ఈ వార్తలు ఎవరి కోసం… -ఉమా నూతక్కి

ఛానల్స్‌ నందు న్యూస్‌ ఛానల్స్‌ వేరయా అనుకునేవారం ఒకప్పుడు. అడల్ట్స్‌ కాకున్నా, మనల్ని మనం అడల్ట్స్‌ అనుకున్నా అనుకోక పోయినా ఫర్వాలేదు, అది పిల్లా పాపలతో చూసే ఫ్యామిలీ వ్యూయర్స్‌ కోసం కదా అనుకునేవాళ్ళం. కాలం మారింది. ఏ ఛానెల్‌ అనేం లేదు. న్యూస్‌ అనేది పేరుకే. ఎంటర్టెయిన్మెంట్‌తో పోటీ పడుతున్నాయి. ఎంటర్‌టెయిన్మెంట్‌ అని పేరు పెట్టుకున్న

ఎంటర్టెయిన్మెంట్‌తో పేచీ తక్కువ. అది బుగ్గన గాటు, ప్యాంటు ఓ వైపు మడిచిన రౌడీ గెటప్‌ వేసుకున్న కృష్ణలాంటిది. మనం పొరబడడానికి అవకాశం లేదు. ఎంటర్టెయి న్మెంట్‌ అంటే ఏ తరహా ఉంటుందో తెలీయ కుండాపోయే అవకాశం లేదు. జబర్దస్తు కొంచెం అటూ ఇటూ ఏదైనా, నువ్వూ నీ సంసిద్ధత… అంతే. న్యూస్‌ ఛానల్స్‌ అలా కాదే. అది దొంగదెబ్బ. న్యూస్‌ కదా అని ఇటొచ్చామా, ఫటా ఫటా అని పడిపోతుం టాయి. ఎందు కొచ్చాంరా బాబూ ఇటువైపు అనిపిస్తుంది. రూపం న్యూస్‌ లాగానే ఉండాలి, సారం ఎంటర్‌ టెయిన్మెంట్‌తో పోటీపడాలి. వికృత సమాసం. మాటలా మరి.
యాంకర్స్‌, గెస్టులనబడు శాల్తీలు కూడ బలుక్కుని ఇవ్వాళ ఈ మోతాదులో అరుద్దాం, ఈ స్థాయి బూతులతో రక్తి కట్టిద్దాం అని లెక్కలేసుకుంటారేమో అని అనుమానం. ఎప్పుడైనా, ఎవరైనా కాస్త విషయముండి అరవకుండా మాట్లాడే గెస్టును చూస్తే ముచ్చట బదులు జాలేస్తుంది. సౌండ్‌ పార్టీలాగా లేడే అన్నట్లు మనకే అనిపిస్తుంది. నాలుగు రోజులు వరుసగా చూశామంటే అట్లా ట్యూన్‌ చేస్తాయి మనల్ని ఛానెళ్ళు. సౌండ్‌ లేకుండా ఒట్టి సబ్‌స్టాన్సే అనే వాళ్ళని ఛానెళ్ళు కూడా రెండోమారు పిలవవను కోండి, అది వేరే విషయం. విషయం ఎవడిక్కావాలయ్యా, సౌండ్‌ ఉందా లేదా నీ దగ్గర. ఒక్కసారీ ప్రత్యర్థిని కరవకుండా కనీసం మైకు పగిలిపోయేలా గట్టిగా అరవకుండా ఒక్క బూతు మాట తెలియ కుండా యాడనుంచొస్తారయ్యా ఎర్ర బస్సెక్కి అని టీవీల వాళ్ళు గట్టిగానే అంటుండొచ్చు.
ఈ పండితుల్లో వారూ వీరనీ, చిన్నా పెద్దా అనీ, రాజకీయ నాయకులా… సినిమా నటులా అని తేడా లేదు. అందరూ అదే బాపతు. కాకపోతే చిన్న వాళ్ళు మాట్లాడితే టీవీలకెక్కదు. విఐపిలకు మాత్రం లైవ్‌లో యథేచ్చగా తమ పాండిత్యాన్ని ప్రదర్శిం చుకునే అవకాశం
ఉంటుంది. అందులోనూ సౌండ్‌ పార్టీలకు. ఈ మధ్యే చూశాం కదా ఒక పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడిన మాటలు, దానికి జవాబుగా మరో పార్టీ చేసిన రచ్చ… అంతకంటే కొన్ని రోజుల ముందే ఒక పెద్ద హీరో అభిమానులు తన భార్య గురించి నానా మాటలూ అంటున్నా రని, ఆ హీరో భార్య క్యారెక్టర్‌ మీద మచ్చ పడేలా అత్యంత దారుణంగా మాట్లాడిన మరో సినీ నటుడి ఉన్మాదం.
