అనువాదం : రఘునాధ్ జోషి
సెక్స్ వర్కర్లపై ఆస్పత్రి సిబ్బంది లైంగికంగా దాడి చేస్తారు, వారిని చిన్నచూపు చూసి కించపరుస్తారు, వారి గోప్యతను అతిక్రమిస్తారు. వాళ్ళు ఎదుర్కొనే వివక్ష వల్ల చివరికి దేశ రాజధానిలో కూడా వైద్య చికిత్సను పొందలేకపోతున్నారు.
శాలిని సింగ్: ‘‘మేము సెక్స్ వర్క్ చేసి సంపాదిస్తాము కాబట్టి మా శరీరాలతో ఏమైనా చేయవచ్చని అనుకుంటారు’’, మీరా (30) భర్త అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడంతో 2012లో తన ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకుని ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ నుండి ఢల్లీికి వచ్చారు. ఆమెలో కోపం, నిస్సత్తువ సమపాళ్ళలో రగులుతున్నాయి.
‘‘నా మందులు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇలా చేస్తారు’’ అని అమిత (39) తన మొహంలో అసహ్యాన్ని వెళ్ళబుచ్చుతూ చూపించారు. ఆస్పత్రిలోని మగ హెల్పర్లు, వార్డు అసిస్టెంట్లు తమ చేతులతో ఆమె ఒంటిని ఎలా తడుముతారో చేసి చూపించారు. ఆ అవమానం సహించరానిదైనా చెకప్‌ల కోసం లేదా మందుల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తిరిగివెళ్తారు.
‘‘మేము హెచ్.ఐ.వి. పరీక్షలు చేయించుకోవడానికి వెళ్ళినపుడు, ఒకవేళ మేము సెక్స్ వర్కర్లమని వాళ్ళకు తెలిస్తే చాలు, సాయం చేస్తామని ఆశ చూపుతారు. ‘వెనుక ద్వారం వైపు నుండి వచ్చేసెయ్, నీ మందులు తెచ్చిస్తాను’ అని అంటారు. ఆ అవకాశాన్ని వాడుకుని మమ్మల్ని అసభ్యంగా తాకుతారు’’. ఇలా కుసుమ్ (45) మాట్లాడుతున్నప్పుడు పలువురు మహిళలు తమకూ అలా జరిగిందని అంగీకరిస్తూ తలలూపారు. అఖిల భారతీయ సెక్స్ వర్కర్ల నెట్‌వర్క్ (AIచీూఔ) ప్రెసిడెంట్‌గా కుసుమ్ గతంలో పనిచేశారు. ఈ ఫెడరేషన్‌లో భాగంగా 16 రాష్ట్రాలకు చెందిన సామూహిక సేవా సంస్థలు 45 లక్షల సెక్స్ వర్కర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
ఢల్లీి వాయువ్య జిల్లాలోని రోహిణి అనే ప్రాంతంలోని ఒక సామూహిక ఆశ్రయ శిబిరం వద్ద ూARI సిబ్బంది కొందరు సెక్స్ వర్కర్లను కలిసినప్పుడు, వాళ్ళలో దాదాపు అందరికీ కోవిడ్ మహమ్మారి వల్ల పని దొరకడం లేదని చెప్పారు. చలికాలంలో ఆ రోజు మధ్మాహ్నం పూట వారంతా వెచ్చదనం కోసం ఒకరికొకరు దగ్గరగా కూర్చుని తాము ఇంట్లో వండుకుని స్టీల్ డబ్బాలలో తెచ్చుకున్న ఆహారాన్ని పంచుకుని భోంచేస్తున్నారు. ఆ భోజనంలో కూరగాయల కూర, దాల్ (పప్పు), రోటీ (రొట్టె) మాత్రమే తినగలిగే దుస్థితిలో ఉన్నారు.
