స్నేహం
ఓ నేస్తం,
నువ్వు లేకుండా ఉండలేను ఒక్క క్షణం
ఎప్పటికీ చెరగనివి మన ఇద్దరి జ్ఞాపకం
ప్రేమ ఆత్మీయతలతో ఎల్లప్పుడూ కలిసుందాం
ఏ బాధల్లో ఉన్న నా చిరునవ్వుకు నీవు కారణం
ఎన్నటికీ వీడనిది మన స్నేహబంధం
నువ్వు దూరం అయితే నాకు దుఃఖం
నువ్వు లేక నేను అయ్యాను శూన్యం
నువ్వు దొరకడం నా జన్మ ధన్యం
మన ఇద్దరి స్నేహం ఎప్పుడూ అవ్వదు అంతం
– ఎస్డి హసీనా, 10 తరగతి