రాగం చూడమ్మో అది ఎంతో మంచిది (2)
ఊరును చూడు, వాడను చూడు
పల్లెను చూడు, పట్నము చూడు
దళితుల్ని చూడు, వికలాంగులని చూడు
ట్రాన్స్‌జెండర్ బాధలని చూడు
ఏమి చేద్దాము, మనం ఆలోచించుదాము (2)
కులము లేదు మతము లేదు…
మనుషులంతా ఒక్కటేనంట
జెండర్ అంటేనే…
అవి తేడాలు లేవమ్మా
ఎక్కడ చూసినా ఎవరిని చూసినా
ఎటువంటి సమస్యకైనా ‘రాగం చూడమ్మో’
చర్చ చేద్దాము… అవి తీర్చుదామూ
ఆలోచించమ్మో మన ఐక్యతారాగంలోన
మొదలుపెట్టాలి, ఇక పదును పెట్టాలి
స్త్రీలకున్న హక్కులన్నీ మానవత్వంతో కలుపుకుందాం
స్త్రీల హక్కులు మానవ హక్కులు వేరు కాదని చాటిచెబుదాం
రిజర్వేషన్ అందుకుందాం
మానవ హక్కులు అందుకుందాం