కసువు – పశువు – పెంట – పంట – పి. ప్రశాంతి

కసువు లేనిదే పశువు లేదు
పశువు లేనిదే పెంట లేదు
పెంట లేనిదే పంట లేదు
పంట లేనిదే కసువు లేదు
… బతుకు లేదు

చిత్తూరు జిల్లాలో వాడుకలో ఉన్న ఈ నానుడి వ్యవసాయ విధానాన్ని, రైతు జీవనాన్ని స్పష్టంగా మనముందు పరుస్తుంది. ఈ నాలుగు లైన్లు మురుగమ్మ చెప్పినప్పుడు ఇంత సహజంగా ఒక వలయంలా ఒకదానితో ఒకటి ముడిపడున్న అంశాలని ఎక్కడికక్కడ కత్తిరించి అసహజ పద్ధతుల్ని రైతు మీద రుద్దిన ‘హరిత విప్లవం’ గుర్తొస్తుంది.
ఆహార పంటల నుంచి వ్యాపార పంటలకి వ్యవసాయాన్ని ఎలా మరలించిందో, ఆ మాయా జాలంలో రైతుని ఎలా ఇరికించిందో, మార్కెట్లని ఎలా నియంత్రిస్తోందో, అధిక దిగుబడి అంటూ హైబ్రీడ్‌ రకాలతో దేశవాళీ విత్తనాన్ని ఎలా కనుమరుగు చేసిందో, పురుగుకాటుకి తట్టు కోలేని ఈ రకాల పంటలకి పదే పదే రసాయన ఎరువులు వాడాల్సి రావటంతో భూమి పొరలు ఎలా నిర్జీవమైపోతున్నాయో… భూజలాలు ఎలా తరిగిపోతున్నాయో, గ్రీన్‌హౌస్‌ వాయువుల ప్రభావంతో వాతావరణ మార్పులు ఎలా చోటు చేసుకుంటున్నాయో, దీని ఫలితంగా అతివృష్టి, అనావృష్టి వ్యవసాయాన్ని, రైతుని ఎలా కబళిస్తున్నాయో ఒక్కసారిగా కళ్ళముందు సజీవ చిత్రాలుగా నిలిచేసరికి ఒళ్ళు జలదరించింది.
మన దేశంలో ఇంకా 70% గ్రామీణ కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి
ఉన్నాయి. అందులోనూ అత్యధిక శాతం (82%) మంది చిన్నకారు, సన్నకారు రైతులే. వీరంతా ఓటేస్తేనే ఎన్నికైన నాయకులు, అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని కావాలనే మర్చిపోయి కొద్దిమందిగా ఉన్న మోతుబరులు, కార్పొరేట్లు, వ్యాపారుల అభివృద్ధే దేశాభివృద్ధి అన్నట్లు తమని తాము మరిపించుకుంటూ రైతు వ్యతిరేక పాలసీలని, చట్టాలని కూడా సునా యాసంగా చేసేస్తున్నారు. నాయకులు తమ రాజకీయ లబ్ది కోసం కళ్ళకి గంతలు కట్టుకుని వాస్తవ దూరమైన, పర్యావరణ హితంకాని ఈ నిర్ణయాల వల్ల కేవలం రైతులే కాదు, పశు పక్ష్యాదులు, భూమి, నీరు, గాలి కూడా కలుషితమవడం వల్ల దేశమూ, భూగోళమూ నష్టపోడాన్ని గుర్తించకపోతే, నమ్మకపోతే, ఇంకా మారకపోతే ఉత్పాతాలని ఎదుర్కోవలసి రావడం ఖాయం… గుర్తించీ చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం అనర్థం.
పెట్టుబడి పెట్టి, కష్టం చేసిన రైతు తన పంటకి/ఉత్పత్తికి ధర తను నిర్ణయించ లేకపోవడం ఎంత విడ్డూరం. గ్రామీణ, పేద రైతు మధ్యవర్తుల మోసానికి గురికాకుండా ఉండేందుకు కనీస మద్దతు ధర మంచిదే. కానీ అది రైతుకి అనుకూలంగా ఉండాలి కానీ మొదటికే మోసం కాకూడదు కదా!