ఢల్లీి వాయువ్య జిల్లాలో ఒక సామూహిక ఆశ్రయ శిబిరం వద్ద సెక్స్ వర్కర్లు కలిసి భోంచేస్తున్నారు. కోవిడ్ మహమ్మరి వల్ల చాలామందికి పని దొరకడం లేదు. ఒంటరిగా ఉండే సెక్స్ వర్కర్లకు వైద్య సేవలను పొందడం మరింత కష్టతరంగా ఉంటుందని మీరా చెప్పారు. ‘‘ఈ మగవాళ్ళు మధ్యాహ్నం రెండిరటి తర్వాత ఆస్పత్రికి తిరిగి రమ్మని అంటారు. ‘నీ పని నేను చేసి పెడతాను అని అంటారు’. అయితే అది ఫ్రీగా జరగదు. కేవలం మందుల కోసం, వార్డు బాయ్‌లను డాక్టర్లుగా పొరబడి వారితో కూడా సెక్స్ చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు మాకు వేరే దారేదీ ఉండదు, తప్పక రాజీ పడాల్సి ఉంటుంది. పెద్ద క్యూలో మేము నిలబడలేం. అంత సమయం మా దగ్గర ఉండదు, అదీకాక కస్టమర్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి అస్సలు సమయం దొరకదు. చికిత్స కోసం వేచి ఉంటే ఆకలితో చనిపోవాలి’’ అని మీరా చెప్పడం కొనసాగించారు. ఆమె కళ్ళల్లో కోపం, గొంతులో వెటకారం తెలుస్తున్నాయి. ‘‘నేనేమైనా గొంతెత్తి మాట్లాడితే, నేను ఒక సెక్స్ వర్కర్‌నని నా మీద వివక్ష చూపుతారు. దాంతో ఉన్న దారులు కూడా మూసుకుపోతాయి’’.
ఆ ప్రాంతంలో ఉన్న రెండు ప్రభుత్వ ఆస్పత్రులు, ఆ చుట్టుపక్కల ఉండే సెక్స్ వర్కర్ల కోసం ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు, అంటే ఒక గంటసేపు సమయాన్ని కేటాయించాయి. ఎన్జీఓ కార్యకర్తల అభ్యర్థన మేరకు ఈ రెండు ఆస్పత్రులు ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఆ సమయాన్ని సెక్స్ వర్కర్లు హెచ్.ఐ.వి. మరియు ఇతర లైంగికంగా సంక్రమించే వ్యాధులు (ఎస్.టి.ఐ.) పరీక్షలు చేయించుకోవడానికి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది.
‘‘సెక్స్ వర్కర్లు సాధారణ ప్రజలతో పాటు ఎక్కువసేపు క్యూలో నించోలేరు, ఎందుకంటే క్యూ చాలా పొడవుగా
ఉంటుంది, వాళ్ళు పరీక్షలు చేయించుకుని చికిత్స పొందడానికి చాలా సమయం పడుతుంది’’ అని రజిని తివారీ చెప్పారు. డిల్లీకి చెందిన సవేరా అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో ఆమె పనిచేస్తున్నారు. ఈ సంస్థ సెక్స్ వర్కర్ల శ్రేయస్సు కోసం పాటుపడుతోంది. క్యూలో ఉన్నప్పుడు ఒకవేళ ఎవరైనా కస్టమర్ వాళ్ళకు కాల్ చేస్తే, క్యూను వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారని ఆమె చెప్పారు. ప్రత్యేకంగా కేటాయించిన ఆ గంటసేపటి సమయంలో కూడా ఎలాగోలా ఆస్పత్రికి వెళ్ళి రావడం కొన్నిసార్లు కష్టతరంగా ఉంటుందని తివారీ చెప్పారు. వైద్య సేవలను పొందడంలో వారికి ఎదురయ్యే ఆటుపోట్లలో ఇది ప్రారంభం మాత్రమే. వైద్యులు ఎస్.టి.ఇ.ల కోసం మాత్రమే వైద్యం చేసి మందులిస్తారు. హెచ్.ఐ.వి. మరియు సిఫిలిస్ వ్యాధుల పరీక్షా కిట్లను సవేరా వంటి ఎన్జీఓలు అందచేస్తాయి. వాటికోసం ఢల్లీి రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణా సంస్థ ఆర్థికపరమైన తోడ్పాటును అందిస్తోంది. ఒక ఎన్జీఓ కార్యాలయంలోని విజిటింగ్ డాక్టర్, సెక్స్ వర్కర్లకు వైద్యపరమైన సలహాలతో పాటు సురక్షితమైన సెక్స్ కోసం పాటించాల్సిన పద్ధతుల గురించిన సమాచారాన్ని అందచేస్తున్నారు. ‘‘ఇతరుల లాగానే సెక్స్ వర్కర్లు కూడా జ్వరం, ఛాతీలో నొప్పి, మధుమేహం వంటి ఇతర వ్యాధులకు లోనయ్యే ప్రమాదముంటుంద’’ని తివారి చెప్పారు. ‘‘వార్డు బాయ్‌లకు తాము సెక్స్ వర్కర్లమని తెలిస్తే తమపై లైంగిక పరమైన చర్యల కోసం ఒత్తిడి చేయడం తరచుగా జరుగుతుంటుంద’’ని సెక్స్ వర్కర్లు స్వీయ అనుభవంతో ఏకీభవిస్తూ చెప్పారు.
