బీడ్‌లో బాలవధువులు: చెరకు కోతల్లో నలిగిపోయిన ఆశలు- పార్ధ్‌ ఎం.ఎన్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

(అనువాదం: అపర్ణ తోట)
మహారాష్ట్ర బీడ్‌ జిల్లాలో అసలే కష్టంగా సాగుతున్న రేఖ వంటి ఆడపిల్లల జీవితాలలో ఈ మహారోగం ఇంకా కష్టాలను తెచ్చిపెట్టింది. పెరుగుతున్న పేదరికం, బడులు మూతబడడం, ఇటువంటి కారణాలెన్నో చిన్నవయసులోనే ఆడపిల్లల పెళ్ళిళ్ళకు కారణమవుతున్నాయి. రేఖకు పది రోజుల క్రితమే, పెళ్ళి చేసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదని అర్థమైపోయింది. ఆమె 15

ఏళ్ళ పిల్ల. ఎంత వ్యతిరేకంచగలదో అంత వ్యతిరేకించింది కానీ ఆమె తల్లిదండ్రులు ఆ విషయాలన్ని పట్టించుకోలేదు. రేఖ ఏడ్చి తనకు ఇంకా చదువుకోవాలని ఉందని చెప్పిందని ఆమె తల్లి భాగ్యశ్రీ చెప్పింది.
భాగ్యశ్రీ, ఆమె భర్త అమర్‌.. ఇద్దరూ వయసు రీత్యా 30ల ఆఖరు అంచులో ఉన్నారు. మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో ఒక పేద గ్రామంలో వారి పిల్లలతో కలిసి బ్రతుకుతున్నారు. ప్రతి సంవత్సరం నవంబరులో వాళ్ళు పశ్చిమ మహారాష్ట్ర లేదా కర్ణాటకకు చెరకు పంటను కోయడానికి వెళ్తారు. ఆరునెలలు విపరీతంగా కష్టపడ్డాక వారిద్దరికీ కలిపి 80,000 రూపాయలు వస్తాయి. వారి పేరు మీద భూమి లేదు. చెరకు పంట కోత మాత్రమే వారి కుటుంబ సంపాదన. వీరిది దళిత వర్గానికి చెందిన మాతంగి కులం.
ప్రతిసారీ తన తల్లిదండ్రులు వలస వెళ్ళినపుడు రేఖ, ఆమె తోబుట్టువులు (ఒకరికి 12, మరొకరికి 8 ఏళ్ళు) వాళ్ళ నాయనమ్మ దగ్గర ఉండేవారు. కానీ ఆమె గత సంవత్సరం మే నెలలో చనిపోయింది. ఈ పిల్లలు ముగ్గురూ ఊరు బయటనున్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కానీ మార్చి 2020లో వచ్చిన ఈ మహారోగం అన్ని బడులను బలవంతంగా మూయించినపుడు, 9వ తరగతి చదువుతున్న రేఖ ఇంట్లోనే ఉండిపోవలసి వచ్చింది. 500 రోజులు గడచిపోయినా బీడ్‌లో బడులు ఇంకా మూతబడే ఉన్నాయి.
‘‘మాకు బడులు ఇప్పట్లో తెరవరని అర్థమైంది’’ అంది భాగ్యశ్రీ. ‘‘బడి తెరచి ఉంచినపుడు అక్కడ టీచర్లు, పిల్లలు చుట్టూ ఉండేవారు. ఊరు హడావిడిగా ఉండేది. బడి మూసేశాక, ఆమెని వదిలి ఎక్కడికీ వెళ్ళలేకపోతున్నాం. జాగ్రత్త పడాలి కదా’’.
