కులం గోడలు కూల్చాల్సింది యువతే! – పి. ప్రశాంతి

శ్రావ్య, చందు స్కూల్‌ ఫ్రెండ్స్‌. క్లాసులు వేరైనా ఆరో తరగతి నుంచి స్కూల్లో అనేక సందర్భాల్లో కలిసి ఆడారు, పాడారు, చదివారు, పోటీపడ్డారు, బైటి పోటీల్లో పాల్గొన్నారు, ప్రైజులూ తెచ్చారు. నవ్వులు, అల్లర్లతో పాటు గిల్లికజ్జాలు, ఒకింత సీరియస్‌ గొడవలు కూడా పడ్డా ఒకరంటే ఒకరికి ప్రత్యేక అభిమానం. స్కూల్‌ వదిలి వెళ్ళే సమయానికి అర్థమైంది ఒకరంటే

ఒకరికి వల్లమాలిన ఇష్టమని. తను మమ్మీ అని పిలిచే పిన్ని చెప్పేవి వింటూ, చేసే బాలికా హక్కుల కార్యక్రమాలు చూస్తూ పెరిగిన శ్రావ్య ఒకరోజు చందూతో స్పష్టంగా చెప్పింది, ‘ఐదేళ్ళు చూద్దాం. నీ చదువు నీది, నా చదువు నాది. అప్పటికీ ఇలాగే ఉంటే అప్పుడు నిర్ణయించుకుందాం ఏం చేద్దామో. అప్పటికి ఎలా మారతామో చూద్దాం. ప్రత్యేకించి కలవద్దు. ఏమంటావు’. ఒకింత అసంతృప్తిగా అయినా సరే అన్నాడు చందు.
ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఇంజనీరింగ్‌లో చేరాడు చందు. సి.ఎ.చెయ్యాలన్న కోరికతో ఆ వైపుగా కోచింగ్‌ తీసుకుంటూనే బి.కాం పూర్తి చేసి సి.ఎ. ఇంటర్‌ రాయడానికి తయారవుతోంది శ్రావ్య. ఈ మధ్యలో వాళ్ళిద్దరూ కలిసింది కేవలం పదిసార్లు. అదీ వాళ్ళిద్దరి పుట్టిన రోజులకి విష్‌ చేసుకోడానికి మిగిలిన ఫ్రెండ్స్‌తో కలిసే. ఒకరి గురించి ఒకరికి విషయాలన్నీ మాత్రం ఫ్రెండ్స్‌ ద్వారా తెలుసు కుంటూనే ఉన్నారు. ఈ ఐదేళ్ళలో ప్రేమ గట్టిపడిరది. వికసిస్తున్న వ్యక్తిత్వాలు… ఒకరిపై ఒకరి ప్రభావం లేకుండానే ఎదుగుతున్నారు.
స్వతంత్రంగా నిలదొక్కుకోడానికి కనీసం మరో మూడేళ్ళు పడుతుందని అంచనా వేసుకుని అప్పటివరకు ఎటువంటి ఒత్తిళ్ళకి లొంగకుండా ఒకరికోసం ఒకరు ఉండాలని నిర్ణయించుకున్నారు. సొంత ఫోన్లు వచ్చాక ప్రతిరోజూ మాట్లాడుకోవడం మొదలైంది, అదీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. శ్రావ్యలో ఏదో మార్పు కనబడుతుండడం పసిగట్టిన శాంతి ఒకరోజు శ్రావ్యని కూర్చోబెట్టుకుని ఇంతకుముందు మాట్లాడుకున్న విషయమే అయినా వాళ్ళ బాబాయిని కులాంతర వివాహం చేసుకో డానికి ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించిందీ చెప్తూ, ‘నువ్వైతే ఏం చేస్తావు?’ అని అడిగింది. ‘నువ్వున్నా వుగా మమ్మీ. నాకేం భయం. అన్నీ నువ్వు చూసు కుంటావుగా’ అని శాంతి ఒళ్ళో వాలిపోయింది. గట్టిగా చుట్టేసిన చేతుల్ని నిముర్తూ ‘ఏరా, ఎవరా అబ్బాయి? నీ ఫ్రెండా’ అని అడిగేసింది. పిన్ని ఎక్కడో పసిగట్టిందని గమనించిన శ్రావ్య కూడా ఏదో ఒకరోజు ఈ ప్రశ్న వస్తుందని ఊహించింది. అందుకే అడిగిందే తడవుగా విషయమంతా చెప్పేసింది. ‘సోషల్‌ కేటగిరీ ఒకటే అయినా చందు కులం వేరు. నీ విషయం వేరు. ఈ విషయంలో డాడీ ఒప్పుకుంటారా లేదా అని చిన్న భయం
ఉంది మమ్మీ. నువ్వు, బాబాయే డాడీని ఒప్పించాలి. ఒప్పుకోకపోతే నీ దగ్గరికే వచ్చేస్తాం ఇద్దరం’ అంది. చిన్నగా నవ్వి, భరోసా ఇస్తున్నట్లు శ్రావ్యని గట్టిగా పట్టుకుని మృదువుగా వీపు నిమురుతూ ఉండి పోయింది శాంతి.
