దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టని విన్నాను
నువ్వది వాదం అన్నావు, నేనది వేదం అన్నానూ
బల ప్రదర్శన కోసం ఒక్కడు పులిని చంపుతుంటే
నువ్వది శౌర్యం అన్నావు, నేనది క్రౌర్యం అన్నానూ
అందం కోసం అప్పు చేసి ఒక ఆభరణం కొంటే
నువ్వది కంకణమన్నావు, నేనది సంకెళ్ళన్నానూ
సంత నడుమ ఒక జోలెపట్టి పసిగొంతు మ్రోగుతుంటే
నువ్వది గేయం అన్నావు, నేనది గాయం అన్నానూ
కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే
నువ్వది వినోదమన్నావు, నేనది ప్రమాదమన్నానూ
నమ్మిన సత్యం నిలిపేందుకు ప్రాణాలను అర్పిస్తే
నువ్వది మరణం అన్నావు, నేనది జననం అన్నానూ
హిందూ యవతి ముస్లిం యువకుడు పెళ్ళి చేసుకుంటే
నువ్వది జిహద్ అన్నావు. నేనది లవ్ అని అన్నాను
నువ్వది ప్రేమదాడి అన్నావు, నేనది ప్రేమైక జీవనమన్నాను