పిలుపులో గౌరవం -డా॥ విజయభారతి

భర్త ‘ముండా’ అని పిలిస్తే దారినపోయేవాడూ ‘ముండో’ అన్నాడని సామెత. ఇది పూర్వకాలపు సామెత అయితే కావచ్చు గాని ఈ రోజుల్లోనూ దీని గురించి ఆలోచించాల్సిందే. ‘‘ఏ సమాజంలో స్త్రీకి గౌరవముంటుందో ఆ సమాజం గౌరవింపబడుతుంది’’ అన్నారు పూర్వ పండితులు. కలకంఠి కంట్లో కన్నీరు వస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి (సంపద) ఉండనంటుందట.

అలాగ భయపెడితేనయినా మగ
వాళ్ళు ఆడవాళ్ళని గౌరవంగా, ప్రేమగా చూసుకుంటారనే ఉద్దేశ్యం కావచ్చు.
ఉన్నత/ఆధిపత్య కులాలలో స్త్రీని గౌరవంగా చూసే సంప్రదాయం ఉంది. రాజ కుటుంబాలలో స్త్రీలను రాణీగారు, రాణీ అమ్మవారు, పెద్ద రాణిగారు, చిన్న రాణిగారు అంటూ పేర్కొంటారు. పిలిచేటప్పుడు భర్తలు భార్యలను గౌరవంగా బహువచనంతో సంబోధిస్తారు. ఇతర కులాలలో ఇలాంటి వ్యవహారం తక్కువ. ఏ కుటుంబాన్ని గమనించినా స్త్రీలను ఏకవచనంతో సంబోధిస్తున్న సందర్భాలే ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా దక్షిణాదిన అన్ని కులాలలోనూ ఇదే వ్యవహారం.
పూర్వపు శాసనాలలో స్త్రీలను గౌరవంగా పేర్కొనటం కనిపిస్తుంది. కావ్యాలలోనూ అంతే. వారు అగ్రకులాలకు, అధికార వర్గాలకు చెంది ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. ప్రతి సామాజిక కోణంలోనూ కులవివక్ష దాక్కొని ఉంటుంది. అది కనిపించదు, కాని దాని ప్రభావం కనిపిస్తుంది.
రామాయణ, మహాభారతాలలో స్త్రీలను`ఆర్య స్త్రీలను (‘ఆర్య’ అంటే గౌరవ కుటుంబాలకు చెందిన అనే అర్థంలో) గౌరవంగా సంబోధించటం కనిపిస్తుంది. స్త్రీలను మంచి విశేషణాలతో, సౌందర్య దృక్పథంతో చూడడం, వర్ణించటం కవులకు అలవాటు. ఆర్యేతర (కింది వర్గాల) స్త్రీలను గురించి చెప్పేటపుడు ఆ దృక్పథం కనిపించదు.
రామాయణంలో సీతను భర్త అయిన రాముడు ఎప్పుడూ మృదు మధురంగా ఆమె గొప్పతనాన్ని గుర్తు చేస్తూనే సంబోధించేవాడు.
‘గొప్పదనంలో పుట్టినదానా’
సీత జనకునికి పెంపుడు కూతురు. ఆమె పుట్టిన కులం ఎవరికీ తెలియదు. ఆమె ఒక రాజుకు కూతురుగా పెరిగింది. మరొక రాజుకు కోడలయింది. ఆ విధంగా ఐశ్వర్యంతో ఆమెకు ఘనత వచ్చింది. ఆమెను పిలిచేవారంతా (బంధు మిత్రులూ, పరిజనమూ) ఆ సంగతి గుర్తుంచుకుని మసిలేవారు. ఆమెను ఎప్పుడూ అగౌరవంగా సంబోధించలేదు. ప్రచారం వల్ల ఆమె గొప్పకులంలో పుట్టినది అయింది. ఇదే కావ్యంలో తాటకనూ, శూర్పణఖనూ సంబోధించిన తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ‘తాటక’ ఒక యక్షుని కూతురు. వర ప్రభావంతో పుట్టింది. ఒక యక్షుని భార్య. అందగత్తె. ఒక రాజ్యానికి పాలకురాలు, బలవంతురాలు. ఆమెను యక్షీ, సహస్రనాగ బల సమన్వితా అంటూ చెప్పినా, ‘పురుషాదీ మహాయక్షీ విరూపా…’ మనుషులను తినే స్త్రీ అంటూ చులకనగా చెప్పారు. ‘విరూప’ అనీ అన్నారు. అక్కడికక్కడే మాట మార్చేశారు. అగ్రకులాల అధర్మాన్ని ఎదిరించిన యక్షస్త్రీ వారికి రాక్షసిగా, దుష్టురాలిగా కనబడిరది.