విలేఖరుల సమావేశాల్లోనో, టీవీ డిబేట్స్‌ లోనో తాము మాట్లాడే ప్రతి చిన్న మాట, ప్రతి ఇంటి డ్రాయింగ్‌ హాల్లో ఉన్న టీవీలో టెలికాస్ట్‌ అవుతుందనీ, వాటిని చిన్న పిల్లలు వింటారనీ తెలియనంత అమాయకులా వీళ్ళు. ఒకర్ని చూసి ఒకరు, ఒక ఛానెల్‌ను చూసి మరొకరు. చిన్న సభను చూసి పెద్దల సభ. ఈజీమనీ లాగే ఈజీ ఫ్రేమ్‌. ఏదైనా ఇన్‌స్టాన్స్‌, ఇదిగో ఈ సిపీఐ, సిపీఎంల పాతకాలపు పెద్దమనుషులు ఇంకా డైనోసార్స్‌ లాగా అక్కడక్కడా ఉంటారు. వాళ్ళలాగా ఉంటే ఏం లాభం, వాళ్ళ పార్టీల్లాగే కనిపించ కుండా పోతాం అని కూడా అనుకుంటారనుకుంటా లోలోపల. ఏం పోటీ ఏం పోటీ… గోరంట్లను చూసి బాబుకు మురిపెం. ఆయన భాషా చాతుర్యం చూసి మురిపెం. నానీని చూసి జగనన్న మురిపెం. అందరిదీ ఒకటే రూటు. ఏయ్‌, అమ్మా, అక్క, ఆలి… ఆడదాని ప్రస్తావన లేకుండా మీకు ఆనందమూ లేదు, ఆగ్రహమూ లేదు. ఏం ఖర్మరా మీకు అనాలని ఉంటుంది కానీ ఔచిత్యం కాదని ఊరుకోవడమే. తాగి తందనాలాడే దగ్గర ఆనందపు మత్తులో ఆడవాళ్ళ చర్చలే. ఒకరిమీద ఒకరు రంకెలేసుకునే చోటా ఆడవాళ్ళే. పైకి
వాళ్ళు, వాళ్ళు తిట్టుకున్నట్టే ఉంటుంది. ఒకరిమీద ఒకరు బురద, మట్టి, పెంట చల్లుకున్నట్టే ఉంటుంది. కానీ, దాన్ని తల్లి గర్భాలకంటించాలని చూస్తారు. అమ్మతనాన్ని బోనులో నిలబెడతారు. అమ్మకే పుట్టారని గుర్తుంటుందంటావా అసలు వీళ్ళకి.
భార్యను జూదంలో పణంగా పెట్టిన వాడిని ధర్మరాజు అని పిల్చుకునే జాతి కదా ఇది. అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏమిటంటే మహాకవులుగా పేరు పొందిన వారు సైతం ‘దొంగలంజకొడుకు లసలే మెసలే ఈ ధూర్తలోకంలో’ అంటూ మగ వారిని తిట్టడానికి ఆడవారినే కించపరిచారు. గౌరవ సభలో గౌరవ సభ్యులు కాట్లాడు కుంటున్నపుడు అపుడెపుడో నాగిరెడ్డి గారు చెప్పిన సూక్తి పదే పదే గుర్తుకు వస్తే తప్పెవరిది?
మగవారి చేత మగవారి కొరకు మగవారు ఏర్పరచుకున్న సమాజంలో బతుకుతున్నాం మనం. వారి ప్రభావం మనమీద ఎంతగా
ఉందంటే ఆడవారిని ఆడవారు తిట్టాలన్నా, ఆడవారి వ్యక్తిత్వాలనే కించపరిచేంతగా!
ఎంతవరకూ ఇలా?
రాళ్ళు విసిరేదెవరైనా అవి తగిలేది మనకే అన్న సంగతిని చాలా బాధ్యతగా పక్కన పెట్టి మనదైన పక్షాన్ని మరింతగా ఎగదోసే పనిలో చాలా బిజీగా ఉంటున్నాం. దీన్ని మార్చ గలిగేది ఎవరు? మార్చాల్సింది ఎవరు? మనకోసం ఎవరూ రారు. మనమే మార్చాలి… మనమే మారాలి. ఆడవారిని కించపరిచే ఏ వ్యక్తినైనా సమాజంలో ప్రతి మహిళా సోషల్‌ బాయ్‌ కాట్‌ చేయాలి.
తాము మాట్లాడే ప్రతి మాట మీద తాము అదుపు తెచ్చుకునేలా చెయ్యాలి. అదుపులేని మాటలకి పర్యవసానాలు ఎంత చేదుగా
ఉంటాయో చూపించాలి. అది చెయ్యాలంటే నువ్వు ఆ కులమూ, నాది ఈ కులమూ అని గిరిగీసుకుని తమ కులంలోని పందులను తాము సమర్ధించే ధోరణి పోవాలి. మదమెక్కిన ఎనుబోతులను ఎనుబోతులనే అనాలి. కులాలను పక్కనబెట్టి, ఏ కులమైనా ఏ అడ్డగాడిదైనా అమ్మ కడుపులోంచే వస్తాడని గుర్తుచేయాలి.

Share
This entry was posted in మంకెన పువ్వు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.