భూమిక సంపాదకులకు,
నమస్కారం. జనవరి సంచికలో అంబేద్కర్ భార్య, డాక్టర్ సవితా గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలిపారు. అలానే ‘నెహ్రు గారి భార్య’లో సంతాల్ యువతి
బుధినీమేరaన్ గురించి కూడా మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. ఆమెకు తోడుగా నిలిచిన బెంగాలీ సుధీర్ దత్తా అభినందనీయుడు.
పై రెండిరటి గురించి వ్రాసిన డా.బి.విజయ భారతి, శాంతిశ్రీ బెనర్జీ గారికి ధన్యవాదాలు. ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలియబరుస్తున్న ‘భూమిక’కు వందనాలు.
` మంగళ కందూర్, ఇ`మెయిల్
భూమిక సంపాదకులకు,
జనవరి సంచికలో వచ్చిన ‘శీతాకాల కథా ఉత్సవం’ అనే రైటర్స్ మీట్ గురించి తెలుసుకోవడం కొత్తగా అనిపించింది. అంతమంది రచయితలు, చిత్రకారులు కలయిక చాలా ఉత్సాహంగా సాగివుండవచ్చు. కొత్త ఆలోచనల కలయికలకు మంచి వేదికలు ఇలాంటి మీటింగ్ అలాగే సంపాదకీయం ద్వారా సావిత్రీబాయి గురించి తెలుసుకున్న విషయాలు చాలా మందిలో ఆత్మగౌరవాన్ని పెంచుకునేలా మార్గదర్శకంగా వుంది. గమనమే గమ్యం అనే ధారావాహిక చాలా బాగుంది. ప్రతినెలా ఒక మంచి సినిమా గురించి విశ్లేషించడం ఒక మంచి విషయాన్ని అందరికి మరింత దగ్గర చేసేలా ఉంది.
` డి.జి. మాధవి, హైదరాబాద్