ఆర్య ఆర్యేతర భావజాలం ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే పురుషులు తమ స్త్రీలను గౌరవంగా సంబోధించటం అలవాటు చేసుకోవాలి. ఆ అలవాటు కొన్ని కులాలలో… ముఖ్యంగా నిమ్న జాతులలో తక్కువ. ‘‘మనం మన స్త్రీలను గౌరవిస్తే సమాజం కూడా వారిని గౌరవిస్తుంది. వారి గౌరవంతోనే మన గౌరవం ముడిపడి ఉంది’ అనే భావన పురుషులలో రావాలి. ఈ విషయంలో
ఉత్తరాది వారు కొంత మెరుగు. వారు తమ భార్యలను పిలిచేటప్పుడు సంతానం పేరిట ఒక తల్లిగా గుర్తిస్తూ పిలుస్తారు. ఉదా: రాముని తల్లి, లక్ష్మణుని తల్లి, రామ్‌ కీ మా… ఇలా.
రామాయణంలో సీత విషయంలో ఉత్తరాది సంప్రదాయమే. కౌసల్య కోడలు, జనకుని కూతురు లాంటి సంబోధనలు యక్ష రాక్షస స్త్రీల విషయంలో కనిపించవు. అది అప్పటి సమాజపు వివక్షా పూరిత వైఖరికి నిదర్శనం. గతాన్నుంచి పాఠాలు నేర్చుకోవాలి కాబట్టి తమ స్త్రీలను చూసే దృష్టిలోనూ, వారి తరపున వ్యవహరించే పద్ధతిలోనూ కింది కులాల వారు మార్పులు చేసుకోవాలి.
‘‘మనం ఎదుటివారిని గౌరవిస్తే వాళ్ళు మనల్ని గౌరవిస్తారు’’ అనేది అన్ని కులాలకూ తెలిసివచ్చేలాగా ప్రదర్శించాలి. వ్యక్తిత్వ వికాసపు పాఠాలలో మొదట చెప్పేది ఆత్మగౌరవం. ఆత్మవిశ్వాసంతో తమ గౌరవాన్ని తామే నిలబెట్టుకోవాలని చెబుతారు. మనల్ని, మన కుటుంబాన్ని, మన స్త్రీలను గౌరవించుకోవటం ద్వారా సమాజ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఈనాడు ఉంది. పూర్వ సాహిత్యంలోనూ, పురాణాల్లోనూ, పూజా విధానాల్లోనూ వినవచ్చే దేవుళ్ళు/దేవతల పేర్లు గమనిస్తే వాటిలో వారి శౌర్య ప్రతాపాలు ఇమిడి ఉండటం కనిపిస్తుంది.
మధుసూదనుడు, మురారి, జనార్ధనుడు వంటివి విష్ణువు పేర్లుగా చెబుతారు. మధువు అనే రాక్షసుడ్ని చంపాడనీ, మురాసురుని చంపాడనీ వాటి అర్థం. ఆ విధంగా అవి వారి తేజస్సును స్ఫురింపచేస్తాయి. జనార్ధనుడు అంటే ‘‘ఏ జనులైతే తన భక్తులను బాధపెడుతున్నారో వారిని సంహరించేవాడు’’ అని అర్థం. ఇది ఒక బెదిరింపు కూడా.
