సుందరగిరి గ్రామంలో, రవీందద్‌కి నాలుగు ఎకరాల పొలం ఉంది. భూగర్భజలాలు పుష్కలంగా ఉన్నప్పటికీ వరి పండిరచ కుండా కూరగాయలు పండిస్తున్నాడు. దానికి కారణం తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండిరచాలని అంటాడు. అయినప్పటికీ అతడి కష్టానికి తగిన ఆదాయం లేక నిరాశకు లోనయ్యాడు.
ఆ సమయంలో జనవికాస సంస్ధ సభ్యులు అతడికి కొన్ని సూచనలు చేశారు. ఫలితంగా అతడి సాగు విధానమే మారి పోయింది..
‘‘ నేను ఇంతకు ముందు, బీర , కాకరను నేలపైన సాగుచేస్తే, ఎకరాకు 5టన్నుల కాయలు మాత్రమే వచ్చేవి. మాకు పందిర్లు మీద సాగు చేయడం నేర్పారు. దీనివల్ల 9 నుండి 12 టన్నుల వరకు దిగుబడి పెరిగింది. బీర, టమాటా కూడా పండిస్తున్నాం. ఇపుడు ఆదాయం పెరగడంతో మాతో పాటు నలుగురు కూలీలకు పని దొరికింది.’’
తీగజాతి పంటలు నేల మీద కంటే నింగిలో పందిర్ల మీద పండిస్తే, ఎక్కువ ఆదాయం వస్తుందని రవీందర్ తెలుసుకున్నాడు. ఇతడి విజయాన్ని చూసిన మిగతా రైతులంతా ఆదే బాటలో అడుగులు వేస్తున్నారు.
తెలంగాణలో వ్యవసాయం వర్షాధారమైనది. కూరగాయలు పండిరచే రైతులకు కష్టానికి తగిన ఆదాయం రాక అప్పుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక చిన్న ఆలోచనతో ,నూతన సాగుపద్దతులు ద్వారా మెరుగైన దిగుబడులు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో చిగురుమామిడి మండలంలోనివి సుందరగిరి , బొల్లోనిపల్లి. ఈ గ్రామాల్లో వర్షపాతం చాలా తక్కువ. తీవ్రమైన నీటి ఎద్దడిని రైతులు ఎదుర్కొంటూ, పంటల వ్యవసాయంలో నష్టపోయారు. దీనికి పరిష్కారం దిశగా,జనవికాస రూరల్ డెవలప్‌మెంట్ సంస్ధ ఈ రెండు గ్రామాల్లో 50 మంది రైతులను ఎంపిక చేసి, నేలమీద పంటలను నింగిలో సాగు చేసేలా ఆధునిక పద్ధతిలో పందిర్ల మీద సాగు విధానంలో శిక్షణ ఇచ్చారు.
తెలంగాణలో పైలెట్ ప్రాజెక్టు!
దేశంలోనే తొలిసారిగా నాబార్డ్ ఆర్ధిక సాయంతో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టుఇది. రైతుల కోసం పనిచేస్తున్న జనవికాస సంస్ధ ద్వారా అమలు చేశారు రైతులకు నష్టాలు పాలు కాకుండా దిగుబడి పెంచడమే ఈ కార్యక్రమం ఉద్ధేశ్యం. సేంద్రీయ సాగు పై రైతులకు ఉద్యాన నిపుణుల తో శిక్షణ ఇప్పించారు. హైదరాబాదు, జీడిమెట్లలోని ఫార్మర్ ట్రైనింగ్ సెంటర్ లో వైవిధ్యమైన పందిర్ల సాగును రైతులకు చూపించి అవగాహన కల్పించారు.
పంట మార్పిడి పద్దతిలో …
ప్రతి రైతు 10 గుంటాస్‌లో పందిరి కూరగాయలు, మిగతా 30 గుంటాస్‌లో టమాటా, మిర్చి, వంకాయ, బెండకాయ మొదలైనవి సాగుచేస్తున్నారు. 9 ఫీట్ల రాతి స్తంభాలు ఇచ్చి పందిర్లు వేయించారు. కూరగాయల విత్తనాలు, మల్చింగ్ షీట్స్, వర్మీ కంపోస్ట్, వేప పిండి ని కూడా రైతులకు అందించారు.
