సమాజంలోని స్త్రీల సమస్యలకు సహాయమందించే వారిలో భూమికదే మొదటిస్థానం అని చెప్పవచ్చు.
స్త్రీల సమస్యలకు పరిష్కారం చూపిస్తూ ఆసరా అవుతున్నది భూమిక.
స్త్రీలలోని సృజనాత్మకతను వెలికితీస్తూ, రచనలను ఆహ్వానించి ప్రచురించి అందరికీ చోటు కల్పించడం ఆనందం.
ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై అవగాహన కల్పించి చేయూతనిచ్చే చెలిమి.
చిరుదరహాసాలందిస్తూ, స్నేహభావంతో అందరినీ ఆలోచింపచేసే సంపాదకీయాలనందించే సంపాదకురాలు సత్యవతి గారి కృషి అంచనాలకు అందనంత ఎత్తుతో, అనేక ప్రక్రియలతో మునుముందుకు నడుస్తున్నది భూమిక.
కవన భూమిక కవితలతో, పుస్తక పరిచయాలతో, సమీక్షలతో సందడి చేస్తూ, అనుభవసారాలతో జీవిత గమనాన్ని తెలుసుకుంటూ, భావిపౌరుల రచనలకు ప్రోత్సాహమందించే ‘భూమిక’ చిరకాలం వర్ధిల్లాలి.
` డా॥బండారి సుజాత