హిజాబ్‌ ధరించిన ముస్లిం విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని వేధించే చర్యలను మహిళా సంఘాలుగా, ప్రజాస్వామిక వాదులుగా, వ్యక్తులుగా ఖండిస్తున్నాం -Feminists, Democratic Groups and Individuals

హిజాబ్‌ ధరించిన ముస్లిం విద్యార్థినులను టార్గెట్‌ చేసుకుని వేధిస్తోన్న హిందూ మతోన్మాదుల చర్యలు, ముస్లిం మహిళలను వేధించేందుకు ఎంచుకున్న మరో సాకు మాత్రమేనని, ఇప్పటికే ముస్లిం మహిళల లైంగిక విషయాల మీద చేస్తున్న దాడులు, వారిని

బహిరంగ వేలంలో పెట్టి, వారి వ్యక్తిత్వాల గురించి నీచమైన పదజాలంలో దూషిస్తున్న తీరును మహిళా సంఘాలు, ప్రజాస్వామిక సంస్థలు, సమూహాలు, విద్యావేత్తలు, న్యాయవాదులు, వ్యక్తులమంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నాం.
రాజ్యాంగం విద్యాసంస్థల్లో అన్ని మతాల వారికీ, తమ సాంస్కృతిక అస్తిత్వాన్ని కొనసాగిస్తూనే విద్యను పొందే హక్కు కల్పించిందని, ఈ బహిరంగ లేఖకి మద్దతిస్తూ సంతకాలు చేసిన 1850కి పైగా సంస్థలు, వ్యక్తులం బలంగా నమ్ముతున్నాం. యూనిఫాం అనేది ఆర్థిక అంతరాలు కనిపించకుండా ఉండేందుకు పెట్టుకున్న ఒక నియమం మాత్రమే. ఆ కారణంగా ఎవరి మీదా సాంస్కృతిక భావజాలాన్ని రుద్దే హక్కు లేదు. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కుతోనే సిక్కులు తలపాగాతోనే తరగతి గదిలో కూర్చునేందుకు అనుమతి ఉంది. అలాగే పోలీసు శాఖలోనూ, రక్షణ శాఖలోనూ తలపాగాతోనే తమ విధులు నిర్వహించేందుకు అనుమతి ఉంది. అలాగే హిందువులు యూనిఫాంతో పాటు బొట్టు, తిలకం, విభూతి, నామాలు పెట్టుకున్నా ఎలాంటి వివాదాలు లేవు. అలాగే ముస్లిం మహిళలు కూడా తమ యూనిఫాంతో పాటు హిజాబ్‌ ధరిస్తున్నారు.
హిజాబ్‌ ధరించే విద్యార్థినులను ప్రత్యేక తరగతి గదుల్లో కూర్చోమని బెదిరించడం, లేదంటే ముస్లిం కళాశాలల్లో చదువుకోమని హెచ్చరించడం, మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు చేస్తున్న చర్య తప్ప మరొకటి కాదు. 2008 నుండే కర్నాటకలోని కోస్తా ప్రాంతంలో మతాంతార వివాహాలు చేసుకున్న వారిమీద దాడి చేయడం, హిందూ`ముస్లిం విద్యార్థుల మధ్య స్నేహాలను చెడగొట్టడం చూస్తూనే ఉన్నాం. ఈ కాషాయ మూకలు కేవలం ముస్లిం మహిళల మీదే కాదు, వెస్ట్రన్‌ దుస్తులతో పబ్‌లకు వెళ్ళే హిందూ అమ్మాయిల పైన, ముస్లిం అబ్బాయిలను పెళ్ళి చేసుకున్న హిందూ ఆడపిల్లల మీద కూడా ఇలాంటి దాడులే చేస్తున్నారు. ఈ మూకలు ముస్లిం మహిళలకు వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొట్టడమే కాదు కరడు గట్టిన పితృస్వామ్య భావజాలంతో హిందూ మహిళలపై కూడా ఆంక్షలు విధిస్తున్నారు, దాడులకు తెగబడుతున్నారు.