ఆస్పత్రి సిబ్బందిగా పనిచేసే మగవాళ్ళకు మహిళా రోగులలో ఎవరు సెక్స్ వర్కర్లో గుర్తించడం సులువైన పనే. ఈ మహిళలు వృత్తిరీత్యా కస్టమర్లను కలిసేందుకు సామూహిక ఆశ్రయ శిబిరం వద్ద వేచి ఉంటారు. ఆ శిబిరం ఈ ఆస్పత్రికి కొంత దూరంలోనే ఉంది. కోవిడ్ మహారోగానికి ముందు, ఈ ఆస్పత్రి గేటు వద్ద నుండి కస్టమర్లు అమితను పికప్ చేసుకుని వెళ్ళేవారు. ఇదంతా ఆస్పత్రికి చెందిన మగ సిబ్బంది కళ్ళముందే జరిగింది. ‘‘హెచ్.ఐ.వి టెస్టింగ్ కోసం వాడే ప్రత్యేకమైన కాగితపు స్లిప్‌ను బట్టి, అవి ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు సెక్స్ వర్కర్లని చివరికి గార్డులు కూడా అర్థం చేసుకున్నారు. మేము పరీక్షలు చేయించుకోడానికి వెళ్ళినపుడు మమ్మల్ని గుర్తుపట్టి, తమలో తాము మాట్లాడుకుంటారు. కొన్నిసార్లు, క్యూ అవసరం లేకుండా వైద్యులను సంప్రదించడానికి మా కస్టమర్ల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని అమిత చెప్పారు. నిజానికి, వైద్యులను సంప్రదించడానికి, చికిత్స పొందడానికి, మందులు తీసుకోడానికి వేర్వేరు క్యూలు ఉంటాయి. అమిత భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోవడంతో రెండు దశాబ్దాల క్రితం తన ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెను వెంటబెట్టుకుని పాట్నా నుండి ఢల్లీి తరలివచ్చారు. మొదట్లో దినకూలీగా ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవారు. అక్కడ ఆమెకు అందాల్సిన వేతనాలు అందకపోవడంతో ఒక స్నేహితురాలు సెక్స్ వర్క్ చేయమని సూచించారు. ‘‘నాకు ఇలాంటి పని చేయడం అస్సలు ఇష్టంలేదని ఎన్నో రోజులు ఏడ్చేదాన్ని. కానీ 2007లో రోజుకు 600 రూపాయల సంపాదన అంటే ఆషామాషీ కాదు. ఒక్కరోజు వేతనంతో పది రోజుల పాటు తిండి దొరికేది’’.