కాబట్టి భాగ్యశ్రీ, అమర్‌లు రేఖను 22 ఏళ్ళ ఆదిత్యకి ఇచ్చి పెళ్ళి చేసేశారు. ఆదిత్య వాళ్ళ ఊరు వీరి ఊరికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్ళు కూడా వలస కూలి పనికే వెళ్తారు. నవంబర్‌ 2020లో చెరకు పంటను కోసే సమయంలో రేఖ, ఆదిత్య పశ్చిమ మహారాష్ట్రకు వెళ్ళారు. ఆమె పేరు మాత్రం స్కూలు రిజిస్టర్‌లో ఉండిపోయింది. కౌమార వయసులో ఉన్న రేఖ, ఆమె వంటి చిన్నవయసులో ఉన్న బాలికలు ఈ మహారోగం వల్ల బలవంతంగా ‘పెళ్ళి’లోకి తోసివేయబడుతున్నారు. మార్చి 2021లో విడుదల చేసిన యునిసెఫ్‌ నివేదికలోని ‘కోవిడ్‌`19: పురోగతికి బాల్య వివాహాల ముప్పు’ అధ్యాయం, ఈ దశాబ్దపు చివరకు ప్రపంచంలో 10 మిలియన్ల బాలికలకు బాల్య వివాహపు ముప్పు ఉందని చెబుతోంది. బడులు మూతబడడం, పేదరికం పెరగడం, తల్లిదండ్రుల మరణాలు, ఇంకా కోవిడ్‌ వలన వచ్చే ఇతర సమస్యల వలన ‘‘ఇప్పటికే ఘోరంగా ఉన్న బాలికల పరిస్థితి మరింత ఘోరంగా మారుతోంది’’ అని ఆ నివేదిక చెబుతోంది.
గత పదేళ్ళుగా బాల్యవివాహాలు 15 శాతం తగ్గాయని, దాదాపు 25 మిలియన్‌ పెళ్ళిళ్ళు ఆపగలిగారని యునిసెఫ్‌ నివేదిక చెబుతోంది. ఇటీవలి కాలంలో వచ్చిన ఈ మహారోగం ఈ పురోగతికి మళ్ళీ ముప్పు తెస్తోంది, ముఖ్యంగా మహారాష్ట్రలో. మహారాష్ట్ర ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఏప్రిల్‌ 7 నుండి జూన్‌ 2021 వరకు రాష్ట్రంలో 780 బాల్య వివాహాలను అడ్డగించింది. ఇది సంప్రదాయవాద అంచనా అని తాంగ్డే, కాంబ్లే చెప్పారు. 2015 నుండి 2020 వరకు బాల్య వివాహాలలో 3 శాతం తగ్గుదల ఉంది. 2015`16 నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌`4) తెలుసుకున్న విషయమేంటంటే, 26 శాతం పైగా 20`24 ఏళ్ళ మధ్య ఉన్న యువతులకు, 18 ఏళ్ళు నిండేలోపే… అంటే చట్టరీత్యా వారికి వివాహ వయసు రాకముందే పెళ్ళి చేస్తున్నారు. 2019`2020 (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌`5)లో ఈ నిష్పత్తి 22 శాతంగా ఉంది. అదే సమయంలో 10.5 శాతం మంది 25`29 వయసున్న యువకులకు, 21 ఏళ్ళు రాకముందే… అంటే చట్టరీత్యా వివాహ వయసు రాకముందే పెళ్ళి జరిగింది.
బాల్య వివాహాల గురించి ఇంత సమాచారమున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వీటిని అరికట్టడానికి ఏ విధమైన చర్యలూ తీసుకోలేదు. 34 ఏళ్ళ తత్వశిల్‌ కాంబ్లే బీడ్‌లో సామాజిక ఉద్యమ కార్యకర్త. పిల్లలు, యువత విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగతుల మీదే దృష్టి సారించిందని, అవికూడా ఇటువంటి సౌకర్యాలు, అంటే ఇంటర్నెట్‌ కనెక్టివిటీ అందిపుచ్చుకోగల పిల్లలకు మాత్రమే సాధ్యపడుతున్నాయని అన్నారు. మహారాష్ట్రలో 18.5 శాతం గ్రామీణ కుటుంబాలకు మాత్రమే ఇంటర్నెట్‌ సౌకర్యం ఉందని 2017`18 నేషనల్‌ శాంపిల్‌ సర్వేలో ఒక నివేదిక తెలుపుతోంది. గ్రామీణ మహారాష్ట్రలో దాదాపు 17 శాతం మందికి (ఐదేళ్ళు లేక దాని పైబడిన వారు) ఇంటర్నెట్‌ వాడడం తెలుసని, అందులో మహిళల నిష్పత్తి 11 శాతమని పేర్కొంది.