ఇపుడు ఈ రైతులు ఒకే రకం పంటలు కాకుండా పంట మార్పిడి పద్దతి అనుసరిస్తున్నారు. దీని వల్ల నేల సారం కోల్పోకుండా ఉంటుంది. బహుళ పంటలు సాగు చేస్తున్నారు. ఒక పంట దెబ్బతిన్నా మరో పంటలో లాభం పొందుతున్నారు. ఇలా ఎక్కువ దిగుబడి సాధించి, స్వయం సమృద్ధి సాధించిన రైతులు ఏమంటారంటే …
ఉద్యోగం వదిలి పొలానికి…
‘‘ గతంలో ప్రైవుట్ కంపెనీలో పనిచేస్తూ నెలకు రూ.10 వేలు జీతం పొందే వాడిని,అది సరిపోక ఆ ఉద్యోగం వదిలి వ్యవసాయం చేస్తున్నా… మాకు పందిర్లకు, మల్చింగ్‌కి సాయం చేసి, వేపపిండి, తక్కువ ధరకు అందించారు. వీటితో సేంద్రియ సద్దతిలో కూరగాయలు పండిస్తూ ఇపుడు నెలకు రూ.20 వేల వరకు ఆదాయం పొందుతున్నాను. ’’ అంటారు యువరైతు కిషన్.
దిగుబడి పెరిగింది..
‘‘ పందిర్ల మీద సాగు వల్ల గతంలో కంటే ఎక్కువ దిగుబడి వచ్చింది. పంటలకు తెగులు రాకుండా వేస్ట్ డిరకంపోజ్ వాడుతున్నాం. ఇంగువ ద్రావణం,ఆవు మూత్రం,పిడకల బూడిద కలిపిన విత్తనాలు నాటితే తెగులు రాకుండా
ఉంటుందని సేంద్రియ సేద్యం శిక్షణలో మాకు వివరించారు. ఇపుడు ప్రతీ కుటుంబం కూరగాయల సాగులో నిమగ్నమయ్యారు…’’ అంటారు మహిళా రైతు సుమలత.
సొంతంగా ఎరువులు
‘‘ మాకు ఆర్ధిక స్తోమత లేక పందిర్లు వేసుకోలేక పోయాం. నాబార్డు సాయం వల్ల ఇపుడు పందిర్లు వేసి, బీర, కాకర, పండిస్తూ అధిక దిగుబడి పొందుతున్నాం. సేంద్రియ ఎరువుల తయారీలో శిక్షణ ఇచ్చారు. దీని వల్ల కూడా మా పొలాల్లో భూసారం దెబ్బతినకుండా ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నాం. వీటికి మార్కెట్‌లో డిమాండ్ కూడా ఉన్నది.’’
అంటాడు నాగరాజు.
తేమను కాపాడుతున్నాం…
‘‘గతంలో కూరగాయలు పండిరచేటోళ్లం కానీ, చీడ,పీడల వల్ల చాలా తక్కువ దిగుబడి వచ్చేది. బీర, కాకర నేల మీద పాకించడం వల్ల కాయల్లో నాణ్యత తగ్గిపోయేది. స్వచ్ఛంద సంస్ధవారు 20 మంది రైతులకు డ్రిప్ సౌకర్యం కల్పించారు. 50మందికి పందిర్లు వేసుకోవడానికి, మల్చింగ్ కోసం అర్ధిక సాయం అందించారు. వీటి వల్ల భూగర్భజలాలను పొదుపు చేస్తు, ఎక్కువ పంటలు సాగు చేస్తున్నాం. మల్చింగ్ షీట్లు కూడా ఇచ్చారు. దీని వల్ల తేమను కాపాడుతున్నాం. కలుపు పెరగడం లేదు. పెరిగిన పంట ఉత్పత్తుల రైతు సంఘాల ద్వారా అమ్ముతూ రైతుకు తోడ్పాటునందిసున్నాం…’’ అంటారు, రైతు ఉత్పత్తిదారుల సంఘం ఛైర్మన్, తిరుపతి.
‘‘ పందిర్ల పై తీగలు చిక్కగా అల్లుకుని నీడ ఏర్పడటం వల్ల, కలుపు పెరగలేదు. దీనివల్ల సాగు ఖర్చు తగ్గింది. నేల మీద కాకర పంట 120 రోజుల్లో పూర్తయితే.. అదే పందిరిపై ఆరు నెలల పంట కాలం ఉంటుంది. నేల పైన సాగు చేస్తే, ఎకరాకు 5 నుంచి 8 టన్నుల దిగుబడి వస్తే… పందిరిపై 15టన్నులకు పైగా దిగుబడి వస్తుంది.’’ అంటారు మరో రైతు అమృతమ్మ.