అమిత, మీరాలతో పాటు ఇతర సెక్స్ వర్కర్ల గాథలు వింటే సెక్స్ వర్కర్లు ప్రత్యేకమైన వివక్షకు గురవుతారని, తద్వారా వైద్య సేవలను పొందడంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుందని సులువుగా అర్థమవుతుంది. అందువల్ల, వీరు ఆస్పత్రులలో తాము చేపట్టే వృత్తిని దాచిపెట్టాల్సి వస్తుందని 2014లో ఒక నివేదిక పేర్కొంది. ‘‘మహిళా సెక్స్ వర్కర్లను విమర్శించడం, హీనంగా చూడటం, వారిని అధిక సమయంపాటు వేచి ఉండేలా చేయడం, సరిగ్గా పరీక్షించకపోవడం, వారికి బలవంతంగా హెచ్.ఐ.వి. పరీక్షలు చేయించడం, ప్రైవేటు ఆస్పత్రులలో మితిమీరి ఛార్జీలు వసూలు చేయడం, వైద్యపరమైన సేవలను, ప్రసూతి సేవలను నిరాకరించడంతో పాటు వారి గోప్యతను అతిక్రమించడం జరుగుతాయి’’ అని ఆ నివేదిక పేర్కొంది. ఈ నివేదికను జాతీయ సెక్స్ వర్కర్ల నెట్‌వర్క్‌లో భాగమైన సహాయసంస్థలు, సెక్స్ వర్కర్ల స్వయం సహాయక సంఘాలు సంయుక్తంగా తయారుచేశాయి.
నివేదికలో పేర్కొన్న అంశాలనే అమిత తన అనుభవంలోనూ చవిచూసింది. ‘‘హెచ్.ఐ.వి. లాంటి పెద్ద వ్యాధుల చికిత్స కోసమో, గర్భస్రావం కోసమో లేదా స్థానిక వైద్యుల వద్ద విసిగి వేసారితేనే మేము పెద్ద ఆస్పత్రికి వెళ్తాము. మిగతా సమయాల్లో రaాలా చాప్ (లైసెన్స్ లేని స్థానిక వైద్యులు) వద్దకు వెళ్తాం. మేము దందా (సెక్స్ వర్క్) చేస్తామని వాళ్ళకు తెలిస్తే, వాళ్ళు కూడా మమ్మల్ని ఏదో ఒకలా దోచుకోవాలని చూస్తారు’’ అని ఆమె చెప్పారు. తమకు ఎదురయ్యే వాళ్ళెవరూ తమపై కనీస మర్యాద చూపించరని కుసుమ చెప్పారు. తమ వృత్తి ఏంటో తెలియగానే లైంగిక వేధింపులు మొదలవుతాయి. సెక్స్ కావాలంటారు, అది కాకపోతే క్షణికమైన లైంగిక సుఖం కావాలి, లేదంటే మమ్మల్ని కించపరిచి అందులో పైశాచిక ఆనందాన్ని పొందాలి. ‘‘బస్ కిసీ భీ తరప్‌ా బాడీ టచ్ కర్నా హై ఉన్‌కో (ఏదైనా చేసి మా శరీరాలను తాకాలి)’’. ఈ వేధింపుల వల్ల వైద్య సేవలను పొందడానికి సెక్స్ వర్కర్లు మొగ్గు చూపకపోవడంతో వాళ్ళకు నచ్చచెప్పాల్సి వస్తోందని డాక్టర్ సుమన్ కుమార్ బిశ్వాస్ చెప్పారు. డాక్టర్ బిశ్వాస్, రోహిణి ప్రాంతానికి చెందినవారు. ఒక స్వచ్ఛంద సంస్థకు చెందిన కార్యాలయంలో సెక్స్ వర్కర్లు ఈయనను సంప్రదిస్తారు. ఈయన ఆ మహిళలకు కండోమ్‌లను పంచడంతో పాటు, వైద్య సలహాలను కూడా ఇస్తారు. కొవిడ్`19 వల్ల సెక్స్ వర్కర్లపై ఉండే వివక్ష మరింత ఎక్కువయింది, దాంతో వాళ్ళు మరింతగా లైంగిక దోపిడీకి గురవుతున్నారు.