ఈ బహిరంగ లేఖకు 15 రాష్ట్రాలకు చెందిన 130 గ్రూపులు తమ మద్దతును తెలియచేశాయి. ఇందులో ఆల్‌ ఇండియా డెమోక్రటిక్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌, ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌, నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఉమెన్‌, బెబాక్‌ కలెక్టివ్‌, సహేలీ ఉమెన్స్‌ రిసోర్స్‌ సెంటర్‌, ఆవాజ్‌ ఏ నిజ్వాన్‌, నేషనల్‌ అలయెన్స్‌ ఫర్‌ పీపుల్స్‌ మూమెంట్‌, ఫోరమ్‌ ఎగైనెస్ట్‌ అప్రెషన్‌ ఆఫ్‌ ఉమెన్‌, పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌, దళిత్‌ ఉమెన్‌ కలెక్టివ్‌, నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ దళిత్‌ ఉమెన్‌, ఉమెన్‌ ఎగైనెస్ట్‌ సెక్సువల్‌ వయొలెన్స్‌ అండ్‌ స్టేస్‌ రిప్రెషన్‌తో పాటు, కవితా కృష్ణన్‌, మరియం దావ్లే, అరుణ రాయ్‌, రాధికా వేముల, మనుజ ప్రదీప్‌, సఫూర జర్గర్‌, హసీనా ఖాన్‌, అజిత రావ్‌, ఖలీదా పర్వీన్‌, ఉమ చక్రవర్తి, సుజాత సూరేపల్లి, వృంద గ్రోవర్‌, విర్గిన సల్దన, సత్నమ్‌ కౌర్‌, సాధన ఆర్య, చయనిక షా, పౌషలి బసక్‌, నివేదితా మెనన్‌, సుశీ తారు, ప్రభాత్‌ పట్నాయక్‌, రాధికా సింగ్‌, అమృత చాచి లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు.
ఈ లేఖని మీ మీ వేదికలమీద ప్రచురించమని, ఈ సమస్యని అందరి దృష్టికి తీసుకెళ్ళి, పరిష్కారం కోసం అందరి మద్దతును సమీకరించమని కోరుకుంటున్నాం.
ఇతర వివరాలకు సంప్రదించండిః అనురాధ 8860824559, కవిత 9560756628
ఈ`మెయిల్‌ ఃsaheliwomen@gmail.com
హిజాబ్‌ ధరించే ముస్లిం మహిళా విద్యార్థినులను టార్గెట్‌ చేసుకుని, వారిని వేధిస్తున్న వ్యక్తులు, సంస్థలు:
1. తరగతి గదుల్లో, కళాశాల ప్రాంగణాలలో హిజాబ్‌ ధరించడం మీద నిషేధం విధిస్తూ, కర్ణాటకలోని కోస్తా ప్రాంతంలో ఒక బెదిరింపు ధోరణి మొదలైంది. ఈ ధోరణి అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తోందంటే, మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు చేస్తున్న చర్యల్లో భాగమే. హిందూ ఆధిపత్య శక్తులు, ముస్లింలను ఏదో ఒక కారణంతో వేరుచేసి చూడడం, వారిని బహిష్కరించే ధోరణితో వ్యవహరించడం చాలాకాలంగా జరుగుతున్నదే. అది బీఫ్‌ కావచ్చు, సామూహిక మత ప్రార్థనలు కావొచ్చు, అజాన్‌ కావొచ్చు, వారు మాట్లాడే ఉర్దూ భాష కావొచ్చు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఇప్పుడు వాళ్ళు ఎంచుకున్న మరో ఆయుధం, ముస్లిం మహిళలు ధరించే హిజాబ్‌.
2. మధ్య కర్ణాటకలోని ఒక కళాశాలలో కాషాయ టోపీలు, కండువాలు ధరించిన ఒక అల్లరి మూక, ఆ కళాశాల ప్రాంగణంలోకి హిజాబ్‌తో అడుగు పెట్టిన ముస్లిం విద్యార్థినిపై అరుచుకుంటూ తనని టార్గెట్‌ చేసి, భయపెట్టేందుకు చేసిన ప్రయత్నం వీడియోలో చూస్తుంటే, రాబోయే రోజుల్లో హిజాబ్‌ కారణంతో ముస్లింలపై ఎలాంటి దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నారో అర్థమవుతోంది.