నీటి ఎద్దడిని తట్టుకొని…
చిగురుమామిడి మండలం తీవ్రమైన నీటి ఎద్దడి ఉన్న ప్రాంతం. సుందరగిరి, బొల్లోనిపల్లి గ్రామాలలో ఉన్న స్వల్ప భూగర్బజలాలను వినియోగించుకుని ఎక్కువ పంటలను పండిరచడానికి రైతులకు తోడ్పాటు నందించారు ఎన్జీఓలు.
పందిర్ల మీద తీగజాతి కాయగూరలను సాగు చేయడం వల్ల రైతులు తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు. నాణ్యమైన సేంద్రియ విధానంలో పండిరచిడం వల్ల మార్కెట్లో గిట్టుబాటు ధరలు పొందుతూ, స్వయం సమృద్ధి సాధించారు.
ఆదాయాలు పెరగడం వల్ల గ్రామాలు ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నాయి. భవిష్యత్‌లో వీరి పంటలకు సేంద్రీయ సర్టి ఫికేట్‌లు కూడా ఇప్పించడానికి నాబార్డు ముందుకు వచ్చింది.
రైతులు సాధించిన ఫలితాలు…
1. గతంలో తీగజాతి కూరగాయలను నేల మీద సాగు చేయడం వల్ల గాలి, వెలుతురు సోకక, చీడ పీడల బెడద ఎక్కువై నాణ్యత లోపించేది. ఇపుడు పెండాల్స్ వల్ల ఆ సమస్యలు తగ్గి, నాణ్యమైన దిగుబడులు ఇవ్వడమే కాక రైతులకు శ్రమ,ఖర్చు తగ్గింది.
2. కాకర పంట కాలం నేల మీద సాగు చేస్తే, 120 రోజుల్లో పూర్తవుతుంది. అదే పందిరి పై అయితే ఆరునెలల వరకు పంట కాలం ఉంటుంది. కాకరను నేలపైన సాగుచేస్తే, ఎకరాకు 5 నుండి 8 టన్నుల దిగుబడి మాత్రమే వస్తుంది. అదే పందిరి మీద అయితే 15 నుండి 20 టన్నుల దిగుబడి పెరుగుతుంది.
3. డ్రిప్ సౌకర్యం వల్ల భూగర్భజలాలను పొదుపు చేస్తున్నారు. పండిరచిన కూరగాయలను ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ల ద్వారా మార్కెట్ చేసుకొని గిట్టుబాటు ధరలు పొందుతున్నారు.
4. అగ్రినిపుణులతో శిక్షణ అనంతరం రసాయన ఎరువులకు స్వస్తి చెప్పి సేంద్రియ ఎరువులను, వాడుతూ, భూసారాన్ని కాపాడుతున్నారు.
5. నింగిలో సాగు వల్ల దిగుబడులు పెరిగి, ప్రతీ రైతు నెలకు రూ. 20 వేల నుండి రూ.30 వేల వరకు ఆదాయం పొందుతూ, సుస్ధిర జీవనోపాధులు పొందుతున్నాడు.
బీడు భూముల్లో తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం పొందడానికి ,కూరగాయల సాగుతో ఆహార భద్రత, ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఫార్మ్‌సెక్టార్ ప్రమోషన్ ఫండ్ విజయ వంతమవ్వడంలో రైతుల పట్టుదల,కృషి ఇతర గ్రామాలకు స్ఫూర్తి నిచ్చింది. ఒకపుడు చాలీ చాలని ఆదాయం తో నిరశకు గురైన రైతులు నేడు మెరుగైన ఆర్థిక అభివృద్ధి సాధించి సుస్ధిర జీవనోపాధులు పొందుతున్నారు.
‘50 మంది రైతులతో సేంద్రియ విధానంలో సాగుబడిని అమలు చేస్తున్నాము . నేల మీద పండిరచే బీర, కాకర పాదులను పందిర్ల మీద పెంచడం వల్ల 50 శాతం అదనంగా దిగుబడి పెరిగింది. ఈ విధానంలో నాటిన 60 నుండి 70 రోజుల్లో కోతకు వస్తున్నాయి. సేంద్రియ ఎరువులతో పండిరచిన కూరగాయలు త్వరగా చెడిపోకుండా నాలుగు రోజుల వరకు నిల్వ
ఉంటున్నాయి…అని జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యదర్శి సంపత్ కుమార్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.