ఆడదయితే చాలు…
ముసలి అయినా కాసు గాయ
అయినా ఒకటే…
గుంట నక్కల ఆకలికి
ఎత్తుగా ఉంటే బలంగా ఉన్నదనో
అరకొర బట్టలేసుకుందనో
నగ్నంగా కళ్ళబడ్డదనో
ఒళ్ళో కూచోబెట్టుకొని
తాకరాని చోట తడుముతూ
అటీటు ఆడపిల్లలను కూర్చో
బెట్టుకొని గిచ్చుతూ గిల్లుతూ
పిసుకుతూ నసుకుతూ
గాంధీ సినిమా చూపించినట్టు కాదు…
చదువు సంస్కారం నేర్పే గురువులైతే నేమి
పొట్ట చీల్చినా అక్షరమ్ముక్క
రాని నిరక్షరకుక్షి అయితేనేమి
పిల్లి కళ్ళుమూసుకుని పాలు
తాగినట్టు దయ్యాలు వేదాలు
వల్లించినట్టుగా ఉంటుంది…
అక్కడ కనిపించేది ఆడతనం
మాత్రమే… తాపీగా కోర్టుకెక్కడం ఓ తప్పే అక్కడున్న
పరిస్థితులేమో వెసులుబాటు
లెంతో ఆలోచించని జడపదార్థాలకేం తెలుస్తుంది…
కులం తెలిస్తే ముట్టుకోవటం
తెలియకపోతే పట్టుకోవడం
రెచ్చగొట్టే బట్టలేసుకుంటేనే
తాకుతారట… అదేదో వాళ్ళ జన్మహక్కైనట్టు… నిర్భయ
నుంచి ఆసిఫా దాకా… దీనాం
ఈ పరంపర కొనసాగుతూనే
ఉన్నది. రోజూ వార్తల్లో…
అనుచిత వ్యాఖ్యలను
దేడ్ దిమాక్ మాటలను
కట్టడి చేయకుంటే పర్యవసానం
గురించి తెల్సినప్పుడే
‘‘ఒకటికి’’పడ్డప్పుడు మాత్రమే
అరికట్టబడ్తాయి…ఈ…