3. రాజ్యాంగం విద్యావ్యవస్థల్లో అన్ని మతాలవారికీ, తమ సాంస్కృతిక అస్తిత్వాన్ని కొనసాగిస్తూనే, విద్యను పొందే హక్కును కల్పించిందని బలంగా నమ్ముతున్నాం. యూనిఫాం అనేది ఆర్థిక అంతరాలు కనిపించకుండా ఉండేందుకు పెట్టుకున్న ఒక నియమం మాత్రమే. ఆ కారణంగా ఎవరిమీదా సాంస్కృతిక భావజాలాన్ని రుద్దే హక్కు లేదు. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కుతోనే సిక్కులు తలపాగాతోనే తరగతి గదిలో కూర్చునేందుకు అనుమతి ఉంది. అలాగే పోలీసు శాఖలోనూ, రక్షణ శాఖలోనూ తలపాగాతోనే తమ విధులు నిర్వహించేందుకు అనుమతి ఉంది. అలాగే హిందువులు యూనిఫాంతో పాటు బొట్టు, తిలకం, విభూతి, నామాలు పెట్టుకున్నా ఎలాంటి వివాదాలు లేవు. అలాగే ముస్లిం మహిళలు కూడా తమ యూనిఫాంతో పాటు హిజాబ్‌ ధరిస్తున్నారు.
4. ఉడిపి కళాశాలల్లోని రూల్‌ బుక్స్‌లో ముస్లిం మహిళలు తమ యూనిఫాం కలర్‌లో ఉండే హిజాబ్‌ ధరించేందుకు అనుమతి ఉంది. అందుకే ఇది కళాశాలల యాజమాన్యాల సమస్య కాదు. హిజాబ్‌ను నిషేధించాలని కాషాయ తిలకాలు, కాషాయ కండువాలు ధరించిన హిందూ మతోన్మాద శక్తులు లేవనెత్తిన వివాదం. ఒకవేళ నిజంగా విద్యాసంస్థల్లో హిజాబ్‌లను నిషేధించాల్సి వస్తే, హిజాబ్‌లే ఎందుకు నిషేధించాలి? కాషాయ కండువాలను కూడా నిషేధించాలి. అది చేయలేనప్పుడు, హిజాబ్‌ని మాత్రమే నిషేధించాలనే డిమాండ్‌ చేయడమంటే, ముస్లిం మహిళలను టార్గెట్‌ చేసి, వారిని భయభ్రాంతులకు గురిచేసేందుకు కాషాయ మూకలు పనిగట్టుకుని చేస్తోన్న దౌర్జన్యమిది.
5. హిజాబ్‌ ధరించే మహిళ్ని ప్రత్యేక తరగతి గదుల్లో కూర్చోమని చెప్పడం, లేదంటే, ముస్లిం కళాశాలల్లో చదువుకోమని హెచ్చరించడమనేది మత విద్వేషం రెచ్చగొట్టడానికి చేస్తోన్న చర్య తప్ప మరోటి కాదు. 2008 నుండే కర్నాటకలోని కోస్తా ప్రాంతంలో ఈ మూకలు హిందూ ముస్లిం విద్యార్థుల స్నేహిలపై ఆంక్షలు పెట్టడం, మతాంతార వివాహాలు చేసుకున్న వారిని బెదిరించడం, భౌతికదాడులు చేయడం జరుగుతోంది. కేవలం ముస్లిం మహిళలమీదే కాదు, ఈ మతోన్మాదులు, వెస్ట్రన్‌ దుస్తులతో పబ్‌లకు వెళ్ళే హిందూ అమ్మాయిలపై, ముస్లిం అబ్బాయిలను పెళ్ళి చేసుకున్న హిందూ మత ఆడపిల్లల మీద కూడా ఇలాంటి దాడులే చేస్తున్నారు. ఈ హిందూ మతోన్మాద గుంపులు ముస్లిం మహిళలకు వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొట్టడమే కాకుండా, కరడు గట్టిన పితృస్వామ్య భావజాలంతో, హిందూ మహిళలపై కూడా దాడులకు తెగబడుతున్నారు.
