పూలండోయ్ పూలు
అందమైన పరిమళాలు వెదజల్లే పుష్పాలు
పూస్తాయి తోటల్లో
కోస్తాము బుట్టలలో
కడతాం మూటల్లో
పంపిస్తాము లారీలలో
పూల రాశులుగా పోయబడతాయి దండలుగా కట్టబడతాయి మాలలుగా ఇవ్వబడతాయి
అమ్మ చేత కొనబడతాయి
ఇంటికి తీసుకెళ్లబడతాయి
పూజా పుష్పమై వికసిస్తాయి
చిన్నారి తలలో పెట్టబడతాయి తనమోములో చిరునవ్వుల మారుతాయి
– ఎ. వైష్ణవి, 9 వ తరగతి