‘‘సెక్స్ వర్కర్లను అంటరానివారిగా చూస్తార’’ని AIచీూఔ ప్రస్తుత ప్రెసిడెంట్ అయిన పుతుల్ సింగ్ చెప్పారు. ‘‘రేషన్ షాపుల ముందుండే క్యూలలో మమ్మల్ని అనుమతించరు, ఆధార్ కార్డులు ఉండాలని వేధిస్తారు. మాలో ఒక మహిళ గర్భం దాల్చినప్పుడు అది సంక్లిష్టంగా, ప్రమాదకరంగా మారింది. కానీ అక్కడికి అంబులెన్స్ రావడానికి ఒప్పుకోలేదు. కేవలం కొన్ని కిలోమీటర్ల అదనపు దూరానికి ఐదువేల కంటే ఎక్కువ డబ్బు కడితేనే వస్తామని బెదిరించారు. ఏదోలా ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్ళినా అక్కడి సిబ్బంది డొంకతిరుగుడు కారణాలు చెప్పి ఆమెకు వైద్యం నిరాకరించారు. ఒక డాక్టర్ ఆమెను చూడడానికి ఒప్పుకున్నాడు, కానీ రోగికి ఆమడదూరంలో ఉండి చూశారు’’ అని చెప్పారు. ఆ మహిళను ఒక ప్రైవేట్ క్లినిక్‌కు తీసుకెళ్ళినప్పటికీ చివరికి ఆమె బిడ్డ చనిపోయిందని సింగ్ చెప్పారు.
… … …
ప్రైవేట్, పబ్లిక్ వైద్య రంగాల మధ్య ఒకదాన్ని ఎంచుకోమని అడిగితే ఈ మహిళలకు క్లిష్టమైన ప్రశ్నే అవుతుంది. ‘‘ప్రైవేటు ఆస్పత్రిలో అయితే మర్యాద కోల్పోవాల్సిన అవసరం లేకుండా వైద్యులను సంప్రదించవచ్చు’’ అని అమిత చెప్పారు. అయితే ఈ ఆస్పత్రులలో ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, ప్రైవేటు ఆస్పత్రులలో అబార్షన్ చేయించుకోవడానికి కనీసం రూ.15 వేలు అవుతుంది. ప్రభుత్వ ఆస్పత్రులో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. ప్రభుత్వ ఆస్పత్రులతో వచ్చే మరో చిక్కేమిటంటే, ప్రభుత్వ గుర్తింపు పత్రాలు చాలా అవసరమవుతాయి. పింకీ (28) తన మొహానికి, మెడకు వేసుకున్న మాస్కును తీసి భయంకరమైన ఒక గాయపు గుర్తును చూపించారు. ఆమె కస్టమర్లలో ఒకరు ప్రేమికుడిగా మారి అసూయతో ఆమె గొంతును కోయబోయినప్పుడు ఆ గాయం ఏర్పడిరది. ‘‘మమ్మల్ని లక్షల్లో ప్రశ్నలు అడుగుతారు, మా వివరాలు తెలిసిపోతాయి, మా మీద పోలీసు కేసయ్యే అవకాశం కూడా ఉంది. మరో విషయం ఏంటంటే, మాలో చాలామంది సొంతూళ్ళలో మా ఇళ్ళను వదిలి వచ్చేటప్పుడు మా రేషన్ కార్డులను కానీ, ఇతర పత్రాలను కానీ చాలాసార్లు వెంట తెచ్చుకోము అని ఆమె ప్రభుత్వ ఆస్పత్రికి ఎందుకు వెళ్ళలేదో వివరంగా చెప్పారు. సెక్స్ వర్కర్లు ‘‘ప్రజా ఆరోగ్యానికి హానికరమైన’’వారనే అభిప్రాయం ప్రబలంగా ఉందని ఇండియన్ ఉమెన్స్ హెల్త్ చార్టర్ 2007 మార్చిలో పేర్కొంది. ఆ తర్వాత ఒక దశాబ్దంకు పైగా సమయం గడిచినప్పటికీ, చివరికి రాజధాని నగరంలో కూడా పెద్దగా మార్పులేమీ రాలేదు. కోవిడ్ మహమ్మరి వల్ల సెక్స్ వర్కర్ల జీవనం మరింత దుర్భరంగా మారింది.
