నేను చదువుకోవాలి, ఇదే నాకున్న ఒకే ఒక కల – రాహుల్‌

ఝార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్‌ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో నివసిస్తున్న సోమ్‌వారీ బాస్కేకి బడికి వెళ్ళడం, చదువుకోవటం అంత సులభమైన పని కాదు. అయినప్పటికీ సంతాలి, సబర్‌, హో, హిందీ, బంగ్లా భాషలు మాట్లాడే ఈ 13 సంవత్సరాల చిన్నారి ఒక పట్టుదల కలిగిన అభ్యాసకురాలు. ‘‘ఝారియాలో గత 4`5 నెలలుగా మాకు కరెంటు లేదు.

మా అక్క, తమ్ముడు, నేను కలిసి చదువుకోవడానికి టార్చిలైట్‌ వాడతాం. కానీ అది 30`45 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది, మళ్ళీ రీఛార్జి చేయాల్సి వస్తుంది.’’
సంతాల్‌ ఆదివాసీ సముదాయానికి చెందిన 13 ఏళ్ళ సోమ్‌వారీ బాస్కే భాటిన్‌ మాథ్యమిక పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని. ఆమె పాఠశాల విద్య పూర్తి చేయాలని దృఢంగా నిశ్చయించుకుంది. ‘‘నేను బాగా చదువుకోవాలి, ఇదే నాకున్న ఒకే ఒక్క కల’’ అని చెప్పింది బాస్కే.
జాదూగోరా బ్లాక్‌లోని రaారియా గ్రామంలో 1000 మందికి పైగా జనాభా ఉంటారు. ఈ గ్రామం అక్షరాస్యత రేటు 59 శాతం, కానీ రaార్ఖండ్‌ సగటు (66 శాతం) కన్నా ఇది తక్కువ. తూర్పు సింగ్‌భూమ్‌ జిల్లాలోని ఈ రaారియా గ్రామంలో ఒక్క ప్రాథమిక పాఠశాలే ఉన్నందున సోమ్‌వారీ తన ఇంటి నుండి 4 కి.మీ. దూరంలో గల మాధ్యమిక పాఠశాలకు వెళ్ళవలసి వస్తోంది.
ఈ విలేఖరి సమీపంలోని ఖరియా కోచా గ్రామానికి వెళ్ళినపుడు సబర్‌ భాషను హిందీలోకి అనువదించి చెప్పటానికి చిన్నారి సోమ్‌వారీ తానే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ విలేఖరికి సహాయకురాలిగా తూర్పు సింగ్‌భూమ్‌ లోని సబర్‌ సముదాయపు ప్రజలతో మాట్లాడేందుకు తోడ్పాటునందించింది. తన మాతృభాష అయిన సంతాలీ గాక సోమ్‌వారీ సబర్‌, హో, హిందీ, బంగ్లా భాషలు మాట్లాడగలదు.
తన గ్రామమైన రaారియా నుండి దాదాపుగా ఒక కిలోమీటర్‌ దూరంలో ఉన్న ఖరియా కోచా గ్రామానికి ముందుకూ, వెనక్కూ పరిగెడుతూ తన టార్చ్‌లైటును ఎలా రీఛార్జి చేసుకుంటుందో సోమ్‌వారీ హిందీలో మాట్లాడుతూ, వివరించింది.
.. … …
‘‘మేం సరైన సమయానికి బిల్లు కట్టకపోవడం వల్ల మా కరెంటు కనెక్షన్‌ తీసేశారు. విద్యుచ్ఛక్తి విభాగం వారు మా తాతగారైన గురాయీ బాస్కే పేరు మీద రూ.16,745 బిల్లు పంపించారు. ఇంత పెద్ద మొత్తాన్ని మేమెలా సమకూర్చగలం?’’
‘‘అందుకే మాకీ కరెంటు కోత’’
‘‘మా ఊర్లో చాలా కొద్దిమంది ఇళ్ళల్లో మాత్రమే కరెంట్‌ కనెక్షన్‌ ఉంది. మేం వారి ఇళ్ళకు వెళ్ళి మా టార్చ్‌లైట్‌, మొబైల్‌ ఫోన్‌ ఛార్జ్‌ చేసుకోవడం వారికి ఇష్టం ఉండదు. అందువల్ల నేను ప క్క గ్రామమైన ఖరియా కోచాకు వెళ్ళి నా టార్చ్‌లైట్‌ ఛార్జ్‌ చేసుకుంటాను. ఆ ఊర్లో ఏదైనా ఒక సబర్‌ ఆదివాసి ఇంట్లో నా ఫ్లాష్‌లైట్‌ ఛార్జికి పెట్టి మా ఇంటికి తిరిగి వచ్చేస్తాను.’’