ఇంటర్నెట్‌ అవకాశం లేని చాలామంది వెనుకబడిన తరగతులకు చెందినవారై ఉంటారు. ఇక్కడ పేదరికం, ఆర్థిక ఆలంబన లేకపోవడం వల్ల ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేస్తారు. పైగా స్కూళ్ళను మూసివేయడం వల్ల పరిస్థితి ఇంకా ఘోరంగా మారింది. బీడ్‌లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
బీడ్‌లో దాదాపు 20`24 ఏళ్ళ మధ్య ఉన్న 44 శాతం మంది యువతులకు, వారికి 18 ఏళ్ళు రాకముందే
పెళ్ళిళ్ళు జరిగాయని 2019`2020లో చెప్పారు (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌`5). దీనికి ప్రధాన కారణం ప్రజలు చెరుకు పంటను కోసే పనికి వలస కూలీలుగా వెళ్ళడమేనని, అది కూడా జిల్లాలో విపరీతమైన కరవు, వ్యవసాయ సంక్షోభం ఉండడం వల్లేనని చెబుతున్నారు.
చెరకు పంట కోత పనికోసం కాంట్రాక్టర్లు పెళ్ళయిన జంటలనే పనిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఈ పనికి ఇద్దరు మనుషులు కావాలి. ఒకరు చెరకును కోస్తే ఇంకొకరు వాటిని మోపులుగా కట్టి ట్రాక్టర్‌ మీద వేస్తారు. ఈ జంటను ఒక జట్టుగా చూస్తారు. దీనివల్ల వీరికి డబ్బు చెల్లించడం తేలికవుతుంది. అదే తెలియని ఇద్దరైతే మళ్లీ ఎవరికెంత ఇవ్వాలని వంతులతో గొడవలు జరగవచ్చు. అమ్మాjైుతే పెళ్ళయ్యాక తన భర్తతో పాటు ప్రయాణించి అక్కడికి చేరుకుని పని సంపాదించుకోవచ్చు. ఈ రకంగా ఆమె తన భర్తతో కలిసి భద్రంగా ఉండొచ్చు. పైగా వారికి ఆర్థిక భారం కూడా తగ్గుతుంది.
ఈ మహారోగం సమయంలో ఇంట్లో ఉండిపోతున్న పిల్లలను చూసి తల్లిదండ్రులు రెండు రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఒకవేళ అబ్బాjైుతే, బాల కార్మికుడిగా మార్చేస్తారు. అమ్మాjైుతే బాల్య వివాహం చేసేస్తారు’’ అని తత్వశిల్‌ కాంబ్లే అన్నారు. అవసరంలో ఉన్న పిల్లల రక్షణను చూసుకునే శిశు సంక్షేమ కమిటీ సభ్యుడిగా, కాంబ్లే బీడ్‌లోని ఎన్నో బాల్య వివాహాలను అరికట్టగలిగారు. తల్లిదండ్రులు ఆర్థిక భారం వదిలించుకోవడానికి 12 ఏళ్ళ వయసున్న బాలికలకు కూడా పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు.
బీడ్‌ తాలూకా ఛైల్డ్‌ ప్రొటెక్షన్‌ కమిటీ (బాల్యవివాహాలను, బాలకార్మికులను అరికట్టే సంఘం)లో సభ్యుడైన అశోక్‌ తాంగ్డేతో కలిసి కాంబ్లే 2020 మార్చి తర్వాత, కోవిడ్‌`19 విజృంభిస్తున్న సమయంలో 100కు పైగా బాల్యవివాహాలను అరికట్టారు. ‘‘ఇవన్నీ మేము సరైన సమయానికి వెళ్ళడం వలన ఆపగలిగాము’’ అన్నారు 53 ఏళ్ళ తాంగ్డే. ‘‘వేళ్ళ సందుల్లోంచి జారిపోయిన కేసులెన్నో తెలీద’’ని అన్నారు.