ఏడాదిలో చాలా జరిగాయి. కరోనా కాలం కలిసొచ్చింది. ఇద్దరూ శాంతి, రామ్‌లతో చర్చించి, అవకాశం చూసుకుని ఇళ్ళల్లో చెప్పేశారు. శ్రావ్య ముందు అన్నయ్యకి చెప్పింది. వారంలోపే వాళ్ళ డాడీ అనుకోకుండా పెళ్ళి ప్రస్తావన తెచ్చేసరికి ఆయనతో చెప్పేసింది. ఏ మాత్రం వ్యతిరేకత లేకపోవడంతో హాయిగా ఊపిరి పీల్చుకుంది. అయితే ‘అబ్బాయి వాళ్ళ పెద్దవాళ్ళు ఒప్పుకుంటేనే పెళ్ళి, అది కూడా మాగ్జిమమ్‌ రెండేళ్ళు టైం ఇవ్వగలను’ అన్న వాళ్ళ డాడీ కండిషన్‌కి కొంచెం కలవరపడిరది. ఎందుకంటే చందూ వాళ్ళ నాన్న అనేక సందర్భాల్లో కులాంతర వివాహాలను వ్యతిరేకిస్తూ మాట్లాడటం, వాళ్ళ కమ్యూనిటీలో ఆ ప్రాంతంలో ఆయన కుల పెద్దగా ఉండడం, ఆయన మాటని కుటుంబంలో కాని, బంధువుల్లో కాని ఎవరూ జవదాటకపోవడం, ఒకటి, రెండు సందర్భాల్లో తను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ కులపు అమ్మాయిని తప్పించి ఎవర్నీ కోడలిగా అంగీకరించనని అందర్లో గట్టిగా చెప్పినవి వినడం వల్ల తమ విషయం ఇంట్లో చెప్పడానికి చందు సంకోచిస్తున్నాడు.
ఒకరోజు ఏదో మంచి సంబంధం ఉందని మాట్లాడటం మొదలుపెట్టగానే ఇదే మంచి అదను అని శ్రావ్య గురించి చెప్పి, తననే పెళ్ళి చేసుకోవా లనుకుంటున్నానని చెప్పాడు. దాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులిద్దరూ చచ్చిపోతామని బెదిరించారు. నెల్లాళ్ళకి తల్లి తెలియని అనారోగ్యంతో పదిరోజులు హాస్పిటల్లో చేరాల్సొచ్చింది. ఇదంతా చందూ వల్లేనని తండ్రి దెప్పడం, తల్లి సరిగ్గా మాట్లాడక పోవడం చందు తట్టుకోలేకపోతున్నాడు. ఎవరి కోసం ఎవర్ని వదులుకోవాలో తెలియక, ఎవర్నీ వదులుకోకుండా ఎలా నెగ్గుకురావాలో అర్థంకాక డిప్రెస్‌ అవుతున్నాడు. శ్రావ్య మాటలతో నిలదొక్కు కుంటున్నా కష్టంగానే ఉంది.
