ఎవరు చూసారురా ఆడవారిని సమానంగా?
తండ్రి చూసాడా?
తల్లి చూసిందా?
అన్న చూసాడా?
ఎవరు చూసారురా ఆడవారిని సమానంగా?
మేనమామ చూసాడాÑ మేనత్త చూసిందా?
తాతయ్య చూసాడా?
అమ్మమ్మ చూసిందాÑ నానమ్మ చూసిందా?
ఎవరు చూసారురా ఆడవారిని సమానంగా?
భర్త చూసాడా?
అత్తమామలు చూసారా?
పొరుగింటి వారు చూసారా?
ఎవరు చూసారురా ఆడవారిని సమానంగా?
ఆఖరికి సమాజంలో సమానత్వం లేకపోగా
ఆడవారికి బానిసత్వమే మిగిలిందిగా.
ఈ బానిసత్వానికి ముగింపు ఎప్పుడు?
ఆడవారికి సమానత్వం వచ్చేది ఎప్పుడు?