2020 అక్టోబరులో జాతీయ మానవ హక్కుల కమీషన్ కోవిడ్`19 సందర్భంలో మహిళల హక్కులపై ఒక సూచనను జారీచేసింది. అందులో సెక్స్ వర్కర్ల దైనందిన జీవితం అనూహ్యమైన స్థాయిలో దెబ్బతిందని పేర్కొంది. కోవిడ్ వల్ల వారి జీవనోపాధి ప్రభావితమైంది, వారిలో హెచ్.ఐ.వి. పాజిటివ్ ఉన్నవారు యాంటీ`రెట్రోవైరల్ చికిత్సను పొందలేకపోతున్నారు. అంతేకాక వారిలో చాలామంది వద్ద ప్రభుత్వ అధికారిక గుర్తింపు పత్రాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు వారికి అందడం లేదు. సెక్స్ వర్కర్లను అసంఘటిత కార్మికులుగా గుర్తించాలనీ, ఇతర రంగాలలోని కార్మికులకు లాగానే వీరికి కూడా సంక్షేమ పథకాలను, ప్రయోజనాలను వర్తింపజేయాలని మొదట ఎన్‌హెచ్‌ఆర్‌సి సూచించినా, చివరికి ఆ సూచనను తొలగించింది. దానికి బదులుగా సెక్స్ వర్కర్లకు మానవతా దృక్పథంతో చేయూతనందించాలని సూచించింది. ‘‘కోవిడ్ సమయంలో పరిస్థితి మరింత దిగజారింది. ప్రభుత్వ ఆస్పత్రులలోని సిబ్బంది ‘మీరు వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశముంది కాబట్టి మేము మిమ్మల్ని ముట్టుకోమ’ని సెక్స్ వర్కర్లకు చెప్పారు. అందువల్ల వాళ్ళకు మందులను తిరస్కరించారు, పరీక్షలు చేయలేదు’’ అని స్నేహ ముఖర్జీ చెప్పారు. ఆమె ఢల్లీికి చెందిన హ్యూమన్ రైట్స్ లా నెట్‌వర్క్‌లో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 2021 మానవ అక్రమ రవాణా బిల్లు డ్రాఫ్ట్ ప్రకారం సెక్స్ వర్కర్లందరూ అక్రమ రవాణా బాధితులుగా పరిగణించబడతారు. ఈ బిల్లు చట్టంగా మారితే సెక్స్ వర్కర్‌గా వృత్తిని కొనసాగించడం మరింత కష్టతరంగా మారుతుందని ముఖర్జీ అభిప్రాయపడ్డారు. దీనివల్ల, సెక్స్ వర్కర్లు వైద్య సేవలను పొందడం మరింత క్లిష్టంగా మారవచ్చని ఆమె హెచ్చరించారు. 2020కి ముందు, రోజుకు ఒకరిద్దరు కస్టమర్లు ఉండి, వారు తలా రూ.200`400 చెల్లిస్తే, సెక్స్ వర్కర్ ఒక నెలకు రూ.6`8 వేల రూపాయల వరకు సంపాదించగలిగేవారు. మొదటిసారి దేశవ్యాప్తంగా కోవిడ్`19 లాక్‌డౌన్ విధించినప్పటి నుండి, నెలల తరబడి కస్టమర్లు లేకపోవడంతో సెక్స్ వర్కర్లు కూడా ఇతర అసంఘటిత రంగ కార్మికుల లాగానే ఇతరుల దాన ధర్మాల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఆహార పదార్ధాలే అరకొరగా ఉన్న పరిస్థితుల్లో మందులు దొరికే ప్రశ్నే లేదు. ‘‘2021 మార్చిలో రేషన్ సరుకులు కూడా ఆగిపోయాయి. సెక్స్ వర్కర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏ పథకాన్నీ ప్రారంభించలేద’’ని AIచీూఔ కో`ఆర్డినేటర్ అమిత్ కుమార్ చెప్పారు. ‘‘కోవిడ్ మహమ్మారి మొదలై దాదాపు రెండేళ్ళు పూర్తవుతున్నా వాళ్ళ వద్దకు కస్టమర్లె వరూ రావట్లేదు. ఆహార కొరతతో పాటు వారి జీవనోపాధిని కోల్పోవటంతో వాళ్ళు చేసే వృత్తి వారి కుటుంబ సభ్యులకు తెలియడం వల్ల వాళ్ళు ఎంతో మానసిక అనారోగ్యానికి గురవుతున్నార’’ని ఆయన చెప్పారు.
