమయిన బౌద్ధ ధర్మాన్ని బుద్దుడు యావద్భారతమంతటా పరివ్యాప్త పరచగా ఆ ధర్మాన్ని ఆగ్నేయాశీయులకు తరిమివేసారు గదా. 9వ అవతారంగా తిరిగి ఆ బుద్ధుడే అవసరం అయినాడు వీరికి!!
అన్ని ప్రాణులపై దయ, అహింసలను కాంక్షరాహిత్యాన్ని బోధించిన ఆ బౌద్ధ ధర్మాన్ని ఎంతగానో నిరసించి తూర్పు, ఆగ్నేయ దేశాలకు తరిమిన వారే. తమ అవసరం కొద్దీ బుద్ధుని దశావతారాల్లో తొమ్మిదవ దశావతారంగా చేర్చడం ఎంత నేర్పరితనం! ఇప్పుడు కొనసాగుతున్నని దశావతార కాలమట, పేరు లౌఖ్యకాలుడి దశావతారమట.
దైవాన్ని గురించిన దైవ విశ్వాసాలు ఇతర విదేశాల్లో లేవని గాదు. గ్రీసు, రోము, ఈజిప్టు, మెసపుటేమియా మొదలైన రాజరిక వ్యవస్థలు ` భగవత్ సంబంధ కథలను, గాథలను అద్భుత రీతిగా ప్రజల మనసులకు ఎక్కించగలిగారు. రాజులైనా తామంతా భగవధంశ గల్గిన వారమని, తమ పురోహిత వర్గాలలో బహుళ ప్రచారం చేయించగలిగారు. తమ పాలనను భగవత్ పాలనగా ఎంచి తమ సమస్త ఆజ్ఞలను పూర్తిగా శిరసావహించవలసినదని అనేక కథలల్లి నమ్మించగలిగారు. ఈ క్రమంలో మున్ముందుగా అణిచి నిర్మూలించింది బలహీన మానవ సమూహాలను, మిగిలిన ప్రజలను తమ బానిసలుగా స్థిరపరుచుకున్నారు. బానిసలను అమ్మడం, కొనడం మొదలైనది. నాడు మొదలైన బానిస వ్యాపారం నిన్న మొన్నటి వరకు సాగింది. అమెరికా, పశ్చిమ యూరప్ దేశాల్లో బానిసలను అమ్మడం, కొనడం మామూలు వ్యాపారం అయ్యింది. ఇప్పుడు మనం ఆనాడు సంభవించిన నమ్ముతున్న హైందవ అవతారుల దశ నుంచి ఈనాటి కుటుంబ, సమాజ, మత సంబంధ స్థితిగతులు ఏఏ దశాల్లో ఏఏ రీతిలో సాగింపబడుతూ వచ్చినపుడు అన్న విషయాలను విశ్లేషణాత్మకంగా పరిశీలించవలసి ఉన్నది.
మన దేశ దేవుళ్ళలో ఒకరిద్దరు తప్ప మిగిలినవారంతా సతులు కలిగిన పతులే. త్రిమూర్తుల్లో బ్రహ్మకు తప్ప మిగిలిన ఇరువురికి ఇద్దరేసి, ముగ్గురేసి భార్యలు! విష్ణుమూర్తి సతీ శ్రీలక్ష్మి ఈమె పతి దేవుడు పాలసముద్రాన ఆదిశేషుని పాన్పుమీద పవళించి ఉంటే భార్య లక్ష్మీదేవి నిరంతరం ఆయన పాదాలను ఒత్తుతూ ఉంటుంది. ఒక సందర్భంగా విష్ణువు భూలోకాన శ్రీనివాసుడిగా అవతరించగా ఈమె అలివేలు మంగగా అవతారం ఎత్తుతుంది. ఒకప్పుడు జరిగిన తాపసుల తాత్విక చర్చల సందర్భంలో మృగ మహర్షి తన కాలి బొటన వేలిని విష్ణువు ఎదపై గట్టిగా తన్నుట జరిగినప్పుడు విష్ణువు భూలోకానికి చేరి శ్రీనివాసుడుగా అవతరించగా ఆ అవమానాన్ని భరించలేని లక్ష్మీదేవి అలివేలుమంగ రూపంలో వనాంతర తపస్సుకు వెళుతుంది. ఆదివిష్ణు లేక ఆదినారాయణునిగా ఆయన దేవి ఆదిలక్ష్మి గా ఈ లోక మానవులు మొదలు ప్రతి ప్రాణిని, ప్రకృతిని సృష్టించి రక్షించుతుండే విష్ణు దంపతులు భూలోక వాసులు కావడం ఏమిటో..
