రంగురంగుల పువ్వులు
రంగురంగుల పువ్వులు
శాంతిని పంచేమల్లెలు
సుగంధాల సన్నజాజులు
నీటిలో ఉదయించే తామరలు సూర్యుడుతో మెలిగే పొద్దు తిరుగుడు పూలు
రండమ్మా రండి రంగురంగుల పువ్వులు
కొనండమ్మ కొనండి
రతనాలలా మెరిసే చామంతులు
రంగులతో ఆకట్టుకునే గులాబీలు
సువాసనతో అల్లుకునే సంపెంగలు
కళ్ళను ఆకర్షించే కనకాంబరాలు
అలంకారాలు పెంచే ముద్దబంతులు
అన్ని కాలాల్లో పూసే మందారాలు అందరిని ఆనందింపజేసే పుష్పాలు
– కె. హిమబిందు, 9 వ తరగతి