ఈ మహారోగ సమయంలో ప్రజల కొనుగోలు సామర్ధ్యం తగ్గిపోయిన అంశం కూడా బాల్యవివాహాలలో పాత్ర పోషిస్తోంది. పెళ్ళికొడుకుల తల్లితండ్రులు కట్నం కోసం ఎక్కువ విసిగించడంలేదని, పెళ్ళిళ్ళు చేయడం కూడా చవకైపోయిందని అన్నారు తాంగ్డే. ఎక్కువమంది అతిథులను పిలవడానికి ఒప్పుకోవడం లేదు కనుక, తక్కువ మంది బంధువులను పిలిచి పని పూర్తిచేయవచ్చని ఆయన అన్నారు. ఇంకోవైపు, కోవిడ్‌ వలన తాము చనిపోతే తమ ఆడపిల్లలు ఏమవుతారోనని తల్లిదండ్రులు భయపడుతున్నారు. వీటన్నింటి వలన బాల్య వివాహాలు పెరిగిపోయాయి. ‘‘కొంతమంది బాలికలకు 12ఏళ్ళకే పెళ్ళిళ్ళయిపోతున్నాయని’’ తాంగ్డే చెప్పారు.
మహారాష్ట్ర ప్రభుత్వ మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ ఏప్రిల్‌ 7 నుండి జూన్‌ 2021 వరకు రాష్ట్రంలో 780 బాల్య వివాహాలను ఆపిందని, ఇది సాంప్రదాయవాద అంచనా అని తాంగ్డే, కాంబ్లే చెప్పారు. ఎందుకంటే బీడ్‌లో 40 పెళ్ళిళ్ళు అరికట్టామంటూ ఆ శాఖ ఇచ్చిన సంఖ్య కన్నా, తామిద్దరం కలిసి క్షేత్రస్థాయిలో ఇంకా ఎక్కువ పెళ్ళిళ్ళనే ఆపగలిగామని తాంగ్డే చెప్పారు.
సంప్రదాయ అంచనాల ప్రకారం చూసినా ఈ మహారోగ సమయంలో ఇన్ని బాల్యవివాహాలు జరగడం పరిస్థితిని ఎత్తి చూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ డేటా ప్రకారం, 2019లో జనవరి నుండి సెప్టెంబర్‌ వరకు 187 బాల్యవివాహాలను నివారించగలిగారు. అంటే కోవిడ్‌ మహారోగం తర్వాత సగటుకు నెలలో జరిగే బాల్యవివాహాలు 150 శాతం పెరిగాయన్నమాట. కాంబ్లే, తాంగ్డేలకు ఈ పెళ్ళిళ్ళు నివారించడానికి సమాచారాన్ని ఇచ్చేవారుంటారు. ఆశా వర్కర్లు కానీ, గ్రామ సేవకులు కానీ తమకు సమాచారమిస్తారని కాంబ్లే చెప్పారు. కానీ వాళ్ళు కూడా అదే ఊరిలో ఉంటారు కాబట్టి చాలా సార్లు భయపడతారని, పెళ్ళి చేస్తున్న కుటుంబాలకు ఈ విషయం తెలిస్తే సమాచారమిచ్చిన వారిని చాలా ఇబ్బంది పెడతారని ఆయన చెప్పారు.
ఊరిలో ఉన్న వైషమ్యాలు కూడా పనిచేస్తాయి. కొన్నిసార్లు, వారికి వ్యతిరేకంగా ఉన్నవారు తమకు సమాచారం అందిస్తారని, అలాగే కొన్నిసార్లు పెళ్ళి కుదిరిన అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి తమకు సమాచారమిస్తాడని చెప్పారు. పెళ్ళి గురించిన సమాచారం అందిన వెంటనే వారిని ఎదుర్కోవడం పెళ్ళిని నివారించడానికి మొదటి అడుగు. పెళ్ళిళ్ళు జరిపించే కుటుంబాలు కొన్నిసార్లు రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించాలని చూస్తారని, తమను బెదిరించడం, దాడి చేయడం కూడా జరిగిందని కాంబ్లే చెప్పారు. ప్రజలు తమకు లంచమివ్వడానికి ప్రయత్నిస్తారని, కానీ తాము పోలీసులకు ముందే సమాచారమిచ్చి సిద్ధంగా ఉంచుతామని ఆయన చెప్పారు. కొంతమంది లొంగుతారని, మరికొంతమంది గొడవపడిన తర్వాత కానీ ఊరుకోరని చెప్పారు.
