పిట్ట కొంచెం కూత ఘనం

శిలాలోలిత

బరువైన నిశ్శబ్దాన్ని మోస్తూ, చిన్న చిన్న మాటల అల్లికలోనే లోతైన జీవితాన్నీ, జీవన పార్శ్వాల్నీ వెల్లడించే అద్భుతమైన ప్రక్రియ హైకూలు. నిజానికి హైకూలు రాయడం చాలా కష్టం. ఎంతో నిశితమైన పరిశీలన, భావోద్విగ్నత, ప్రాపంచికానుభవం వున్నవారికే అది సాధ్యం.
ప్రకృతిలో తాము లీనమై పోతూ, జెన్‌మునుల తత్వసారాన్ని జీర్ణించుకుని, అనుభూతి సాంద్రతలో గడ్డకట్టిన మంచుముక్కలు హైకూలు. రత్నమాల ‘రాత్రి చేరింది పిట్ట’ అనే కవిత్వ సంపుటిలోని హైకూ సంగీతాన్ని పిట్ట వినిపించింది.  ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్లుగా వుంది. పదాల పొదుపు, అర్థాల విరుపులతో ఆద్యంతము ఒక రసానుభూతిని కలిగిస్తుంది.
కవయిత్రికుండే కవిత్వాభిరుచి, ప్రాపంచిక దృక్పథం, జీవితానుభవం, ఘర్షణ, సంఘర్షణ, ఇలాంటివన్నీ కవిత్వాన్ని స్పర్శించగానే తెల్సిపోతుంటాయి.
ప్రస్తుతం రత్నమాల ‘జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’ హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నారు. ఇది 2005లో వచ్చిన పుస్తకం. చైతన్యానికి, స్ఫూర్తికి, స్వేచ్ఛకు, ప్రాణానికీ సంకేతంగా ‘పిట్ట’ ను భావిస్తూ, రాత్రిని చేరుకున్న ‘పిట్ట’ రూపంలో జీవిత దర్శనాన్ని చేసిన హైకూలివి.
పొద్దుచూడాలని/కిటికీ పరదా తీసాను/మంచు పరదా ఎవరు తీస్తారు?
 – మూసేసుకుని వున్న మనసు కిటికీ పరదా అది మంచుతో నిండి పోయింది. పొద్దును, అంటే, మార్పును, వెలుగును చూడాలని కిటికీ పరదాను తీయగలిగాను కానీ, అసలు తీయాల్సింది మనసు తెరను. అదీ మంచుతో నిండిపోయింది. దాన్ని నేనే తెరవగలగాలి. తెరవాలి కూడా అనే ధ్వనిప్రాయంగా కవయిత్రి చెప్పారు. పిల్లలు చేసే అల్లరిలో అరుపులు ఎంత సహజమో చెబ్తూ, వాళ్ళను రాత్రంతా అరిచే కీచురాయితో పోల్చడం, నిశ్శబ్దాన్ని, రాత్రి గాఢతను భగ్నం చేసినట్లుగా పిల్లలు కుటుంబ జీవితాల్లో చైతన్యాన్ని నింపుతారని అంటుందొకచోట. ఒకానొక వెలుగు, ఒక ఆలోచన మనిషి అంతర్‌ బహిర్‌ లోకాల్లో సర్వవ్యాపితం ఐన తీరును, జనం కోసం ఎంతో ఎత్తునుంచి దూకి గాయాలైనా, మళ్ళీ మళ్ళీ మనకోసం ఉదయించే సూర్యుడి నిష్కపటతాన్నీ, ధైర్యాన్నీ, అలసెటురగని తనాన్నీ, బతుకుచెట్టు కింద సత్తువ కోల్పోయిన ప్రాణి వణికే ధ్వని గొణుగుడు అని తేల్చేస్తుందొకచోట.
జలపాతపు ఉధృతిని, విడిచెళ్ళి పోయిన బాల్యపురేఖ నిశ్శబ్దపు నదిలా నెమ్మదిగా ప్రవహిస్తున్న జీవనయానమని నిర్లిప్తత చెబ్తూ, తుమ్మెదకు పనిలేదు అని చెప్పడం వెనక లోతైన బాధ వుంది. ‘శిశిరం’ లో చేయగలిగింది ఏమీలేదన్న వేదాంత ధోరణీవుంది. జాబిలి మీదున్న అపారమైన ప్రేమతో, వెన్నెల్లో వీచే చల్లనిగాలి దానిదేసుమా అనే మురిపెంవుంది. సమాజమనే విశాలమైదానంలో సహృదయత అనే కొమ్మలు పంచిన మానవత్వపు వృక్షముందా? ఐనా మని షోక్కడే ‘పిట్ట’ లా కుదించుకుపోయి, ఎగరకుండా, స్వేచ్ఛను సాధించుకోకుండా వుంటున్నారని వివరిస్తుంది.
ప్రతి మనిషి తన మనసు సొరంగాన్ని తనకుతానే తవ్వుకోవడానికి ఏకాంతం అవసరం. అదెంత అవసరమో మిత్రుల ఆత్మీయ స్పర్శ కూడా అంతే అవసరం. అరుదైన అద్భుతమైన మిత్రుల జ్ఞాపకమనేది తీరిక లేని పననీ, అలసటంతా తీరిపోతుంది అంటుందికొకచోట.
తల్లి పాడే జోలపాట సగంలోనే పాపాయి నిద్రపోతుంది. మిగిలిన సగం తన మనసు నిద్రకోసం తల్లి పాడుకుంటుందం టుంది. ఈ రెండవ వూహ దగ్గరే మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు.
తల్లిదండ్రులు ఈ పోటీ ప్రపంచంలోకి పిల్లల్ని బలవంతంగా నెట్టి, ఆ ఒత్తిడిలో పిల్లలు ఆత్మహత్యలవైపు దారి తీస్తుండడాన్ని ఈ హైకూ గుర్తుచేసింది.
పూల తీగ/బంధాలను అల్లుతోంది/పూలు రాలిపోయాయి/ఇలాంటిదే మరొకటి
నువ్వు/నానుంచి దూరంగా ఉన్నపుడు/నేను కూడా నానుంచి దూరమే!
-మోడువారిన జీవితాన్ని ఆత్మవిశ్వాసం ధైర్యమనే లతలు జీవాన్ని నింపుతాయనే ఆశావహ దృక్కోణం మరోచోట చిన్నారి పసికూనలు ఘనీభవించిన హృదయాలను మెత్తటి స్పర్శతో లే ఎండలా కరిగిస్తారంటుంది హృద్యంగా. ప్రపంచాన్ని చూడలేని అంధులకు కలలెలా వస్తాయి? అని ప్రశ్నిస్తుందొకచోట. మనో ప్రపంచంలో అనుభూతుల చెలమ ఎండనంత వరకూ, ఆశావహులైనంత వరకూ కలలు కంటూనే వుంటారు. కలలొస్తాయి కూడా. చుట్ట చుట్టుకొని వున్న దిగులును తొలగించుకోక పోతే, అందమైనవన్నీ అంచువరకూ వచ్చి నిలిచిపోతాయంటుంది.
మొత్తమ్మీద ఈ హైకూలు పాఠకుల హృదయాలను పిట్ట అరుపులతో మేల్కొల్పుతాయి. సాంద్రత ఎక్కువగా వున్న హైకూలివి. కవిత్వావరణంలో తనదైన కవిత్ర ముద్రను రత్నమాల ఈ హైకూలతో సాధించుకున్నారు.

Share
This entry was posted in మనోభావం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో