సిమోన్‌ ద బోవా: స్త్రీవాదంతో పాటు స్వతంత్ర ఆలోచనల ఒక ఆదర్శ మహిళ -వేలూరి కృష్ణమూర్తి

మహిళల వెదుకులాట, పోరాటాలకు ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఈ పోరాటాలకు సామాజిక, రాజకీయ, అలాగే సాంస్కృతిక ఆయామాల స్పష్టమైన రూపం లభించింది పాశ్చాత్య దేశాల మేథావంతులు, వారు చేసిన పోరాటాల వల్ల. వారిలో సిమోన్‌ ద బోవా గారిది పెద్ద పేరు. బోవా ప్రతిపాదించిన అభిప్రాయాలు ఆమె మాటల్లో చెప్పాలంటే, ‘మొదట మహిళ తనపై

తాను ఆధారపడడం ముఖ్యం. అంటే, సాంప్రదాయం వల్ల మహిళ ఎవరెవరికో ఆస్తి అవుతున్నదే తప్ప, తన స్వంత ఆస్తి కావడం లేదు. ఒక మహిళ వివాహమవగానే భర్త, అనంతరం ఆమె పిల్లల ఆస్తి అవుతోంది. పెళ్ళి కాకుంటే తల్లిదండ్రుల ఆస్తి అవుతుంది. ఏ సమయంలోనైనా భర్త, పిల్లలు ఆమెనుండి స్పష్టీకరణ, సహాయం అడగవచ్చు. దీన్ని నెరవేర్చడం ఆమె కర్తవ్యం. ఆమె కుటుంబానికి, సమాజానికి చెందుతుంది కానీ తనకు మాత్రం చెందదు’.
మరొకటేమిటంటేÑ స్త్రీలనూ, పురుషులనూ పూర్తి మనుషులుగా చూడడం ఈ కాలానికి అత్యవసరం. ఈ ఇద్దరి మధ్య భేదం నాశనం కావాలి. స్త్రీ పోరాటానికి దానిదే అయిన అనన్యత ఉంది. అదీకాక ఈ పోరాటాన్ని పురుషులతో కలిసి చేయాల్సిన అవసరముంది. స్త్రీవాది పోరాటాల నుండి పురుషులను వేరుచేసి ఉంచేదాని గురించి నాకు నమ్మకం లేదు. ఇది ఒక ధోరణి అయితే మహిళలు తమ తలరాతను తామే రాసుకోవాలి. ఎవరి ఉద్దారం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదన్నది బోవా ఇంకొక గట్టి నమ్మకం.
‘స్త్రీలుగా ఎవరూ జన్మించరు. వారు స్త్రీలుగా రూపించబడతారు. అమ్మాయిలలో సామర్ధ్యముండదని కాదు, సమాజం ఆమె చలన వలయాలను కట్టివేసింది. చరిత్ర వైఫల్యం వల్ల నిరాశ చెందాల్సిన పనిలేదు. ఇది మగవారి లోకమని మౌనంగా ఉండిపోకూడదు. మహిళలు తమకోసం ఒక ఖాళీ పేపరును వెదుక్కోవాలి. దానిలో ఒక కొత్త లోకానికి అడుగుజాడలను నిర్మించుకోవాలి.
దగ్గర దగ్గర 70 ఏళ్ళ క్రితం సిమోన్‌ ద బోవా అన్న ఈ మాటలు. వాటి ప్రకారమే తన జీవితాన్ని రూపొందించుకుని అలాగే ప్రవర్తించిన ధీర మహిళ. సిమోన్‌ కేవలం స్త్రీవాది ఆలోచనాపరురాలు మాత్రమే కాదు, ఆమె ఒక గొప్ప మానవతావాది. తాను చెప్పినట్లు చేసి చూపించింది. తత్వశాస్త్రానికి కూడా గొప్ప కానుకను అందించింది. స్త్రీ వాదపు కొన్ని పాయలలో ఆమెది ఒకటి. ఆమె జీవితం, ఆమె మాటలు ఇప్పటికీ ప్రస్తుతం. ఇది ప్రపంచంలోని అందరు మహిళలకు సిమోన్‌ దబోవా చేసే ఒత్తిడికి తోడు దానికి తనే సాక్షిగా ఉన్నానన్న ప్రామాణికమైన నడత ఆమెది. ఫ్రెంచ్‌ ఆలోచనా క్రమంలో ఇలాంటి మొదటి నమ్మకం మాది అన్న ఒకింత అహంభావం ఆమెకు ఉండేది. దీనికి తోడు జీన్‌ పాల్‌ సాత్రేతో మేథో సాంగత్యం, వారిద్దరూ నిరంతరమైన హెచ్చరికతో కాపాడుకొన్న స్వతంత్రత. ఇవి రెండూ ఒక పోరాట యోధురాలి ప్రాథమిక అవసరాలై ఉండేవి. బోవా జీవిత దృష్టికోణాన్ని ప్రతిబింబించే అనేక సంగతులు ఆమె తన రచనలలో చర్చించారు. శ్రద్దావంతులైన క్యాథలిక్‌ కుటుంబంలో జన్మించి, పెరిగిన బోవా కాల్పనిక సత్యహీనమైన నమ్మకాలున్న రాజకీయాలకు సంబంధించిన, ధార్మికతకు సంబంధించిన వాటిని తీవ్రంగా ప్రతిరోధించింది. సిమోన్‌ ద బోవా ఆలోచనా క్రమం మరియు జీవన ప్రేమను ఎవరు ఇష్టపడకుండా ఉండగలరు? ఆమె వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం మహిళలకు ఒక గుణపాఠం.
అస్తిత్వ వాదం మరియు స్త్రీ వాదాల విశిష్టమైన కలయిక ప్రాతిపదికగా ఆమె జీవితం మరియు ఆమె రచనలు ప్రతిబింబించాయి. ఆమె వెదుకులాట, ఆలోచనా మార్గంలో మనకు కనిపించేది పితృప్రధాన సమాజం విశ్లేషణ మాత్రమే కాదు, అక్కడ మనుషుల అస్తిత్వానికి సంబంధించిన మూలభూత ప్రశ్నల అన్వేషణ కూడా ఉంది. స్త్రీ వాదం యొక్క విభిన్న ధోరణులైన ఫ్రెంచ్‌, బ్రిటిష్‌, అమెరికన్‌ ఆలోచనా చలనశీల చట్రంలో ఆమె ఆలోచనల అనన్యతను పరిశీలించాల్సిన అవసరముంది.
తన ఇంద్రియ లోకం, భావనా లోకం మరియు ఆలోచనా లోకాలు ‘స్వతః తనవేనని’ అన్నందుకు, అలా జీవించినందుకు సిమోన్‌ బోవా పడిన కష్టాలు, అనుభవించిన బాధలు ఎన్నో. ఈ కారణంవల్ల సంప్రదాయబద్ధమైన ఆనాటి యూరోపులో ఆమె తాను చేస్తున్న ఉద్యోగాన్ని పోగొట్టుకుంది. ‘మాతృత్వానికి విరోధి, కుటుంబమనే వ్యవస్థకు విరోధి’ అని ఆమెని వర్ణించి కించపరిచారు. ఇంత జరిగినా ఆమె తన నమ్మకాలకు అనుగుణంగానే నడుచుకొంది. దానివల్ల శిలువ కిరీటాన్ని కోసింది. ఆమెది స్వతంత్రమే తప్ప స్వచ్ఛందత కాదు. చివరివరకూ స్వచ్ఛందత రూపు రేఖలను తీర్మానించేవారెవరు? ఈ నేపథ్యంలో ఆమె జీవితం, అలాగే ఆమె రచనలలో ఈనాటికీ మనం అనుసరించాల్సిన కొన్ని ముఖ్యమైన పాఠాలున్నాయి. కేవలం స్త్రీ వాదులకు మాత్రమే కాదు, అందరి సంవేదనాశీలులకూ ముఖ్యమనిపించే ఈ రచనల ఉపయోగం అన్ని కాలాలకూ అన్వయమవుతుంది.
సిమోన్‌ ద బోవా ప్రముఖ రచన ‘ది సెకండ్‌ సెక్స్‌’ గ్రంథం 1949లో ఫ్రెంచ్‌ భాషలో ప్రచురితమయింది. 1953లో అది ఇంగ్లీషులోకి అనువదించబడి, అనంతర కాలంలో ఎన్నో పునఃముద్రణలకు నోచుకుంది. అనంతర కాలంలో ప్రపంచంలోని ఎన్నో భాషల్లో అనువదించబడిరది. 2007లో కన్నడ భాషలోకి అనువదించబడిరది. ఈ కృతి మహిళా దృష్టి కోణంలో స్త్రీ వాద సంబంధిత రచన. సిమోన్‌ ద బోవా 1908 జనవరి 6న పారిస్‌లోని ఒక శ్రీమంతుల బోర్జియస్‌ కుటుంబంలో జన్మించింది. తండ్రి జార్జ్‌ బట్య్రాండ్‌ ద బోవా, తల్లి ఫ్రాంకోయిస్‌ బోవా. తల్లిని సిమోన్‌ బోవా ‘మామెన్‌’ అని పిలిచేవారు. సిమోన్‌కు ఒక సోదరి, పేరు హెలెనీ. చెల్లెల్ని బోవా పపెట్‌ అని పిలిచేవారు. 1925లో గణితం మరియు తత్వ శాస్త్రంలో బ్యాచిలరేట్‌ ముగించిన తర్వాత 1928లో సోరెబాన్‌ విశ్వవిద్యాలయం నుండి తత్వ శాస్త్రంలో ఉన్నత పట్టభద్రురాలయింది. 1929 అక్టోబర్‌లో జీన్‌పాల్‌, సాత్రెను కలిసింది. అనతర కాలంలో ఇద్దరూ 51 సంవత్సరాల కాలం సహజీవనంలో గడిపారు. 1971లో ఫ్రాన్స్‌ మహిళా పోరాటం యొక్క ముఖ్య ప్రణాళిక`మానిఫెస్టో 343, గర్భపాతం స్వతంత్రతకు అవకాశమిచ్చే చట్టానికి తన మద్దతును ప్రకటించారు. 1986 ఏప్రిల్‌ 8వ తేదీన ఆమె మరణించారు. 1980లో మరణించిన సాత్రె సమాధి, సిమోన్‌ బోవా సమాధి ఒకే చోట ఉంటాయి. ఈ సమాధులున్న స్థలం మౌంట్‌ పర్నాస్‌ సిమెత్రీ.
సిమోన్‌ ద బోవా మొత్తం నాలుగు ఆత్మ సంబంధమైన కథలను రాశారు. ఈ ఆత్మకథ గొలుసు క్రమంలో మొదటిది ‘మెమైర్స్‌ ఆఫ్‌ ఎ డ్యూటిఫుల్‌ డాటర్‌’. ఈ కథ ప్రెంచ్‌ భాషలో 1958లో ప్రచురించబడిరది. జేమ్స్‌ కిర్కప్‌ దాన్ని Memoirs of a Dutiful Daughter పేరుతో ఆంగ్లంలోకి అనువదించాడు. ఈ మొదటి ఆత్మకథ బాల్యం, యుక్తవయసులోని గందరగోళాలు, మనుష్య సంబంధాల సూక్ష్మమైన అవలోకనపు భాగం. తన ఆసక్తులను గుర్తించుకొంటూ జరిగిన ఆమె మేథో ప్రయాణంలో ముఖ్యమైన సూచనలు ఇందులో ఉన్నాయి. ‘ద ప్రైం ఆఫ్‌ లైఫ్‌ (The prime of life)’ సిమోన్‌ బోవా గొలుసు ఆత్మకథ క్రమంలో రెండవ భాగం. ఇది 1960లో ఫ్రెంచ్‌ భాషలో ప్రచురితమయింది. సిమోన్‌ బోవా తన జీవితపు ప్రారంభపు రోజులను, అనంతర కాలాన్ని 1929 నుండి 1944 వరకు పారిస్‌లో గడిపింది. ఆ కాలంలోని పారిస్‌ జీవితం, అప్పటి సమాజ పరిస్థితి, జీన్‌ పాల్‌ సాత్రెతో గడిపిన రోజులు, ఆ కాలంలోని ఇతర మేధో వ్యక్తులతో గడిపిన సంగతులు ఇందులో ఉంటాయి.
‘ఫోర్స్‌ ఆఫ్‌ సర్కమ్‌స్టాన్సెస్‌ (Force of circumstances)’ 1963లో ఫ్రెంచ్‌ భాషలో ప్రచురితమైన సిమోన్‌ బోవా ఆత్మకథ గొలుసు కథలో మూడవ భాగం. దీన్ని 1965లో రిచర్డ్‌ హోవార్డ్‌ ఇంగ్లీష్‌లోకి అనువదించాడు. 1944 నుంచి 1963 వరకు సిమోన్‌ బోవా జీవితానికి సంబంధించిన వివరాలు ఇందులో పొందుపరచబడ్డాయి. ఫ్రెంచ్‌ స్వాతంత్య్ర సంగ్రామం, అల్జీరియా యుద్ధానికి సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయి. ఇవేకాక జీన్‌ పాల్‌ సాత్రె, అలాగే తన ప్రియుడు ఎల్గేృన్‌తో సిమోన్‌ బోవా సంకీర్ణమైన సంబంధాల గురించిన వివరాలు కూడా ఉంటాయి. సిమోన్‌ బోవా రాసిన ఆత్మకథా క్రమంలో ఆఖరి భాగం ‘ఆల్‌ సెడ్‌ అండ్‌ డన్‌’ 1974లో ప్రచురితమైంది. విస్తారమైన ఈ ఆత్మకథ చివరి భాగంలో బోవా చివరి పది సంవత్సరాలు (1962`1972) జీవితం చిత్రించబడిరది. ఈ భాగంలో సిమోన్‌ బోవా మేధో లోకం నిర్మాణమైనదాన్ని గురించి అంతర్దృష్టి ఉంది. ప్రపంచంలోని వివిధ దేశాలలో జరుగుతున్న మార్పులకు సిమోన్‌ బోవా ప్రతిక్రియ ఉల్లేఖించబడిరది. ఇందులో తాను సాత్రె, అలాగే ఇతర మేధో మిత్రులతో కలిసి తిరిగిన ప్రదేశాల గురించి అనేక వివరాలు ఉన్నాయి. అనుభవించిన భయాలు, బాధలు, నిజం చెప్పడానికి వెనుకాడని సిమోన్‌ బోవా జీవితం ఇందులో వివరించబడిరది. ‘ఎ వెరీ ఈజీ డెత్‌’ 1964లో తల్లి మరణించిన సంవత్సరం తర్వాత ప్రచురించింది. దుఃఖం, పశ్చాత్తాపం, ఆత్మ విమర్శ, అలాగే అనుభవించిన కష్టాల విశ్లేషణ ఇందులో చోటుచేసుకున్నాయి. తన తల్లిని మామేన్‌ అని పిలిచే సిమోన్‌ ఆమెతో ఆరు వారాల కాలం సిమోన్‌ జరిపిన మాటలు, చర్చలు, అనుభవాలను పంచుకున్న విషయాల నిరూపణ ఈ గ్రంథం.
సిమోన్‌ బోవా రచించిన మరొక ఉత్కృష్ట గ్రంథం ‘Aసఱవబఞ’ ఎ ఫేర్‌వెల్‌ టు సాత్రె (A farewell to satre). 1930లో సాత్రెతో ఆమె పరిచయం, కొన్ని మేధో సంబంధమైన రచనలకు సాక్షిjైునది. సాత్రె అస్తిత్వ వాదాన్ని రూపిస్తే, స్త్రీ వాదపు విరాట్‌ రూపాన్ని సిమోన్‌ ద బోవా ఆవిష్కరించింది. వారిద్దరి స్నేహానికి సంబంధించిన లేఖలు ఎన్నో ఇందులో చోటు చేసుకున్నాయి. తన ప్రియ మిత్రుడు సాత్రెతో గడిపిన చివరి పదేళ్ళ అనుబంధానికి సంబంధించిన సంగతులను ఇందులో పొందుపరిచారు సిమోన్‌. దీనిలో తాత్విక జిజ్ఞాస, భిన్నాభిప్రాయాలు, ప్రేమ లాంటి విషయాలు అనేకం ఉన్నాయి.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.