2020 అక్టోబర్‌లో కాంబ్లే, తాంగ్డే 16 ఏళ్ళ స్మితకు పెళ్ళి జరుగుతోందని తెలుసుకున్నారు. పెళ్ళి మండపం బీడ్‌ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళేసరికి పెళ్ళి రివాజులన్నీ మొదలుపెట్టేశారు. స్మిత తండ్రి విఠల్‌ పెళ్ళి ఆపడానికి ఒప్పుకోలేదు. ‘‘ఆయన మా మీద అరిచాడు. ఆమె నా కూతురు, నాకు కావల్సినట్లు చేయగలను’’ అన్నాడని చెప్పారు తంగ్డే. పెళ్ళి ఆపకపోతే ఏం జరగవచ్చో అర్ధం చేసుకోవడానికి అతనికి కొంచెం సమయం పట్టిందని, తాము అతన్ని పోలీస్‌స్టేషన్‌కి తీసుకువెళ్ళి అతని మీద ఫిర్యాదు చేయించామని ఆయన చెప్పారు. స్మిత చాలా బాగా చదువుతుందని ఆమె మేనమామ కిషోర్‌ చెప్పారు. కానీ ఆమె తల్లిదండ్రులు బడికి వెళ్ళలేదని, వారికి దాని అవసరం తెలీదని, ఈ మహారోగం వలన వారు రోజుకు రెండు పూటలా తినడానికి కష్టపడుతున్నారని చెప్పారు. విఠల్‌, అతని భార్య పూజ 30ల మధ్యవయసులో ఉన్నారని, వారు ఇటుక బట్టీలలో పనిచేస్తారని కిషోర్‌ చెప్పారు. నాలుగు నెలలు పనిచేస్తే వారిద్దరికీ కలిపి 20,000 రూపాయలు వస్తాయని, స్మితకు పెళ్ళి చేస్తే ఒక రోజులో రెండు పూటలా ఒక మనిషి తినే భోజనం గురించి ఆందోళన చెందే అవసరం ఉండదని ఆయన వివరించాడు. కాంబ్లే, తాంగ్డేలకు అన్నిటికన్నా పెద్ద సవాలు ఈ తల్లిదండ్రులు ఆగిపోయిన పెళ్ళిని మళ్ళీ జరపకుండా ఉండడం. గతంలో బడులు నడుస్తున్నప్పుడు టీచర్లు బడికి రాని పిల్లల గురించి వాకబు చేసి, ఒకవేళ వారికి పెళ్ళి చేస్తుంటే తమకు సమాచారమిచ్చేవారని, కానీ ఇప్పుడు బడులు మూతబడ్డాయి కనుక తమకు సమాచారం అందడం కూడా కష్టమవుతోందని వారు చెప్పారు. విఠల్‌ని ప్రతి రెండు నెలలకు పోలీస్‌ స్టేషన్‌లో రిపోర్టు చేయమని పోలీసులు అడిగారని, తాము అతన్ని నమ్మలేమని, ఎందుకంటే పెళ్ళి వయసు రాని కూతురికి మళ్ళీ పెళ్ళి చేయాలని చూస్తాడేమోనని తమ ఆందోళన అని అన్నాడు తాంగ్డే. పెళ్ళి ఆగిపోయిన తర్వాత స్మిత తన మేనమామ కిషోర్‌ ఇంట్లో రెండు నెలలు ఉంది. ఆ సమయంలో ఆమె చాలా మౌనంగా ఉందని కిషోర్‌ చెప్పాడు. ఆమె ఎక్కువ మాట్లాడేది కాదని, ఒక్కతే ఉండేదని, తమకు ఇంటి పనులలో సాయం చేసేదని, ఆమెకు అంత త్వరగా పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదని ఆయన చెప్పారు.