సెక్స్ వర్కర్ల నెట్‌వర్క్ రూపొందించిన 2014 నివేదిక ప్రకారం భారతదేశంలో 8 లక్షలకు పైగా సెక్స్ వర్కర్లు ఉన్నారు. వారిలో దాదాపు 30 వేల మంది ఢల్లీిలో ఉన్నారని తివారీ అంచనా వేశారు. రాజధానిలోని దాదాపు 30 ఎన్జీఓలు ఒక్కొక్కటి కనీసం వెయ్యిమంది సెక్స్‌వర్కర్ల చొప్పున విభజించుకుని వారికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించడంలో సహాయపడుతున్నాయి. ఈ మహిళలు తమను తాము దినకూలీలుగా పరిగణిస్తారు. ‘‘మేము ఈ పనిని సెక్స్ వర్క్ అనే పేరుతో పిలుస్తాం, వ్యభిచారం అని కాదు. ఏ రోజుకు ఆ రోజు సంపాదిస్తాను, దాంతో నా ఆకలి తీర్చుకుంటాను. నాకంటూ ఒక ఫిక్స్‌డ్ స్పాట్ ఉంది. రోజుకు ఒకరిద్దరు కస్టమర్లు వస్తారు, తలా రూ.200`300 చెల్లిస్తారు’’ అని రాణి (34) చెప్పారు. ఈమెది ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదాయు జిల్లా, ఈమె భర్త చనిపోయారు.
ఈ మహిళల జీవనోపాధి, వాళ్ళ జీవితంలో ఒక పార్శ్వం మాత్రమే. ‘‘ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సెక్స్ వర్కర్ల జీవితాలను ప్రభావితం చేసే ఇతర అంశాలెన్నో ఉన్నాయి. వీరు ఒంటరిగా బతికే మహిళలు, ఒంటరిగా పిల్లలను పెంచుకుంటోన్న తల్లులు, దళిత మహిళలు, నిరక్షరాస్యులు, వలస వచ్చిన మహిళలు మొదలైన వివిధ వర్గాలకు చెందినవారు’’ అని మంజిమ భట్టాచార్య చెప్పారు. ఈమె ముంబైకి చెందిన సామాజిక కార్యకర్త మరియు స్త్రీవాద రచయిత. గ్లోబలైజేషన్ మరియు సాంకేతికతల వల్ల లైంగిక క్రయవిక్రయాల వ్యాపారంపై ఎలాంటి ప్రభావం పడిరదో వివరిస్తూ ‘ఇంటిమేట్ సిటీ’ అనే పుస్తకాన్ని రాశారు. ‘‘చాలా కేసులలో ఖర్చులకు సరిపడా ఆదాయాన్ని సంపాదించుకోడానికి ఈ మహిళలు పలు రకాల పనులు చేసుకుంటారు. ఇళ్ళల్లో పనిమనిషిగా, భవన నిర్మాణ కార్మికురాలిగా, కర్మాగారాలలో కార్మికురాలిగా మొదలైనవి’’ అని ఆమె చెప్పారు. సెక్స్ వర్క్‌లో కూడా కొన్ని అనిశ్చిత పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ‘‘ఈ పనికోసం మేము వేరేవాళ్ళ ఇంటిని వాడుకోవాల్సి వస్తే ఆ వ్యక్తికి కమీషన్ ఇవ్వాలి. కస్టమర్‌ను నేను తీసుకొస్తే నేను నెలకు రూ.200`300 అద్దె రూపంలో కట్టాలి. కానీ అదే కస్టమర్‌ను ఆ దీదీ (ఇంటి ఓనర్) తెస్తే, ఫిక్స్‌డ్ రేట్ మొత్తాన్ని నేను ఆమెకు ఇవ్వాలి’’ అని రాణి చెప్పారు. అటువంటి ఒక ఇంటికి ఆమె నన్ను తీసుకెళ్ళారు. తాను ఎవరన్న