ఆ తర్వాత నేను పప్పా (నాన్న) లేదా చాచా (బాబాయ్‌)ల సైకిల్‌ కోసం వారు మార్కెట్‌ నుండి తిరిగి వచ్చేవరకు వేచి చూస్తాను. టార్చ్‌లైట్‌ పూర్తిగా చార్జ్‌ కావడానికి 3`4 గంటలు పడుతుంది. ఆలోపు సైకిల్‌ నా చేతికి రాగానే వెంటనే వెళ్ళి దాన్ని తిరిగి తెచ్చుకుంటాను. నేను ప్రతిరోజూ ఉదయం ఏదోలా టార్చ్‌ని ఖచ్చితంగా ఛార్జ్‌ చేయాల్సిందే, లేకపోతే మేమిక ఆ రాత్రి చదువుకోలేం. మా అక్క రతనీ బాస్కే 10వ తరగతి, తమ్ముడు జితూ బాస్కే 3వ తరగతి చదువుతున్నారు.
‘‘చాలాసార్లు మాకు ఖరిచా కోచ్‌కు వెళ్ళటం కుదరదు. అలాంటప్పుడు బ్యాటరీలో మిగిలివున్న ఛార్జిని పొదుపుగా వాడుకుంటాం, లేదంటే కొవ్వొత్తితో సరిపెట్టుకుంటాం.
భాటిన్‌ మాధ్యమిక పాఠశాలకు విద్యార్థులు భాటిన్‌ నుండి, రaారియా వంటి చుట్టుపక్కల గ్రామాల నుండి వస్తారు. మొత్తం 232 మంది విద్యార్థుల్లో దాదాపుగా అందరూ ఆదివాసీ తెగలకు చెందినవారే. ‘‘మేం బడిలో మధ్యాహ్న భోజనం పెడతాం. గుడ్లు లేదా పళ్ళు పంచిపెట్టిన రోజున అత్యధిక సంఖ్యలో విద్యార్థులు హాజరవుతారు,’’ అని సోమ్‌వారీ చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు దినేశ్‌ చంద్ర భగత్‌ తెలిపారు.
ఝార్ఖండ్‌ ప్రభుత్వం రaార్ఖండ్‌ ఎడ్యుకేషన్‌ ప్రాజెక్ట్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్‌ యూనిఫామ్‌లు అందజేస్తోంది. 1`5 తరగతుల విద్యార్థులు ఒక్కొక్కరికి ఒక జత స్కూలు యూనిఫామ్‌, బూట్లు, సాక్స్‌ కొనుక్కోవటానికి రూ.600 కేటాయిస్తారు. 6`8 తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి స్కూల్‌ యూనిఫాం కొరకు రూ.400, స్వెటర్‌ కొరకు రూ.200, ఒక జత బూట్లు, సాక్స్‌ కొరకు రూ.160 అందజేస్తారు.
ఈ పథకం ద్వారా అందవలసిన డబ్బు డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డిబిటి) ద్వారా విద్యార్థుల బ్యాంక్‌ అకౌంట్లకు నేరుగా చేరుతుంది. అయితే, మొత్తం విద్యార్థుల్లో, 60 శాతం మంది విద్యార్థులకు మాత్రమే యూనిఫామ్‌ కొనుక్కోవడానికి డబ్బు అందిందని ప్రధానోపాధ్యాయులు భగత్‌ చెప్పారు.
ఝారియా జనాభాలో 94.39 శాతం మంది సంతాల్‌, ముండా, తాంతీ, లోహర్‌ మొదలైన ఆదివాసీ తెగలకు చెందినవారే. వీరిలో అత్యధికంగా 94 శాతం మంది సంతాలులే. వీరిలో ఎక్కువమంది వ్యవసాయ కూలీలు. కొందరికి మాత్రం కొంత పొలం (కొన్ని బిఘాలు) ఉంటుంది. అందులో వర్షాధార వ్యవసాయం చేసి వారి కుటుంబాలకు సరిపడా వడ్లు పండిస్తారు.
‘‘రోజువారీ కూలీ అయిన మా నాన్న దివారామ్‌ బాస్కేకి సాధారణంగా భూమి లోపల కేబుల్‌ వేయటం కోసం గోతులు తవ్వే పని దొరుకుతుంది. పని దొరికిన రోజున ఆయన రూ.300`350 వరకు సంపాదిస్తారు. మా కుటుంబం మొత్తం మా నాన్నకు వచ్చే కూలీ డబ్బుపై ఆధారపడిరది. మా తాత (నాన్నకు నాన్న) గారికి ఏడెకరాల పొలం ఉన్నా అదంతా రాళ్ళతో నిండి ఉండి వ్యవసాయానికి పనికిరాదు.’’