శివునికీ అంతే… త్రిపురారి, అంధకవైరి మొ॥ పేర్లు. ఇంద్రునికీ వృత్రారి, పాకారి వంటి పేర్లు శత్రు సంహారంతో ముడిపడి ఉన్నాయి. స్త్రీల పేర్లకు వస్తే చండిక, మహిషాసురమర్దిని పేర్లు దేవి శక్తిని తెలిపేవే. భర్త పేరుతో, భార్య పేరుతో ముడిపడి ఉన్న పేర్లూ మన సమాజంలో ఉన్నాయి. పార్వతీపతి, మా (లక్ష్మి)ధవుడు, లక్ష్మీపతి, శచీపతి వంటివి అప్పటివారు గౌరవప్రదంగానే స్వీకరించారు.
మనల్ని మనమే గౌరవించుకోవాలి. ఆత్మస్తుతి మంచిది కాదన్నారు గాన కొన్ని పరిస్థితుల్లో అది అవసరమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి వర్గాన్ని వారు గౌరవించుకోవాలి. పరస్పరం గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. స్త్రీల పట్ల కూడా ఇది వర్తిస్తుంది. స్త్రీలను గౌరవంగా చూడటం, సంబోధించడం సమాజ లక్షణం అయినప్పుడే అది పురోగమనం.
కింది కులాల వాళ్ళను ఒరేయ్‌, ఒసేయ్‌ అని పిలవటం సాధారణంగా చూస్తుంటాం. వారు ఆత్మగౌరవంతో ప్రతిఘటించటమే దానికి పరిష్కారం.
ఈ విషయంలో బి.ఎస్‌.మూర్తి గారి తల్లి గంగమ్మను ఆదర్శంగా చెప్పుకోవాలి. ఆమెను ఒక కామందుల కుర్రాడు ఒసే గంగీ అని పిలిచాడట. వెంటనే ఆమె రోషంతో ‘‘ఎవడ్రా వాడు? నన్ను ఒసే అని పిలిచేది నా మొగుడేను. మరొకడు అలా పిలిస్తే ఒళ్ళు చీరేస్తాను’’ అంటూ వెనక్కి తిరిగిందట. అంతే… ఆ తర్వాత అక్కడ అలాంటి పిలుపులు వినబడలేదు.
ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. బి.ఎస్‌.మూర్తి ఇంటి పేరు బయ్యా. ఆయన నాలుగు పర్యాయాలు అమలాపురం నుండి కాంగ్రెస్‌ ఎం.పి.గా ఎన్నికయ్యాడు. ఆయనకు ఆ ధైర్యం తల్లినుంచే వచ్చిందనుకోవాలి. వాళ్ళ ఊరు నగరం. ఆ ఊళ్ళో మహమ్మదీయులు ఎక్కువ. మొదట ఆ ఊరికి కాందిశీకులుగా వచ్చిన ముస్లింలను అక్కడి కింది కులాల వారు ఆదరంగా చూడడంతో వారు వీరిని ‘భయ్యా’ అని సంబోధించేవారట. ఆ విధంగా కొన్ని కుటుంబాలకు బయ్యా ఇంటిపేరుగా స్థిరపడిరదని ఆయన చెప్తుండేవారు. మా నాన్నగారి ఊరు మామిడి కుదురు. నగరం, మామిడి కుదురు జంట గ్రామాలు.
మా నాన్న బోయి భీమన్న గారూ తన ఇంటిపేరు గురించి ఒక కథ చెప్పేవారు. ఆంగ్లేయుల పాలన కాలంలో ఆంగ్లేయాధికారుల ఇళ్ళల్లో చిన్న చిన్న పనులకు, కింద కులాలవారే వెళ్తుండేవారు. వాళ్ళని ఆ అధికారులు బోయ్‌ ‘దీశీవ’ అని పిలిచేవారట. అలా తమకు బోయ్‌ (బోయి) ఇంటిపేరుగా స్థిరపడిరదంటారు ఆయన. అది గౌరవంతో కూడిన పిలుపే.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.