విషయాన్ని రహస్యంగా ఉంచుతామని, తద్వారా ఈ సెక్స్ వర్క్ ఒప్పందాన్ని ఇరకాటంలో పెట్టబోమని నిర్ధారించాల్సిందిగా ఆ ఇంటి యజమాని మమ్మల్ని అడిగారు. మేము నిర్ధారించిన తర్వాతే సెక్స్ వర్క్ కోసం కేటాయించిన గదిని మాకు చూపించారు. అందులో ఫర్నిచర్ పెద్దగా లేదు. ఒక మంచం, అద్దం, భారతీయ దేవతామూర్తుల ఫోటోలు, వేసవి కాలంలో వాడేందుకు గాను ఒక పాత కూలర్ ఉన్నాయి. ఇద్దరు మహిళలు మంచం మీద కూర్చుని తమ మొబైళ్ళలో లీనమై ఉన్నారు. బాల్కనీలో పొగ తాగుతోన్న ఇద్దరు మగ వాళ్ళు తమ చూపు తిప్పుకున్నారు. తమ శరీరాన్ని ఆర్థిక వనరుగా మార్చే ‘ప్రపంచపు అత్యంత పురాతన వృత్తి’లోని వారికి ఈ వృత్తిని ఎంచుకోవడంలో ఎంతవరకు స్వేచ్ఛ ఉంటుంది అనే ప్రశ్నను లేవనెత్తితే, దానికి సమాధానమివ్వడం మానవ చరిత్ర అంతటా కష్టతరంగా ఉందని చెప్పవచ్చు. ఈ వృత్తిని పూర్తి స్వేచ్ఛతో ఎంచుకోవడం జరిగిందని చెప్పడం కష్టం, ఎందుకంటే ఈ ఎంపికను చెడ్డదిగా, అనైతికమైనదిగా పరిగణించడం జరుగుతుందని భట్టాచార్య చెప్పారు. ‘‘సెక్స్ వర్క్‌ను కావాలనే ఎంచుకున్నానని ఏ మహిళయినా చెప్పుకుంటుందా? ఇలాంటి ప్రశ్నే మరో చోట ఎదురవుతుంది. తను బాయ్‌ఫ్రెండ్‌తోనో లేదా భాగస్వామితోనో సెక్స్‌కి సమ్మతించానని నిక్కచ్చిగా ఒప్పుకోవడానికి అమ్మాయిలు వెనుకాడతారు. ఎందుకంటే, అలా ఒప్పుకుంటే తాము ‘చెడ్డ’ అమ్మాయిలమనే లేబుల్ పడుతుంది’’. ఇదిలా ఉండగా, తన పిల్లల ఆహారం, ఇల్లు, స్కూలు ఫీజులకు, మందులకు ఖర్చు చేయడానికి తాను డబ్బు ఎలా సంపాదిస్తున్నాననే విషయాన్ని తన ఎదిగే పిల్లలకు ఎలా చెప్పాలా అని రాణి ఆలోచిస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో యుక్త వయస్సులోని ఆడపిల్లలు మరియు యువ మహిళల మీద దేశవ్యాప్తంగా ూARI మరియు జశీబఅ్‌వతీవీవసఱa ుతీబర్ సంయుక్తంగా ఈ రిపోర్టింగ్ ప్రాజెక్టును చేపట్టాయి. సాధారణ ప్రజల అనుభవాలను, వారి దృష్టి కోణాలను వెలికితీస్తూ, అణచివేతకు గురైన వర్గాల ప్రజల స్థితిగతులను అన్వేషించడానికి ూశీజూబశ్రీa్‌ఱశీఅ ఖీశీబఅసa్‌ఱశీఅ శీట Iఅసఱa సపోర్టు చేసిన కార్యక్రమాలలో ఈ ప్రాజెక్టు ఒకటి.
(ఈ వ్యాసం (https://ruralindiaonline.org/en/articles/they-grope-me-when-they-give-my-medicines/)పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా (ruralindiaonline.org) ఫిబ్రవరి 21, 2022 లో మొదట ప్రచురితమైనది.)