‘‘మా అమ్మ మాలతి బాస్కే ఇంటి పని, వంట పని చేసుకోవటమే కాకుండా పొయ్యిలోకి కర్రల కోసం వెతుకుతూ తరచూ అడవిలోకి వెళ్ళవలసి వస్తుంది. ఆమె అలా వెళ్ళినపుడు నేను బడికి వెళ్ళటం మానేసి ఇంటిపట్టున ఉండవలసి వస్తుంది. మా అమ్మ బబ్లూ చాచా నడుపుతోన్న టిఫిన్‌ సెంటర్‌లో కూడా వంట చేస్తుంది. అమ్మకాలను బట్టి ఆమె రోజుకు రూ.50`60 వరకు సంపాదించవచ్చు. నాన్నకు కూలిపని దొరకనప్పుడల్లా బబ్లూ చాచాకు సహాయం చేస్తారు. బబ్లూ చాచా మా ఆదివాసీ సముదాయానికి చెందినవారు కాకపోయినా మా కుటుంబంలో ఒక వ్యక్తిగానే భావిస్తాం.’’
పాఠశాల విద్యపై ఈ నివేదిక, Gloom in the classroom: The schooling crisis in Jharkhand ప్రకారం కోవిడ్‌`19 సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 87 శాతం విద్యార్థినీ విద్యార్థులకు అసలు స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులోనే లేవు. ఆర్థికవేత్త జాన్‌ డ్రేజ్‌ PARI తో మాట్లాడుతూ ఇలా అన్నారు, ‘‘కోవిడ్‌ సంక్షోభ సమయంలో వెనుకబడిన వర్గాలకు, ఆదివాసీ వర్గాలకు చెందిన విద్యార్థులను పాఠశాల విద్యా వ్యసవ్థ పూర్తిగా నిస్సహాయులుగా వదిలేసింది. మనం పూర్తిగా ఆన్‌లైన్‌ విద్యపై ఆధారపడటం వల్ల పేద విద్యార్థినీ విద్యార్థులకు అన్యాయం జరిగింది.’’
… … …
‘‘డిసెంబర్‌ నెల ప్రారంభంలో మా పాఠశాల వారు ఏర్పాటు చేసిన క్రిస్మస్‌ పిక్నిక్‌కు వెళ్ళగలనో లేదో అనే ఆందోళన నాలో మొదలైంది. నా స్నేహితురాళ్ళతో కలిసి జంషెడ్‌పూర్‌లోని డిమ్నా ఆనకట్ట చూడాలని చాలా ఆశగా ఉంది. కానీ పిక్నిక్‌కు వెళ్ళేందుకు ఒక్కొక్కరూ రూ.200 కట్టాలి. మా కుటుంబం అంత ఖర్చు భరించలేదు. అందుకే నేను అమ్మానాన్నలను డబ్బు అడగలేదు. వేరొకరి పొలంలో వరి కోతలకు వెళ్ళి నేను రోజుకు రూ.100 సంపాదించాను. ఇలా కష్టపడి కూడబెట్టిన రూ.200 పిక్నిక్‌ ఛార్జీలకు సొంతంగా కట్టుకున్నాను. అలా నా స్నేహితులతో కలిసి ఆనకట్ట చూడటానికి వెళ్ళి ఆనందంగా గడిపాను.’’
‘‘కరోనా వ్యాధి వల్ల మూసివేసిన మా పాఠశాలను మళ్ళీ పోయిన సంవత్సరమే తిరిగి తెరిచారు. లాక్‌డౌన్‌ సమయంలో నేను సరిగ్గా చదవలేకపోవడం వల్ల గత పరీక్షల్లో నాకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం నేను కష్టపడి చదివి ఎలాగైనా సరే మంచి మార్కులు తెచ్చుకుంటాను.’’
‘‘ఈ సంవత్సరం నా పరీక్షలు అయిపోయాక పై చదువుల కోసం నేను జాదూగోరాకు వెళ్ళవలసి ఉంటుంది. అదిక్కడి నుండి 7`8 కి.మీ. దూరంలో ఉంది. నేనక్కడ ఉన్నత పాఠశాలలో చేరతాను.’’
‘‘నేను పెద్దయ్యాక పోలీసు అధికారిగా కానీ, న్యాయవాదిగా కానీ అవుతాను.’’ ధైర్యంగా చెప్పింది సోమ్‌వారి బాస్కే.
(ఈ వ్యాసం (https://ruralindiaonline.org/en/articles/i-want-to-study-its-my-only-dream/) ఏప్రిల్‌ 13, 2023 లో మొదట ప్రచురితమైనది.)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.