ఇదంతా చెప్పి ఒకసారి చందూతో మాట్లాడ మని శాంతిని కోరింది శ్రావ్య. గత నాలుగైదు నెలల్లో శాంతి చాలాసార్లు మాట్లాడటం, శ్రావ్య వాళ్ళ డాడీ కూడా చందూతోను, వాళ్ళ డాడీతోను మాట్లాడటం విషయాన్ని కాస్త మెత్తబరిచాయి. అయితే చందు వాళ్ళ నాన్న మాత్రం ఈ పెళ్ళికి తను ఒప్పుకునేదే లేదని తేల్చి చెప్పేశారు. ‘ఒకవేళ ఆ అమ్మాయినే చేసుకోవాలనుకుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇక నీకు మేం ఉండం, ఆస్తిలో ఏమీ ఇవ్వం’ అన్న దగ్గరికి వచ్చారు. ఒకట్రెండు సందర్భాల్లో సరదా సంభాషణల్లో శ్రావ్య ప్రస్తావన తెస్తే ‘నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోవా. నీకు మేం అవసరం లేదంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళిపో’ అంటూ కేకలేశారని చిన్నబుచ్చుకున్నాడు చందు.
ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇద్దరి సంపాదనతో హాయిగా బ్రతకొచ్చు. కానీ ఇరువైపులా పెద్దలు అంగీకరించాలని వారి ఆశ. ఒకవైపు ఎటువంటి ఇబ్బంది లేకున్నా, రెండోవైపు అంగీకారం కోసం శతవిధాలా ప్రయత్నాలు చేసినా ఫలిం చలేదు, మార్పు వస్తుందన్న నమ్మకమూ లేదు. అందుకే ఇప్పుడు ఇద్దరూ శాంతి దగ్గరకు వచ్చేశారు.
శ్రావ్య వచ్చిన రెండ్రోజులకి పెళ్ళి ముహూర్తం నిర్ణయించుకుని ఫ్యామిలీ మెంబర్స్‌ అందరికీ విషయం చెప్పి ఒప్పించి వారిని తీసుకురావడానికి రామ్‌ వెళ్ళాడు. ఇంకాసేపట్లో వారంతా రానే వస్తారు. ముందురోజు చందు తల్లిదండ్రులతో కాన్ఫరెన్స్‌ కాల్‌లో శాంతి, రామ్‌లు ఇద్దరూ మాట్లాడి ఒప్పించడానికి ప్రయత్నించారు. యువ తరానికి ఆదర్శమవుతారని, పాత రోజులు కాదని, కులమతాల గోడలు కూలడానికి మనం దరం ప్రయత్నించాలని… ఎన్నో చెప్పి చూశారు. అయినా వినలేదు. ‘దగ్గరుండి పిల్లల్తో ఇలాంటి తప్పు చేయి స్తారా? మా పరువేం కావాలి? కులంలో పెద్ద మనిషిగా ఇక నా మాటకి లెక్కెక్కడుంటుంది? నాకు కొడుకు లేడనుకుంటా’ అంటూ ఫోన్‌ పెట్టేశారు.
అవును మరి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కులాల వారీగా తయారుచేయడమే కాక, రాజకీయ లబ్ది కోసం సామాజిక వర్గాలని, కులాల్లో ఉపకులాలని కూడా విడదీసి, సంఘటిత బలం లేకుండా చేస్తున్న ప్రస్తుత ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో కుల నాయకులుగా చెలామణి అయ్యేవారు ఇంత కంటే వేరేగా ఎలా ఉంటారు? ఇంకా మొండిగా చంపుకోడానికే కన్న పిల్లల్నీ వదులుకోడానికి అనాయాసంగా స్ధిపడిపోతున్నారు కాని కుల ప్రాపకాన్ని కాదనుకోడానికి మాత్రం తయ్యారుగా లేరు ఎందుకని? కుల మతాల నిచ్చెనలు నిట్ట నిలువుగా చీలుతున్న ఈ సందర్భంలో యువ భారతం… ఆత్మ నిర్భరత ఎటు పోతుంది!? ఎక్కడ తేలుతుంది!? ఇప్పుడే మేలుకోకపోతే, ‘విభజించి పాలించు’ రాజకీయాన్ని ఛేదించకపోతే భిన్నత్వంలో ఏకత్వానికి అర్థం లేదు. సమోన్నత రాజ్యాంగానికి విలువా లేదు!

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.