6. కర్ణాటక హోం శాఖ మంత్రి హిజాబ్‌ ధరించిన ముస్లిం మహిళల ఫోన్‌ రికార్డులపై దర్యాప్తు చేయమని, ఉగ్రవాద సంస్థలతో వారికున్న లింకులపై పరిశీలించమని ఆదేశించారని తెలిసి మేము ఆశ్చర్యానికి గురయ్యాం. ఇప్పటివరకూ ముస్లింలు తమని ఈ దేశ పౌరులుగా గుర్తించమని అడిగితే, తమ పట్ల వివక్షను చూపొద్దని నినదిస్తే వారిని టెర్రరిస్టుగా ముద్రవేయడం చూశాం. కానీ, ఇదే దేశంలో హిందూ మహిళలు, సిక్కు మతస్థులు తమ సంప్రదాయం ప్రకారం చీరలని ముసుగుగా వేసుకుంటే ఎలాంటి అభ్యంతరాలుండవు, కానీ ముస్లిం మహిళలు హిజాబ్‌ ధరిస్తే మాత్రం నేరమయిపోతుంది. భారత దేశ తొలి మహిళా ప్రధాని, తొలి మహిళా రాష్ట్రపతి కూడా తమ చీరలతో తల నిండుగా చుట్టుకునేవారు. మరి వాళ్ళిద్దరి వస్త్రధారణ మీద ఎందుకు కామెంట్లు చేయలేదు? ఎందుకు వారి విషయాన్ని వివాదాస్పదం చేయలేదు?
7. ఏ మహిళలైనా వారి వస్త్రధారణ విషయంలో అవమానాలకు, బెదిరింపులకు గురికాకుండా చదువుకోగలగాలి. విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా విద్యార్థులు తలలమీద ఏం ధరించారనే దానిమీద కాకుండా, విద్యార్థుల తలల్లో ఏ ఆలోచనలు కలుగుతున్నాయనే విషయాల మీద దృష్టి పెట్టాలి. ఈ సందర్భంగా జీన్స్‌ వేసుకుని, షార్ట్స్‌ వేసుకుని, హిజాబ్స్‌ వేసుకునే మేము కాలేజీలకు వస్తామని ధైర్యంగా చెప్పిన మహిళలకు మనమంతా అండగా నిలబడాలి.
8. ముస్లిం మహిళలు హిజాబ్‌ ధరించినా, ధరించకపోయినా అది వారి హక్కు. ఆ హక్కుని గౌరవిద్దాం, వారికి సంఫీుభావంగా నిలబడదాం. కర్ణాటక ముస్లిం మహిళా విద్యార్థినులు తమ సంస్కృతిలో భాగంగా మాత్రమే హిజాబ్‌లు ధరిస్తున్నారని విశ్వసిస్తున్నాం, అందుకే ఆ సంస్కృతిని తప్పనిసరిగా గౌరవిద్దాం.
9. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలనేది వారి వ్యక్తిగతమైన విషయం. అంతేకానీ, ఆ వస్త్రధారణ అణకువకు, అసభ్యతకు కొలమానం మాత్రం కాదు. మహిళల దుస్తుల విషయంలో, అన్ని మతాల పితృస్వామ్య ఆలోచనల నుండి వచ్చిన సాంస్కృతిక భావజాలం మాత్రమే. అందుకే స్త్రీలు ఎలాంటి దుస్తులు ధరిస్తే గౌరవించబడతారనే హితోపదేశాలు మానండి. వారు ఎలాంటి దుస్తులు ధరించినా వారిని గౌరవించడం నేర్చుకోండి. ఒక స్త్రీ తన శరీర భాగాలు కనిపించేలా వస్త్రధారణ చేసుకుంటే, ఆమె ఒక మంచి హిందూ మహిళ/ ఒక మంచి ముస్లిం మహిళ/ ఒక మంచి క్రిస్టియన్‌మహిళ/ ఒక మంచి సిక్కు మహిళ కాదని మీరు నిర్ధారణలు చేశారంటే, అది మీ పితృస్వామ్య భావజాలంలో ఉన్న సమస్య. ఈ పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా ఒక్కో మహిళ ఒక్కో విధంగా నిరసనను తెలియచేస్తుంది. తనకు అవసరమైనవేంటో, అనవసరమైనవేంటో తానే నిర్ణయించుకుంటుంది. తనదైన పద్ధతిలో తన హక్కుల కోసం పోరాడుతుంది. అలాంటి మహిళల ఆలోచనల్ని, ఆకాంక్షల్ని గౌరవిద్దాం.
10. కర్ణాటకలోని విద్యాసంస్థలో ముస్లిం విద్యార్థిని పట్ల దూకుడుగా వ్యవహరించిన వ్యక్తులపైనా, అందుకు బాధ్యులైన సంస్థలపైనా తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఇతర చోట్ల హిజాబ్‌ ధరించిన మహిళల పట్ల ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని, తక్షణమే చర్యలు తీసుకునేలా పోలీసులని ఆదేశించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తున్నాం.

Share
This entry was posted in సమాచారం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.