ఇప్పటికే వైవిధ్యతకి చోటు లేకుండా చేసిన పీడీఎస్‌ ద్వారా ప్రజల ఆహార అలవాట్లని మార్చేయడంతో పాటు, ఒకే రకమైన పంటని పండిరచడానికి ఉసిగొల్పడం జరిగిపోయింది. దీని ప్రభావం వ్యవసాయం మీదే కాదు, మారిపోయిన తిండితో ఆరోగ్యం మీద, ఆర్థిక పరిస్థితి మీద, సామాజిక స్థితిగతుల మీద కూడా పడిరది. స్థానిక వాతావరణ పరిస్థితులకు అను గుణంగా ఉండే పంటలు పండిరచినంత కాలం, అవే తిన్నంతకాలం ఆరోగ్యం బాగుంది, నేల బాగుంది, పంట బాగుంది, వీటిని ఆశ్రయించు కుని ఉన్న జీవ జాలం బాగుంది, నీరు, గాలి బాగుంది. వీట న్నిటితో మనిషి బ్రతుకు ప్రశాంతంగా ఉండేది.
క్రమేణా మారిన పరిస్థితులతో మనిషి చేతిలో డబ్బయితే ఆడుతోంది కానీ పేదరికం తగ్గట్లేదు! మరి పెరుగుతున్న ధరలు, ఖర్చులతో ఆదాయం చాలని పరిస్థితిలో బ్రతుకు బండిని ఈడ్చడం కష్టంగా మారుతూ… పండిరచే రైతుని, కొనుక్కునే వినియోగదారుల్ని కూడా నిస్సహాయ స్థితికి చేర్చి ఆత్మహత్యలకి ప్రేరేపిం చడం కాక ఇంకేమవుతుంది? అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి చందాన ఉన్న మార్కెట్లు ఆహార సార్వభౌమత్వాన్ని వెక్కిరిస్తున్నట్లేగా!!
ఎన్ని కొత్త కొత్త పథకాలని రూపొం దించినా అవి రైతు సాధికారతకి, వ్యక్తి జీవన గౌరవానికి తోడ్పడకపోతే… తిరిగి ప్రభుత్వం పైనే ఆధార పడేటట్లు చేస్తే, ప్రశ్నించే ధిక్కార స్వరాన్ని వినిపించనివ్వకుండా చేస్తే, బలహీనమైన స్కీంల ద్వారా డబ్బుని పేలాల్లా పంచుతూ పేదల్ని నిర్బలుల్ని చేస్తే, అతి కొద్దిమంది వ్యాపారాల కోసం అభివృద్ధి పేరుతో సారవంత మైన పలు భూముల్ని లాక్కుని రోడ్లు వేస్తే, ప్రజా ప్రయాణ సాధనాల్ని ప్రైవేటు పరం చేసి ప్రయాణాలని లక్జూరి యస్‌గా మారుస్తున్నామని మాయ జేయాలని చూస్తే… ఎవరైనా ఆ మాయలో పడేది కొంతకాలమే. అది మాయా జాలం అని గ్రహించాక రాజ్యాంగం సాక్షిగా… ప్రశ్నించే గొంతుకలు వేనవేలవుతాయి. ధిక్కార స్వరాలు సామూహిక గానం చేస్తాయి. అమాయక గ్రామాలు చైతన్యధారలవుతాయి. నాగలి, చాట పట్టిన చేతులు రaండాలెత్తు తాయి, కుయుక్తితో విభజింపబడ్డ జాతులు అఖండ మవుతాయి. అత్యున్నతమైన రాజ్యాంగం సాక్షిగా ప్రజా స్వామ్యం వర్ధిల్లే రోజు, భాష, జాతి, ఆహార వైవిధ్యత విలసిల్లే రోజు, ప్రజా సార్వభౌమత్వం సాధించుకునే రోజు… ఆ రోజుని సుసాధ్యం చేసుకోడానికి ఈ భూమి పుత్రులు, పుత్రికలు కాచుకుని ఉన్నారు.
కసువు`పశువు`పెంట`పంట` జీవ జాలం`జీవనం ఒక మహత్తరమైన గొలుసు. ఈ బలమైన, అత్యంత ఆవశ్యకమైన గొలుసును తెంపాలని చూస్తే పతనం తప్పదని, అది తమతోనే మొదలౌతుందని అర్థమయిన నాడే మనిషి మనుగడకి సరికొత్త పునాది బలిష్టంగా ఏర్పడుతుంది. మరి ఆ రోజు కోసం ప్రతి ఒక్కరం ఒకటవుదామా? హక్కుల్నే కాదు, బాధ్యతల్ని ప్రియంగా అందుకుందామా? ద్వేషంతో కాదు ప్రేమతో పోరాటాన్ని ప్రజ్వరిల్ల చేద్దామా? సొంత లాభం కొంత మానుకుని జారిపోయే బ్రతుకుల్ని చేరతీద్దామా? ఈ గమనంలో మీలో ఎందరు నాతో…

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.