ఈ శ్రీనివాసుడు మళ్ళీ పద్మావతి అనే రాకుమార్తెను ప్రేమించి పెళ్లాడుతాడు. ఆమె ఆయనగారి అనుంగు భార్య అయితే ఆయన పూర్వ భార్య లక్ష్మీదేవి అలివేలుమంగ రూపాన వెంకన్నగా మారిన శ్రీనివాసుడు తనకొకరికే భర్త అని, మరెవరికీ కాదని, పద్మావతితో వాదులాటకు దిగుతుంది. ఇద్దరు ఆయన్ను అమిరి పట్టుకొని నావాడంటే నావాడని తగవులాడుతుండగా ఆయన విగ్రహ రూపం దాల్చాడు. చివరకు ఇద్దరిని ప్రేమగా స్వీకరిస్తాడు తన భార్యలుగా కానీ. ఏటేటా తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం జరుగుతుండేవి పద్మావతి దేవితోనే. లక్ష్మి అజా పజా కనబడనే కనపడదు.
ప్రస్తుత కాలాన శ్రీ వేంకటేశ్వరుడు గాను, వెంకన్న గారు మారిన శ్రీనివాసుడు ఇతడు నా భర్త మాత్రమే, నా భర్త మాత్రమేను అంటూ చెరొక భుజం పట్టుకు లాగుతుండగా, ఎటు చెప్పలేక శిలాకృతిని దాల్చుతాడు. చివరకు తాను వాళ్ళిద్దరికీ సమరీతి భర్తనే అని వాక్రుచ్చుతూ నిజరూపం పొంది వారి వాదులాటకు తీర్పు ఇస్తాడు.
ప్రజలు అత్యంత ఆసక్తితో, భక్తితో వీక్షించే వెంకటేశ్వర మహత్యం చిత్రానికి కథా సంగ్రహమిదే. సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకులు తండోపతండాలుగా వచ్చి చూస్తుంటారు.
ఇంకా తిరుపతికి వచ్చి వెంకన్న స్వామిని దర్శించి వేలు, లక్షల కానుకల రూపంలో మొక్కుబడులు చెల్లించుకుంటున్న భక్తులు ఏటేటా లక్షలకు పెరుగుతున్నారు. ఏడాదికొకసారి అత్యంత ఘనంగా ఆడంబరంగా జరుపబడుతుండే వెంకటేశ్వరుడి కళ్యాణంలో ఆయన ప్రక్కన పద్మావతియే భార్యగా కనబడుతుంది, అసలు ఈ తంతును శ్రీ వెంకటేశ్వర`పద్మావతి కళ్యాణం అనే పలుకుతున్నారు, గుర్తిస్తున్నారు ఆదిలక్ష్మి, అలివేలు మంగల రూపాలు అసలు కనబడవు.
ఇంకా శంభో శంకరుడి మహాత్య అవతారం కథకొద్దాం.. ఈ దేవుడి ప్రప్రథమ కళత్రం పార్వతి దేవి, ద్వితీయం ఆయన శిరస్సునధిష్టించి ఉండే గంగాదేవి. శంకరుడు తరచు తన భక్తుల స్వల్పకాల తపస్సులకు సంతృప్తి పొంది శక్తివంతమైన అస్త్ర శాస్త్రాలను బహుకరిస్తూ ఉంటాడు. అర్జునుడికిచ్చిన పాశుపతా శాస్త్రం వాటిలో ప్రముఖమైనవి. ఈ సందర్భంలో శివునికి సంబంధించిన ఒక సందేహం చిరకాలంగా అపరిష్కృతంగానే ఉంటూ వస్తున్నాయి.