మహిళల ఆరోగ్యంపై బాల్య వివాహాల ప్రభావాల గురించి పరిశోధనలు జరిగాయి. ఇందులో బాల్య వివాహానికి, ప్రసూతి మరణాలకు ఉన్న లంకె గురించి కూడా ఉంది. నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఛైల్డ్‌ రైట్స్‌ వారి నివేదికలో, 2011 గణాంకాలను తీసుకుని ‘‘భారతదేశంలో బాల్య వివాహాలపై గణాంక విశ్లేషణ’’లో 10`14 లోపు పెళ్లయిన బాలికలకు గర్భధారణ లేక ప్రసూతి సమయంలో మరణించడానికి 20`24 ఏళ్ళ మధ్య వివాహమైన వారికన్నా ఐదు రెట్లు ఎక్కువ ప్రమాదముందని తెలుస్తోంది. ఒకవేళ తల్లి గర్భధారణకు ముందు, తర్వాత బలహీనంగా ఉంటే బిడ్డలు కూడా బలహీనంగా పుడతారు. ఇక రేఖ విషయంలో, పోషకాహార లేమి, శారీరక బలహీనత వలన ఆమె అత్తింటివారు ఆమెను పుట్టింటికి పంపించేశారు. 2021 జనవరిలో ఆమె భర్తతో వెళ్ళిన 2`3 నెలల తర్వాత మళ్ళీ పుట్టింటికి వచ్చిందని రేఖ తల్లి భాగ్యశ్రీ చెప్పింది.
చెరకుని కోయడం, వాటిని మోపులుగా కట్టి 25 కిలోల బరువును నెత్తిమీద పెట్టుకోవడం,
ఉండాల్సిన బరువుకన్నా తక్కువ బరువున్న రేఖకు కష్టం. ఆమె అంత కష్టమైన కూలిపని చేయలేదని, దానివల్ల ఆమె భర్త ఆదాయం తగ్గిపోయిందని చెప్పింది భాగ్యశ్రీ. అందుకని ఆమె అత్తమామలు పెళ్ళిని తెగతెంపులు చేసుకుని ఆమెని తిరిగి ఇంటికి పంపించేశారని చెప్పింది. పుట్టింటికి తిరిగి వచ్చాక రేఖ అక్కడ కొన్ని రోజులే ఉంది. ఒక అమ్మాయి అత్తింటి నుంచి పెళ్ళయిన కొన్ని నెలలకే తిరిగి వచ్చేస్తే, ఊర్లోని ప్రజలు ప్రశ్నిస్తారని, అందుకని ఆమె ఎక్కువగా తన మేనత్త ఇంట్లోనే ఉంటుందని భాగ్యశ్రీ చెప్పింది. చెరకు కోత కాలం మళ్ళీ దగ్గరపడుతోంది. భాగ్యశ్రీ, అమర్‌ మళ్ళీ వలస వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. రేఖ భవిష్యత్తుకు మళ్ళీ ప్రణాళిక వేస్తున్నారు. ఒకటే తేడా… రేఖ ఈసారి వ్యతిరేకించడం లేదు. మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంది.
ఈ కథనంలో పిల్లలు, వారి తల్లిదండ్రుల పేర్లను గోప్యంగా ఉంచాలన్న కారణంతో పేర్లు మార్చాము. ఈ కథ పులిట్జర్‌ సెంటర్‌ మద్దతునిచ్చే సిరీస్‌లో భాగం. పార్థ్‌ ఎం.ఎన్‌. 2017 ూARI ఫెలో, విభిన్న వెబ్‌సైట్లకు స్వచ్ఛంద పాత్రికేయునిగా పనిచేస్తున్నారు. ఆయన క్రికెట్‌, ఇంకా ప్రయాణాలు చేయడాన్ని ఇష్టపడతారు. లాబాని జంగి 2020 ూARI ఫెలో. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన ఆమె స్వంతంగా చిత్రకళను అభ్యసించారు. ఆమెకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. ప్రస్తుతం ఈమె కోల్‌కతాలోని సెంటర్‌ ఫర్‌ స్టడీస్‌ ఇన్‌ సోషల్‌ సైన్సెస్‌లో బెంగాలీ కార్మిక వలసలపై పిహెచ్‌డి చేస్తున్నారు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.