మహాత్తర అద్భుత శక్తి కలిగిన ఆదిదేవుని శివధనస్సు మిథిలా చక్రవర్తి జనకమహారాజు ప్రసాద సమీపంలోని ఓ భోఫానంలో ఉండిపోవడం, దానిని అతని కుమార్తె తన ఎడమ చేత అతి సులువుగా తీసి బయటనుంచడం అన్నది సీతాదేవి కల్యాణానికి మూలహేతువు.
శంకరునికి చెందిన మరొక ఉదంతం:
ఇది ఒక హింసాత్మక కృత్యం. పార్వతి దేవి స్నానం ఆడబోతూ తన స్నానగృహం లోనికి ఎవరూ ప్రవేశించకుండా చూడమని తన కొడుకు వినాయకుని కాపలా కూర్చోబెట్టడం, అదే సమయాన శివుడు వచ్చి స్నాన వాటికలో ప్రవేశించబోగా ఆ బాలకుడు అడ్డు నిలువగా… శివుడాతని తలను ఖండిచిన కథ ఎల్లరకూ తెలిసినదే. కుమారుని మృతికి దు:ఖిస్తున్న తన సతి కోసమై ఎక్కడో చనిపోయిరుడున్న ఏనుగు తలను తెచ్చి మృతబాలకుని కంఠమునకతికించి సజీవునిగా చేసిన శంకరుని మహత్యాన్ని కీర్తించని, అబ్బురపడని వారుండరు. అంతటి మహత్తర సృజనాశక్తి గల శివశంకరుడు తాను ఖండిరచిన శిరస్సునే తిరిగి అతికించి బ్రతికించవచ్చునే! ఏనుగు తలను వెతికి తేవలసినవసరం ఉన్నదా!? ఘనుడు విష్ణుదేవుడు వామనుడిగా అవతరించినప్పటి ఘనకార్యాన్ని గురించి ఎంతగా స్మరించుకున్నా తనివి తీరదు. విష్ణువు పరుశురామునిగా అవతరించి కన్న పుత్రుడెవడు ఒడిగట్టని చర్యను గురించి చెప్పుకోక తప్పదు. తండ్రి జమదగ్ని తన తల్లి రేణుక మీద తెలిపిన నిందారోపణలను నమ్మిన పరశురాముడు తండ్రి కోరిన విధంగా చేసేందుకు సిద్ధమైనాడు. ఇతని ఆయుధము గొడ్డలి అదే పరుశువు తల్లి రేణుక నీటిని తెచ్చే పనిమీద సమీప నదికెళ్లినప్పుడు అశ్వినీ దేవతలన్నవారు ఆకాశ గమనం చేస్తూ ఆమె కంట పడ్డారు. మిక్కిలి ఆశ్చర్యంలో వారిని గమనించతుండడం వలన నీటి కడవను ఇంటికి చేర్చడంలో ఆలస్యం జరిగింది. ఆమె వలన జరిగిన ఆ ఆలస్యం ` భర్త జమదగ్నికి మరో విధంగా అర్థమయింది. గగనతలాన అశ్వినీ దేవత గమనాన్ని చూసి, వారిపై మనసు పారవేసుకున్నది తన భార్య అని భ్రమించి అందుకామెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన ఐదుగురు కుమారులకు తన నిర్ణయం చెప్పగా అందుకు పరశురాముడు సిద్ధమై, తల్లి రేణుకను తన పరుశువుతో ఆమె తలను ఒక వ్రేటుతో ఖండిరచారు. తక్షణం ఆమె తన ప్రాణమొదిలింది.
భర్త భక్తి తపస్సులో మునిగి ఉన్న మునీశ్వరుడు కుమారుడు, శత్రురాజన్యుల భయంకరుడు. పరశురాముడుగా అవతరించిన సాక్షాత్తు విష్ణువు! విష్ణు దేవుడు!! నందు కుమారుడు నవనీతచోరుడు అని ముద్దుగా ముచ్చటపడే అవతారపురుషుడు శ్రీకృష్ణుడు. పసిబాలల నుంచి ముసలి వాళ్ళ వరకు ఇంతగా ఇష్టపడే, ప్రేమించి, ఆరాధించే అవతారపురుషుడు మరొకరు లేరు అన్న మాట నిజం! అణువణువునా శృంగారం నిండిన దేవుడు తాను తప్ప మరొకరు లేరు.
బాలుడిగా ఉన్నప్పుడే చెరువున స్నానం ఆడుతున్న గోప స్త్రీల వలువలను దొంగలించి చెట్టుపై దాచిన ఘనుడు. అష్ట భార్యల భర్తగా ఉంటూనే, పదహారువేల గోపికల ప్రియుడై ఉంటూ అనుక్షణం వారి అనురాగం ప్రియత్వాల్ని పొందుతుండే రసికాత్మ అవతారుడే కృష్ణభగవానుడు. జనుల మనో గుణగణాలను బట్టి చాతుర్వర్ణం మయా సృష్టం అని సగర్వంగా ప్రకటించి వారి నాలుగు వర్ణాలుగా (కులాలుగా) ఆదిత్య హీనతతో విభజించిన ఘనత తనదేనని వాకృచ్చుతాడు. మానవులందరి పితరుడైన దేవుడు లేక దైవావతారుడు`వారి సమైక్యతకు బదులు విభజించి ఆనందించడమేమిటి!? ఇంకా మన విలక్షణ రామావతారునికి చెందిన విలక్షణ గాధలు! యావద్భారతంలోని ప్రతి మూలాన రామభక్తులే. రాజ్యాధికార, స్వర్థ కారణాన`సతీసమేతంగా పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. రామునికి అయితే ఈ నూత్న దంపతుల వెంట లక్ష్మణుడు ఎందుకట? తననూత్న దాంపత్య పరిస్థితేనే భార్యను విడిచి 14 ఏళ్లు అన్న వదినలతో పాటు అరణ్యవాసపు టవసరమేమి? ఆ యావత్తు సమయాన్ని అతని సతీ నిద్రలోనే గడపాల్సిన అవసరం?
లక్ష్మణ సహిత శ్రీరామ దంపతులు వనవాసం గడిపింది మరెక్కడో కాదు, సూర్పణక అధికార రాజ్య వనాంతరాలలో అందుకుగాను ఆమె అనుమతిని ఆర్జించి తీసుకోకుండుట వలన సూర్పణక వారి వద్దకు చేరి ప్రశ్నించవలసి వచ్చింది. ‘‘ఎవరు మీరు? ఎవరి అణుజ్ఞతో ఇక్కడ కుటీరం నెలకొల్పి నివసిస్తున్నారు?’’ అని సూర్పణక ఇలా ప్రశ్నించడాన్ని ఆమె ఈ అన్నదమ్ముల పొందుగోరి వచ్చి బలవంత పరిచినట్టు చిత్రించబడిరది రామాయణ కావ్యం. సూర్పణక కామప్రవృత్తికి రాముడిలా సమాధానమిచ్చాడట ‘‘నా వద్ద నా భార్య ఉన్నది, మరొక స్త్రీ సాంగత్యం అవసరమేమి? నా తమ్మునికి తోడుగా అతని భార్య లేదు, అతని సాంగత్యము నర్థించుము’’ అని ఆమెను లక్ష్మణుని చెంతకు పంపించగా అతను తీవ్ర ఆగ్రహవేశుడై సూర్పనక ముక్కు,చెవులు కోసి వెలివేసెనన్నది పురాణ కథనం. ఎట్టి పరిచయము లేని పరాయి స్త్రీ నీచమైన కోరికను ఖండిరచి, తిరస్కరించవచ్చును కదా? ముక్కు, చెవులను ఖండిరచు అధికార అవసరం ఎట్లు కలిగినది?
తన సోదరి గురికాబడిన తీవ్ర విఘాతం అవమానాలకు చింతాక్రాంతుడైన రావణుడు అందుకు ప్రతిచర్యగా రాముని సతీ సీతాదేవిని సంగ్రహించి తీసుకొని పోవుట సహజము, మిక్కిలి సహజము. ఇదే సమయాన తనదైన రాజ్యపాలన కాంక్ష నెరవేరని స్థితిలో ఉండిన రావణ సోదరుడు విభీషణుడు రాముడిని ఆశ్రయించాడు. వాలి, సుగ్రీవ సోదరుల కుటుంబ కలహాల జోక్యంతో అన్న ‘‘వాలి’’ని తన ధనుర్భానములకాహుతి చేసినందుకై సుగ్రీవుడు కృతజ్ఞుడై తన బలగమంతటితో రామునికి రావణునితో జరిగిన యుద్ధమున భాగస్వామ్యమును కలిగించుకొని తన మద్దతు అందించాడు. పైన పేర్కొనబడిన వారందరి సహాయమునందుకున్న రాముడు తదనంతరం జరిగిన రామరావణ యుద్ధమున రాముడు తన కోదండముతో రావణుడి పది శిరస్సులను ఖండిరచి, సంహరించి విజేత కాగలిగాడు.
ఆ పిమ్మట సీతమ్మ అగ్ని పునీత కాగలిగిన తర్వాతనే భార్యగా స్వీకరించాడు. చివరకు అశ్వమేధ యజ్ఞం సందర్భంగా పుత్రులు లవకుశులతో రాముడు తలబడినప్పుడు తన భార్య సీతను గుర్తించి అయోధ్యకు రమ్మని ఆహ్వానించగా, ఆమె అందుకు తిరస్కరించి తల్లి భూదేవి గర్భానికి చేరిపోతుంది. తన ఆత్మగౌరవాన్ని ప్రకటించుకుంది. ప్రజా వాక్య పాలనకై అటు శంభూకుని చంపి, ఇటు భార్యను అడవుల పాల్జేయడమేనా అవతారపురుషుడు శ్రీరాముడి ప్రత్యేకత?
అంత్య స్థాయిన మరొక సంఘటన! త్రిమూర్తులు ముగ్గురు సమఖ్యులై నిర్వహించిన ఘన చర్య, దైవాలు ముగ్గురు బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు`ముని పత్ని అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించేందుకై అరుదెంచి తమ వద్దనున్న ఇనుపశనగలను ఆమె వివస్త్రjైు వుడికించి పెట్టమని.., అట్లు కాకున్నా ఆమె పాతివ్రత్యము శంకింపదగినది అని పలుకుతారు. ఆమె ఆ ముగ్గురిని పసిబాలలుగా మార్చి తాను, ‘‘నగ్నjైు’’ ఇనుప గుగ్గిళ్ళులను మెత్తగా వండి వారికందించుతుంది.’’ త్రిమూర్తులు ఆనందభరితులై అనసూయ దేవిని వేనోళ్ళ కీర్తించి తమ నిజ రూపములనొదిలి దత్తాత్రేయుడు ఒక్కడుగా అవతరించి నిష్క్రమిస్తారు. ఈ అవతారులందరూ పురుషులే, స్త్రీల ప్రతివ్రతల పరీక్షకులే! వీరందరిని ఆర్య, పురోహిత వర్గాలు సృష్టించాయి. వీరి ప్రచారాలతో పాలకవర్గాలు నిరక్షర ప్రజలను నమ్మించారు.
ఈ వ్యాస విషయాలు హైందవ మతం ఒక్కదానివే విమర్శక వాస్తవికాలు మాత్రమే కావు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మతాలు, మత కర్మాలన్ని మూఢత్వ విశ్వాలే. జంతు, మానవ బలులు, మొక్కుబళ్ళ లక్షల కానుకలు, దేవి దైవాలు వ్యక్తులనావేశించి భవిష్యత్తుల్ని ప్రకటించడాలు`సమస్తం`అన్ని భ్రమలే.